మరికొన్ని విషయములు...
నాకు సంస్కృతము తెలియదు.
సంస్కృతములో కొన్నిచోట్ల (కొన్నిసార్లు) ఒకే పదానికి కూడా ఒకే అర్ధము అని కాకుండా, మరికొన్నిఅర్ధాలుంటాయట, ఒక్క అక్షరం మారినా, పలకటంలో తేడా వచ్చినా..అర్ధం మారే పరిస్థితి ఉంటుందట.
ఉదా..వంద్యా అంటే ఒకవిధమైన అర్ధం, వంధ్యా అని వత్తి పలికితే వేరే విధమైన అర్ధం అని తెలిసింది. అందువల్ల జాగ్రత్త తీసుకోవాలి.
..............................
వర్ణసంకరము అంటే అర్ధము ఏమిటోనని నాకు సందేహాలు కలిగాయి.
సంస్కృతములో వర్ణము అంటే కొన్ని అర్ధములు ఉండవచ్చు. సాంకర్యము అంటే కొన్ని అర్ధములు ఉండవచ్చు. వర్ణసాంకర్యము అంటే కొన్ని అర్ధములు ఉండవచ్చు.
వర్ణసాంకర్యము అంటే ఏమిటో దైవానికే తెలుస్తుంది.
......................................
మహాభారతయుద్ధసమయంలో భారీగా సైనికులు చనిపోతే, వర్ణసాంకర్యం జరిగి సమాజానికి ముప్పు వాటిల్లుతుందేమోనని అర్జునుడు సందేహాన్ని వ్యక్తపరచారట.
అర్జునుని సందేహాలకు శ్రీకృష్ణుల వారు తెలియజేసిన విషయాలను గమనిస్తే, వర్ణాలు కేవలం పుట్టుకతోకాకుండా గుణకర్మలను బట్టి ఏర్పడుతాయని తెలుస్తోంది.
(శ్రీ కృష్ణులవారి అభిప్రాయాలను సరిగ్గా పూర్తిగా తెలుసుకోవటం..నాకు తెలియదు. అర్ధమయినంతలో వ్రాసాను.)
......................................
ఎవరి పనిని వారు సరిగ్గా చేయకపోతే వర్ణసంకరం అని అంటారని కూడా అనిపిస్తోంది.
...............................
పాతకాలంలో యుద్ధవిద్యలను బ్రాహ్మణులు కూడా నేర్పించేవారని తెలుస్తోంది. ఉదా..పాండవుల గురువులు బ్రాహ్మణులు..ఉన్నారు.
పాండవుల గురువులు యుద్ధవిద్యలను నేర్పించటం మాత్రమే కాకుండా, వారు స్వయంగా యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఈ విషయాలను గమనిస్తే, ప్రాచీనకాలంలో కొందరు వివిధ వృత్తులను చేపట్టినట్లు తెలుస్తోంది.
...................................
నాకు తోచిన ఆలోచనలు...
వర్ణసాంకర్యము తప్పు, వర్ణసంకరం జరగకూడదని అంటారు...అంటే ఎవరూ తమ వృత్తిని మార్చుకోకూడదని అర్ధం అయితే,
ప్రాచీనకాలంలో కూడా కొందరి విషయంలో వృత్తులు మారటం, ఒకే కుటుంబంలో వివిధవృత్తులు చేయటం జరిగిందట.
ఉదా..పాండవులు కొంతకాలం విరాటరాజుకొలువులో వివిధ వృత్తులను చేసారు.
మనుషులలో గుణాలు, స్వభావము మారటం అనేది కూడా ఉంటుంది.ఎవరైనా చెడుగా మారకూడదుకాని, మంచిగా మారటం మంచిదే.
ఉదా..అరణ్యాలలో సామాన్యంగా జీవించే వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకుని వాల్మీకి మహర్షిగా మారారు.
.................................................
వర్ణము అంటే వృత్తులు అని కూడా అనుకుంటే, వర్ణసాంకర్యము చేస్తే తప్పు.. అని అంటే,
స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా.. వారి పనిని మంచిగా చేయాలి, పనిలో చెడును కలపకుండా మంచిగా పద్ధతిగా పని చేయాలి అని ( తమ వృత్తిలో మోసం, పాపాలు..వంటివి చేయకూడదని ..).
వర్ణసంకరం కాకూడదు.. అంటే, ఈ అర్ధాన్నికూడా భావించవచ్చని నాకు అనిపించింది.
......................................................
అత్యంత ప్రాచీనకాలంలో వర్ణవ్యవస్థ, పుట్టుకతో వచ్చేదిగా ఉండి, క్రమంగా వృత్తులతో వచ్చే కుల వ్యవస్థగా మారి ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
అత్యంత ప్రాచీనకాలంలో వర్ణవ్యవస్థ, వ్యక్తుల స్వభావము మరియు పనిని బట్టి ఉండేదని, క్రమంగా పుట్టుకతో వచ్చే కుల వ్యవస్థగా మారి ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
అయితే, అగ్రవర్ణాలుగా ఉన్నవారిలో..ఉపనయనం జరగకుండా వారికి ద్విజత్వం రాదు, అందాకా వీళ్ళు శూద్రుల కిందనే లెక్క..అని కూడా అంటారు.
వర్ణము లేక కులము..అనేది పుట్టుకతోను ఉండవచ్చు, వృత్తిని(పని..)బట్టి కూడా ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
స్త్రీకి వివాహానికి ముందు తండ్రి యొక్క వర్ణము(కులము..), వివాహానికి తరువాత భర్త యొక్క వర్ణము(కులము..) ఉండి ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
అప్పట్లో చాలామంది స్త్రీలు ఇంటిపట్టున ఉండి ఆహారం వండటం, ఇల్లు చక్కదిద్దుకోవటం, చంటిపిల్లల సంరక్షణ, పిల్లలను చక్కగా పెంచటం..చేసేవారు. మరల బయటకొచ్చి ఉద్యోగాలు అని బోలెడుపని చేసేవారు కాదు.
.........................................
ఈ రోజుల్లో.. ఎవరైనా వేరేవేరే కులాల వాళ్లు వివాహం చేసుకుంటే జన్మించిన పిల్లలకు తండ్రి యొక్క కులాన్ని చెప్పే పద్ధతి పాటిస్తున్నారు. తల్లి తండ్రి విడిపోయినా లేక కొన్ని సందర్భాలలో...తల్లి లేక తండ్రిలో ఎవరి కులం పిల్లలకు రావాలనేది.. ఎంచుకునే అవకాశం కూడా ఉందట.
విజ్ఞాన సూత్రాల సహాయంతో..ఒక్క స్త్రీ మాత్రమే లేక ఒక్క పురుషుడు మాత్రమే సంతానాన్ని పొందితే, ఆ పిల్లలకు ఆ ఒక్క పేరెంట్ కులమే వస్తుంది కావచ్చు.
................................................
విషయాలను గమనిస్తే ఏమనిపిస్తుందంటే, సమాజంలో పనివిభజన, వృత్తులు ఏర్పడ్దాయి.
పిల్లలకు తండ్రి చేసే వృత్తి కాకుండా, వేరే వృత్తి నేర్పించాలంటే ఉన్న ఊరిలో అవకాశాలు లేక, వేరే ఊరికి పంపటం ఇష్టం లేని పరిస్థితిలో కూడా వంశపారంపర్య వృత్తులు కొనసాగిఉండవచ్చు. ఇలా కూడా పుట్టుకతో ఒకకులం అనేది కొనసాగుతుంది.
కులాలు ఏర్పడి, ఎవరివృత్తులు వారికి ఉన్నాకూడా, కొన్నిసార్లు ఇతరవృత్తులను కూడా చేసినట్లు తెలుస్తోంది.
ప్రపంచంలో వివక్ష అనేది అనేక విషయాలలో ఉంది. ప్రాచీనకాలంలో ఏం జరిగిందో కాని, ఇప్పటినుంచి ప్రపంచంలో వివక్ష అనేది లేకుండా అందరూ ప్రయత్నించితే మంచిది.
........................................
గ్రంధాలలో ఉన్న ప్రాచీనకాలం నాటి విషయాలలో, కధలలో ఎన్నో విషయాలుంటాయి. ఎన్నో అంతరార్ధాలుంటాయి. ఎన్నో కోణాలుంటాయి. ఎన్నో విధాలుగా విశ్లేషించి తెలుసుకోవాలి. పైపైనచూసి గబుక్కున నిర్ణయానికి రాకూడదు.వారి పూర్వజన్మకర్మలను బట్టి కూడా కధలలో విషయాలుంటాయి.
గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు (మార్పులుచేర్పులు) జరిగాయని తెలుస్తుంది.ఏది ప్రక్షిప్తమో సరిగ్గా తెలియకపోవచ్చు.
గ్రంధాలలో ప్రాచీనకాలపు కధలలో చెప్పబడిన వాళ్లు ఇతర లోకాల్లోనివాళ్లు కావచ్చు. కొందరు, ఇతరగ్రహాలవాళ్లు కూడా ఉంటారు. భూమిపైన రాజ్యాలవాళ్లు, దేశాలవాళ్లు, రాష్ట్రాలవాళ్లు కూడా ఉంటారు.
ప్రాచీనకాలంలో భూమిపై వివిధఖండాలు కాకుండా, ఒకే ఖండముగా ఉండేదంటున్నారు.
.............................................
విశ్వంలో ఎన్నో డైమెన్షన్లున్నాయంటారు. సృష్టిలో అపారమైన విజ్ఞానం ఉంది. ఎన్నో రహస్యాలుంటాయి. అన్నీ దైవానికి మాత్రమే తెలుస్తాయి.
మనుషులు సృష్టిలోఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోలేరు. కొన్ని విషయాలను, సందేహాలను తెలుసుకోవచ్చు.
ఇంకా సందేహాలు ఉన్నాకూడా, వాటిగురించి అదేపనిగా ఆలోచించటం కన్నా, అవసరమైనంతలో కొన్ని తెలుసుకుని, అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుంటే సరిపోతుంది.
ప్రాచీన గ్రంధాలలో ఎంతో విజ్ఞానం ఉంది..గ్రంధాలలోని ఆయుర్వేదాన్ని కాని, ఇంకా ఏదైనా విద్యనుకాని నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. అయితే, గ్రంధాలలోని విజ్ఞానాన్ని అంతా తెలుసుకోవాలని, ఎప్పుడూ సందేహాలతో సతమతమవుతూ ఉంటే చాలాకష్టం.
జీవితంలో ప్రతి సందేహాన్ని తీర్చుకోవటమే మన జీవితలక్ష్యం కాదుకదా, దైవకృపను పొందటం..ముఖ్యము. దైవముదయ ఉంటే అన్నీ ఉంటాయి.
సృష్టిలో ఎన్నో విషయాలుంటాయి. ఎన్నో రహస్యాలుంటాయి. దైవానికే అన్నీ సరిగ్గా తెలుస్తాయి.
.................................
వ్రాసినవాటిలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
....................................
భారతీయ విజ్ఞానం గురించి కొన్ని లింక్స్..
3 COMMENTS: