శ్రీ కృష్ణుని 16 వేల.. మంది భార్యల గురించి కూడా చాలామంది అదొకరకంగా మాట్లాడుతుంటారు.
కొందరు ఏమంటారంటే , కృష్ణుడు అంతమందిని వివాహం చేసుకున్నప్పుడు మేమెందుకు చేసుకోకూడదు? ఆని అతితెలివిగా ప్రశ్నిస్తారు.
మరి, కృష్ణుడు ఒకే సమయంలో 16వేల ..రూపాలు ధరించి అందరి వద్ద భర్తగా ఉండటాన్ని నారదుల వారు చూశారట.
కృష్ణుడు అంతమందిని వివాహం చేసుకున్నప్పుడు మేమెందుకు చేసుకోకూడదు? అనే వాళ్లు అలా ఒకేసారి రెండు, మూడు అవతారాలు ధరించి ఇద్దరు లేక ముగ్గురి వద్ద ఉండగలరా?
కృష్ణుని 16 వేల ..భార్యల విషయంలో ఎన్నో అంశాలున్నాయంటారు.
కృష్ణుని 16వేల..మంది భార్యలు ..గోపికలని కొందరు, గత జన్మలో మునులని కొందరు అంటారు.
ప్రాచీనులు గ్రంధాలలో చెప్పిన అంశాలలో ఎన్నో అంతరార్ధాలుంటాయని పెద్దలు తెలియజేసారు.
ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం గ్రంధం చదవ వచ్చు.
***************
ఆసక్తి ఉన్నవారు మరికొన్ని విషయములను ఇక్కడ చూడగలరు...
No comments:
Post a Comment