ఇంకో విషయం ఏమిటంటే, బ్రహ్మ, ఇంద్రుడు .. అనేవి పదవులు అంటారు కొందరు. హనుమంతులవారు భవిష్యత్తులో బ్రహ్మ అవుతారట. మరి, హనుమంతుల వారు బ్రహ్మ అయితే సరస్వతిదేవి ఎవరు ? అనే సందేహం వస్తుంది.
నేను పండితుల ద్వారా విన్నదేమిటంటే, హనుమంతునికి సువర్చలా దేవి తో వివాహం జరిగిందని , హనుమంతులవారు బ్రహ్మ అయినప్పుడు సువర్చలాదేవి సరస్వతిదేవి అవుతుందని విన్నాను.
**************
గ్రంధాలలో ఎన్నో విషయాలున్నాయి. విజ్ఞానం, సమాజం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. అయితే, గ్రంధాలలోని అంతరార్ధాలను సరిగ్గా గ్రహించగలగాలి.
బ్రహ్మాండంలో ఎన్నో కోట్ల లోకాలున్నాయని, ఎందరో త్రిమూర్తులున్నారని, ఎందరో బ్రహ్మదేవులు ఉన్నారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది..
ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి ఒకే కధ వివిధ రకాలుగా చెప్తున్నారు. ఒకే విషయం గురించి భిన్నమైన కధలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఏది సరైనది ? ఏది కాదో ? భగవంతునికే తెలియాలి.
*************
రావణాసురుడు ఎత్తుకెళ్ళిన సీత నిజమైన సీత కాదని, ఛాయా సీత అని , నిజమైన సీత అగ్నిదేవుని సంరక్షణలో ఉన్నదని ఒక దగ్గర ఉంటే,
వాల్మీకి రామాయణంలో ఛాయా సీత గురించి ప్రస్తావన లేదంటారు.
ఉత్తరరామాయణం వాల్మీకి రామాయణంలో లేదంటారు కొందరు. ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు భేదం లేదు . భేదం చూపించిన వారు నరకానికి పోతారు. అని గ్రంధాల ద్వారా తెలుస్తున్నా కూడా, భేదాలతో పరస్పరం కొట్టుకున్న చరిత్ర మనకుంది.
హిందువులలో శక్తి, శివ, విష్ణు..ఇలా అనేక భాగాలుగా చీలికలుండటం, ఒకరితో మరొకరు కలహించుకోవటం జరిగింది.
వీళ్ళలో కొందరు గ్రంధాలలోని కధలను తమకు అనుకూలంగా, తమకు నచ్చని వారికి వ్యతిరేకంగా మార్చి ఉండవచ్చు?
ప్రాచీనకాలం నుండి తరతరాలుగా కొందరు పండితులు, పామరులు , కొందరు తెలిసితెలియనివాళ్లు, కొందరు స్వార్ధపరులు కొన్ని విషయాలను వక్రీకరించి ఉండవచ్చు.
కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసారేమో ?
కాలగమనంలో గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు జరిగి ఉండవచ్చని సందేహాలు వస్తాయి.
తెలిసీతెలియని కొందరి వల్లా, హిందువులకు వ్యతిరేకమైన కొందరి వల్లా గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు ప్రవేశపెట్టబడి ఉండవచ్చని సందేహాలు కలుగుతాయి.
ఏది ప్రక్షిప్తమో ? ఏది కాదో ? తెలియదు. ఇలాంటప్పుడు, గ్రంధాలలోని విషయాల గురించి ప్రజలకు తెలిసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
విషయాలను అపార్ధం చేసుకోకుండా, సమాజానికి హితం కలిగే విధంగా సరైన అర్ధాన్ని ప్రజలకు తెలియజేయాలి.
సమాజానికి నష్టం కలిగించేలా ఉన్న ప్రక్షిప్తాలను విడిచిపెట్టాలి.
.........................
ప్రాచీనగ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని పండితులే అంటుంటారు. తరతరాలనుండి ఎందరు తమకు తోచినట్లు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేసారో తెలియదు.
కొందరు తెలిసితెలియని వాళ్లు, స్వార్ధపరులు కూడా ..గ్రంధములలో మార్పులుచేర్పులు చేసే అవకాశముంది. అందువల్ల ప్రతిదీ గుడ్దిగా నమ్మటం కాకుండా విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు. భవిష్యత్తులో అయినా..ఎవరికి తోచినట్లు వారు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలి.
******************
గ్రంధాలలో ఎంతో విజ్ఞానం ఉంది. గర్భస్థ పిండాలను కుండలలో పెంచటం, ఒకరి గర్భం నుండి శిశువును ఇంకొకరి గర్భం లో ప్రవేశపెట్టడం.. దూరశ్రవణం, దూరదృశ్యం.. వంటివి గ్రంధాలలో చదివి పుక్కిటి పురాణాలంటూ ఎగతాళి చేసేవారు.
ఆయితే, ఆధునికకాలంలో టెస్ట్ ట్యూబ్ విధానం, టెలిఫోన్, టీవీ, సరోగసి..వంటివి వచ్చాక పూర్వీకులు చెప్పినవి సాధ్యమేనని తెలిసింది.
అయినా ప్రాచీనుల విజ్ఞానానికి, ఆధునిక విజ్ఞానానికి తేడా ఉంది.
ప్రాచీనులది ధ్యానంతో సాధించిన విజ్ఞానం. ఆధునికులది భౌతికవిజ్ఞానం.
ఆధునికులకు భౌతిక శరీరం గురించి ఇంకా పూర్తిగా తెలియదు. మనస్సు గురించి తెలిసింది ఇంకా తక్కువ.
ప్రాచీనుల విషయంలో శరీరంతో కన్నా, మనస్సుతో సాధించేది ఎక్కువ.
గ్రంధాలలో అణిమాది సిద్ధులు, పరకాయప్రవేశం, కామరూపవిద్య..వంటి ఎన్నో శక్తుల గురించి ఉంది.
వీటిగురించి తెలుసుకునే స్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా ఎదగలేదు.
భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందేమో తెలియదు.
***************
శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణచరితామృతం గ్రంధంలో ఎన్నో విషయాలున్నాయి.
ఒకయోగి అత్మకధ గ్రంధంలో కూడా అనేక లోకాలగురించి, అక్కడి వారి అద్భుతమైన శక్తుల గురించి తెలియజేసారు.
ఇవన్నీ ఊహకు అందని విషయాలు.
No comments:
Post a Comment