కొన్నిసార్లు చర్మంపై దురద.... వంటి వ్యాధులు వస్తుంటాయి.
వ్యక్తిగత శుభ్రత లేనప్పుడు, ఇంకా హాస్టల్స్ వంటి పరిస్థితిలో కూడా ఒకరి నుంచి ఒకరికి ఇలాంటి చర్మవ్యాధులు పెరిగే అవకాశం ఉంది.
ఇంట్లో కూడా చర్మవ్యాధి ఉన్న వారు వాడిన సబ్బులను ఇతర కుటుంబసభ్యులు వాడినా ఒకరి నుంచి ఒకరికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది.
ఈ మధ్య ఒక పేపర్లో నేను చదివిన విషయం ఏమిటంటే,
చర్మంపై దురద వంటి వాటికి మందులు వాడినప్పుడు తాత్కాలికంగా తగ్గి , తిరిగి వస్తున్నట్లు గమనించారని వ్రాసారు.
ఈ విషయం ఎలా ఉన్నా , ఇలాంటి వ్యాధి వచ్చినప్పుడు చాలామంది వైద్యుల వద్దకు వెంటనే వెళ్ళరు.
ముఖ్యంగా పిల్లలు దురద ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు.
ఇలాంటి పరిస్థితిలో అశ్రద్ధ చేయకుండా వైద్యుల వద్దకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి.
పిల్లలు హాస్టల్లో ఉన్నా కుడా పెద్దవాళ్ళు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.
అయితే, డాక్టర్ వద్దకు వెళ్లే లోపు దురద నుంచి ఉపశమనం పొందటానికి ఒక చిట్కా వ్రాస్తాను. దీనికి ఉప్పు ద్వారా ఉపశమనం ఉంటుంది.
కొంచెం మెత్తటి ఉప్పు తీసుకుని , నీటితో తడిపి దురద ఉన్న దగ్గర పూయాలి.
ఉప్పునీరు కూడా పూయవచ్చు.
ఇలా చేస్తే దురద నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
నాలుగు, అయిదు రోజులు ఇలా చేస్తే దురద తగ్గిపోయే అవకాశం ఉంది.
కొన్ని రోజుల తరువాత తిరిగి దురదగా అనిపించినా , ఇలాగే చేయవచ్చు.
అయితే, ఉప్పును సీసానుండి తీసుకునేటప్పుడు మురికి చేతితో తీయటం కాకుండా స్పూన్ తో తీసుకోవాలి.
లేకుంటే విడిగా కొంచెం ఉప్పును ఒక పాకెట్లో ఉంచుకోవాలి.
పెద్దవాళ్ళకయినా ఇలాంటి ట్రీట్మెంట్ వాడవ చ్చు.
చర్మం దురద రావడానికి అనేక కారణాలుంటాయి. అందువల్ల వైద్యులను సంప్రదించడం మంచిది.
ఉప్పు వల్ల బాక్టీరియా చనిపోతుందని అంటున్నారు. అయితే, ఉప్పు ఎక్కువ రోజులు పూస్తే చర్మం నల్లగా అవుతుందేమో తెలియదు.
భరించలేని దురద ఉన్నప్పుడు ఉప్పు రాయడం వల్ల ఉపశమనం ఉంటుంది.
అయితే, ఉప్పు వంటి గాఢమైనవి ఎక్కువరోజులు పూయకూడదు. చర్మం కమిలే అవకాశం ఉంది కాబట్టి 4 లేక 5 రోజులు వాడి ఆపేయాలి.
అయితే, ఉప్పు వంటి గాఢమైనవి ఎక్కువరోజులు పూయకూడదు. చర్మం కమిలే అవకాశం ఉంది కాబట్టి 4 లేక 5 రోజులు వాడి ఆపేయాలి.
అలోవేరా జెల్ రాయడం వల్ల కూడా దురదల నుంచి ఉపశమనం ఉంటుందట.
ఇవి పొడి చర్మంపై కాకుండా ... చర్మం తడి చేసి పూయాలట.
.............
కొంచెం వేపనూనె మరియు కొంచెం కొబ్బరినూనె కలిపి కొంతకాలం వ్రాయవచ్చు.
ఈ రోజుల్లో మన వస్త్రధారణలో ఎన్నో మార్పులు వచ్చాయి. పాతకాలంలో స్త్రీలు అయితే చీర కట్టుకుని కొన్ని కుచ్చెళ్ళను కాళ్ళ మధ్య గోచీలా మడిచి కట్టుకునేవారు.
పురుషులు పంచె కూడా గోచీలా మడిచి కట్టుకుంటారు. ఈ వస్త్రధారణ వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
ఆధునిక కాలంలో స్త్రీలు, పురుషులు ధరిస్తున్న ఒంటికి అంటిపెట్టుకునే అండర్ వేర్ ల వల్ల వ్యాధులు వచ్చే అవకాశముంది.
బిగుతుగా ఉండే ప్యాంట్ వల్ల కూడా మగవారిలో వీర్యం బలహీనమయ్యి సంతానోత్పత్తి తగ్గే అవకాశాలున్నాయని కొన్ని పరిశోధనల ద్వారా తేలినట్లు వార్తలు వచ్చాయి.
ఇంట్లో ఉన్నప్పుడు చీరలు, లుంగీలు ధరించి అండర్ వేర్ వేసుకోకుండా తిరిగితే, టాయ్ లెట్ నుండి బయటకు వచ్చి ఇంట్లో నడుస్తున్నప్పుడు కొన్ని నీటిబొట్లు ఇంట్లో పడే అవకాశముంది.
అలాగని ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒంటికి అంటిపెట్టుకునే అండర్వేర్లు ధరిస్తే చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. పాతకాలంలోని వస్త్రధారణ వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉండవు.
పంచెలు , చీరలు రెండుకాళ్ళ మధ్య నుంచి మడిచి దోపటం వల్ల టాయ్లెట్ నుంచి వచ్చి ఇంట్లో నడిచేటప్పుడు నీటిచుక్కలు క్రింద పడవు. బిగుతుగా ఒంటికి అంటిపెట్టుకోవటం ఉండదు కాబట్టి చర్మవ్యాధులు కూడా రావు.
పాతకాలంలో మగవాళ్లు, పిల్లలు కూడా లాగూలు ధరించేవారు. ఇవి బిగుతుగా కాకుండా వదులుగా ఉండేవి. ఇలాంటి అండర్వేర్లను ధరించవచ్చు.
ఇఈ లాగూలు ఎలాంటివంటే, ఇప్పటి వాళ్ళు ధరిస్తున్న బెర్ముడా షార్ట్స్ వంటివి.
అయితే, ఈ షార్ట్స్ ను మందపాటి వస్త్రంతో కాకుండా పల్చటి వస్త్రంతో వదులుగా కుట్టించుకుని అండర్వేర్ లా ధరించవచ్చు.
***************
ఈ రోజుల్లో చీరలను మడిచి పాతకాలంలా మడిచి ధరించటం అంటే కష్టం కాబట్టి, చీర ధరించే వారు వదులుగా ఉండే అండర్వేర్ ధరించవచ్చు.
పంజాబీ డ్రెస్ ధరించే స్త్రీలు వదులుగా ఉండే అండర్ వేర్ వేసుకోవాలంటే వదులుగా ఉండే పటియాలా టైపు పాంట్ అనువుగా ఉంటుంది.
మగవాళ్ళకు వదులుగా ఉండే అండర్ వేర్లు ధరించాలంటే, పాంట్లు కొంత వదులుగా కుట్టించుకోవాలి. లేదంటే వదులుగా ఉండే లాల్చీ, పైజమా అనువుగా ఉంటుంది.
***************
పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఆహారపదార్ధాలను దాటకూడదని తెలియజేసారు. ఇలా చెప్పటంలో శుభ్రత మరియు ఆరోగ్యం ఇమిడిఉన్నాయి.
కొందరు పిల్లలు, పెద్దవాళ్లు కూడా ఇంట్లో నడుస్తూ గబుక్కున నేలమీద ఉన్న ఆహారపాత్రల ప్రక్కనుంచి వెళ్ళకుండా..వాటిని దాటి వెళ్తుంటారు. పిల్లలు పరిగెడుతూ కూడా పాత్రలను దాటుతుంటారు. ఇలా చేయకూడదు.
ఇలాంటి సున్నితమైన విషయాలు రాయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కాబట్టి, మాట్లాడుకోవటం లో తప్పులేదు.
కొన్నిసార్లు కాలిగోళ్ళు పుచ్చుతాయి. ఇలాంటప్పుడు ఉప్పును తడిపి పుచ్చిన గోరుపై పెడితే తగ్గుతుంది.
ReplyDeleteవారానికి మూడుసార్లు రాత్రి పడుకోబోయే ముందు ఉప్పునీటితో నోటిని పుక్కిలించి ఊయాలి.
ఇలా చేస్తే దంతాలు బాగుంటాయి.
అయితే, ఉప్పు వంటి గాఢమైనవి ఎక్కువరోజులు పూయకూడదు.
Deleteచర్మం కమిలే అవకాశం ఉంది కాబట్టి 4 లేక 5 రోజులు వాడి ఆపేయాలి.