koodali

Monday, June 25, 2018

కొన్ని విషయములు...మరియు ప్రధానాంశసంభవలైన ప్రకృతి కళారూపిణుల గురించి.....

* ఓం. శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రణామములు. 

*బ్రహ్మ దేవుడు , నారదునితో పరమాత్మను గురించి చెప్పిన సందర్భంలో..



ఈ విషయములు " శ్రీ దేవీ భాగవతము " గ్రంధము లోనివండి....



*సర్వప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే 
 ఆదిశక్తి-ఆదిపురుషుల తత్వం.అది తేజస్సు....
ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు.సర్వ ప్రాణికోటిలోనూ మిశ్రాభూతులై ఏకరూపులై అవ్యయులై నిర్గుణులై నిర్మలులై చిదాత్మలై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ.పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. అంటూ ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.
....................................

  *  ప్రధానాంశసంభవలైన ప్రకృతి కళారూపిణుల గురించి నారాయణుడు నారదునితో చెప్పిన విషయాలు............


స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడ లేకుండా దేవతలు సైతం హవిర్దానాన్ని స్వీకరించరు.



దక్షిణా దేవి యజ్ఞపత్ని
.


స్వధాదేవి పితృదేవతా పత్ని. ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి.



స్వస్తి దేవి వాయుపత్ని. ఆదానప్రదానాలను సఫలం చేస్తుంది.


పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీపురుషులు క్షీణించిపోతారు.



తుష్టిదేవి అనంత పత్ని. సకలదెవతలూ సకల లోకాలూ సంతుష్టి చెందేది ఈవిడ అనుగ్రహంతోనే.


సంపత్తిదేవి ఈనాశ పత్ని.
 ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్ర్యంతో అలమటిస్తాయి. (( ఇలాగే ఉందండి . .) మరి ఈశాన పత్ని . సరైనదో . లేక ఈనాశ పత్ని. సరైనదో నాకు తెలియదండి. )
  

ధృతిదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే అధైర్యంతో వొణికిపోవాల్సివస్తుంది.


సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే లోకం బంధుత్వరహితమై పోతుంది.



దయాదేవి మోహ పత్ని.



ప్రతిష్ఠాదేవి పుణ్య పత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది.



కీర్తిదేవి సుకర్మ పత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమై పోతుంది.



క్రియాదేవి ఉద్యోగపత్ని. ( ఉద్యోగం=ప్రయత్నం ) ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలై పోతాయి.
మిథ్యా దేవి అధర్మ పత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే ( ఆగ్రహిస్తే ) విధి నిర్మితమైన సృష్టి అంతావిచ్ఛిన్నమవుతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపిణిగా ఉంటుంది. ద్వాపరంలో సగం శరీరంతో దాగి ఉంటుంది. కలియుగంలో మాత్రం మహాప్రగల్భురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్ర వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపటరూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది.

శాంతదేవి లజ్జాదేవులిద్దరూ సుశీల పత్నులు. వారు లేకపోతే జగత్తు ఉన్మత్తమై పోతుంది.

బుద్ధి మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞాన పత్నులు.వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది.


మూర్తిదేవి ధర్మపత్ని. కాంతి స్వరూప. మనోహర. ఈవిడ లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ 
కూడా నిరాధారుడై పోతాడు. ఈవిడ శోభారూప. లక్ష్మీకళారూప. శ్రీ రూప. మూర్తిరూప.మాన్య. ధన్య.


ఇక నిద్రాదేవి కాలాగ్నిరుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది.


కాలానికి రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడు.


క్షుత్పిపాసలు లోభ పత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతోంది.


.తేజస్సుకి ప్రభా - దాహికలిద్దరూ భార్యలు.



కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వర పత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది.



నిద్రా తంద్రా ప్రీతి దేవులు ముగ్గురూ సుఖ పత్నులు. సకల ప్రాణికోటిని అలసట నుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు.



శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.



* ఇలా పెద్దలు చెప్పటం జరిగింది.
.....................
* నాకు అర్ధం అయినంతలో .........

౧. పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీపురుషులు క్షీణించిపోతారు. .......

అంటే ,
పుష్టిదేవితో కూడిన గణపతి దేవుని అనుగ్రహం వల్ల స్త్రీపురుషులు క్షీణించకుండా ఉంటారు....

( పుష్టిగా ఉంటేనే క్షీణించకుండా బలంగా ఉంటారు కదా !. )


౨. ధృతిదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే అధైర్యంతో
వొణికిపోవాల్సివస్తుంది.......

అంటే , (..ధృతి అంటే ధైర్యం .ధైర్యం లేకపోతే అధైర్యమే కదా !. )


౩ . ప్రతిష్ఠాదేవి పుణ్య పత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది. ........

అంటే ,( ..పుణ్యాలు చేస్తే ప్రతిష్ఠ పెరుగుతుంది. పుణ్యాలు చేసేవారు లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది కదా ! )


౪.కీర్తిదేవి సుకర్మ పత్ని.
 ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమై పోతుంది......

అంటే , (.మంచి కర్మలు చేసే వారు లేకపోతే జగత్తు యశోహీనమైపోతుంది కదా ! )


౫ . క్రియాదేవి ఉద్యోగపత్ని. ( ఉద్యోగం=ప్రయత్నం ) ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలై పోతాయి. .............

అంటే ,. (. పద్ధతిగా పనులు చేసేవారులేకపోతే లోకాలన్నీ సోమరులతో నిండి విధిహీనాలైపోతాయి కదా ! )


౬ . 
మిథ్యా దేవి అధర్మ పత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే ( ఆగ్రహిస్తే ) విధి నిర్మితమైన సృష్టి అంతావిచ్ఛిన్నమవుతుంది .......

అంటే ,. ( మిధ్యావాదులైన అధర్మపరులయిన ప్రజల వల్ల సృష్టి
విచ్ఛిన్నమవుతుంది కదా !. )


౭ . శాంతాదేవి లజ్జాదేవులు సుశీల పత్నులు.........వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది. .........

అంటే , ( శాంతం, లజ్జ ( సిగ్గు ) లేని ........ సుశీలత లేని వ్యక్తుల వల్ల జగత్తు ఉన్మత్తమైపోతుంది కదా !. )


౮ 
బుద్ధి మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞాన పత్నులు.వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది. ......

అంటే ,....( బుద్ధి మేధా ధృతి కలిగిన జ్ఞానులు లేని లోకం మూఢులతో నిండిపోతుంది కదా !.)


౯ .. మూర్తిదేవి ధర్మపత్ని........

అంటే ,...( ధర్మం , ధర్మమూర్తులు లోకంలో పెరిగినప్పుడు లోకంలో ధర్మానికి బలం పెరిగి , అధర్మానికి బలం తగ్గిపోతుంది . అప్పుడు
పరమాత్మ కృపకు పాత్రులమవుతాము కదా ! )


౧౦ . క్షుత్పిపాసలు లోభ పత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతోంది......

అంటే , (.క్షుత్పిపాసలతో కూడిన లోభబుద్ధి కలవారి వల్లే లోకం చింతాతురమవుతోంది కదా ! )


౧౧. కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వర పత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది. ..........

అంటే ,...( జరా ( ముసలితనం ), మృత్యువు వల్లనే జీవులు మరణిస్తారు. అలా జగత్తు క్షీణిస్తోంది కదా !. )


౧౨. నిద్రా తంద్రా ప్రీతి దేవులు ముగ్గురూ సుఖ పత్నులు. సకల ప్రాణికోటిని అలసట నుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు..........

అంటే ,....(. నిద్రా ......... సుఖం వల్ల అలసటనుంచి తేరుకుంటారు కదా ! )


౧౩. శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.................

అంటే ,. ( శ్రద్ధా భక్తులు ఉన్నవారికి వైరాగ్యం కుదురుకుంటుంది. వారికి మోక్షం లభించే అవకాశం ఉంది కదా !.)



ఇలా నాకు అర్ధమయింది వ్రాసానండి. నాకు పెద్దగా పాండిత్యం లేదు. ఇందులో పొరపాట్లు ఉన్నయెడల దైవం క్షమించాలని కోరుకుంటున్నానండి.

Monday, May 28, 2012


మరి కొన్ని విషయములు....



*******************

ఆసక్తి ఉన్నవారు ఈ టపాను కూడా చూడవచ్చు . 


Wednesday, May 16, 2012

సూర్య ప్రభ, చంద్ర శోభ ....సూర్యప్రభ, చంద్ర ప్రభ.




No comments:

Post a Comment