క్రిస్టియన్లు,
హిందువులు, ముస్లిం మతం వారు ఒకరితో ఒకరు గొడవలు
పడకూడదు.
ఒకరి
గ్రంధాలలోని విషయాల గురించి ఇంకొకరు తప్పుగా మాట్లాడకూడదు.
ఎవరి మార్గంలో వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. దైవం
అందరికీ ఒకే శక్తి.
వేరువేరు దేవుళ్లుంటే ఈ ప్రపంచాన్ని ఏ దేవుడు సృష్టించినట్లు?
కొందరు నీరు అన్నా, కొందరు వాటర్ అన్నా కొందరు పానీ
అన్నా ఉండేది నీరు అనేది ఒక్కటే.
అలాగే ఎవరు ఏ విధంగా విధమైన పేరుతో పిలుచుకున్నా, ఏ విధంగా ఆరాధించుకున్నా దైవం అనేది
ఒక మహాశక్తి.
దైవాన్ని ఎవరి పద్ధతి ప్రకారం వారు ఆరాధించుకుంటారు.
***********
మరి కొన్ని విషయములు....
దైవమనే మహాశక్తి సృష్టిలో అన్ని జీవులను సృష్టిస్తారు. అన్ని జీవులు వారి సృష్టే.
మహానుభావులు.. ప్రపంచమంతా చక్కగా ఉండాలని కోరుకుంటారు.
రామకృష్ణమఠంలో అన్ని మతాలవారికి ప్రవేశముంటుంది. ఒకయోగి ఆత్మకధ పుస్తకంలో ఇతర మతాల ప్రస్తావన ఉంది.. శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణచరితామృతము గ్రంధములో ఇతర మతముల వారి గురించి ప్రస్తావన ఉంది.
దైవమనే మహాశక్తి సృష్టిలో అన్ని జీవులను సృష్టిస్తారు. అన్ని జీవులు వారి సృష్టే.
మహానుభావులు.. ప్రపంచమంతా చక్కగా ఉండాలని కోరుకుంటారు.
రామకృష్ణమఠంలో అన్ని మతాలవారికి ప్రవేశముంటుంది. ఒకయోగి ఆత్మకధ పుస్తకంలో ఇతర మతాల ప్రస్తావన ఉంది.. శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణచరితామృతము గ్రంధములో ఇతర మతముల వారి గురించి ప్రస్తావన ఉంది.
కొందరు పండితులు కూడా మతాలకతీతంగా సినిమాలు తీయటం, మాటలు, పాటలు వ్రాయటం జరిగింది. ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు, ప్రజలు ఆ భావజాలానికి ప్రభావితం అవ్వటంలో ఆశ్చర్యం లేదు.
లోకాసమస్తాసుఖినోభవంతు..అని అందరూ అనుకోవాలని పెద్దలు తెలియజేసారు. అలా లోకం అంతటా సుఖంగా ఉండాలని కోరటంలో తప్పు లేదు. అందరూ అలా కోరుకోవాలి కూడా.
చాలామంది హిందువులు ఉదారవాదులు. ఇతరమతాల పట్ల ఉదారంగా ఉంటారు. అయితే, కొన్ని మతాలవారు కొందరు, ఇతర మతాలవారిని గౌరవించనప్పుడు అనేక సమస్యలు వస్తాయి. అలా గౌరవించనివారిది తప్పు.
అన్నిమతాలవారు ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవించాలి.
అయితే, హిందువులు ఎంత ఉదారంగా ఉన్నాకూడా, ఇతరులు ఉదారంగా లేకుండా హిందువులను మతం మార్చటానికి నయానా, భయానా ప్రయత్నిస్తున్నప్పుడు, హిందుమతాన్ని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు.. హిందువులు తమను, తమ మతాన్ని పరిరక్షించుకోవటంలో తప్పులేదు. ఎవరిని వారు రక్షించుకోవాలి కదా..
హిందువులలోనూ మంచివారు చెడ్డవారు ఉంటారు. ఇతరమతాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉంటారు. అయితే అతి మంచితనంతో అన్నీ వదిలేసి కూర్చోకూడదు.
ఉదా..ప్రపంచంలో అందరూ మంచివాళ్లే అనుకుంటూ.. రాజు రాజ్యరక్షణ చూడకుండా కూర్చుంటే, శత్రువులు వచ్చి రాజ్యాన్ని దోచుకుని, ప్రజలను చంపి వెళ్తారు. అందువల్ల లోకాస్సమస్తాసుఖినోభవంతు.. అనుకుంటూనే మన రక్షణ కొరకు సరైన రక్షణ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి.
ప్రపంచమంతటా కొందరు దుష్టులు.. అధికారం, సంపద కొరకు మతాలను కూడా వాడుకుంటూ సామాన్య ప్రజలను కష్టాలపాలు చేస్తున్నారు. కుల,మత,ప్రాంతాల పేరుతో ..ప్రజలను రెచ్చగొడుతూ సామాన్యులను కష్టాలుపెడుతున్నారు. ప్రజలు ఏ మతం వారైనా, ఈ విషయాలను గమనించి జాగ్రత్తగా ఉండాలి.
అన్ని జీవులు బాగుండాలని, అందరికి సరైన బుద్ధిని ప్రసాదించాలని దైవాన్ని కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment