ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి వింటుంటే సమాజం ఎటుపోతోందో అర్ధం కావటం లేదు.
మహిళలపై అత్యాచారాలు జరగటం చాలా ఘోరం.
మరొక ఒక సంఘటనలో ఒక యువకుడు యాక్సిడెంట్ గురయ్యి రోడ్డుపై విలవిలలాడుతూ తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేయమని ప్రాధేయపడుతూ ఫోన్ నంబర్ ఇచ్చినా చుట్టుప్రక్కల గుమికూడిన జనం స్పందించలేదట.
కొందరయితే ఆ యువకుడు గిలగిలలాడుతుంటే సెల్ ఫోన్లో చిత్రీకిరిస్తూ ఉన్నారట. ఎవ్వరూ పట్టించుకోకపోవటం వల్ల ఆ యువకుడు అక్కడే మరణించాడట.
ఇవన్నీ గమనిస్తే ,మనుషుల్లో మానవత్వం మరుగునపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సమాజానికి తక్షణం కావలసింది నైతికాభివృద్ధి.
చిన్నతనం నుంచి పిల్లలలో నైతిక విలువలు పెంపొందేలా పెద్దవాళ్ళు శ్రద్ధవహించాలి.
నైతికవిలువలు కలిగిన పౌరుల సంఖ్య పెరిగితే సమాజంలో నేరాలు-ఘోరాలు తగ్గుతాయి.
No comments:
Post a Comment