కొన్ని రాజకీయపార్టీలు, షాపుల అడ్వరటైస్ మెంట్స్ వాళ్లు రోడ్దు వెంబడి పెద్ద సౌండుతో మైకులో అనౌన్స్ చేస్తూ వెళ్తుంటారు. ఇవన్ని చాలా ఇబ్బందిగా ఉంటాయి.
కొన్ని మీటింగుల సందర్భంగా ఎక్కువ సౌండుతో మైకులో చెబుతుంటారు. చుట్టుప్రక్కల ఇళ్ల వారికి సంగతి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.
మైక్ సౌండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా సరిగ్గా వినబడదు. సౌండ్ ఎక్కువగా ఉన్నప్పుడు తల దిమ్ముగా కూడా అనిపించే అవకాశముంది.
ఇంట్లో పూజ చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫోన్ వచ్చినా సరిగ్గా వినబడదు. టివీలో ఏమైనా కార్యక్రమాలు వినాలన్నా సరిగ్గా వినబడవు.
మైకులు సౌండ్ ఎక్కువగా కాకుండా తగుమాత్రం సౌండ్ ఉంటే బాగుంటుంది.
************************
మా ఇంటి దగ్గరలో ఒక దేవాలయం ఉంది. దేవాలయంలో మైకు పెడతారు.కొన్నిసార్లు ఎక్కువ సౌండ్ పెడతారు.
చాలా దూరంగా ఉన్న ఇళ్లవారికి కూడా వినబడాలని దేవాలయం వారి అభిప్రాయం కావచ్చు.
అయితే, దగ్గరి ఇంటి వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. మేము దేవాలయానికి దగ్గరగా ఉన్నాము కాబట్టి చాలా సౌండ్ వినిపిస్తుంది.
దైవానికి సంబంధించిన విషయాల గురించి ఇలా రాయటం పాపం అని కొందరు అనుకుంటారేమో కానీ, పాపం కాదని నా అభిప్రాయం.
మైక్ ఎక్కువ సౌండ్తో కాకుండా కొద్దిగా తగ్గించి పెడితే ఎంత బాగుంటుందో కదా! అనిపిస్తుంది.
సౌండ్ ఎక్కువగా లేకుండా తగుమాత్రం ఉన్నప్పుడు బాగుంటుంది. ఇబ్బందేమీ ఉండదు.
పాతకాలంలో మైకులు లేని కాలంలో దైవ స్తోత్రాలను శ్రావ్యంగా గానం చేసేవారట.. కొన్ని స్తోత్రాలయితే పైకి వినిపించకుండా చదువుకునేవారట.
ఇప్పుడు చాలా వాటిని మైకుల్లో గట్టిగా వినిపిస్తున్నారు.
***********
అందరికీ గట్టిగా వినిపించాలని పెద్ద శబ్దం పెడితే ఎంత గొప్ప శబ్దాలైనా
వినలేక చెవులు మూసుకునే పరిస్థితి వస్తుంది. శబ్దం సరిగ్గా ఉంటే చెవులకు,
మనస్సుకు హాయిగా చక్కగా ఉంటుంది.
మైకుల సౌండ్ తగ్గించి పెడితే మంద్ర
స్థాయిలో వినిపించే భక్తిపాటలు గాలిలో వ్యాపించి వాతావరణాన్ని శుద్ధి
చేస్తాయి.
నేను ఎక్కడో చదివినదాని ప్రకారం ..కొన్ని మంత్రాలు గట్టిగా
అందరికీ వినిపించకూడదట.
ఈ రోజుల్లో కొందరు మంత్రాలను తప్పుగా చదువుతూ
మైకులలో పెద్ద శబ్దంతో అందరికీ వినిపిస్తున్నారు.ఇదంతా ఏమిటో అర్ధం కాదు .
No comments:
Post a Comment