koodali

Saturday, August 30, 2014

ఓం.. ఒక్క స్త్రీగానీ ఒక్క పురుషుడు గాని సంతానాన్ని పొందే అవకాశమూ ఉంది..


దయచేసి  ఈ  పోస్టును  చివరివరకూ  చదవండి.

సంతానాన్ని  పొందాలంటే , స్త్రీ పాత్ర  పురుష పాత్ర  ఉంటుందన్నది  అందరికీ  తెలిసిన  విషయమే.  అయితే , కొన్ని  ప్రత్యేక  పరిస్థితులలో  ఇద్దరి  పాత్ర  లేకుండానే అంటే  కేవలం  ఒక్క  స్త్రీగానీ  ఒక్క  పురుషుడు  గాని   తనకు  తానే   సంతానాన్ని  పొందే  అవకాశమూ  ఉంది. 


దేవతలు  విషయంలో  చాలా  మహిమలు  ఉంటాయి  కాబట్టి  వారి  విషయంలో  ఇలాంటివి  సాధ్యమే. తపస్సు  ద్వారా  మహిమలను  పొందిన  మహర్షుల  విషయంలోనూ  ఇలాంటివి  సాధ్యమే. 


అయితే  ఈ  మధ్య  కొందరు  ఇలా  జరగటం  అబద్ధం  అంటూ వాదిస్తూ , స్త్రీ పురుష పాత్ర  లేకుండా  సంతానాన్ని  ఎలా  పొందుతారు ? అని  ప్రశ్నిస్తూ  అలాంటివి  జరగటం  అసంభవం  కాబట్టి  కొందరు ప్రాచీనులు  అక్రమపద్ధతిలో  సంతానాన్ని  పొందారని  వ్రాయటం   ఎంతో  బాధాకరం.


ప్రపంచంలో  మనకు  తెలియని  విషయాలు  అనేకం  ఉన్నాయి.  మనకు  తెలిసిన  అతికొద్ది  విషయాలను  పట్టుకుని  ప్రాచీనులను  అవమానించటం  ఎంతో  ఘోరం. 
............................. 

ప్రపంచంలో  ఫలదీకరణం  లేకుండానే  తమ  జాతిని  వృద్ధి  చేసుకునే  లక్షణాలు  కలిగిన  జీవులు  ఎన్నో  ఉన్నాయి. 

 ఉదా.. పువ్వు పండుగా  మారటం,  పండులోని  విత్తనం  మొక్కగా   మారటం  వంటి   పద్ధతితో  సంబంధం  లేకుండా ,  కేవలం  ఒక  మొక్క  నుంచి  ఆకును  త్రుంచి  నేలలో  పాతితే  ఆ  ఆకు  ఇంకో  మ్రొక్కగా  ఎదిగే  విధానమూ  మనకు  తెలుసు.


 ఇలాగే  మనుషులలో  కూడా  ఒక  మనిషి   తనకు  తానే  సంతానాన్ని  పొందే  విధానమూ  ఉందంటున్నారు. 
............................. 

 ఆధునికవిజ్ఞానం  చెబుతున్న  విధానాలను  చూస్తే ...  

భవిష్యత్తులో  మానవులు  సంతానాన్ని  పొందాలంటే, ఒక  స్త్రీ లేక  పురుషుడు  సంతానాన్ని  పొందాలని  అనుకుంటే  తన  శరీరంలోని కణములలో కొన్ని  మార్పులుచేర్పులు  చేయటం  ద్వారా  రెండవవారి  సహకారం  లేకుండానే  సంతానాన్ని  పొందవచ్చట.

 మూలకణముల   (స్టెంసెల్స్ ) ద్వారా  ఇలాంటివి  సంభవమేనంటున్నారు.

ఈ  ప్రయోగం  కోసం వ్యక్తి  యొక్క  శరీరంలోని  చేయి,  కాలు  లేక  ఏ  భాగం  నుంచి  అయినా  మూలకణాలను  సేకరించవచ్చట.

ఉదా..  ఒక  పురుషుని  స్పెర్ం   మరియు  అతని   శరీరం  నుండి  సేకరించిన కొన్ని  కణములను  అండముగా  మార్చటం  ద్వారా  అతనికి   సంతానాన్ని  కలిగించే  అవకాశాలు  ఉన్నాయి. 

స్త్రీ  అయితే,   ఆమె  అండం   మరియు ఆమె  శరీరం  నుండి  సేకరించిన కొన్ని  కణములను  స్పెర్ం లా  మార్చటం  ద్వారా  ఆమెకు సంతానాన్ని  కలిగించే  అవకాశాలు  ఉన్నాయి . 

ఇవన్నీ  గమనిస్తే,   మనకు  ఏమి  తెలుస్తోందంటే,  ప్రాచీనులు  తెలియజేసిన  విషయాలు  అసత్యాలు  కావని చక్కగా  తెలుస్తోంది. 

ఆధునిక  భౌతిక  శాస్త్రజ్ఞులే  ఇవన్నీ  సాధ్యం  అంటున్నప్పుడు  దేవతలకు,  మహర్షులకు  మరెన్నో  శక్తులు  ఉంటాయి .
........................... 

  ఈ  విషయాల  గురించి  ఇప్పటి  వాళ్ళం  తెలుసుకోవాలంటే  ఆధునిక  విజ్ఞానపరిశోధనల  గురించి  చెబితే  బాగా  అర్ధమవుతుందని  వ్రాసాను . అంతేకానీ  ప్రాచీనుల  విజ్ఞానానికి ,  ఆధునికుల  విజ్ఞానానికి  పోలిక  చెప్పటం  నా  అభిప్రాయం  కాదు. 

 ప్రాచీనులది  దైవభక్తితో  కూడిన  తపశ్శక్తితో సాధించిన  శక్తి  అయితే ,  ఆధునికులది  భౌతికశక్తితో  తెలుసుకున్న  విషయపరిజ్ఞానం. 
....................

ఒకయోగి  ఆత్మ  కధలో  ఎన్నో  విషయాలు  చెప్పబడ్డాయి. 

 సంకల్పమాత్రం  చేత  వస్తువులను  సృష్టించటం  గురించి,  ఒక  వస్తువును  ఇంకో  వస్తువుగా  మార్చటం  మొదలైన  ఎన్నో  విషయాల  గురించి  తెలియజేశారు.  ఇవన్నీ  అభూతకల్పనలు  కాదు. అద్భుతమైన  విజ్ఞానం. 

వైశేషిక , న్యాయదర్శనాలనే  ప్రాచీన  భారతీయ  గ్రంధాల్లో , పదార్ధ అణునిర్మాణ సిద్ధాంతాన్ని  వివరించడం  జరిగింది. 

ప్రతి అణుగర్భంలోనూ, సూర్యకిరణంలోని అసంఖ్యాకమైన రజోకణాల  మాదిరిగా  విశాలజగత్తులు  ఇమిడి ఉన్నాయి- యోగవాశిష్ఠం.

ఒకయోగి  ఆత్మ  కధలో...హిమాలయాల్లో  మహాభవన సృష్టి ... అనే  అధ్యాయంలో  కొన్ని  విషయాలు....

  బాబాజీ  ఈ  సుందర సౌధాన్ని  తన  మనస్సులోంచి  సృష్టించారు;  దాని  పరమాణువుల్ని తమ  సంకల్పశక్తి  చేత  సుసంఘటితంగా  నిలిపి  ఉంచుతున్నారు- దేవుడి  ఆలోచన  ఈ  భూమిని సృష్టించినట్టూ, ఆయన  సంకల్పం  దీన్ని  నిలిపి  ఉంచినట్టు...ఇలా  అనేక   విషయాలను తెలియజేసారు .  ................

మూలకణాల  పరిశోధనల  గురించి  నేను  కొంత కాలం  క్రిందట   ఒక  తెలుగు  దినపత్రికలో  చదివాను.  

ఇంగ్లీష్లో  ఈ  విషయాల  గురించి కొంతవరకు తెలుసుకోవాలంటే  క్రింది  లింక్  ద్వారా  తెలుసుకోవచ్చు.


Stem Cell Research and Same-Sex Reproduction | Tom ...


ప్రపంచంలో  ఫలదీకరణం  లేకుండా  జాతిని  వృద్ధి  చేసుకునే  కొన్ని జీవుల  గురించి...


Parthenogenesis - Wikipedia, the free encyclopedia.. 






2 comments:

  1. ఈ విజ్ఞానం ఇంకా అభివృద్ధి చెందాలనుకుంటా.

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమే ఈ విజ్ఞానం ఇంకా ప్రయోగాల స్థాయిలోనే ఉందట. అయితే ఎలుకల మీద జరిపిన కొన్ని ప్రయోగాలలో కొంతవరకు ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయంటున్నారు.

    అయితే ఈ ప్రయోగాలు పూర్తయితే ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేమండి.

    ...............

    మనకు తెలియని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఒకయోగి ఆత్మకధ గ్రంధములో ఎన్నో విషయాలను తెలియజేసారు.

    శ్రీ యోగానంద గారి గురువుగారయిన శ్రీ యుక్తేశ్వర్ గారు ఎన్నో లోకాల గురించి తెలియజేసారు. సూక్ష్మలోకం గురించి కొన్ని విషయాలు..

    అక్కడి వాళ్ళెవరూ స్త్రీ గర్భాన జన్మించినవారుకారు; సూక్ష్మలోకవాసులు తమ విశ్వసంకల్పశక్తి సహాయంతో ప్రత్యేక (అవయవ) నిర్మాణమూ, సూక్ష్మశరీరమూ గల సంతానాన్ని సృష్టించుకుంటారు.

    సూక్ష్మలోక జీవులు ప్రాణకణికాశక్తి వల్లా పవిత్రమంత్రప్రకంపనల వల్లా తమ రూపాల్లో మార్పులు చేసుకొంటూ ఉంటారు.

    సూక్ష్మలోకవాసులందరి మధ్య భావసంపర్కం పూర్తిగా, మానసికప్రసార (టెలిపతీ ), సూక్ష్మ దూరదర్శనాల(ఆస్ట్రల్ టెలివిజన్ ) ద్వారా జరుగుతుంది...ఇలా ఎన్నో విషయాలను తెలియజేసారు.

    ReplyDelete