koodali

Friday, June 22, 2018

కొన్ని సంఘటనలు...విపరీత ధోరణి..



 ఆధునిక సైన్స్ వల్ల  కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి..


ఆ మధ్య ఒక వార్త వచ్చింది. ఒక భార్యా భర్తకు ఎంతకూ సంతానం కలుగలేదట. 

అమ్మాయికి గర్భసంచి లో అనారోగ్యం కారణమని తెలిసింది. 

సరోగసి విధానం ద్వారా వారు సంతానభాగ్యం  పొందే వీలుందని వైద్యులు చెప్పగా …


అద్దెగర్భం విధానం ద్వారా తాను గర్భాన్ని  మోస్తానని అమ్మాయి తల్లి ముందుకు వచ్చిందట. 


కూతురు అల్లుడు యొక్క పిండాన్ని టెస్ట్ ట్యుబ్   ద్వారా  పెంచి  అమ్మమ్మ గర్భంలో ప్రవేశపెట్టారట.


 ఆ విధంగా ఒక తల్లి తన కూతురు యొక్క బిడ్డను తాను గర్భంలో ధరించి కూతురుకు సహాయం చేసిందట. 



అయితే ఇక్కడ ఎవరూ అపోహపడనక్కరలేదు.  కూతురు అల్లుడు యొక్క సంతానాన్ని  అత్త గారు గర్భంలో  ధరించడం ఏమిటీ?

 అందులో కూతురు అంశతో పాటు అల్లుడు అంశ కూడా ఉంటుంది కదా !  అనుకోకూడదు. 


ఈ సంఘటనలో  అత్తగారు ఏమీ అపవిత్రం కాలేదు కదా . కూతురు కోసం జస్ట్ ఆమె తన గర్భాన్ని అద్దెగా ఇచ్చింది అంతె.

*******************


ఈ రోజుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య  ఎక్కువగా పెరిగింది.ఒకరి కిడ్నీ ఇంకొకరికి అమర్చటమూ జరుగుతోంది. 


ఇలాంటప్పుడు..  విపరీత ధోరణి తో  ఆలోచించేవాళ్ళకు కొన్ని సందేహాలు వస్తాయి. 


ఉదా..ఇద్దరు అక్కచెల్లెళ్ళలో  చెల్లెలుకు కిడ్నీ వ్యాధి ఉండి అక్క ఒక కిడ్నీ చెల్లెలుకు ఇచ్చిందనుకుందాము.



 చెల్లెలు భర్త  అతిగా ఆలోచించి , అయ్యో! 
 పూజ్యునీయులైన వదిన గారి అంశ అయిన కిడ్ని నా భార్య శరీరంలో ఉంది. నేను నా భార్యతో కాపురం చేయవచ్చో లేదో ? అని ఆలోచిస్తే అది విపరీత ధోరణి అవుతుంది.


అలాగే ఇద్దరు అన్నాదమ్ముల్లో  తమ్ముడికి వ్యాధి ఉండి అన్న తన ఒక కిడ్నీ తమ్ముడికి ఇచ్చారనుకుందాము. 



తమ్ముడి భార్య అతిగా ఆలోచించి,  అయ్యో! పూజ్యునీయులైన బావగారి  అంశ అయిన కిడ్ని నా భర్త శరీరంలో ఉంది. నేను నా భర్తతో కాపురం చేయవచ్చో లేదో ? అని ఆలోచిస్తే అది విపరీత ధోరణి అవుతుంది.


-------------------------


మగవాళ్లు.. ...పూజ్యనీయులైన  తమ అత్త,మామగారి అంశలు తన భార్యలో ఉంటాయి కాబట్టి ,  భార్యతో కాపురం చేయవచ్చో లేదో ? అని ఆలోచిస్తే  అది విపరీతధోరణి అవుతుంది.



స్త్రీలు ......పూజ్యనీయులైన  తమ అత్త,మామగారి అంశలు తన భర్తలో ఉంటాయి కాబట్టి , భర్తతో కాపురం చేయవచ్చో లేదో ? అని ఆలోచిస్తే  అది  విపరీత ధోరణి అవుతుంది.


అశుచి అంటూ పదేపదే స్నానాలు చేయటం వంటివి కూడా విపరీతధోరణి అవుతుంది. ఇందువల్ల జలుబు వంటివి రావటంతో పాటు నీటివృధా చేసిన పాపం అంటుకుంటుంది.


పెద్దవాళ్ళు చెప్పినట్లు  పసుపు నీళ్లను చిలకరించుకున్నా   అశుచి  పోతుంది.


********* 
 నోరు అంటే ఉమ్మి ఉంటుంది, ఉమ్మిఅంటే  ఎంగిలి,  అశుచి, అంటు కాబట్టి .. నోటితో పవిత్రమైన  దైవనామాలను, మంత్రాలను పలకడం కూడా తప్పేమో ? అని  ఆలోచిస్తే అది విపరీతధోరణి అవుతుంది. 

****************

   లౌకిక విషయంలోనైనా, పురాణేతిహాసాలను అర్ధం చేసుకునే విషయంలోనైనా విపరీత ధోరణి తో ఆలోచించటం సరైనది కాదు.

పురాణేతిహాసాలలోని ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి. 


వీటిని విపరీత ధోరణితో ఆలోచించి  అపార్ధం చేసుకోకుండా  సక్రమంగా అర్ధం చేసుకోవాలి. 
 
 


1 comment:

  1. ప్రపంచానికి ఆదిలో ఆదిదంపతులు ఉన్నటు, ప్రతి కుటుంబానికి మూలంలో ఆది దంపతులు ఉంటారు.

    వారికి సంతానం కలగటం, ఆ సంతానానికి మరల సంతానం..ఇలా సంఖ్య విస్తరిస్తుంది. బంధువుల మధ్య రక్తసంబంధం ఉండటం వల్ల అంశ సంబంధం ఉంటుంది.

    అయితే, బంధుత్వాలలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దాని ప్రకారం వావివరసలు ఉంటాయి.



    మేనత్త, మేనమామ పిల్లల మధ్య వివాహం చేసే పద్ధతి కూడా ఉంది. ఎవరి కట్టుబాట్లను అనుసరించి వారు వివాహాలు చేసుకుంటారు.

    అక్క కూతురును వివాహం చేసుకోవటం, మేనత్త, మేనమామ పిల్లల మధ్య వివాహ సంబంధాలు కొందరిలో నిషిద్దం.









    ReplyDelete