శుభప్రదమైన 2018 సంవత్సరపు శ్రీ అమర్ నాధ్ యాత్ర ప్రారంభమయింది. ..అందరికీ శుభాకాంక్షలు.
.....................
marikonni vishayamulu..
వేదములు ఎంతో గొప్పవి. వేదములలో దైవము గురించి, సృష్టిలోని విజ్ఞానం గురించి ఎన్నో విషయములు ఉంటాయని గ్రంధముల ద్వారా తెలుస్తుంది.
వేదవిజ్ఞానాన్ని తెలుసుకునే వారు తెలుసుకుంటారు. వేదవిజ్ఞానాన్ని నేర్చుకున్నవారు, ఆ విజ్ఞానం ద్వారా సమాజానికి తమ వంతు సాయం చేయవచ్చు.
దైవాన్ని పొందాలంటే సృష్టిలోని విజ్ఞానమంతా తెలుసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది. దైవకృపను పొందటానికి.. అన్నింటికి మూలమైన దైవాన్ని పట్టుకుంటే చాలు.
వేదములలో కొంత భాగాన్ని తెలుసుకోవాలన్నా ఎన్నో సంవత్సరాలు కృషి చేయాలంటారు. సమాజంలో ప్రతిఒక్కరూ అలా వేదములను నేర్చుకోలేరు.
సమాజం సరిగ్గా సాగాలంటే ఎన్నో వృత్తుల వారు అవసరం. సమాజంలో ఎన్నో వృత్తులున్నాయి. అవి నేర్చుకునే వారు అవి నేర్చుకుంటారు.
ఎవరైనా దైవకృపను పొందటానికి వేదవిజ్ఞానము తెలుసుకుని తీరాలని లేదనిపిస్తుంది. శ్రీకాళహస్తి సంఘటనలో జంతువులు కూడా భగవంతుని పూజించి దైవకృపకు పాత్రులయ్యాయి.
అందువల్ల, ఎవ్వరూ కూడా నాకు పాండిత్యం లేదు, వేదములు తెలియవు కాబట్టి, దైవకృపను పొందలేనేమో..అని అనుకోనవసరం లేదు.
వేదవిజ్ఞానం తెలియకపోయినా కూడా, తనకు తెలిసినంతలో సమాజానికి మంచిచేస్తూ, దైవము పట్ల ప్రేమతో దైవాన్ని నమ్మి స్మరిస్తే దైవకృపను పొందే అవకాశముంది.
వేదవిజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్లు, తద్వారా సమాజానికి మంచి చేస్తూ, దైవము పట్ల ప్రేమతో దైవాన్ని నమ్మి స్మరిస్తే దైవకృపను పొందే అవకాశముంది.
ఎవరి పద్ధతి వారిది.