ఒకప్పుడు నారదులవారు తామే గొప్ప విష్ణుభక్తులమని భావించి, ఆ మాట విష్ణుమూర్తి ద్వారా వినాలనుకుని వైకుంఠానికి వెళ్లి అడగగా, విష్ణుమూర్తివారు భూలోకంలో కూడా ఒక రైతు తనకు గొప్ప భక్తుడని తెలియజేస్తారు.
అంత గొప్ప భక్తుడు ఎలా ఉంటాడో చూడాలని కుతూహలంతో నారదుడు భూలోకానికి వెళ్లి చూడగా, ఆ రైతు తన స్వధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ తనకు వీలు కుదిరినంతలో విష్ణుమూర్తిని తలచుకోవటం గమనించి,
నారదులవారు విష్ణుమూర్తితో ...కొద్దిసేపు మాత్రమే భగవంతుని తలచుకునే రైతు అంత గొప్ప భక్తుడు ఎలా అవుతాడని ప్రశ్నించగా..
విష్ణుమూర్తి ..అంచులవరకూ నిండుగా తైలంతో నిండిన ఒక పాత్రను నారదుని తలపై ఉంచుకుని తైలం కింద ఒలకకుండా కొంతదూరం వెళ్లి రమ్మంటారు.
తిరిగి వచ్చిన నారదునితో.. ఇంతవరకూ ఎన్నిసార్లు దైవాన్ని తలచుకున్నావని విష్ణుమూర్తి ప్రశ్నించగా, తైలం క్రింద ఒలకకుండా జాగ్రత్తగా చూసుకునే కంగారులో తాను దైవప్రార్ధన సరిగ్గా చేయలేకపోయానని నారదుడు సమాధానమిస్తారట.
ఈ కధ వల్ల ఏమని తెలుసుకోవచ్చంటే .. స్వధర్మాన్ని నిజాయితిగా పాటిస్తూ వీలుకుదిరినంతలో దైవప్రార్ధన చేసినా చాలు .. దైవానుగ్రహాన్ని పొందవచ్చని తెలుస్తుంది.
ఈ కధను అంతర్జాలంలో ఒక దగ్గర ఇంగ్లీష్ లో చదివి రాసాను. సంభాషణల్లో ఎక్కడైనా తేడాలు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment