koodali

Monday, January 22, 2024

ఓం..

 ఓం
శ్రీరామమందిరము ప్రారంభమవుతోంది.
సీతారాములకు వందనములు. 


ఈ శుభ సందర్భముగా  అందరికీ శుభాకాంక్షలు.


 శ్రీరామమందిరం కొరకు ఎందరో కలలు కన్నారు. ఎందరో ఎన్నో త్యాగాలు చేసారు. కష్టాలు అనుభవించారు.


దైవం దయవల్ల కల నిజమయ్యింది.

లోకం అంతా సుఖసంతోషాలతో ఉండాలి.

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్..

లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

*   సీతారాములు ఏం చేసిఉంటే అందరు ప్రజలు మెచ్చుకునేవారు...

 

* శ్రీ మద్రామాయణము..సుఖాంతము.. 

 

* జాతకాలు విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు....

 

  * జీవితంలో సంపాదన ఉంటే చాలా ?

 

 * బలవంతులు బలహీనులను పీడించకూడదని మాట్లాడే హక్కు వ...

 

మితిమీరిన స్వేచ్చ.....

 

 * పాపాలు పండే రోజు ఎప్పుడు వస్తుందో ...

 

*  దైవ సృష్టి ...

 

 * పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా ..

 

*   ఇప్పుడు ఎవరెంత మంచిగా ఉంటున్నారు?

 

  * సోషల్మీడియాలో కొందరు..మరి కొన్ని విషయములు...

 

ఓం ..నిష్కామ కర్మ యోగం అద్భుతమైన మార్గం..

 

* కొన్ని ఆహార విషయాలు... రెండవ భాగం...

 

మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయ...

 

 

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్..   లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

*అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ప్రహ్లాదునికి తెలియజేస...

 

* ఓం.. పేర్లను గమనిస్తే..మరి కొన్ని విషయాలు...

 

*సంతోషంగా మనసారా నవ్వటానికి బోలెడు డబ్బు అవసర...

 * ఈ రోజుల్లో ఆరోగ్యం అని గానుగనూనెలు.. మరికొన్ని విష...

 

*హేతుబద్ధత...........

 

 *స్త్రీ పుట్టింటినుంచి తెచ్చుకునే ధనం విషయంలో చట్టబ... 

 

*అద్భుతమైన విజ్ఞానమ్..

 

 *కొన్ని విషయాలు.... (ETERNALLY TALENTED INDIA -...

 

* మనశ్శాంతి కరువైతే బోలెడు డబ్బున్నా సంతోషం ఉ...

 

 *సమాజం కూడా , న్యాయంగా సంపాదించిన సొమ్ముతో జీ..

 

 *పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా....

 

* మనం భగవంతుడిని విసిగిస్తు..

 

  * ఇలాంటి పరిస్థితులు మారాలి.

 * ఓం ....మరి కొన్ని విషయములు..

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

*దైవం నిత్యం.. దైవానికి ఆది, అంతము లేవు ..ఉదాహరణ.....

 

 *పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా ... చక్కట...

 

* మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయ...

 

 *ముహూర్తాలు...మరి కొన్ని విషయాలు.

 

* జీవితంలో సంపాదన ఉంటే చాలా ?

 

*".Matter and energy cannot be created or destroyed...

 

* అప్పుడు ..ఇప్పుడు .. కొన్ని విషయాలు ...

 

 *వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం.......

 

 *ఆడవాళ్ళ మధ్యే ఇన్ని గొడవలు ఉండగా..

 

* ఎలా జీవించాలి ? ఎలా జీవించకూడదు ? కొన్ని విషయా...

 

* ఈ రోజుల్లో ఆహారం గురించి కొన్ని విషయాలు.. మరియు స...

 

జీవులు పుట్టడం , కష్ట సుఖాలు అనుభవించటం అ...

 

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1

 


 వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్...లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 పోస్టులు అన్నీ నాకు ముఖ్యమేనండి. అయితే, కొన్ని పోస్టులను ఇక్కడ ఇస్తున్నాను.

 

 *ఒకరి సంపద 100 కోట్లు.....ఒకరి సంపద 100 ..

 

 *రోబోట్లు వచ్చినా ..ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి...

 

 *ఓం..కొన్ని సందేహాలు..సమాధానాలు..

 

* .భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి ...

 

 *ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరం.

 

* డబ్బు బాగా ఉన్నవాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉంటారు.


* సమాజంలో సతీసహగమనం.. వ్యాపించటానికి .. 

 

*ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది...

 

* దైవం గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ...

 

* ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు ద...

 

 *కొన్ని ఆహార విషయాలు... మూడవ భాగం...

 

 

 

 

Friday, December 15, 2023

ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..

 

  పాతకాలంలో నెలసరి రోజుల్లో స్త్రీలు ఎన్నో నియమాలను పాటించేవారు.  ప్రాచీనులు కొన్ని నియమాలను చెప్పారు.. అయితే కొందరు వాటిని ఎక్కువ చేసి, మూఢత్వంగా తయారుచేసారు. 

ఇది ఎక్కడవరకు వెళ్ళిందంటే, కొన్ని ప్రాంతాలలో నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు  బయట చిన్నగుడిసె వేసి మూడు రోజులూ అక్కడ కూర్చోవటమనే స్థాయికి కూడా వెళ్ళింది. మరికొందరి విషయంలో దూరంగా గుడిసెలో కూర్చోకపోయినా ఇంట్లోనే పక్కన కూర్చోబెట్టి, ఒక అసహ్యకరమైన వ్యక్తిని చూస్తున్నట్లు వారితో ప్రవర్తిస్తారు.


నేపాల్ లో చాలా ప్రాంతాలలో ఇలా దూరంగా గుడిసెలలో ఉంచే ఆచారం ఉందట. ఆలా ఉంచటం వల్ల పాములు, తేళ్లు కుట్టి కొందరు చనిపోయారట. కొందరు అనారోగ్యం పాలయ్యారట. కొన్ని అఘాయిత్యాలు కూడా జరిగాయని వ్రాసారు. ఇప్పుడు ప్రభుత్వం అలా గుడిసెలలో ఉండటాన్ని నిషేధించిందట. 

మనదేశంలో కూడా కొన్ని ప్రాంతాలలో నెలసరి స్త్రీలను వేరే గుడిసెలలో ఉంచటం అనే పద్ధతి ఉందట.


మహారాష్ట్రలో కొన్నిచోట్ల నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు కొన్ని స్వచ్చంద సంస్థలు గుడిసెల బదులు సౌకర్యాలతో కూడిన ఇళ్ళను కట్టి అక్కడ ఉంచుతున్నారట. నెలసరి అని ఇలా ఇళ్ళకు దూరంగా ఉంచటం ఏంటో ఖర్మ. 

 

  ఇలా తల్లులు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు చంటి పిల్లలు తల్లికొరకు ఏడుస్తారు. పిల్లల్ని ఇరుగుపొరుగుదగ్గర  వదలకూడదు. 

  నెలసరి అని తల్లిని దూరం పెడితే, ఆమె యొక్క చిన్నపిల్లల బాగోగులను పక్కవాళ్ళు ఏ మాత్రం చూస్తారో చెప్పలేము. పిల్లల సేఫ్టీ కూడా ముఖ్యమే.

 ఏంటో ఇవన్నీ. ఆచారాలలో మూఢత్వం ప్రవేశించకూడదు. 

.....................................
  నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ పనిచెయ్యకుండా, కొంత రెస్ట్ ఉండటం, అనారోగ్యం లేకుండా కొన్ని నియమాలను పాటించటం.. వంటివి మంచిదే కానీ, ఆ పేరుతో అతి చేయటం సరైనది కాదు. 

 కొందరైతే, నెలసరి వచ్చిన వారిని చూసి అసహ్యంగా చూస్తూ దూరంగా తప్పుకోవటం, వారికి కంచంలో కొద్దిగా ఆహారాన్ని వేసి, దూరం నుంచి ప్లేటును నెట్టటం..వంటివి చేస్తుంటారు. ఇక పండుగలప్పుడు, వివాహాదిశుభకార్యాలప్పుడు  నెలసరి వస్తే , వచ్చిన వారిని తిట్టిపోస్తారు. అనేకమంది  నెలసరి రాకుండా మందులు వాడుతూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు.


నెలసరి అంటే సంతానానికి సంబంధించిన విషయం. నెలసరి లేనిదే సంతానం లేదు. ఆ సమయంలో వారిని పక్కన కూర్చోబెట్టి,  కొంత రెస్ట్ ఇచ్చి, ఆరోగ్యకరమైన భోజనం వండి ఇచ్చి, మంచిగా చూసుకోవచ్చు. వారిపట్ల అగౌరవంగా ప్రవర్తించకూడ
దు.

    ఈ రోజుల్లో నెలసరి సమయంలో  స్త్రీలు కాలేజీలకు, ఉద్యోగాలకు, పనులకు వెళ్తున్నారు కదా..మరి అంటుముట్టు ఎలా పాటిస్తారు?


  నెలసరిలో స్త్రీలనుండి నెగటివ్ఎనెర్జీ వస్తుందని కొందరు అంటున్నారు. పాపాలు చేసేవారినుండి, మద్యమాంసాలు తీసుకున్నవారి నుండి కూడా నెగటివ్ ఎనెర్జీ వస్తుంది. 

అందుకే, పాపాలు చేసేవారికి దూరంగా ఉండాలంటారు. ...దుష్టులకు దూరంగా ఉండటం కుదరనప్పుడు, మంచివారు దైవస్మరణ చేసుకోవాలి.

పాపాలు చేసేవారినుండి వచ్చే నెగటివ్ ఎనెర్జీతో పోల్చుకుంటే, ప్రకృతిసహజమైన నెలసరి వల్ల వచ్చే నెగటివ్ ఎనెర్జీ ఫరవాలేదు.

ఆచార వ్యవహారాలను మంచిగా పాటించాలి. మూఢత్వంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒక లింక్..

Story Of A Young Bride | Gaokor- A Period House

  *****************

 మరి కొన్ని విషయాలు...
 
నెలసరి నియమాలను పాటిస్తే మంచిది. అయితే, ఈరోజుల్లో నెలసరినియమాలు నూటికినూరుశాతం పాటించాలంటే అందరికీ కుదరకపోవచ్చు. సూపర్ బజారుకో, బట్టలషాపుకో వెళితే ఆడవాళ్ళు ఉంటారు. రైలు ఎక్కితే ఆడవాళ్ళుంటారు. అంతమందిలో నెలసరిలో వారూ ఉంటారు. అలాగని ఇంటికొచ్చి అదేపనిగా తలస్నానాలు చేస్తే,  అనారోగ్యం వచ్చే అవకాశముంది. అందువల్ల కొద్దిగా పసుపునీళ్లు చిలకరించుకోవచ్చు..


ఆచారవ్యవహారాలను పద్ధతిగా పాటించాలి. అయితే, కొందరు మూఢనమ్మకాలతో పాటిస్తారు. మూఢనమ్మకాల వారికి చెప్పేదేమిటంటే, నెలసరి ఇంట్లో కలిపేసుకుంటే దోషమని భయపడి, మూఢత్వంగా  చేయవద్దు. ..దీనికి సంబంధించిన ఒక  లింక్ పోస్టులో ఉంది. ఆ సినిమాలోలా మూఢత్వంగా ఎవ్వరూ చేయవద్దు. 

పాతకాలంలో కొందరు.. నెలసరి స్త్రీలంటే గౌరవం లేకుండా, వారు బాధపడేలా మాట్లాడేవారట. ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.

*******
 పాపాలు చేసేవారి నుండి కూడా నెగటివ్ ఎనెర్జీ వస్తుందని ఇంతకుముందు వ్రాసాను. దానిగురించి మరికొన్ని విషయాలు..

ఎక్కువ మంచిపనులు చేసేవారికి పాజిటివ్ ఎనెర్జీ ఉంటుంది. ఎక్కువపాపాలు చేసేవారికి నెగటివ్ ఎనెర్జీ ఉంటుంది.. ఇవి ఒకరినుంచి ఇంకొకరికి తగిలే అవకాశాలు కూడా ఉంటాయి.

 

 ఇంకో విషయం ఏమిటంటే.. అన్ని వస్తువులకు, మనుషులకు ఆరా అని ఉంటుందట. ఆరాను కొందరు ఫోటోలు కూడా తీసారు.  మనుషుల ప్రవర్తన బట్టి ఆరా ఉంటుందంటారు. మనుషులు  ధ్యానం చేసేటప్పుడు దగ్గరగా కూర్చోకుండా కొంతదూరంలో కూర్చోవాలట. ఒకరి ఆరా ఇంకొకరిని ప్రభావితం చేయకూడదంటే,  కొంతదూరం పాటించాలట. ఆరా  గురించి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.  

*జీవితంలో దైవభక్తిని కలిగి సత్ప్రవర్తనతో జీవించడానికి ప్రయత్నించాలి.

 

Friday, September 8, 2023

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలని..

 

Wednesday, December 10, 2014

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల..


  • పూర్వీకులు  అంటరానితనాన్ని  ప్రోత్సహించారని  కొందరు    తప్పుపడతారు. దయచేసి  పెద్దలను  తప్పు  పట్టవద్దు . 

    పశుపక్ష్యాదులనే  పూజించమని  చెప్పిన  పెద్దలు  సాటి  మనుషులను  తక్కువగా  చూడమని  చెప్పరు  కదా  !

    దైవం దృష్టిలో   అందరూ సమానమేనని   పెద్దలు  ఎంతగానో   చెప్పటం   జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి .

    ధర్మరక్షణకోసం  విష్ణుమూర్తి  దశావతారాల్లో  జంతుజన్మలను  ధరించటానికి  కూడా  వెనుకాడలేదు.


    ఈ   విషయాలను  గమనిస్తే , సృష్టిలో  ఏ  జీవినీ  తక్కువగా  చూడకూడదని  తెలుస్తుంది.

    అందుకే   పశుపక్ష్యాదులను,  చెట్లను  కూడా  పూజించి  గౌరవించమని  పూర్వీకులు  మనకు  నేర్పించారు. 


    వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి   పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి.  


    వేదపురాణేతిహాసాలలోని  భావాలను  సమాజానికి  మరింత  చక్కగా  తెలియజేయటానికి ఎందరో  అవతారమూర్తులు,  మహానుభావులు  జన్మించారు.

    వీరి  బోధనలు  మరియు  ,  ఆచరణ  ద్వారా  ఏది  ధర్మం,  ఏది  అధర్మం  అనే  విషయములు    అందరికీ  తెలుస్తాయి.  


      శ్రీ  రాముడు  శూద్ర  స్త్రీ  అయిన   శబరి  సమర్పించిన  ఫలాలను  స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేశారు. శ్రీరాములవారు  అంటరానితనాన్ని  పాటించలేదు.

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు .... అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.


    శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్రము ..గ్రంధములో  కూడా ఇలాంటి   విషయములు   వివరంగా  చెప్పబడ్డాయి.


     ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు ....అని తెలుస్తోంది.  శివుడే  ఈ  విషయాన్ని  తెలియజేశారంటారు. 


     మహావతార్  బాబాజీ  శిష్యులైన  లాహిరీ  మహాశయులు, స్వామి యుక్తేశ్వర్ , పరమహంస  యోగానంద,  రామకృష్ణపరమహంస,  వివేకానందుడు...మొదలగువారు  గొప్ప  మహానుభావులు.  వీరు   అంటరానితనాన్ని   పాటించలేదు.

  • ఒక యోగి ఆత్మకధలో ..... లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.

    రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వారికి   ప్రవేశం ఉంది.


    అంటరానితనాన్ని  అగ్రవర్ణాల   వాళ్ళు  పాటించారని  కొందరు  అంటారు.  
     అగ్రవర్ణాలవాళ్ళలో ఇతరులను  ఎంతో చక్కగా  ఆదరించిన  వారెందరో  ఉన్నారు.  అగ్రవర్ణాల లో  కూడా పేదరికంతో  దయనీయంగా  జీవిస్తున్నవారెందరో  ఉన్నారు. 

     కొన్ని  గ్రామాలలో  ధనవంతులైన  శూద్రులు   పేదవారైన  శూద్రుల  పట్ల   పట్ల  అంటరానితనాన్ని పాటించారు.  

    ******************

    గ్రంధముల  ద్వారా  తెలుసుకున్న  మరి  కొన్ని  విషయములు.....

    బ్రాహ్మణ  క్రత్రియ  వైశ్యులను  ద్విజులు అంటారు...ఉపనయనం  జరగకుండా  వారికి  ద్విజత్వం  రాదు.  అందాకా  వీళ్ళు  శూద్రుల  కిందనే  లెక్క.  రాకుమారులకు  11  వ ఏట,  బ్రాహ్మణ పుత్రులకు  ఎనిమిదవ  ఏట, వైశ్య  తనయులకు  పన్నెండవ  ఏట  ఉపనయనం  చెయ్యాలని  ధర్మశాస్త్రాల  నిర్ణయం......... అన్నట్లు    పెద్దలు  తెలియజేశారు.


    భీష్ముల  వారి  విషయంలో............

    భారతంలో , భీష్ముల  వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు  వారే  తెలియజేసిన  విషయాన్ని  బట్టి ,  వ్యక్తులు  తినే  ఆహారాన్ని  బట్టి    మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది. 


      అధర్మంగా  ప్రవర్తించే  వారి  వద్దనుంచి  స్వీకరించే  ఆహారం  వల్ల  కూడా స్వీకరించిన వారి  మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది.

     దుర్యోధనుడు  గొప్ప  వంశంలో   జన్మించినా   కూడా  ,అధర్మపరుడైనందువల్ల  అతని  నుంచి  స్వీకరించిన  ఆహారం  వల్ల  భీష్ముల  వారికి  కష్టాలు  వచ్చాయి.  


    శ్రీ కృష్ణుల వారు   కూడా.....దుష్టుడైన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని  తిరస్కరించి , సౌమ్యుడైన  విదురుని  ఆతిధ్యాన్ని స్వీకరించారు. 

    పై  విషయాలన్నీ  గమనిస్తే  ,  అధర్మంగా  ప్రవర్తించేవారిపట్ల..,   పాపాలు  చేసే వారి  పట్ల  అంటరానితనాన్ని  పాటించాలన్నది . పెద్దల  అభిప్రాయం  అనిపిస్తుంది.


    కొందరు  గొప్ప పదవి  లభించినా  అంతటితో  తృప్తిని  పొందక  ఇంకా  ఏదో  కావాలని  అశాంతితో  జీవిస్తారు. 


     భగవదనుగ్రహాన్ని  పొందాలంటే  నిష్కామకర్మతో జీవించాలని పెద్దలు  తెలియజేశారు.  

  • నిష్కామ  కర్మతో  జీవించేవారు  మహారాజ  పదవిలో  ఉన్నా,   పొంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు.    జనకమహారాజులా.  


     నిష్కామ  కర్మతో  జీవించేవారు  ఆడంబ
    రాలు  లేకున్నా  ,   క్రుంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు . .శబరిలా .

    భగవంతుని  కరుణను  పొందిన  జీవులలో   పశువులు,  పక్షులు,   పేద వారు,  ధనవంతులు, అన్నిరకాల  జీవులు  ఉన్నారు. అంతా  దైవం  దయ.
  •  .....
  •