koodali

Friday, June 22, 2018

పురాణములు, ఇతిహాసములు, మరియు ప్రాచీన గ్రంధములు ఇవన్నీ చాలాగొప్పవి.....అందులోని ధర్మమును తెలుసుకోవటం మన ధర్మం.


ఓం.
సుధా సముద్రములోమణిద్వీపములో,చింతామణిగృహములో నివసించేఆదిదంపతులైన  పరమాత్మకు{శ్రీమన్మహాదేవుడుశ్రీమన్మహాదేవివందనములు.

శ్రీకృష్ణార్జునులకు వందనములు.

ఆ ఆదిదంపతులైన శ్రీమన్మహాదేవీశ్రీమన్మహాదేవులు ఇద్దరూ వేరువేరుకాదట . వారు అర్ధనారీశ్వర తత్వంలా ఒకరేనట. నన్ను క్షమించాలి. ఈ విషయం వివరించటానికి నాకు శక్తి చాలదు. దేవతలు రాగద్వేషాలకు అతీతులు కారట. త్రిమూర్తులు సత్వ, రజో, తమో గుణ ప్రధానులు. ఆ పరమాత్మయే రాగద్వేషములకు అతీతులు. 

ఇంకాశ్రీ దేవీభాగవతములో ఎన్నో విశేషములుచెప్పబడ్డాయి పరమాత్మ గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే.

శ్రీకృష్ణులవారిని గురించి కొన్ని విషయములు చెప్పుకుందాము. ఆయన శ్రీమహావిష్ణువు అవతారం. 

ఆయన అష్టభార్యలగురించి నాకుఏమనిపిస్తుందంటే వారు అష్టలక్ష్మీదేవీఅవతారములకు సంకేతమేమోనని. 

కొంతమంది అయనయొక్క పదహారువేలమంది భార్యలగురించి అపార్ధం చేసుకుంటారు. దానికి ఒక కారణం ఉంది.

పూర్వం ఒకానొకప్పుడు శ్రీకృష్ణులవారు, అర్జునులవారు నారాయణుడు, నరుడు గా అవతరించిన రోజులలో ఇద్దరూ గొప్పతపస్సు చేస్తున్నారు. 

అప్పుడు ఇంద్రుడు వారివద్దకు అప్సరసలను పంపించారు. ఇక్కడ నేను అనుకోవటం ఇంద్రుడు తపస్వుల ఇంద్రియనిగ్రహాన్ని పరీక్షిమిచుట కొరకు, ఇంకా వారు ఇంద్రియములను ఎంతవరకూ జయించారు ఇవన్నీ పరీక్షించటానికి అలా వారిని పంపిస్తారేమోనని అనిపిస్తుంది.


సరే ఆ అప్సరసలు ఎంతోకాలం అలా ఆడి, పాడినా నరనారాయణులు అలా నిశ్చలంగా తపస్సు చేసుకుంటూనేఉన్నారట.. కొంతకాలం తరువాత వారికివారే కండ్లు తెరచి అంతాగ్రహించి ............. ఆడి పాడి అలసిన అప్సరసలతో వారిని వారిలోకం తిరిగి వెళ్ళమనీ, వెళ్ళేముందు తమ ఆతిధ్యం స్వీకరించివెళ్ళవలసిందిగా మర్యాదకోసం కోరారట.


అప్పుడు నారాయణుడు తన తపశ్శక్తితో కొత్త అప్సరసలను, ఊర్వశిని కూడా సృష్టించి వారికి అతిధిమర్యాదలు జరిపారు. వీరి తపశ్శక్తికి , నిగ్రహశక్తికి ఆ అప్సరసలు ఆశ్చర్యపడి వారు తమలోకం వెళ్ళబోమని, తమందరిని వివాహం చేసుకోవలసినదిగా వరమడగటం జరిగింది.


అప్పుడు నారాయణుడు ఎంతో ఆవేదన చెంది వారిని శపించబోగా నరుడు కోపం మరింత అనర్ధకమని వారించటం జరుగుతుంది. అప్పుడు నారాయణుడు ఈ జన్మలో వారిని వివాహమాడటం జరగదని, భవిష్యత్తులో అది జరుగగలదని తెలియపరిచి వారిని పంపివేస్తారు.


ఆ తరువాత ఆయన ఎంతో ఆవేదనతో తాను ఎంతో తపశ్శక్తిని వ్యయపరిచి అప్సరసలను సృష్టించటం, ఆతిధ్యమివ్వటం , వరం ఇవ్వవలసిరావటం ,వీటన్నిటికి ఎంతో బాధపడి తాను అసలు వారిని పట్టించుకోకుండా గౌరవమర్యాదలు చెయ్యకుండా మౌనంగా ఉండిపోతే ఎంతబాగుండేది... వారి మానాన వారు వెళ్ళి పోయేవారు కదా అనుకుంటారు.



అదిగో.....ఆవిధముగా  పదహారువేలమందినిశ్రీకృష్ణుల వారు వివాహం చేసుకొనవలసివచ్చింది.దీని గురించి నాకు ఏమని అనిపిస్తుంది అంటే ....ఎవరైనా ఇలా కొన్ని సందర్భాలలోమర్యాదలు అంటూ మొహమాటాలుపోకుండా........... ముభావంగా వ్యవహరించటమేఅందరికీ శ్రేయస్కరమని.....


ఇంకా ఒకసారి వైకుంఠములో శ్రీలక్ష్మీదేవికి, సవతులతో సంవాదం జరిగిన సందర్భములో విష్ణుమూర్తి లోకమునకు ఒక ఉపదేశం చేస్తూ....పురుషునికి బహుపత్నులు ఉండటంధర్మ విరుధ్ధమని కూడా తెలియచేశారు


ఒకప్పుడు శ్రీకృష్ణులవారు సంతానార్ధియై శివుని కొరకు తపస్సు చేయటం జరిగింది. అంటే రుక్మిణి దేవికి వారికి సంతానం కలిగి తనకు ఇంకా సంతానం లేనందుకు జాంబవతీదేవి కృష్ణుని ప్రార్ధించటం జరిగిందట . (  జాంబవతీ దేవి యేనా కాదా అని నాకు సరిగ్గా గుర్తులేదు. దయచేసి క్షమించాలి.)

అప్పుడు
 పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయి సంతానవరాన్ని అనుగ్రహించటం జరుగుతుంది. దానికి ముందు కృష్ణులవారు వారితో తాను వారిని లౌకికమైన కోరికల కోసం ఆరాధించినందుకు బాధను వ్యక్తపరచటం జరుగుతుంది.


సరే ఆ తరువాత పార్వతీపరమేశ్వరులు కృష్ణులవారితో భవిష్యత్తులో జరగబోయే సంగతులు తెలియచేస్తారు. అందులో యాదవుల యొక్క నాశనంగురించి ,ఇంకా పదహారువేల యాభై మంది భార్యలు దొంగలవల్ల అవమానములు పొందటం ఇలా ఎన్నో విషయములు తెలియజేస్తారు.


ఇక భారత యుధ్ధములో అధర్మం జరిగిందనికొందరంటారుఇంతకుముందు ఒకసారి మనంధర్మం అనేది సందర్భమును బట్టి మారుతుందనిఅనుకున్నాము కదండి.

అంటే ఉదా.....మీ స్నేహితుడు ఒకసారి మీ ఇంటికి వచ్చాడని అనుకుందాము. ఆయన చాలా మంచి వ్యక్తి. మీ ఇద్దరు లోపల మాట్లాడుకుంటున్నారు. ఇంతలో బయట పెద్దగా మీస్నేహితుడిని పిలుస్తూ , కొంతమంది ఆయన శత్రువులు మీఇంటిముందు గోల చేస్తున్నారు. అప్పుడు మీరు ఏమి చేస్తారు?


మన పెద్దలు అసత్యం చెప్పటం పాపం అన్నారుకదా అని .... ఆయన ఇక్కడే ఉన్నాడని వారికిఅప్పగిస్తారా ? అప్పుడు
మీరు ఏమి చేస్తారంటే అబధ్ధం చెప్పనవసరంలేదు అప్పటికి యుక్తియుక్తముగా మాట్లాడి, ఏదో విధముగా తెలివిగా తప్పించి ఆయనను కాపాడుతారు. అదే కదా అప్పటికి ధర్మం.


శ్రీకృష్ణుల వారు ధర్మపరులైన పాండవులనుఇలాగే రక్షించారని నా అభిప్రాయంమనము ఆయనను స్నేహితునిగాలేక గురువుగాఎలాభావిస్తే అలా ఆయన మనలను రక్షిస్తారు.

ఇక,  శ్రీ భగవద్ గీత  గురించి ఎంత చెప్పుకున్నాతక్కువే .
అది అందరికి తెలిసిన విషయమే.

ఇంకా ధర్మాత్ములైన భీష్మాచార్యులు,, ద్రోణాచార్యులు, కర్ణుడు వీరు అలా జీవితాలు చాలించటం బాధాకరమే, కానీ మరి వారు అధర్మ పక్షములో చేరటంవల్ల అధర్మపరుడైన దుర్యోధనుడినికి శక్తి పెరుగుతోంది కదామరి. ... అయితే ఆ పెద్దలు అలా వారి పక్షాన ఉండటానికి వారి కారణములు వారికి ఉన్నాయి లెండి.


ఇక భారతయుధ్ధం తరువాత శ్రీకృష్ణులవారు, ,వారి అష్టభార్యలు అందరి అవతారసమాప్తి జరిగింది.తరువాత ఇన్నో సంగతులు జరిగాక దొంగలు వారి పదహారువేలమంది భార్యల ఆభరణములు దోచుకుంటారు. 
నేను అనుకోవటం అప్సరసలు ఒక తపస్విని అడగకూడని వరంఅడిగినందుకే  జన్మలో ఆఖరికి అలాఅవమానించబడ్డారేమోనని..


ఇక కొన్ని విశేషాలు చెప్పుకుంటే శంకరుడుపార్వతీదేవి సలహాతో లోకహితం కొరకు విషమునుకంఠములో దాచుకున్నారుమరి ఈనాడు మనముమనసుఖం కోసం లోకాన్ని విషంతోనింపుతున్నాము.


ఇంకా ప్రాచీన గ్రంధములనుండి మనము ఎన్నో సంగతులు నేర్చుకోవచ్చు. ఒకప్పుడు కైలాసములో విఘ్నాధిపత్యం కొరకు శివుడు వినాయకుడు, కుమారస్వామికి మధ్యన ఒక పోటీ పెట్టిన కధ మనకు తెలుసుకదా....అందులో శివుడు మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకములలో అన్ని పుణ్యనదులలో స్నానం ఆచరించి ముందుగా తిరిగి నా వద్దకు వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అని అనటం జరిగింది.


అప్పుడు కుమారస్వామి వెంటనే బయలుదేరి వెళ్ళగా వినాయకుడు తన అసక్తతను తల్లిదండ్రులవద్ద తెలిపి బాధపడినప్పుడు వారు కుమారా ! ఒక్కసారి నారాయణమంత్రంజపించినంతమాత్రమున మూడువందల కల్పములు సకల పుణ్యనదులలో స్నానమాచరించిన ఫలం లభిస్తుంది. ఒక్కసారిజననీజనకులకు ప్రదక్షిణ చేసినంతనే మూడులోకములు చుట్టివచ్చినంత ఫలితం కలుగుతుందని బోధించగా వినాయకుడు అలా ఆచరించి ఆ పోటీలో గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే. ఆతరువాత కుమారస్వామి కూడా ఈ రహస్యమును తెలుసుకుంటారు.


దీన్నుంచి నాకేమనిపించిందంటే మనము ఓపికఉండి తీర్ధయాత్రలు అలా చేయటం మంచిదేగానిఒకవేళ కుదరనప్పుడు బాధపడక దైవాన్నిమనశక్తిమేరకు ప్రేమభక్తితో పూజించినా  దైవందయ లభిస్తుంది అనిఇంకా మనము ఎప్పుడుఎలా ప్రవర్తించాలో  కదల ద్వారా మనముతెలుసుకోవచ్చు .


1. రావణాసురుని దుష్ట బుధ్ధికి సహకరించి వారి సంతానం మరణించారు.


2. దైవాన్ని ఎదిరించమన్న తండ్రి మాట వినక ధర్మమార్గములో నడిచి  దైవసహాయముతో ప్రహ్లాదుడు రక్షించబడ్డారు.


3.చెడ్డవాడైన వరునితో పెద్దలు వివాహం నిశ్చయించటం .... తరువాత రుక్మిణిదేవి శ్రీకృష్ణులవారిని వివాహమాడటం అందరికి తెలిసిన కధే. .

4. పెద్దలకు తెలియకుండా దుష్యంతునితో సంతానము పొందిన శకుంతల పడ్డ కష్టాలు మనకు తెలిసినవే.


5.అన్నదమ్ములు ఐకమత్యముగా ఉంటే వచ్చే లాభములు శ్రీరాముడు,లక్ష్మణుడు,భరతుడు,శత్రుఘ్నుడు కధ ద్వారాతెలుసుకోవచ్చు.


6.అన్నదమ్ములు వైరభావం కలిగిఉంటే వచ్చే ఫలితములు వాలి,సుగ్రీవుల కధ ద్వారా తెలుసుకోవచ్చు.


ఇలా ఎన్నో మనం తెలుసుకోవచ్చు.


ఇంకా నాకు ఏమనిఅనిపిస్తుందంటేనండి......ఎంతో విజ్ఞానం కూడాప్రాచీన గ్రంధములలో ఉన్నదని....ఉదా....రోజుల్లో స్టెంసెల్స్ అని మూలకణముల ద్వారాఎన్నో ప్రయోజనముల గురించి నేటి శాస్త్రవేత్తలుచెబుతున్నారువిష్ణుమూర్తి బొడ్డు నుండి పద్మంద్వారా బ్రహ్మ జన్మించి సృష్టిని చేస్తారు అంటే...

..ఒకవేళ మూలకణములు వీటి ప్రయోజనములు, వాటిద్వారా కొత్త సృష్టిని సృష్టిచవచ్చు ఇవన్నీ ఇలా సంకేతముగా కూడా నాకు అనిపించింది. పిల్లలు పుట్టినప్పుడు వచ్చే బొడ్డుత్రాడు నుండి ఈ మూలకణములు సేకరిస్తారు. ఇంకా బ్రహ్మ బొటన వ్రేలు నుండి దక్షుడు పుట్టారు ఇలా కూడా మూలకణములు అన్నవి వారికి తెలుసునని నాకనిపించింది.చాలా త్వరగా వ్రాయవలసి వస్తోంది.క్షమించండి.


ఇంకా త్రిమూర్తులు వారివారి పదవీబాద్యతలప్రకారం వారి వస్త్రధారణ ఉన్నట్లు కూడానాకనిపించింది

సృష్టిని చేసే బ్రహ్మ ఈ నాటి శాస్త్రవేత్తల వలె గడ్డం కలిగిఉండటం ...


మహావిష్ణువు స్థితి కి సూచనగా ఆభరణములు ధరించుట ఇలా అలంకారప్రియులు.


పరమశివుడు లయకారత్వానికి చిహ్నమైన భస్మమును ధరించుట, ఇంకా అభిషేకప్రియులు. ఇలా మనపెద్దలు ఎంత బాగా చెప్పారు... ఇలా ఎన్నో విషయములు మనము తెలుసుకుని ఆచరించవలెను. అపార్ధం చేసుకోవటం తప్పు.


శ్రీ గాయత్రీ మాతకు వందనములు.

ఇక ఇవన్నీ నేను వ్రాయటం జరిగింది అని చెప్పుకుంటే అంతకన్నా అహంకారం, హాస్యాస్పదమైన విషయం మరి ఇంకొకటి ఉండదు. సంస్కృతం కూడా చదవటం రాదు నాకు. వేదములు అసలే తెలియదు. నేనసలు ఇంత క్లిష్టమైన టాపిక్ ఎందుకు తీసుకున్నాను. అని ఎంతోబాధపడ్డాను.


ఒకోసారి ఏమి వ్రాయాలో తెలియక బెంబేలెత్తి ఇకనావల్లకాదు బాబోయ్ ... ఇక నీదే భారం అని దైవం పై భారం వేసేసి చేతులెత్తేసినప్పుడు .... నాయందు  దైవం జాలిపడి  మాత్రంవ్రాయటానికి సహాయం చేసినందుకు దైవమునకు నేనెలా కృతజ్ఞతలు తెలుపుకోగలను?అంతా  భగవంతుని దయ.


చిన్నప్పటినుంచి పెద్దలు, పిన్నలు ద్వారా తెలుసుకున్నవి ,ఇంకా దత్తాత్రేయుల వారుచెప్పినట్లు ఎన్నో జీవులనుండి కూడా మనము ఎన్నో విషయములు నేర్చుకోవచ్చు. ఇంకా నాకు సహాయపడిన మీ అందరికీ నా కృతజ్ఞతలండి.ఇందులోని తప్పులను నేను చేసినవి గాను,ఒప్పులను భగవంతుని దయగాను పాఠకులుగ్రహించవలెనని నా మనవి.

.పరమాత్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేఅంతా భగవంతుని దయ.


పరమాత్మార్పణమస్తు...........

Friday, July 30, 2010




No comments:

Post a Comment