koodali

Monday, June 25, 2018

ఓం.. పేర్లను గమనిస్తే..మరి కొన్ని విషయాలు...



సూర్యభగవానుని భార్యల పేర్లను గమనిస్తే...  సంధ్య, ఛాయ, ఉష, పద్మిని, ప్రభ...ఇవన్నీ సూర్యునితో సంబంధం ఉన్న విషయాలే.

సూర్యుని భార్యల పేర్లను గమనిస్తే,  

సంధ్య.. అంటే ఉదయ, మధ్యాహ్న, సాయంసంధ్యలు. 

ఛాయ..  సంధ్యాసమయాలలో పొడుగైన  ఛాయ ( నీడ ) ఏర్పడుతుందట. 

 ఉష ..అంటే ఉషస్సు.

 పద్మిని.. పద్మాలు సూర్యకాంతి వల్ల విచ్చుకుంటాయి. 

ప్రభ..సూర్యుని కాంతి. ఇలా సింబాలిక్ గా అనుకోవచ్చు. 

 సూర్యునికి సంధ్య, ఛాయ.. ఇద్దరు భార్యలని కొన్ని చోట్ల ఉంది. మరికొన్నిచోట్ల ఎక్కువమంది భార్యల పేర్లు ఉంటాయి.

***************

దేవతల చర్యలు మానవులకు ఉన్నటువంటి రాగద్వేషాలను పోలి ఉండవు. దేవతల చర్యలను మానవ ధర్మాలు,గుణముల కోణం నుండి చూడకూడదు.

ఉదా....ఇంద్రుడు తపస్సు చేసే వారి వద్దకు అప్సరసలను పంపి వారి తపస్సులను భగ్నం చేయటానికి ప్రయత్నిస్తారు అని కొందరు అంటారు.

కానీ ఇంద్రుడు అప్సరసలను పంపటం ద్వారా .. తపస్వుల పట్టుదలను పరీక్షిస్తారు .. అని కూడా అనుకోవచ్చు.

************

ఇంకా , చంద్రునికి తన భార్యలలో రోహిణి అంటే ఎక్కువ ఇష్టం అని చెబుతారు.

చంద్రునికి ఉచ్ఛస్థానం వృషభరాశి . అందులో కృత్తిక ,మృగశిర నక్షత్రములు పూర్తిపాదములతో ఉండవు. రోహిణి నక్షత్రం మాత్రమే అన్ని పాదములతో ఉంటుంది.

అందుకని, చంద్రునికి ఉచ్ఛస్థానమయిన వృషభంలో రోహిణి నక్షత్రం పూర్ణంగా ఉంటుంది కాబట్టే... అని కూడా అర్ధం చేసుకోవచ్చు.


అందుకే దేవతల చర్యలను మానవగుణముల కోణం నుండి చూడకూడదు.

దేవతలు మానవులుగా అవతరించిన సందర్భంలో మాత్రము ,.. వారి చర్యలను కొంతవరకు , మానవధర్మముల కోణము నుండి చూడవచ్చు అనిపిస్తుంది.

**************

అప్సరసల గురించి నాకు తోచిన మరి కొన్ని విషయాలు..

ఎవరైనా తపస్సులు చేస్తుంటే వారి వద్దకు ఇంద్రుడు అప్సరసలను పంపటం అంటే.....  తపస్సు చేసే వారి  పట్టుదలను , ఇంద్రియ నిగ్రహాన్ని పరీక్షించడం కోసం అనుకోవచ్చు. 

అప్సరసలను చూసి మోహపడని వారు స్త్రీవ్యామోహం అనే  పరీక్షలో గెలుస్తారు.

 ఈ అప్సరసలు వ్యక్తులలోని వ్యామోహాలకు పరీక్షలు.

ఇంద్రుడు ఇంద్రియాలపై ఆధిపత్యం ఉన్నవారు అయినప్పుడు...  

వ్యక్తులలోని వ్యామోహ  భావాలకు ప్రతీకలు  అయిన  అప్సరసలు,  ఇంద్రియాలకు  సంబంధం  ఉన్న  దేవత  అయిన ఇంద్రుని ఆధీనంలో ఉండటంలో అనే విషయంలో ఆశ్చర్యం  ఏమీ లేదు. 
-------------------------

ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు దాగుంటాయి.

ప్రతి 
దాన్ని అపార్ధంచేసుకోవటం కాకుండా , దైవం దయ కోసం ప్రయత్నించాలి అందరూ .అప్పుడే ప్రశాంతత లభిస్తుంది.


ఇందులో పొరపాట్లు ఉన్నచో భగవంతుడు క్షమించవలెనని ప్రార్ధిస్తున్నానండి.



1 comment:

  1. దైవ స్తోత్రాలు పఠించేటప్పుడు జాగ్రత్తగా పఠించాలి.

    కొన్ని పుస్తకాలలో కూడా కొన్ని అచ్చుతప్పులు ఉంటున్నాయి. కొన్ని కాసెట్స్ లో కూడా కొన్ని తప్పులు వినిపిస్తున్నాయి.

    అందువల్ల తెలిసిన పండితులను ద్వారా నేర్చుకుని చదువుకుంటే మంచిది.

    ఎలాగోలా పదాలను కలిపేసి లేక విడదీసి చదివితే అర్ధాలు మారిపోయే అవకాశం ఉంది.
    ఉదా..ఆదిత్యహృదయం.. 12 వ శ్లోకంలో..

    agnigarbhoaditeH putraH shamkhaH shishiranAshanaH..అనే వద్ద ..

    agnigarbhoaditeH .. అని గబాగబా చదివి..putraH shamkhaH shishiranAshanaH. అని గబగబా చదివితే అర్ధం మారిపోయే అవకాశం ఉంది.

    ఇక్కడ అదితి దేవి పుత్రుడైన సూర్యుడు అని అర్ధం ఉన్నది.అందువల్ల , ఆ అర్ధం వచ్చేలా.. agnigarbhoeaditeaH putraH ..putraH అని కలిపి చదవాలి.

    నాకు సంస్కృతం తెలియదు. ఆదిత్యహృదయం చదివినప్పుడు నాకు తోచిన అభిప్రాయాన్ని వ్రాసాను.

    వ్రాసిన విషయాలలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete