ఇక స్నాక్స్ విషయానికొస్తే ,
పకోడి... సెనగపిండిలో చాలా కొద్దిగా బియ్యపు పిండి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కలిపి పకోడీ వేయటం కూడా తేలికే. ఉల్లిముక్కలు తిననివారు సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి పకోడి వేసుకోవచ్చు.
పకోడి కోసం కలిపే పిండిలో ఎక్కువ నీరు పోయకూడదు. ఎక్కువ నీరు పోస్తే నూనె బాగా పీల్చుకుంటుంది. తక్కువ నీటితోనే పిండి కలపాలి.
......
మసాలా వడ...పచ్చిశనగపప్పు నానబెట్టి..నీరు అసలు పోయకుండా పప్పును కచ్చపచ్చగా రుబ్బుకుని , కొత్తిమీర, పుదీనా, ధనియాలపొడి, అర టీ స్పూన్ అల్లంవెల్లుల్లి ముద్ద , కొంచెం గరం మసాలాపొడి వేసి కలిపి మసాలా వడలు వేసుకోవచ్చు. ఈ మసాలా వడలు నూనె ఎక్కువగా పీల్చవు.
దోసె....
ఒక గ్లాస్ మినప్పప్పు, రెండు గ్లాసుల బియ్యం, ఒక టీ స్పూన్ మెంతులను పగలు 6 గంటలు నానబెట్టి, సాయంత్రం రుబ్బి, రాత్రంతా పులవనిచ్చి , ఉదయం దోసెలు వేసుకోవచ్చు.
ఊల్లిముక్కలు, పచ్చిమిర్చి... దోస పైన వేసి కాల్చుకోవాలి.
ఊల్లిముక్కలు, పచ్చిమిర్చి... దోస పైన వేసి కాల్చుకోవాలి.
........
పెసరట్టు... ఒక గ్లాసు పెసలను రాత్రంతా నానబెట్టి, కొద్దిగా పచ్చి మిర్చి, అల్లం, ఉప్పు.. మిక్సీలో రుబ్బి అట్లు వేసుకోవచ్చు.
. పెసరట్టు పిండిని.. మినపట్టు పిండిలా పులవబెట్టకూడదు. పెసరట్టు పిండిని రుబ్బిన వెంటనే దోసెలు వేసుకోవాలి. పిండి మిగిలితే వెంటనే ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
పెసరట్టు పిండిలో రెండు టీ స్పూన్ల బియ్యం పిండి కలిపితే కరకరలాడుతాయని అంటారు . పెసరట్టు పల్చగా వేసుకుంటే కరకరలాడుతూ వస్తుంది .
. పెసరట్టు పిండిని.. మినపట్టు పిండిలా పులవబెట్టకూడదు. పెసరట్టు పిండిని రుబ్బిన వెంటనే దోసెలు వేసుకోవాలి. పిండి మిగిలితే వెంటనే ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
పెసరట్టు పిండిలో రెండు టీ స్పూన్ల బియ్యం పిండి కలిపితే కరకరలాడుతాయని అంటారు . పెసరట్టు పల్చగా వేసుకుంటే కరకరలాడుతూ వస్తుంది .
ఊల్లిముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర....దోస పైన వేసి కాల్చుకోవాలి.
బయట ఫుడ్ ఎక్కువగా తినకుండా ,అప్పుడప్పుడు అయినా కొంచెం ఓపికతో ఇంట్లో చేసుకుంటే అనారోగ్యం రాకుండా బాగుంటుంది.
**************
1. ఇడ్లీలోకి, దోసెలకు పచ్చడి... చిన్నగా తరిగిన పచ్చికొబ్బరి ముక్కలు, వేయించిన పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన శనగపప్పు( పుట్నాల పప్పు) కానీ, వేయించిన వేరుశనగపప్పు కానీ తీసుకుని, ఉప్పు కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాణలిలో పోపు వేయించి , పైన పచ్చడిలో కలుపుకుంటే ఇడ్లీలోకి, దోసెలకు పచ్చడి తయారవుతుంది.
*************************
**************
1. ఇడ్లీలోకి, దోసెలకు పచ్చడి... చిన్నగా తరిగిన పచ్చికొబ్బరి ముక్కలు, వేయించిన పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన శనగపప్పు( పుట్నాల పప్పు) కానీ, వేయించిన వేరుశనగపప్పు కానీ తీసుకుని, ఉప్పు కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాణలిలో పోపు వేయించి , పైన పచ్చడిలో కలుపుకుంటే ఇడ్లీలోకి, దోసెలకు పచ్చడి తయారవుతుంది.
2.ఇడ్లీలోకి, దోసెలకు పచ్చడి... బాణలిలో నూనెలో వేసి, అందులో ఒక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక టమేటో ముక్కలు, కొద్దిగా వేరుశనగపప్పు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు, కొన్ని వెల్లున్ని రెబ్బలు, ఉప్పు, పసుపు, కొన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు..ఇవన్నీ నూనెలో కొద్దిసేపు వేయించి , మిక్సీలో మెత్తగా పచ్చడి చేసుకుంటే ఇడ్లోకి, దోసెలకు , ఈ పచ్చడి కూడా వేసుకోవచ్చు.
**********************
సొరకాయ గింజల పచ్చడి ... సొరకాయ{ ఆనపకాయ } లేత గింజలు ఉంటే గింజలు తీసి పచ్చడి చేసుకోవచ్చు. సొరకాయ గింజలు, మిర్చి, చింతపపండు, ఉప్పు, పసుపు, టమేటో , కరివేపాకు, కొత్తిమీర..అన్నీ బాణలిలో వేయించి , మిక్సీలో మెత్తగా రుబ్బి పోపు పెట్టుకుంటే సొరకాయ గింజల పచ్చడి. తయారవుతుంది. సొరకాయలో మిగతా భాగం కూర వండుకోవచ్చు.
మామూలుగా అరకప్పు బియ్యం ఒక మనిషికి సరిపోతుందట.
ఉప్మా కు కూడా అరకప్పు రవ్వ ఒక మనిషికి లెక్క.
ఉప్మా కు కూడా అరకప్పు రవ్వ ఒక మనిషికి లెక్క.
అంటే, నలుగురు మనుషులుంటే నాలుగు అరకప్పులు అంటే రెండు కప్పుల రవ్వ సరిపోతుంది.
అయితే, తినే వారి అలవాటును బట్టి కొంచెం ఎక్కువ, తక్కువా తీసుకోవచ్చు.
*********************
పప్పుల పొడి..... బాణలిలో కొంచెం మినప్పప్పు, కొంచెం కందిపప్పు, కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర విడివిడిగా వేయించుకుని తీసి ప్రక్కన పెట్టుకోవాలి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి, అందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పైన వేయించుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వేయించిన శనగపప్పు ( పుట్నాల పప్పు ) , ఉప్పు, వెల్లుల్లి ....ఇవన్నీ పొడి కొట్టి పిల్లలకు పంపిస్తే వేడి అన్నంలో నేయి వేసుకుని తినవచ్చు. ఇడ్లీలో , దోసెల్లో తినవచ్చు.
ఈ పొడిని వేపుడు కూరల్లో కూడా వేసుకోవచ్చు. కూరల్లో వేసి కొన్ని నీరు పోసుకుంటే గ్రేవీ కూర కూడా తయారవుతుంది. ఇష్టమున్నవారు పొడిలో ఎండుకొబ్బరి కూడా వేసుకోవచ్చు.
******************************
పిల్లలకు.... పెసలు, వేరుశనగపప్పు, శనగలు, రాగులు, బొబ్బర్లు.. ..వంటి రకరకాల గింజలను తెచ్చి రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే అల్పాహారంలా తినవచ్చు.
అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కీరదోసముక్కలు, నిమ్మరసం, ఉల్లిముక్కలు వేసుకోవచ్చు.
అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కీరదోసముక్కలు, నిమ్మరసం, ఉల్లిముక్కలు వేసుకోవచ్చు.
లేకుంటే, నానబెట్టిన గింజలను కుక్కర్లో ఉడికించి , గుగ్గిళ్లలా తినవచ్చు.
ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కీరదోసముక్కలు, నిమ్మరసం, ఉల్లిముక్కలు వేసుకోవచ్చు.
పాతకాలంలో నూనెవంటలు ఎప్పుడో పండుగల్లో వండుకునేవారట.
ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కీరదోసముక్కలు, నిమ్మరసం, ఉల్లిముక్కలు వేసుకోవచ్చు.
పాతకాలంలో నూనెవంటలు ఎప్పుడో పండుగల్లో వండుకునేవారట.
పాతకాలంలో గుగ్గిళ్లను ఎక్కువగా తినేవారట. . ఈ కాలంలో శారీరికశ్రమ తగ్గి, తిన్నది అరగటం లేదు కాబట్టి, గుగ్గిళ్ళ్ను కొద్ది మొత్తంలో తినవచ్చు.
పెసలు, శనగలు అన్నీ నానబెట్టినవి అమ్ముతున్నారు .
అయితే, బయటవాళ్ళు నానబెట్టటం కాకుండా, రకరకాల గింజలను కలిపి చిన్నప్యాకెట్లలో అమ్మితే, ఇంటికి తెచ్చి నానబెట్టుకోవచ్చు.
అయితే, బయటవాళ్ళు నానబెట్టటం కాకుండా, రకరకాల గింజలను కలిపి చిన్నప్యాకెట్లలో అమ్మితే, ఇంటికి తెచ్చి నానబెట్టుకోవచ్చు.
**********************
ఉలవలను నానబెట్టి, కుక్కర్లో ఎక్కువసేపు ఉడికించాలి. తరువాత చారులా చేయవచ్చు.
లేదంటే ఉలవచారు బయట అమ్మేవి తెచ్చుకోవచ్చు. ఉలవలు ఆహారంలో తీసుకోవటం మంచిది.
*********************
ఉలవలను నానబెట్టి, కుక్కర్లో ఎక్కువసేపు ఉడికించాలి. తరువాత చారులా చేయవచ్చు.
లేదంటే ఉలవచారు బయట అమ్మేవి తెచ్చుకోవచ్చు. ఉలవలు ఆహారంలో తీసుకోవటం మంచిది.
*********************
ఇక డ్రైఫ్రూట్స్ సంగతి తెలిసిందే. రోజూ కొద్దిగా తినవచ్చు. ఏదైనా, ఎవరి అరుగుదలను బట్టి వారు తీసుకోవాలి.
ReplyDeleteపాలు త్వరగా తోడుకోవాలంటే, కొందరు ఒక ఎండుమిరపకాయను తోడుపెట్టిన పాలలో వేస్తారు. ఇంకొక పద్ధతి ఏమిటంటే, . గోరువెచ్చని పాలలో కొద్దిగా పెరుగు వేసి ఆ పెరుగు పాలలో బాగా కలిసేలా స్పూ న్ తో తిప్పాలి. ఆ గిన్నెను చల్ల గాలి తగలకుండా మూత ఉన్న అలమారలో పెట్టాలి. లేకపోతే పాలగిన్నెను మరొక పెద్ద గిన్నెలో లో పెట్టి పైన ఇంకొక మూత పెట్టాలి. అలా ఉంటే త్వరగా తోడుకుంటుంది.
బౌర్నవిటా వంటివి గడ్డకట్టకుండా ఉండాలంటే బాటిల్ ఫ్రిజ్లో పెట్టాలి.
Deleteఈ మధ్య చాలామంది భోజనంలో ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం కాకుండా తక్కువగా పాలిష్ చేసిన బియ్యాన్ని వాడుతున్నారు.
అయితే ఈ అన్నం తెల్లగా ఉండదు కాబట్టి, కొందరు ఇష్టపడరు.
ఇలాంటప్పుడు ఈ బియ్యాన్ని పిండి పట్టించి దోసెలు వేయటానికి వాడుకోవచ్చు.
ReplyDeleteబయట కొనే పంచదార, బెల్లం వాడటం ఇష్టంలేనివారు చెరకుగడలు తెచ్చుకుని, ఇంట్లోనే చెరుకురసం తయారుచేసుకుని, ఆ రసాన్ని వేడిచేసి పాకం పట్టుకుని స్వీట్స్ తయారుచేసుకోవచ్చు.
ఈ క్రింద ఇచ్చిన మెషిన్ల ద్వారా చెరకును ముక్కలుగా కొట్టి,రసం తీసుకోవచ్చు.
Manual Sugarcane Bud Cutter Machine
agrow.shop
Sugarcane Juice Machine, Sugarcan Machine ( With Italiyan Gear Box), Latest Prices Manufacturer & Supplier in India
www.aajjo.com
ReplyDeleteరవ్వ లేకుండా రవ్వ దోసెలుగా...
ఒక కప్పు బియ్యపుపిండిని ఒక గిన్నెలో పోసి, కుక్కర్లో కొంచెం నీరు పోసి బియ్యం పిండి ఉన్న గిన్నెపై మూత పెట్టి కుక్కర్లో ఉంచి కుక్కర్ విజిల్ పెట్టకుండా 15 నిమిషాలు ఉడికించాలి.( ఇడ్లీలు ఉడికించే విధంగా..)
తరువాత బియ్యంపిండి గిన్నెను కుక్కర్లో నుండి తీసి, ఆ పిండి లో సుమారు ఒకటిన్నర గ్లాసుల నీరు పోయాలి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి ఉంచుకుని, అందులో కొంచెం జీలకర్ర కలుపుకోవాలి.
పిండిని పెనం పై నుండి జారుగా దోసెలుగా వేసుకుని, పైన ఉల్లితరుగు జల్లుకుని, కొంచెం నూనె వేసుకోవాలి. దోసెను దోరగా కాల్చుకోవాలి.
ఈ పిండిని మామూలు దోసెలాగ గరిట ను పెనానికి తగిలేలా పిండిని తిప్పితే పిండి పెనానికి ముద్దలా అంటుకునే అవకాశం ఉంది. అందువల్ల కొంత పైనుంచి రవ్వ దోసెలా వేయాలి.
పిండి ఉడికించినదే కాబట్టి రెండో వైపు ఎక్కువ కాలకపోయినా పరవాలేదు.
కావాలంటే పైన చెప్పిన పిండిలో కొంత జొన్నపిండికానీ, రాగుల పిండి కానీ కూడా కలుపుకోవచ్చు.
Deleteమరి కొట్టిన పిండిని ఏమి చేస్తారు అనురాధ గారు. ఒక సందేహం.. అసలే వరిపిండి అన్నారు దానిని కుక్కర్ లో ఇడ్లిల మాదిరి ఉడకబెట్టారు.. అపుడది పేద్ద ఇడ్లి ఐతది కదా.. అటువంటప్పుడు నీరు పోస్తే మళ్ళి దోస పిండిలా జారుగా ఎలా మారుతుంది. అలా ఐతే ముందుగానే ఆ బియ్యపు పిండిలోనే చొళ్ళ పిండి కలుపుకుని జారుడు దోశెల మాదిరిగానో.. లేదంటే బొర్లించిన కుండపై గుడ్డతో పెట్టే పూతరేకు మాదిరిగానో తయారౌతాయి కదా అని మాయావిడువాచ.. అదేదో మూవిలో లా నెయ్యేసి కాల్చాలా.. కిరస్నాయిలేసి కాల్చాల్.. అసలు కాల్చాలా వద్దా..!
Deleteమా ఘమ్సిబాయి కి (ఝాన్సి లక్ష్మీ బాయి లాటి దాని నేనంటు తనకు తానే బిరుదు ఇచ్చుకుంటే.. సరదాగా ఆటపట్టిస్తు నా ధర్మపత్నిని నేను అపుడపుడు అలా పలకరిస్తాను, అనురాధ గారు) వచ్చిన ధర్మ సందేహమిది. రెండు సార్లు కుక్ చేస్తే ఇడ్లి, ఖమన్ ఢోక్లా, మోమో, శర్వపిండి, రాగి సంగటి ముద్దలా గట్టిగా ఐపోదు, జొన్న పిండి ముద్ద విరిగిపోతుంది తదా శ్రీవారు అని అడిగితేను.. అమ్మ కు వంటవార్పు వచ్చు కదా అని ఈ రెండేళ్ళు తన కోడలికి పని చెప్పలేదు. ఇపుడేమో తనకి వంట ఎలా చేయాలో అమ్మను అడిగి, యూట్యూబ్ లో చూసి, వంటల బ్లాగ్ లలో వెతికి ఇలా గట శ్రీమతి అంటే మీరు పిల్లల్ని చూస్తు ఉండండి నేను చేసుకోస్తా చిటికెలో అంటు అపుడపుడు మాడు దోశెలు చేస్తా వుంటుంది నా ధరణి..!
sridhar+anitha=sri[dharani]tha.. మీకు ధన్యవాదములండి.
Deleteబొంబాయ్ రవ్వ లేకుండా రవ్వ దోసెలుగా...
బొంబాయ్ రవ్వ, మైదా వంటివి వాడటం మంచిది కాదని అంటున్నారు.అయితే, బొంబాయ్ రవ్వ బదులు బియ్యపు రవ్వ వేసుకోవచ్చు.
ముందురోజు రుబ్బిన పిండి లేనప్పుడు దోసెలు వేసుకోవాలనుకుంటే కూడా (ఇన్స్టెంట్ దోసెలు)ఇలా వేసుకోవచ్చు.
అయితే, ఇక్కడ పిండిలో నీరు పోయకుండా పొడిపిండిని కొంతసేపు ఉడికిస్తాము.
పొడిపిండి ముందే కొంత ఉడికించటం వల్ల, దోసె పచ్చిగా ఉందేమో ? సరిగ్గా ఉడికిందో? లేదో? అనే సందేహం ఉండదు.
ఒక కప్పు బియ్యపుపిండిని ఒక గిన్నెలో పోసి.. కుక్కర్లో కొంచెం నీరు పోసి.. బియ్యం పిండి ఉన్న గిన్నెపై మూత పెట్టి.. కుక్కర్లో ఉంచి, కుక్కర్ విజిల్ పెట్టకుండా సుమారు 10 నిమిషాలు ఉడికించాలి.(ఇడ్లీలు ఉడికించే విధానంలో..)
(అయితే, ఇడ్లీలు తప్పనిసరిగా 15 నిమిషాలు ఉడికించుకోవాలి.)
తరువాత బియ్యంపిండి గిన్నెను కుక్కర్లో నుండి తీసి, ఆ పిండి లో సుమారు ఒకటిన్నర గ్లాసులు ..లేక రెండుగ్లాసులు నీరు పోయాలి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి ఉంచుకుని, అందులో కొంచెం జీలకర్ర కలుపుకోవాలి.
పిండిని పెనం పై నుండి జారుగా దోసెలుగా వేసుకుని, పైన ఉల్లితరుగు జల్లుకుని, కొంచెం నూనె వేసుకోవాలి. దోసెను దోరగా కాల్చుకోవాలి.
ఈ పిండిని మామూలు దోసెలాగ గరిట ను పెనానికి తగిలేలా పిండిని వేసి తిప్పితే.. పిండి పెనానికి ముద్దలా అంటుకునే అవకాశం ఉంది. అందువల్ల కొంత పైనుంచి రవ్వ దోసెలా వేయాలి.
మంటను బాగా తగ్గించి కాకుండా కొంత పెద్ద మంట ఉండేలా ఉంచి, పిండిని రవ్వదోసెలుగా కొంత పలుచగా కలిపి, పెనంపైన కొంత ఎత్తునుంచి దోసెలుగా వేస్తే హోల్స్ బాగా వస్తాయి.
పిండి ఉడికించినదే కాబట్టి రెండో వైపు ఎక్కువ కాలకపోయినా పరవాలేదు.
కొంచెం ఎక్కువసేపు కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి.
మొత్తం బియ్యంపిండి అయితే తెల్లగా క్రిస్పీగా వస్తాయి. కొంత జొన్నపిండికానీ, రాగిపిండికానీ బియ్యంపిండిలో కలుపుకుని కూడా దోసెలు వేసుకోవచ్చు. అంతా రాగిపిండితోనే వేస్తే కూడా దోసెలు వచ్చాయి.
* ఇడ్లీలు ఉడికించే విధంగా అంటే ..ఇడ్లీపిండిలో నీరు కలిపి ఉడికిస్తాము కాబట్టి, ఆ పిండి ఇడ్లీలుగా ఉడికిపోతాయి.
ఇక్కడ బియ్యపుపిండిలో నీరు కలపకుండా పొడిపిండిని ఉడికిస్తాము.
(బియ్యంపిండిలో కొంత జొన్నపిండికానీ, రాగిపిండికానీ కలుపుకుని కూడా ఉడింకించుకోవచ్చు.)
* పిండి గట్టిగా అయినాకూడా.. నీరుపోసి గరిటెతో కలిపితే వెంటనే దోసెల పిండిలా జారుగా అవుతుంది.
అనురాధ గారు.. చాలా ఓపికగా వివరించినందుకు ధన్యవాదాలు.. నా శ్రీమతి కి తెలియజేస్తాను. మీ బ్రాగ్ లో చాలా విషయాలు పొందుపరిచారు. మరొకమారు ధన్యవాదాలు.. మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నందుకు అభినందనలు మీకు.
Delete
ReplyDeleteమరికొన్ని విషయాలండి..
పిండిని వేడి చేయకుండా కూడా అప్పటికప్పుడు పిండిని నీటిలో కలిపి దోసెలు వేసుకోవచ్చు.
పచ్చి పిండితో అప్పటికప్పుడు వేసిన దోసెలను కూడా వేడి పెనం పైన సరిగ్గా కాల్చితే సరిపోతుంది.
****
అయితే, కొందరికి దోసె ఉడికిందో? లేదో? అని సందేహాలు ఉంటాయి.
ఇలాంటప్పుడు.. పొడిపిండిని ఒకసారి వేడిచేసి దోసెలు వేస్తే, పిండి ఉడకలేదనే సందేహం ఉండదు కాబట్టి ఇలా చేసాను.
ఈ పిండి గిన్నె అడుగుభాగానికి వెళ్లి నీరు పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, దోసె వేసినప్పుడల్లా పిండిని ఒకసారి గరిటెతో కలుపుకుని దోసె వేసుకోవాలి.
********
ఇవన్నీ రాస్తుంటే మామూలుగా వేసుకునే మినపదోసెలు, పెసరట్లు విషయంలో
నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి..
రుబ్బిన మినప్పప్పు, పెసరపప్పు వంటివి త్వరగానే ఉడుకుతాయేమో.. వాటిని కొన్నిసార్లు నానబెట్టి పచ్చివి తింటారు కూడా.
బియ్యం, జొన్నలు.. వంటివి మాత్రం సరిగ్గా ఉడకటం అవసరం.
అయితే..మినపప్పును, బియ్యాన్ని కొన్ని గంటలు నానబెట్టి, రుబ్బి కొంత సమయం తరువాత దోసెలు వేసుకుంటే అవి ఉడకకపోవటం అనే సమస్య ఉండకపోవచ్చు.
***********
దోసెలను ఇనుప పెనంపై వేస్తే త్వరగా కాలుతాయి. అయితే, పెనం తుప్పు పట్టకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక, Soapstone Kalchatti Tawa (Maakal).... అనేవి కూడా ఉన్నాయి.
***********
ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నా కూడా .. మేము కూడా అప్పుడప్పుడు మైదా, బొంబాయ్ రవ్వ వాడుతాము.
**********
నాకు ఒక సమస్య ఉంది. నాకు ఆలోచనలు అన్నీ ఒకేసారి తట్టవు.
బ్లాగులో పోస్టుకానీ, కామెంట్ కానీ వ్రాసిన తరువాత కూడా కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వీలైనంతలో వాటిని కూడా వ్రాస్తుంటాను.
చదివేవారికి విషయాన్ని వివరంగా తెలియజేయాలనే తాపత్రయంలో కొత్తగా తట్టిన ఆలోచనలను కూడా రాస్తుంటాను.
*******
వ్రాసిన వాటిలో ఏమైనా సందేహాలుంటే అడగవచ్చండి.
ప్రతిసారి ధన్యవాదాలు చెప్పనవసరం లేదండి.
ReplyDeleteమినపప్పు,బియ్యం కలిపి ఇడ్లీలు, దోసెలు, పునుగులు..వంటివి ఎక్కువ వద్దనుకుంటే పెసలు, మినపప్పు నానబెట్టి రుబ్బి దోసెలు వేసుకోవచ్చు.
మినప్పప్పు, జొన్నలు కలిపి దోసెలు వేయటం కూడా అంతర్జాలంలో చూపిస్తున్న.
మినప్పప్పు, జొన్న రవ్వ కలిపి ఇడ్లీలు వేసుకోవచ్చు. పెసర్లతో కూడా ఇడ్లీలు వేయటం అంతర్జాలంలో తెలియజేస్తున్నారు.
గోధుమపిండికి కొద్దిగా బియ్యంపిండి కలిపి కూడా పునుగులు వేసుకోవచ్చు.
బియ్యంపిండి లేదా బియ్యపు రవ్వకు, కొద్దిగా జొన్నరవ్వ లేదా జొన్నపిండిని కలిపి పునుగులు వేసుకోవచ్చు.
ReplyDeleteఈ మధ్య కొందరు ఉప్పుడు బియ్యపు రవ్వను ఇంట్లోనే తయారుచేస్తున్నారు.
బియ్యాన్ని వేడినీటిలో కొద్దిసేపు ఉంచి ఆ నీటిని వార్చి, బియ్యాన్ని ఎండలో ఎండించి రవ్వ పట్టిస్తున్నారు.
నేను ఇంతకుముందు ఏమనుకున్నానంటే, ధాన్యాలు సరిగ్గా ఉడికించకుంటే అజీర్ణం చేస్తుందనుకున్నాను.
ReplyDeleteఅయితే, ఈ మధ్య ఒకరు తెలియజేసిన అమృతాహారం అనే విధానం గురించి చూసాను.
వారు ఏం చెప్తున్నారంటే ..కాయగూరలు, పండ్లను ఉడికించకుండా తింటే మంచిదని చెబుతున్నారు. ఇంకా కూడా ధాన్యాలను నానబెట్టి, రుబ్బి కొంతసేపు తరువాత( ఉడికించకుండా) తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
ఇది విన్న తరువాత ఏమనిపించిందంటే, ఎప్పుడయినా దోసెలు అవి వేసుకున్నప్పుడు దోసెలు పూర్తిగా వేగకపోయినా ప్రమాదం ఉండకపోవచ్చని ధైర్యం వచ్చింది.