koodali

Saturday, August 30, 2014

ఓం.. ఒక్క స్త్రీగానీ ఒక్క పురుషుడు గాని సంతానాన్ని పొందే అవకాశమూ ఉంది..


దయచేసి  ఈ  పోస్టును  చివరివరకూ  చదవండి.

సంతానాన్ని  పొందాలంటే , స్త్రీ పాత్ర  పురుష పాత్ర  ఉంటుందన్నది  అందరికీ  తెలిసిన  విషయమే.  అయితే , కొన్ని  ప్రత్యేక  పరిస్థితులలో  ఇద్దరి  పాత్ర  లేకుండానే అంటే  కేవలం  ఒక్క  స్త్రీగానీ  ఒక్క  పురుషుడు  గాని   తనకు  తానే   సంతానాన్ని  పొందే  అవకాశమూ  ఉంది. 


దేవతలు  విషయంలో  చాలా  మహిమలు  ఉంటాయి  కాబట్టి  వారి  విషయంలో  ఇలాంటివి  సాధ్యమే. తపస్సు  ద్వారా  మహిమలను  పొందిన  మహర్షుల  విషయంలోనూ  ఇలాంటివి  సాధ్యమే. 


అయితే  ఈ  మధ్య  కొందరు  ఇలా  జరగటం  అబద్ధం  అంటూ వాదిస్తూ , స్త్రీ పురుష పాత్ర  లేకుండా  సంతానాన్ని  ఎలా  పొందుతారు ? అని  ప్రశ్నిస్తూ  అలాంటివి  జరగటం  అసంభవం  కాబట్టి  కొందరు ప్రాచీనులు  అక్రమపద్ధతిలో  సంతానాన్ని  పొందారని  వ్రాయటం   ఎంతో  బాధాకరం.


ప్రపంచంలో  మనకు  తెలియని  విషయాలు  అనేకం  ఉన్నాయి.  మనకు  తెలిసిన  అతికొద్ది  విషయాలను  పట్టుకుని  ప్రాచీనులను  అవమానించటం  ఎంతో  ఘోరం. 
............................. 

ప్రపంచంలో  ఫలదీకరణం  లేకుండానే  తమ  జాతిని  వృద్ధి  చేసుకునే  లక్షణాలు  కలిగిన  జీవులు  ఎన్నో  ఉన్నాయి. 

 ఉదా.. పువ్వు పండుగా  మారటం,  పండులోని  విత్తనం  మొక్కగా   మారటం  వంటి   పద్ధతితో  సంబంధం  లేకుండా ,  కేవలం  ఒక  మొక్క  నుంచి  ఆకును  త్రుంచి  నేలలో  పాతితే  ఆ  ఆకు  ఇంకో  మ్రొక్కగా  ఎదిగే  విధానమూ  మనకు  తెలుసు.


 ఇలాగే  మనుషులలో  కూడా  ఒక  మనిషి   తనకు  తానే  సంతానాన్ని  పొందే  విధానమూ  ఉందంటున్నారు. 
............................. 

 ఆధునికవిజ్ఞానం  చెబుతున్న  విధానాలను  చూస్తే ...  

భవిష్యత్తులో  మానవులు  సంతానాన్ని  పొందాలంటే, ఒక  స్త్రీ లేక  పురుషుడు  సంతానాన్ని  పొందాలని  అనుకుంటే  తన  శరీరంలోని కణములలో కొన్ని  మార్పులుచేర్పులు  చేయటం  ద్వారా  రెండవవారి  సహకారం  లేకుండానే  సంతానాన్ని  పొందవచ్చట.

 మూలకణముల   (స్టెంసెల్స్ ) ద్వారా  ఇలాంటివి  సంభవమేనంటున్నారు.

ఈ  ప్రయోగం  కోసం వ్యక్తి  యొక్క  శరీరంలోని  చేయి,  కాలు  లేక  ఏ  భాగం  నుంచి  అయినా  మూలకణాలను  సేకరించవచ్చట.

ఉదా..  ఒక  పురుషుని  స్పెర్ం   మరియు  అతని   శరీరం  నుండి  సేకరించిన కొన్ని  కణములను  అండముగా  మార్చటం  ద్వారా  అతనికి   సంతానాన్ని  కలిగించే  అవకాశాలు  ఉన్నాయి. 

స్త్రీ  అయితే,   ఆమె  అండం   మరియు ఆమె  శరీరం  నుండి  సేకరించిన కొన్ని  కణములను  స్పెర్ం లా  మార్చటం  ద్వారా  ఆమెకు సంతానాన్ని  కలిగించే  అవకాశాలు  ఉన్నాయి . 

ఇవన్నీ  గమనిస్తే,   మనకు  ఏమి  తెలుస్తోందంటే,  ప్రాచీనులు  తెలియజేసిన  విషయాలు  అసత్యాలు  కావని చక్కగా  తెలుస్తోంది. 

ఆధునిక  భౌతిక  శాస్త్రజ్ఞులే  ఇవన్నీ  సాధ్యం  అంటున్నప్పుడు  దేవతలకు,  మహర్షులకు  మరెన్నో  శక్తులు  ఉంటాయి .
........................... 

  ఈ  విషయాల  గురించి  ఇప్పటి  వాళ్ళం  తెలుసుకోవాలంటే  ఆధునిక  విజ్ఞానపరిశోధనల  గురించి  చెబితే  బాగా  అర్ధమవుతుందని  వ్రాసాను . అంతేకానీ  ప్రాచీనుల  విజ్ఞానానికి ,  ఆధునికుల  విజ్ఞానానికి  పోలిక  చెప్పటం  నా  అభిప్రాయం  కాదు. 

 ప్రాచీనులది  దైవభక్తితో  కూడిన  తపశ్శక్తితో సాధించిన  శక్తి  అయితే ,  ఆధునికులది  భౌతికశక్తితో  తెలుసుకున్న  విషయపరిజ్ఞానం. 
....................

ఒకయోగి  ఆత్మ  కధలో  ఎన్నో  విషయాలు  చెప్పబడ్డాయి. 

 సంకల్పమాత్రం  చేత  వస్తువులను  సృష్టించటం  గురించి,  ఒక  వస్తువును  ఇంకో  వస్తువుగా  మార్చటం  మొదలైన  ఎన్నో  విషయాల  గురించి  తెలియజేశారు.  ఇవన్నీ  అభూతకల్పనలు  కాదు. అద్భుతమైన  విజ్ఞానం. 

వైశేషిక , న్యాయదర్శనాలనే  ప్రాచీన  భారతీయ  గ్రంధాల్లో , పదార్ధ అణునిర్మాణ సిద్ధాంతాన్ని  వివరించడం  జరిగింది. 

ప్రతి అణుగర్భంలోనూ, సూర్యకిరణంలోని అసంఖ్యాకమైన రజోకణాల  మాదిరిగా  విశాలజగత్తులు  ఇమిడి ఉన్నాయి- యోగవాశిష్ఠం.

ఒకయోగి  ఆత్మ  కధలో...హిమాలయాల్లో  మహాభవన సృష్టి ... అనే  అధ్యాయంలో  కొన్ని  విషయాలు....

  బాబాజీ  ఈ  సుందర సౌధాన్ని  తన  మనస్సులోంచి  సృష్టించారు;  దాని  పరమాణువుల్ని తమ  సంకల్పశక్తి  చేత  సుసంఘటితంగా  నిలిపి  ఉంచుతున్నారు- దేవుడి  ఆలోచన  ఈ  భూమిని సృష్టించినట్టూ, ఆయన  సంకల్పం  దీన్ని  నిలిపి  ఉంచినట్టు...ఇలా  అనేక   విషయాలను తెలియజేసారు .  ................

మూలకణాల  పరిశోధనల  గురించి  నేను  కొంత కాలం  క్రిందట   ఒక  తెలుగు  దినపత్రికలో  చదివాను.  

ఇంగ్లీష్లో  ఈ  విషయాల  గురించి కొంతవరకు తెలుసుకోవాలంటే  క్రింది  లింక్  ద్వారా  తెలుసుకోవచ్చు.


Stem Cell Research and Same-Sex Reproduction | Tom ...


ప్రపంచంలో  ఫలదీకరణం  లేకుండా  జాతిని  వృద్ధి  చేసుకునే  కొన్ని జీవుల  గురించి...


Parthenogenesis - Wikipedia, the free encyclopedia.. 






Thursday, August 28, 2014

ఓం,


 వినాయకచవితి పూజలో ఉపయోగించే పత్రి ఎన్నో ఔషధవిలువలు గలిగిన పత్రి. 


ఇప్పుడంటే  పత్రిని  బజారులో  కొంటున్నారు  గానీ, ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ పత్రిని  సేకరించటంలో  పెద్దవాళ్ళతో  పాటు పిల్లలు  కూడా పాల్గొనేవారట. అందువల్ల  పిల్లలకు  రకరకాల  మొక్కల  గురించిన వివరాలు, వాటికి  గల  ఔషధగుణాలు   తెలిసేవి . 


  పూజ  తరువాత  , పూజలో  వాడిన  పత్రిని  కూడా  నీటిలో  కలుపటం  ద్వారా  పత్రిలోని  ఔషధ  గుణాలు  నీటిలో  కలిసి  నీరు  బాగుంటుంది.


మట్టితో  తయారుచేసిన   విగ్రహాల   వల్ల     కలిగే  మంచి  గురించి   ఎందరో  ప్రచారం  చేస్తున్నారు.  అందువల్ల  ప్రజలలోనూ  క్రమంగా   చక్కటి  చైతన్యం  పెరుగుతోంది.  


  పర్యావరణానికి  హానిని    కలిగించని   విగ్రహాలను  వాడటానికి  ముందుకొచ్చే  ప్రజల  సంఖ్య  పెరగటం   మంచి  పరిణామం.

Monday, August 25, 2014

.వరుణ పూజలు...

 
వర్షాలు  సరిగ్గా  పడటంలేదని  వరుణపూజలు  చేసారు. వరుణపూజలు  ఫలించి    వానలు కురిసి  నదులలోకి  నీరు  వచ్చింది. 


ఉత్తరభారతంలో  విస్తారంగా  వానలు  కురిసాయి. కర్ణాటక  ఎగువన  కురిసిన  వానల వల్ల   దక్షిణాదిన  కూడా నదులలోకి  నీరు  వచ్చింది.  రెండుమూడునెలల  క్రిందట  కన్నా  పరిస్థితి  చాలా  వరకు  చక్కబడింది. 


  అయితే  వర్షాకాలం  లాగా ఎక్కడికక్కడ  బాగా  వానలు  పడకపోవటంవల్ల   ఉష్ణోగ్రతలు  పెరుగుతున్నాయని  అంటున్నారు.  ఇలా  సకాలంలో  వానలు  పడని  పరిస్థితికి  మనుషుల  స్వయంకృతాపరాధాలే  కారణం.  


అభివృద్ధి  పేరుతో మనుషులు  సాగిస్తున్న  విచ్చలవిడి  పర్యావరణ కాలుష్యం  వల్ల  ఉష్ణోగ్రతలు  క్రమంగా  పెరుగుతున్నాయి. ఒక దగ్గర  వరదలు, ఒక దగ్గర విపరీతమైన ఎండలు ఉంటూ  వాతావరణం  అస్తవ్యస్థంగా  మారుతోంది. 


వానలు  కురవకపోతే  పూజలు  చేయటం  మంచిదే  కానీ, వాతావరణ విధ్వంసాన్ని  మానుకోవాలి. 


.మనుషులు  తమ అంతులేని  కోరికలతో  పర్యావరణాన్ని  విధ్వంసం చేస్తుంటే ,  దైవం  మాత్రం  మనుషులు  చేసే  పూజలకు  మురిసిపోయి  సకాలంలో చక్కగా   వర్షాలు  కురిపించాలని  ఆశపడుతున్నాము.


 దైవం  దయామయులు  కనుక , మనుషులు  ఎన్ని  తప్పులు  చేస్తూన్నా  ఇంకా   వానలు  కురిపిస్తూనే  ఉన్నారు. 


మనుషులు  చేస్తున్న  విధ్వంసం  వల్ల  పర్యావరణం  పాడయ్యి  ఎన్నో  జీవజాతులు  ఇబ్బందులు  పడుతున్నాయి.   ఇంతకుముందు  కొండల  పైన  వృక్షాలు  దట్టంగా  పెరిగేవి. అందువల్ల  ఆ  ప్రాంతములో  వానలు  పడేవి.  ఇప్పుడు  రాళ్ళకోసం  కొండలనూ  పిండిచేసి  మాయం  చేసేస్తున్నారు. 


 మరికొందరు  జనాలు  నేలమీద  స్థలం  దొరకటం  లేదంటూ  కొండలపైకి  ఎక్కి  ఇళ్లు  కట్టేస్తున్నారు.  ఇక  కొండలపైన  చెట్లకు  స్థానం  ఎక్కడిది  ? 


ఇంతకు ముందు  సిమెంట్  రోడ్  లేక  తారు  రోడ్  ఉన్నా ,  కనీసం  రోడ్డుకు  ఇళ్ళకు  మధ్య  మట్టినేల  ఉండేది. 


ఇప్పుడు  నగరాల్లో  మట్టి అనేది   కనబడకుండా  సిమెంట్ తో నేలను  కప్పేస్తున్నారు.   కొందరు , తమ  ఇంటికి  రోడ్ కు  మధ్య  కూడా  మట్టి  కనబడకుండా  సిమెంట్  వేసి,  అదే  గొప్ప  అనుకుంటున్నారు.


మట్టి  నేలంటూ  లేకపోతే  వానలు  కురిసినప్పుడు  పడే  వాననీరు  నేలలో  ఇంకేదెలా  ?  నీరు  నేలలో  ఇంకితేనే  కదా  భూగర్భజలాలు  పెరుగుతాయి. 


 ఇక, కొందరు  పరిశ్రమల  వారు  తమకు  వేలకొలది  ఎకరాల  స్థలం  కావాలంటున్నారు. ఎక్కువగా  యంత్రాలతో  పనులు  చేయించుకుంటూ  కొద్దిమందికి  మాత్రమే  ఉద్యోగాలు  ఇస్తారు. వాళ్ళు  ఇచ్చే  వందల  ఉద్యోగాలకు  స్థలం  మాత్రం  వేల  ఎకరాలు  కావాలంటారు. 


కొన్ని  పరిశ్రమల  భూమి  కోసం  అడవులను  కూడా  కొట్టివేస్తారు.

మనుషులకు  ఎక్కడి  స్థలమూ  చాలటం  లేదు.  భూమి  అంతటా  కాంక్రీట్  కట్టడాల మయం  అయిపోయి,  పర్యావరణం  అంతటా  కాలుష్యంతో  నిండి, ఉష్ణోగ్రతలు  పెరుగుతుంటే  సకాలంలో  వానలు  ఎలాపడతాయి  ?


 మనుషులు తాము  పర్యావరణానికి   కలగజేస్తున్న  విధ్వంసాన్ని  గ్రహించాలి. లేకపోతే  ముందుముందు  ఏం  జరుగుతుందో  ఊహించటం  కష్టమే.


Friday, August 22, 2014

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలి...అని.....

ఓం ,

  వేదములు  ఎంతో  గొప్పవి.  వేదములను  చక్కగా  అర్ధం  చేసుకున్నప్పుడు  వాటిలోని అంతరార్ధాలు  సరిగ్గా  అర్ధమవుతాయి. 

 శ్రుతిస్మృతులు  రెండూ  రెండు  కళ్ళు. పురాణమే  హృదయం. ఇవి  మూడూ  చెప్పినదే  ధర్మం. మరోటి  కాదు. ఈ మూడింటిలోనూ పరస్పర  విరోధం  కనిపిస్తే  అక్కడ  వేదానిదే  తుదితీర్పు. అని  పెద్దలు  తెలియజేసారు. 

వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి  పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి. 


అయితే, పురాణేతిహాసములలో  కాలక్రమేణా కొందరి  వల్ల  కొన్ని  ప్రక్షిప్తాలు , కొన్ని మార్పులుచేర్పులు జరిగాయని అంటారు.


అందువల్ల  ,  స్మృతులూ  పురాణాలూ  తంత్రాలూ  శాస్త్రాలలో ఉన్న  విషయాలను  వేదముతో  సరిచూసుకుని  అసలు  అర్ధాన్ని  గ్రహించటానికి  ప్రయత్నించాలి.

 ఏది  ధర్మం ? ఏది అధర్మం ? అనే  ధర్మ సంకటం ఎదురై , ఎంతకీ  విషయం  అర్ధం కానప్పుడు  దైవాన్ని  ప్రార్ధించటం ఉత్తమం. 

..............................

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలి...అని....


పూర్వీకులు  అంటరానితనాన్ని  ప్రోత్సహించారని  కొందరు    తప్పుపడతారు. దయచేసి  పెద్దలను  తప్పు  పట్టవద్దు .   


పశుపక్ష్యాదులనే  పూజించమని  చెప్పిన  పెద్దలు  సాటి  మనుషులను  తక్కువగా  చూడమని  చెప్పరు  కదా  !


దైవం దృష్టిలో   అందరూ సమానమేనని   పెద్దలు  ఎంతగానో   చెప్పటం   జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి .

ధర్మరక్షణకోసం  విష్ణుమూర్తి  దశావతారాల్లో  జంతుజన్మలను  ధరించటానికి  కూడా  వెనుకాడలేదు.



ఈ   విషయాలను  గమనిస్తే , సృష్టిలో  ఏ  జీవినీ  తక్కువగా  చూడకూడదని  తెలుస్తుంది.

అందుకే   పశుపక్ష్యాదులను,  చెట్లను  కూడా  పూజించి  గౌరవించమని  పూర్వీకులు  మనకు  నేర్పించారు. 



వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి   పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి.  



వేదపురాణేతిహాసాలలోని  భావాలను  సమాజానికి  మరింత  చక్కగా  తెలియజేయటానికి ఎందరో  అవతారమూర్తులు,  మహానుభావులు  జన్మించారు.

వీరి  బోధనలు  మరియు  ,  ఆచరణ  ద్వారా  ఏది  ధర్మం,  ఏది  అధర్మం  అనే  విషయములు    అందరికీ  తెలుస్తాయి.  



  శ్రీ  రాముడు  శూద్ర  స్త్రీ  అయిన   శబరి  సమర్పించిన  ఫలాలను  స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేశారు. శ్రీరాములవారు  అంటరానితనాన్ని  పాటించలేదు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు .... అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.



శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్రము ..గ్రంధములో  కూడా ఇలాంటి   విషయములు   వివరంగా  చెప్పబడ్డాయి.



 ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు ....అని తెలుస్తోంది.  శివుడే  ఈ  విషయాన్ని  తెలియజేశారంటారు. 



 మహావతార్  బాబాజీ  శిష్యులైన  లాహిరీ  మహాశయులు, స్వామి యుక్తేశ్వర్ , పరమహంస  యోగానంద,  రామకృష్ణపరమహంస,  వివేకానందుడు,......మొదలగువారు  గొప్ప  మహానుభావులు.  వీరు   అంటరానితనాన్ని   పాటించలేదు.


ఒక యోగి ఆత్మకధలో ..... లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.


రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వారికి   ప్రవేశం ఉంది.

..........................................

అంటరానితనాన్ని  అగ్రవర్ణాల   వాళ్ళు  పాటించారని  కొందరు  అంటారు.  
 అగ్రవర్ణాలవాళ్ళలో ఇతరులను  ఎంతో చక్కగా  ఆదరించిన  వారెందరో  ఉన్నారు.  అగ్రవర్ణాల లో  కూడా పేదరికంతో  దయనీయంగా  జీవిస్తున్నవారెందరో  ఉన్నారు. 


 కొన్ని  గ్రామాలలో  ధనవంతులైన  శూద్రులు   పేదవారైన  శూద్రుల  పట్ల   పట్ల  అంటరానితనాన్ని పాటించారు.  


.........................................

 వేదములలోని  కొన్ని  విషయాలు .....

ఈ విషయాలు    అంతర్జాలంలో  సేకరించినవి.

 Before we begin our journey of solving the caste-puzzle through Vedas, let us start with certain worship mantras from Vedas that mention Shudras:


Yajurved 18.48:
O Lord! Provide enlightenment/ compassion to our Brahmins, Kshatriyas, Vaishyas and Shudras. Provide me also with the same enlightenment so that I can see the truth.

Yajurved 20.17:
Whatever crime we have committed against my village, forest or committee; whatever crime we have committed through our organs, whatever crime we have committed against Shudras and Vaishyas, whatever crime we have done in matters of Dharma, kindly forgive us relieve us from the tendency of the same.

Yajurved 26.2:
The way I gave this knowledge of Vedas for benefit of all humans, similarly you all also propagate the same for benefit of Brahmins, Kshatriyas, Shudras, Vaishyas, Women and even most downtrodden. The scholars and the wealthy people should ensure that they not deviate from this message of mine
.***
 There are several shlokas in Manusmriti that state that a person belonging to high Varna falls down to level of a Shudra (uneducated) if he does not conduct noble deeds. For example,

2.104: A person who does not worship the Supreme Lord twice daily should be considered a Shudra.

2.172. He who has not been initiated with teaching of the Vedas is a Sudra.

4.245: A Brahmin acquires brilliance through company of noble persons and avoiding bad company. On contrary, if he indulges in bad company, he becomes a Shudra.


..................................

గ్రంధముల  ద్వారా  తెలుసుకున్న  మరి  కొన్ని  విషయములు.....


బ్రాహ్మణ  క్రత్రియ  వైశ్యులను  ద్విజులు అంటారు...ఉపనయనం  జరగకుండా  వారికి  ద్విజత్వం  రాదు.  అందాకా  వీళ్ళు  శూద్రుల  కిందనే  లెక్క.  

రాకుమారులకు  11  వ ఏట,  బ్రాహ్మణ పుత్రులకు  ఎనిమిదవ  ఏట, వైశ్య  తనయులకు  పన్నెండవ  ఏట  ఉపనయనం  చెయ్యాలని  ధర్మశాస్త్రాల  నిర్ణయం......... అన్నట్లు    పెద్దలు  తెలియజేశారు.

..........................

భీష్ముల  వారి  విషయంలో............

భారతంలో , భీష్ముల  వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు  వారే  తెలియజేసిన  విషయాన్ని  బట్టి ,  వ్యక్తులు  తినే  ఆహారాన్ని  బట్టి    మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది. 



  అధర్మంగా  ప్రవర్తించే  వారి  వద్దనుంచి  స్వీకరించే  ఆహారం  వల్ల  కూడా స్వీకరించిన వారి  మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది.


 దుర్యోధనుడు  గొప్ప  వంశంలో   జన్మించినా   కూడా  ,అధర్మపరుడైనందువల్ల  అతని  నుంచి  స్వీకరించిన  ఆహారం  వల్ల  భీష్ముల  వారికి  కష్టాలు  వచ్చాయి.  



శ్రీ కృష్ణుల వారు   కూడా.....దుష్టుడైన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని  తిరస్కరించి , సౌమ్యుడైన  విదురుని  ఆతిధ్యాన్ని స్వీకరించారు. 


పై  విషయాలన్నీ  గమనిస్తే  ,  అధర్మంగా  ప్రవర్తించేవారిపట్ల..,   పాపాలు  చేసే వారి  పట్ల  అంటరానితనాన్ని  పాటించాలన్నది . పెద్దల  అభిప్రాయం  అనిపిస్తుంది.

....................................................

కొందరు  గొప్ప పదవి  లభించినా  అంతటితో  తృప్తిని  పొందక  ఇంకా  ఏదో  కావాలని  అశాంతితో  జీవిస్తారు. 


 భగవదనుగ్రహాన్ని  పొందాలంటే  నిష్కామకర్మతో జీవించాలని పెద్దలు  తెలియజేశారు.  



నిష్కామ  కర్మతో  జీవించేవారు  మహారాజ  పదవిలో  ఉన్నా,   పొంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు..  జనకమహారాజులా.  



 నిష్కామ  కర్మతో  జీవించేవారు  , ఆడంబరాలు లేకున్నా ,  క్రుంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు ..
శబరిలా.


భగవంతుని  కరుణను  పొందిన  జీవులలో   పశువులు,  పక్షులు,   పేద వారు,  ధనవంతులు, అన్నిరకాల  జీవులు  ఉన్నారు. అంతా  దైవం  దయ. 



వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి  క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను .


Wednesday, August 20, 2014

. వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం.......

 
ఓం,
నారాయణ  మహర్షి  నారద  మహర్షికి  ఎన్నో  విషయములను  తెలియజేసారు. వాటిలోని  కొన్ని  విషయములు..

 (శ్రీ  దేవీ  భాగవతము  నుంచి  తెలుసుకున్నవి...)

. జీవికి  కడదాకా  నిలిచేది  ధర్మమొక్కటే. తల్లిదండ్రులు గానీ భార్యాపుత్రులు గానీ జ్ఞాతి  మిత్రులు గానీ ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు  సహాయకారి...

శాస్త్రీయమనీ  లౌకికమనీ ఈ ఆచారం రెండు విధాలు.రెండూ అనుష్టింపదగినవే. దేనినీ  పరిత్యజించటానికి  వీలులేదు. గ్రామ జాతి దేశ కుల ధర్మాలుంటాయి. వాటిని  పాటించాలి. ఉల్లంఘించకూడదు.

దురాచారుణ్ణి  లోకం  నిందిస్తుంది.వాడు దుఃఖభాజనుడవుతాడు.వ్యాధిపీడితుడవుతాడు. ధర్మవిరుద్ధమైన అర్ధకామాలను  పరిత్యజించాలి.అలాగే లోకవిరుద్ధమైన ధర్మాన్నీ పరిత్యజించాలి. అది సుఖప్రదం కాదు కనక.

నారాయణమహర్షీ ! మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి.ధర్మమార్గాన్ని  నిర్ణయించడంలో  దేన్ని  ప్రమాణంగా  తీసుకోవాలి  అనేది  పెద్ద  సందేహం.

నారదా ! సందేహం  ఏమీ  లేదు. శ్రుతిస్మృతులు  రెండూ  రెండు  కళ్ళు. పురాణమే  హృదయం. ఇవి  మూడూ  చెప్పినదే  ధర్మం. మరోటి  కాదు. ఈ మూడింటిలోనూ పరస్పర  విరోధం  కనిపిస్తే  అక్కడ  వేదానిదే  తుదితీర్పు. 

స్మృతిపురాణాల  కన్నా  వేదం  చెప్పినదే  ప్రమాణం. వేదంలోనే  ద్వైధీభావం  కనిపిస్తే  అప్పుడు అవి రెండూ  ధర్మాలుగానే  పరిగణించాలి.స్మృతులలో ద్వైధీభావం  కనిపించినా  ఇంతే. వేదంతో  సరిచూసుకోవాలి. ..


.కొన్నిచోట్ల  పురాణాలలోనూ  తంత్రగ్రంధాలలోనూ  కనిపించేవాటిని  కూడా  యధాతథంగా  ధర్మాలుగా  స్వీకరించాలని  కొందరు  అంటున్నారు.కానీ అది సరి కాదు. వేద  విరుద్ధం  కానంత  వరకే  పురాణాలుగానీ  తంత్ర గ్రంధాలు గానీ  ప్రామాణికాలు. ప్రత్యక్షంగా శ్రుతి  విరుద్ధమైన  ధర్మం ఎవరు  చెప్పినా  అప్రామాణికమే. 


ధర్మమార్గ  నిర్ణయంలో సర్వదాసర్వధా వేదమొక్కటే పరమప్రమాణం. దానికి  అవిరుద్ధంగా  ఉంటే స్మృతులూ  పురాణాలూ  తంత్రగ్రంధాలూ  చెప్పినవి  కూడా  కొండొకచో ప్రామాణికాలు అవుతాయి.మరింకేమీ ప్రామాణికం కానే కాదు.


వేదధర్మాన్ని  కాదని  ఇతర ప్రమాణాలను  పట్టుకుని  ఆ మార్గాల్లో  నడిచే  వారికోసం  యమలోకంలో  నరకకుండాలు  సిద్ధంగా  ఉన్నాయి. అందుచేత  వేదోక్తమే  ధర్మం. దానినే  ప్రయత్నపూర్వకంగా  ఆచరించాలి. స్మృతులూ  పురాణాలూ  తంత్రాలూ  శాస్త్రాలూ  ఏది  చెప్పినా  వేదమూలమైనంతవరకే  ప్రామాణికం.


కొందరు ఏవేవో కుశాస్త్రాను  ప్రమాణాలుగా  చూపించి ప్రజలను  తప్పుదోవ  పట్టిస్తుంటారు. అటువంటివారు  నరకానికి  పోతారు....అందుచేత  వేదం  ఒప్పుకున్నదే  సద్ధర్మం.  దానినే  ఆచరించాలి.. .  అంటూ  ఎన్నో  విషయాలను  తెలియజేసారు.
.......................

వేదంలోనే  ద్వైధీభావం  కనిపిస్తే  అప్పుడు అవి రెండూ  ధర్మాలుగానే  పరిగణించాలి. అనే  విషయం గురించి .. కొన్ని  అభిప్రాయాలను  వ్రాయటం  జరిగింది.
. నాకు ఏమనిపించిందంటే,
 
ఆలస్యం అమృతం విషం ..అని చెప్పిన పెద్దలే నిదానమే ప్రధానం.. అనీ తెలియజేసారు. ఇదేమిటి ? ఇలా పరస్పర విరుద్ధంగా చెప్పారు ? అనుకోకూడదు. రెండూ సరైనవే.

ఉదా
..ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు, నిదానమే ప్రధానం .. అనే సూత్రాన్ని పాటించకూడదు. ఇలాంటి పరిస్థితిలో ఆలస్యం అమృతం విషం ..అనే సామెత ప్రకారం నడుచుకోవాలి.వీలైనంత త్వరగా వెళ్ళి మంటలను ఆర్పాలి.


ఉదా..ఎక్కడైనా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు, ఆలస్యం అమృతం విషం.. అనుకుంటూ వెంటనే వెళ్ళి విడాకులు ఇప్పించకుండా , కొంతకాలం వేచి చూస్తే , భార్యాభర్త తమ పట్టుదలలను విడిచిపెట్టి సర్దుకుపోయే అవకాశం ఉంది. ఇక్కడ నిదానమే ప్రధానం.. అనే సూత్రం బాగానే ఉంటుంది.

వ్రాసిన అభిప్రాయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 



Monday, August 18, 2014

యమధర్మరాజు సావిత్రికి తెలియజేసిన కొన్ని విషయములు.. మరియు..


కొందరు  ప్రజలు తమకు  నచ్చినదే  ధర్మం  అంటారు . 

నాకు నచ్చినదే  ధర్మం , నాకు  తోచినట్లే  నేను  ప్రవర్తిస్తాను.. అంటూ  ప్రతి  ఒక్కరూ సమాజానికి  హాని  కలిగించే  విధంగా  ప్రవర్తిస్తే  సమాజం  అల్లకల్లోలం  అయిపోతుంది. అలా   ప్రవర్తిస్తే  ఏ చట్టమూ , ఏ  న్యాయస్థానమూ  ఒప్పుకోవు కదా !


  సమాజక్షేమం  కోరి  పెద్దలు  కొన్ని  కట్టుబాట్లను  ఏర్పరిచారు.  సమాజం  సజావుగా  సాగటానికి  ఏర్పరుచుకున్న  ధర్మాలను  సరిగ్గా  పాటించినప్పుడే  సమాజం సజావుగా  సాగుతుంది.
............
  
అయితే, ఏది  ధర్మం  ? ఏది  అధర్మం  ? అనే విషయంలో  ప్రజలకు  అనేక  సందేహాలు  వస్తూంటాయి. 

ఈ  విషయములను ప్రజలకు  మరింత  వివరంగా  తెలియజేయాలని  భావించి , ఆ  వివరాలను  పెద్దలు  పురాణేతిహాసాల  కధల  ద్వారా  లోకానికి   తెలియజేశారు. 

ఎన్నో  కధలు,  ఎన్నో  పాత్రలు, చిత్ర  విచిత్రమైన మలుపులు, ఎన్నో   విభిన్నమైన కోణాలు..ఇలా  ఎన్నో అద్భుతమైన విషయాలను  తెలియజేసారు.

...................

ఎంతటి  గొప్పవాళ్ళైనా  సరే  పొరపాటుగా  ప్రవర్తిస్తే....
  
ఒకసారి  ఇంద్రుడు, దుర్వాస  మునీంద్రుడు ఒకరికొకరు  ఎదురుపడ్డారు.తనకు  విష్ణుమూర్తి  ఇచ్చిన  పారిజాత పుష్పాన్ని  దుర్వాసుడు ప్రేమగా  ఇంద్రునికి  కానుక చేశాడు. 

దాన్ని  స్వీకరించి  దేవేంద్రుడు కళ్ళకు  అద్దుకుని శిరస్సు  మీద  పెట్టుకోవలసింది  పోయి నిర్లక్షంగా  తన  ఐరావతం  శిరస్సు  మీదకు  విసిరాడు. ఈ సంఘటనలో  దుర్వాసుడికి  మహాకోపం  వచ్చి ఇంద్రుని  శపిస్తాడు.

ఇంద్రుడు  గజగజలాడుతూ  దుర్వాసుని  పాదాలపై  పడి ప్రాధేయపడగా,  మునీశ్వరుడు  కాస్త  మెత్తబడి  ఎన్నో విషయములను  ఉపదేశిస్తారు.

జరిగిన విషయములను ఇంద్రుడు బృహస్పతికి తెలియజేయగా ..

. ఒకరి  శాపం  గానీ  ఒకరి  ఆశీస్సు  గానీ  మన  కర్మఫలాలే. మహాలక్ష్మి వరించినా మహాదైన్యం  లభించినా  కర్మఫలమే..అంటూ  వారు  ఎన్నో  విషయములను  వివరిస్తారు. 

తరువాత  కొన్ని  ప్రయత్నముల  తరువాత  ఇంద్రుడు  తన  ఐశ్వర్యాన్ని  తిరిగి  పొందుతారు.

ఎంతటి  గొప్పవాళ్ళైనా  సరే , పొరపాటుగా  ప్రవర్తిస్తే  దానికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవిస్తారని ఈ  సంఘటన ద్వారా  తెలుసుకోవచ్చు.

..................

సంధ్యావందనము  యొక్క  ప్రాముఖ్యత..

ఒకప్పుడు  పరాశర మహర్షి  అశ్వపతికి ఉపదేశించిన విషయములలో  కొన్ని  విషయములు..

.సంధ్యావందన  పరిపూతుడైన  బ్రాహ్మణుడి  పాదధూళితో  భూదేవి  పవిత్రురాలవుతుంది. అతని  స్పర్శతో  నదీజలాలు  పావనమవుతాయి. గరుత్మంతుణ్ణి  చూసిన  పాములలాగా  పాపాలు  పారిపోతాయి.  
సంధ్యావందనం  చెయ్యనివాడు  అందించే  పిండతర్పణాలను  పితృదేవతలు  స్వీకరించరు.  పూజానైవేద్యాలను  దేవతలు  అంగీకరించరు. 
..................

యమధర్మరాజు  సావిత్రికి  తెలియజేసిన  విషయములలో  కొన్ని  విషయములు..

ఏ  రకమైన  ద్రవ్యాన్ని  ఎవరి  నుంచి  కాజేసినా  చోరుడు  నక్రముఖి  కుండములో  నలిగిపోవలసిందే.  మూడు  శతాబ్దములు  యమభటుల  దండతాడనలు  తినవలసిందే.  

ఆ పైని  రోగిష్టి  ఎద్దుగా  ఏడు  జన్మలు   దుఃఖించి  మానవుడై  మహారోగిగా అందరితోనూ  ఏవగింపబడి  కడపటికి  పరిశుద్ధి  పొందుతాడు. 


ఏనుగుల్నీ  గుర్రాల్నీ  పశువులను  చంపినవాడు గజదంశకూపంలో  మూడుయుగాలపాటు  యాతనలు  అనుభవిస్తాడు. నాగదంతాలతో  యమభటులు  కుళ్ళబొడుస్తుంటే  కుయ్యోం మొర్రో మని  పెడబొబ్బలు  పెడతాడు. అటుపైని  ఆయాజంతువులుగా  మూడేసి  జన్మలు ఎత్తుతాడు. నరుడై  శుచి అవుతాడు.
....

బ్రహ్మహత్యా  సమానాలు...

బ్రహ్మహత్య  అంటే  బ్రాహ్మణుడిని  చంపటం  అనేకాదు.  ఇంకా  చాలా  రకాలున్నాయి. 

శ్రీకృష్ణాది  దేవతల  పట్ల  భేదభావాన్ని  పాటించి  ఆదరానాదరాలు  చూపిస్తే  అది బ్రహ్మహత్యా  సదృశం. ..

గురు మాతాపితృ భార్యాపుత్రుల్ని  పోషించకపోయినా  అవివాహితుడిగా  సంతానం  పొందినా  బ్రహ్మహత్య  చేసినట్టే. ఇదే  ఆతిదేశిక  బ్రహ్మహత్య. 

...........

పురుషుడికి  పరిణయమాడిన  స్త్రీ  మాత్రమే  గమ్య. తక్కిన  వనితలందరూ  అగమ్యలు.  అంటే  పొందుకోరరానివారు. అగమ్యాగమనం  నూరు  బ్రహ్మహత్యలతో  సమానం. కుంభీపాక  నరకమే  శిక్ష. 
..........

దేహస్వరూపాన్ని  వివరిస్తూ...

స్థూల  శరీరం  పంచభూతాత్మకం.  అది  కృత్రిమ  దేహం  కనక  నశ్వరం - బూడిద  అయిపోతుంది.మట్టిలో  కలిసిపోతుంది. పంచభూతాలూ  పంచభూతాలలో  కలిసిపోతాయి.  అటుపైని అంగుష్ఠప్రమాణంతో  జీవుడు  మిగులుతాడు.  ఇది  సూక్ష్మదేహం.  దీనితోనే  శుభాశుభకర్మఫలాలు  అనుభవిస్తాడు. ఇది నశించదు.  శిధిలం  కాదు. అగ్ని  దగ్ధం  కాదు. శస్త్రాస్త్రాలకు  లొంగదు. తప్తద్రవ  తప్తతైల  తప్తపాషాణాది  కూపాల్లో  ఎంతకాలం  ఎన్ని  శిక్షలు  వేసినా  చెక్కుచెదరదు.  దుఃఖాలను  మాత్రం అనుభవిస్తూంటుంది...ఇలా  అనేక  విషయాలను  తెలియజేసారు.
................................... 

పై  విషయాలను గమనిస్తే  మనకు  అనేక  విషయాలు  తెలుస్తాయి.

అయితే,  తెలిసో తెలియకో  పాపాలు  చేసి  కష్టాలను అనుభవించే  జీవుల  పట్ల  కరుణను  కలిగి  ఉన్నవాళ్ళకు   పుణ్యం  వస్తుంది .



Friday, August 15, 2014

ధర్మం...


 నేడు  స్వాతంత్ర్యదినోత్సవం  . 

స్వాతంత్ర్యం  వచ్చి  ఎన్నో  సంవత్సరాలు  గడిచినా  ఇంకా  దేశంలో  ఎన్నో  సమస్యలు  ఉన్నందుకు , అనేక  విషయాలలో   సహాయం    కోసం  విదేశాల  వైపు  చేతులు  చాపుతున్నందుకు  మనం  సిగ్గుతో  తలదించుకోవాలి.  

 ఆకలితో  అల్లాడుతున్న  అభాగ్యులు  కొందరు,   ఆత్మహత్యలు  చేసుకుంటున్న  అన్నదాతలు  కొందరు,

  దేశం  నుంచి  దోచుకున్న  వేలకోట్ల  సొమ్మును  విదేశాలకు  తరలిస్తూన్న  దేశద్రోహులు  కొందరు,  అనేక  సమస్యలతో  ఉన్న  దేశంలో  ఆడంబరాలతో , వినోదాలతో  ఎంతో  సమయాన్ని వృధా  చేస్తున్న   ప్రజలు  కొందరు  ,

ఇక  , దేశానికి    స్వాతంత్ర్యం  వచ్చిందని   ఏ  విధంగా  సంతోషించాలో  అర్ధం  కావటం  లేదు.

సరే,  అయిపోయిందేదో  అయిపోయింది, ఇప్పటికైనా  కొందరు  నేతలు  దేశాన్ని  అభివృద్ధిపధంలో నడిపిస్తామని  గట్టిగా  ఆశ  పెడుతున్నారు. ఆ  ఆశ  వమ్ముకాకూడదని  ఆశిద్దాము.

  నేతలతో  పాటు,  అధికారులు,  ప్రజలు,  కలిసి  ఎవరి  ధర్మాన్ని  వారు   నిజాయితీగా   ఆచరించినప్పుడు  సమాజం  తప్పక  అభివృద్ధి  చెందుతుంది. 

..........................

సత్యయుగంలో  ధర్మం  నాలుగుపాదాలతో  నడుస్తుంది.    కలియుగానికి  వచ్చేసరికి  ఒంటిపాదంతో  నడుస్తుందని  అంటారు. 

అంటే క్రమంగా ధర్మాన్ని పాటించే వారు   తగ్గుతారని  అర్ధం.  అంతే   కానీ ,  ధర్మం  మారుతుందని అర్ధం  కాదు . 

సత్య  యుగంలోనైనా  కలియుగంలోనైనా ... పాపాలు చేసేవారికి  నరకం...  పుణ్యాలు  చేసేవారికి  స్వర్గం  ప్రాప్తిస్తాయి. 

ఏ  యుగంలోనైనా  మూలధర్మాలు  మారవు. .మూలధర్మాలు  అంటే.... 

ఉదా.. ఇతరులను బాధపెట్టేలా ప్రవర్తించటం ఏ  యుగంలోనైనా  తప్పే,

ఇతరుల సొమ్మును కాజేయటం  ఏ  యుగంలోనైనా  తప్పే,

స్త్రీలు పురుషులు మనసును అదుపులో ఉంచుకోకుండా ప్రవర్తించటం ఏ  యుగంలోనైనా  తప్పే.... 

ధర్మం అంటే ... ఇతరులు నీకు ఏమి చేస్తే నీవు బాధపడతావో నీవు దానిని ఇతరులకు చేయవద్దు. అని నిర్వచిస్తారు .

ఏ  కాలంలోనైనా  ధర్మానికి నిర్వచనం ఇదే కదా !

............................. 

అయితే ,  ఆచార  వ్యవహారాలను  పాటించటంలో  కులధర్మాలు, దేశ ధర్మాలలో  కొద్దిగా  తేడాలు  ఉంటే  ఉండవచ్చు.  అయినా  కూడా మూల  ధర్మం  యొక్క  ప్రాముఖ్యత  అలాగే  ఉంటుంది.


 ఆపద్ధర్మం అని  ఉంటుంది. ఆపదలో  ఆపద్ధర్మాన్ని  ఆచరించి ,  ఆనక  ప్రాయశ్చిత్తం  చేసుకునే  అవకాశం  ఉందంటారు.  అంతేకానీ  మూల  ధర్మం  ఎప్పటికైనా  మూల  ధర్మమే.

ఉదా..ఆపత్కాలంలో అసత్యం  పలికి   తప్పించుకోవటం  ధర్మమే  అంటారు.

అంతమాత్రాన,    అసత్యం  పలకటం  తప్పు..  అనే  మూల  ధర్మం  ప్రాముఖ్యత    అలాగే  ఉంటుంది.

.............................
అయితే  , కలియుగంలో  ఎక్కువమంది  మానవులు  శారీరికంగా,   మానసికంగా  బలహీనులు  కాబట్టి  కొన్ని  సడలింపులను  ఇచ్చారు. 

 ఉదా..సత్య  యుగంలో  ఎక్కువ  పుణ్యం  ఆచరిస్తే  వచ్చే  పుణ్యఫలం,  కలియుగంలో  కొద్దిమాత్రం పుణ్యం  ఆచరించినంత  మాత్రానే  లభిస్తుంది.


 ఇతర  యుగాలలో  యజ్ఞయాగాదిక్రతువులు  చేస్తే  వచ్చే  పుణ్యఫలం  కలియుగంలో  దైవనామస్మరణ  చేసినంతనే   లభిస్తుంది.


ప్రజలు  పాపాలను  చేయకుండా  పుణ్యాలే  చేయాలన్నది  పెద్దల  అభిప్రాయం. 

ప్రజల  దృష్టి  పాపకర్మల  వైపు  మళ్ళకుండా ,వారికి   పుణ్యకర్మల  పట్ల  ఆసక్తి  కలగజేయటానికి  పెద్దలు  ప్రయత్నించారు . 

ఏ యుగంలోనైనా  పాపకర్మలు  ఆచరిస్తే  లభించే  ఫలితం  నరకమే....

కలియుగంలోనైనా  పాపపు పనులు   ఆచరిస్తే  లభించే  ఫలితం  పాపఫలితమే  తప్ప  పుణ్య  ఫలితం  కాదు.

........................

పెద్దలు  సమాజానికి  కొన్ని  కట్టుబాట్లను  ఏర్పరిచారు. ఉదా..ఇంద్రియనిగ్రహం  వంటివి.

 అయితే  కొందరు  ప్రజలు  పెద్దలు  చెప్పిన  నీతులను  ప్రక్కకు  పెట్టి  తమకు  తోచినట్లు  ధర్మాలను  నిర్వచించుకుంటూ  తప్పులను  చేస్తున్నారు. ఇలాంటి  వారు  ఆ  కాలంలోనూ  ఉన్నారు.  ఈ  కాలంలోనూ  ఉన్నారు.


........................ 

 పెద్దలు  తెలియజేసిన  ధర్మాలకు ,  కొందరు   పొరపాటు  నిర్వచనాలను   ఇచ్చారు,  ఇస్తున్నారు.  ఇలాంటి వారిలో   కొందరు    బాగా  చదువుకున్న వారు  కూడా ఉన్నారు . 


ఉదా..శివకేశవుల  మధ్య  భేదాన్ని  చూపటం  తప్పు.  అని  పెద్దలు   వేదాలు ,  పురాణేతిహాసాల  ద్వారా   తెలియజేసారు . 


  శివకేశవ  భేదాలతో  వాదులాడుకుంటూ  సమాజంలో  భేదభావాలను వ్యాపింపజేసిన  వారిలో  కొందరు పండితుల  పాత్ర  కూడా  ఉండటం  బాధాకరం .
.........................

 వేదాలలోనూ,  పురాణేతిహాసాలలోనూ  చెప్పబడిన  విషయాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోని  కొందరు  వ్యక్తుల  వల్ల  ...   మరియు...   స్వార్ధపరులైన  కొందరు  వ్యక్తుల  వల్ల   సమాజంలో  కొన్ని  దురాచారాలు  వ్యాప్తిచెందాయి. 

 వేదాలలోనూ,  పురాణేతిహాసాలలోనూ  చెప్పబడిన  విషయాలను సరిగ్గా  అర్ధం  చేసుకుంటే  అంతా  మంచే  జరుగుతుంది.