koodali

Monday, July 25, 2016

అన్న క్యాంటీన్లు మరియు...


  అన్న క్యాంటీన్ల వల్ల ఎందరికో ఉపయోగం జరుగుతోంది.  ఇలాంటివి రాష్ట్రమంతటా  విస్తరించితే ఎందరికో లాభం జరుగుతుంది.


 ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల ఉపాధి లభించటం ఎందరికో కష్టంగా ఉంది.


ఉపాధి లేకపోయినా  పేదలకు  కనీసం  తక్కువ ధరకు ఆహారం లభిస్తే ఎంతో మంచిది.

ప్రభుత్వాలు తక్కువ ధరకు ఆహారాన్ని అందించటం వల్ల ప్రజల ఆకలీ తీరుతుంది. ప్రభుత్వాలకూ మంచి పేరు వస్తుంది.


తమిళనాడులో ఇలాంటి అమ్మా క్యాంటీన్ల వల్ల ఎందరో పేదవాళ్లు కడుపు నింపుకుంటున్నారు. అక్కడ ఇంకా ఎన్నో పధకాలు ఉన్నాయి.


అక్కడ ఉన్న ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావటానికి ఈ పధకాలు కూడా ఎంతో దోహదపడ్దాయి.


తమిళనాడులో కొత్త ప్రభుత్వం వస్తే పాత పధకాల అమలు ఉంటుందో ? ఉండదో? అనే భయం వల్ల కూడా ప్రజలు ఉన్న ప్రభుత్వానికే ఓటు వేసి ఉండవచ్చు.

ఇక ఇంకుడుగుంతల త్రవ్వకం, మొక్కలను నాటడం కూడా చాలా మంచి విషయాలు.  ఇందులో  ప్రజలు కూడా ఆసక్తిగా పాల్గొనటం మంచి విషయం.

..................................

 అయితే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో అణువిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలనుకోవటం మాత్రం అత్యంత బాధాకరమైన విషయం.


ప్రపంచమంతటా  సో లార్, పవన విద్యుత్ వంటి హరిత విద్యుత్ కోసం ప్రయత్నిస్తుంటే....  ఆంధ్రప్రదేశ్లో అణువిద్యుత్ కర్మాగారాలు  నిర్మించాలనుకోవటం అత్యంత బాధాకరం ఐన విషయం. కేంద్రం ఈ విషయాలలో  తిరిగి ఆలోచించటం మంచిది.



Friday, July 22, 2016

ఈ రోజుల్లో ఆహారం గురించి కొన్ని విషయాలు.. మరియు సోయా గురించి..


 
ఈ రోజుల్లో ఆహారపద్ధతులలో విపరీతమైన మార్పులు వచ్చాయి.

  అజనిమోటో, సోయాసాస్, వెనిగర్, సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..వంటివి విరివిగా వాడిన ఆహారానికి ప్రజలు బాగా అలవాటుపడ్దారు.

 పొంగి కరకరలాడుతూ ఉండటానికి... సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..


 ఒకవిధమైన రుచి పెరగటం కోసం ....అజనిమోటో, సోయాసాస్, వెనిగర్ వంటివి బాగా వాడుతున్నారు.

 అజనిమోటో ఎక్కువగా వాడకూడదు.

 ఇవన్నీ వాడటం వల్ల ఆహార పదార్ధాలకు ఒక విధమైన  రుచి  రావటం వలన  వీటి  వాడకం  బాగా పెరిగింది.

 ఆ రుచికి అలవాటుపడటం వల్ల  మళ్లీమళ్లీ అవే తినాలనిపిస్తుంది.  అలా శరీరంలోకి  వెళ్లే అజనిమోటో పరిమాణం బాగా పెరుగుతుంది.

ఇంట్లో చేసుకునే వంటలలో కూడా అజనిమోటో, సోడాఉప్పు వంటివి ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలి.

నాకు తెలిసినంతలో సోయాసాస్ , వెనిగర్ వంటివి పదార్ధాలను నెలల తరబడి పులవబెట్టి తయారుచేస్తారు.

   కెమికల్స్ తో కూడా సోయాసాస్, వెనిగర్ తయారుచేస్తారట.


కొన్ని దేవాలయాలకు  సమీపంలో యాత్రికులు వెళ్ళే దారిలో కూడా  నూడిల్స్ వంటి  ఫాస్ట్  ఫుడ్   అమ్ముతున్నారంటే ప్రజలు వీటికి ఎంతలా అలవాటుపడ్డారో తెలుస్తోంది.

 మన పూర్వీకులు  సోడాఉప్పు వంటివి  వాడకుండానే వెన్న వాడి  కరకరలాడే రుచికరమైన స్నాక్స్ చేసేవారు.

 
 *************

ఇంకో విషయం ఏమిటంటే,  ఆరోగ్యానికి మంచిదని భావించి.... ఈ రోజుల్లో సోయా కు సంబంధించిన పదార్ధాలు కూడా ఎక్కువగా వాడుతున్నారు.


అయితే, సోయా మంచిదే కానీ  పరిమితి మించి మరీ ఎక్కువగా సోయాను తినకూడదంటున్నారు.

ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ క్రింద లింక్  ద్వారా తెలుసుకోగ
రు.


Benefits of Soy & Soy Protein Dangers | Natural Health Newsletter

************

పాతకాలంలో గుగ్గిళ్లు.. అంటే నానబెట్టి ఉడికించిన పెసలు, శనగలు..వంటివి తినేవారు. అప్పటివారు శారీరికంగా బాగా పనిచేసేవారు. శారీరికంగా పనిచేసేవారికైనా , మానసికంగా పనిచేసేవారికైనా మంచి పోషకాహారం అవసరం.


కొందరేమో పెసలు, శనగలు వంటివి ఎక్కువగా తినకూడదంటారు, ఎక్కువ తింటే కిడ్నీలు పాడైపోతాయంటారు. మరి కొందరేమో మొలకెత్తిన పెసలు, శనగలు..వంటివి తినాలంటారు. ఈ రోజుల్లో రకరకాలుగా చెప్పటం వల్ల గందరగోళంగా ఉండి ఏం తినాలో? ఏం తినకూడదో? ఎంత తినాలో? వంటి సందేహాలు ఎక్కువయ్యాయి.



ఈ రోజుల్లో ప్రొటిన్స్, కార్బోహైడ్రేడ్స్.. అంటారు. ప్రాచీనులు నవధాన్యాల గురించి తెలియజేసారు. మనం రెండు లేక మూడు ఇడ్లీలు, రెండు లేక మూడు దోసెలు, రెండు చపాతీలు..అలా లెక్కప్రకారం తింటే ఎక్కువతక్కువ కాకుండా ఉంటుంది.అరడజను అలా తినకూడదు.అన్నం మనిషికి సుమారు అరకప్పు బియ్యంతో వండితే సరిపోతుందంటారు.


  నిమ్మకాయ వంటి పుల్లటిపండ్లు మరీ ఎక్కువ కాకుండా కొన్ని తినాలి.ఇంకా, పురుగుమందులు వేయని, దేశవాళి కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు..వాడితే మంచిది.

ఆహారం తీసుకోవటంలో కొన్ని పద్ధతులు..ఎవరి పద్ధతిని బట్టి వారు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

ఉదయం ఆకుల కషాయం..ఉదా..జామాకు..వంటివి వేడి నీటిలో 2 నిమిషాలు కాచి ఆ నీటిని తాగాలి.

నెలకు నాలుగు రోజులు ధనియాల కషాయం..ఉదా.. నెలలో మొదటి నాలుగురోజులు..

link.. జలుబు, దగ్గు తగ్గటానికి ఈ పానకం.......... 

చ్యవంప్రాశ్ కూడా తీసుకోవచ్చు.



మొర్నింగ్ బ్రేక్ఫాస్ట్ .. ఇడ్లి..దోస..పూరీ..పొంగణాలు..ఉప్మ..రోజు విడిచి రోజు ఒక గ్లాస్ రాగుల జావ..రోజులో ఎప్పుడైనా రాగుల జావ త్రాగవచ్చు.జొన్న జావ కూడా తాగవచ్చు.

భోజనంలో చక్కగా అరిగే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి..

వారంలో రెండు సార్లు మునగాకు జ్యూస్
వారంలో ఒక సారి బూడిదగుమ్మడి జ్యూస్
వారంలో ఒకటి లేక రెండుసార్లు కొబ్బరి నీరు
 
నువ్వుల ఉండలు వారానికి రెండు తినవచ్చు.
వేడిచెయ్యకుండా మెంతిపిండికానీ, మెంతులు కానీ వాడవచ్చు.

ప్రతిరోజు ఫ్రూట్స్

సలాడ్ అండ్ డ్రైఫ్రూట్స్  వారానికి 3 సార్లు..

గ్రీన్ జ్యూస్ వీక్లి 3 సార్లు...పుదీనా, కొత్తిమీర వంటి వాటి జ్యూస్ ..

రాత్రిపూట.. వీక్లి 2 సార్లు చపాతీలు..మిగిలిన రోజుల్లో..జొన్న ఉప్మా..జొన్న దోసలు..జొన్న ఇడ్లి..

వారానికి ఒకసారి లేక రెండుసార్లు.. పకోడి..బజ్జి..లేక ..చాట్..

15 రోజులకు ఒకసారి(నెలకు రెండు సార్లు).. స్నాక్స్..కారప్పూస అండ్ స్వీట్..వండుకుని నెలలో ఎప్పుడైనా తినవచ్చు.

వారంలో రెండుసార్లు తలకు..నూనె నిదానంగా మర్దన చేయాలి.

రోజూ ఉదయానే లేచి సూర్యనమస్కారాలను లేత ఎండలో చేయటం.. ఉదయంగానీ సాయంకాలం కానీ అర్ధగంటయినా ఎండ శరీరానికి తగలాలి.


కనీసం అర్ధగంట నడవాలి...ఉదయం కానీ, సాయంకాలం కానీ తక్కువ ఎండలో నడిస్తే ..ఎండ తగలటం, నడవటం అనే రెండు పనులు ఒకేసారి జరుగుతాయి. నడిచేటప్పుడు దైవనామాన్ని కూడా నిదానంగా అనుకోవచ్చు. 


కనీసం 15 నిమిషాలన్నా ధ్యానం చేయాలి. మీకు ఇష్టమైన దేవుని నామాలను వింటూ కూడా ఉండవచ్చు. అయితే, ధ్యానం, ప్రాణాయామం..వంటివి శిక్షకుల వద్ద అభ్యసించి చేస్తే మంచిది.

 ధ్యానం ద్వారా అనేక ఆలోచనల నుంచి కొంతసేపైనా మనస్సుకు విశ్రాంతిని ఇవ్వవచ్చు.

 
జీవితం అంటే కొన్ని టెన్షన్లు ఉంటాయి కదా..మన చుట్టూ టెన్షన్ పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు కొంతయినా టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది.

 కానీ, మనం ఆరోగ్యంగా ఉండాలంటే టెన్షన్ ఎక్కువ ఉండకుండా తామరాకుమీద నీటిబొట్టులా జీవించటాన్ని తప్పక నేర్చుకోవాలి.

 జీవితంలో మన చేతనైనంత మనం చేసి,  దైవంపై భారం వేయాలి.  నిష్కామకర్మ యోగంతో జీవించటాన్ని అభ్యసించాలి.

శక్తి చాలనప్పుడు ..సరైనవిధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని శరణువేడుకోవాలి.

అంతా  దైవం దయ.

Monday, July 18, 2016

ఓం. హిందువులు.. మరి కొన్ని విషయాలు.....


గురువులకు అనేక వందనములు.


  .............
క్రింద వ్రాసిన విషయాలు ఈ పొస్ట్ వేసిన చాలాకాలం క్రిందట వ్రాసి ఇక్కడ వేయటం జరిగిందండి.
 
ఇప్పుడు చాలామంది హిందువులు హిందుదేవతలను ఆరాధిస్తూ, సాయిని కూడా ఆరాధిస్తున్నారు.

ఎన్నో నియమాలు పాటిస్తూ హిందువులకు దిశానిర్దేశం చేసే బ్రాహ్మణులు కూడా కొందరు ,  సాయి సర్వాంతర్యామి అని పూజలు చేస్తుంటే,  హిందువులు కొందరు  వారిని అనుసరించటంలో ఆశ్చర్యం లేదు.

సాయి విధానాలు సరళంగా ఉంటాయి. అనేక ఆచారవ్యవహారాలుండవు, అనేక కఠినమైన నియమాలుండవు. 
 
అయితే,  షిర్డిసాయికి హారతులు ఇస్తారు. రోజుకి మూడుసార్లు అనుకుంటున్నాను, నాకు సరిగ్గా తెలియదు. హారతులకు ఎక్కువ సమయమే పడుతుంది.
 
 ఎక్కువ నియమాలు లేకుండా ఉండే సాయి ఆరాధనలో కూడా, సాయిని హిందు దేవతలుగా పూజలు మొదలుబెట్టి ఆరాధించటం ఆశ్చర్యం. 
.....................................
 సులభమైన విధానాలతో ఉన్న షిర్డిసాయి ఆరాధనకు చాలామంది ఆకర్షితులవటంలో ఆశ్చర్యం లేదు.

 పరిస్థితి ఎలా ఉందంటే,  సాయి విగ్రహం ఉంటే,  జనాలు వస్తారని 
కొన్ని హిందు దేవాలయాల్లో  సాయి విగ్రహాన్నికూడా పెడుతున్నారట. భవిష్యత్తులో  పరిస్థితి  ఎలా ఉంటుందో?
..........................................
షిర్డిలో ప్రాచీన శివుని దేవాలయం ఉంటుంది. శివాలయానికి మేము వెళ్లినప్పుడు  అక్కడ, షిర్డి మందిరంలోలా  క్యూలు లేవు. బోలెడు భక్తులు లేరు.
....................................... 
  కొందరు హిందువుల ప్రవర్తన వింతగా ఉంటుంది. ఒకే హిందువుల్లో వైష్ణవులు, శైవులు అని కొందరు గొడవలు పడటం జరిగింది. మరి, ఇతర మతాలను కూడా నమ్మే సాయిబాబాను గురువుగా, దైవంగా భావించటం ఆశ్చర్యమే.
 
 హిందువులను ఉద్ధరిస్తామనే వాళ్ళు,  వైష్ణవ.. శైవ ..అని గొడవలు మానేయాలి.

అనేకముఖములతో ఉన్న విష్ణుమూర్తి(శ్రీకృష్ణుని) విశ్వరూపదర్శనము చిత్రం ద్వారా శివుడు కూడా ఉండటాన్ని గమనిస్తాము..దైవశక్తి కదా..మరి, వైష్ణవులు శివుని పట్ల ద్వేషభావం కలిగిఉంటే మహాపాపము.
 .....................................
  కొందరు సాయిబాబాకు అనేక దేవతలుగా అవతారాలు అలంకరించి పూజలు చేస్తున్నారు.
 
హిందుదేవతలకు వారి పద్ధతుల ప్రకారం పూజలు చేస్తారు.  శివుని విష్ణువులా ఆరాధిస్తారా? విష్ణువును శివునిగా ఆరాధిస్తారా? 
 
సాయికి  హిందుదేవతలుగా అలంకరించి పూజలు చేయటం కాకుండా, సాయిని సాయిలా ఆరాధింవచ్చు  కదా....
 .........................................
 
 భవిష్యత్తులో ఇంకెవరైనా వచ్చి,  వారు సర్వాంతర్యామి అంటే, వారికి కూడా హిందుదేవతల అలంకారాలు చేసి పూజలు చేస్తారా? 

కొందరు హిందువులు ఇతర మతాల దైవాన్నికూడా పూజిస్తారు. కోరికలు తీరటానికి ఇతర మతపండుగలలో పాల్గొంటారు.  భవిష్యత్తులో అలాంటివాళ్లు ఎవరైనా ,  తనకు ఏదైనా కల వచ్చిందని చెప్పి, తనకు తోచినట్లుగా పూజలు చేస్తానంటే ?  ఎవరు ఏది చెబితే అది ఒప్పుకోవాలా?
.................................
 హిందుదేవతల పూజలకు కొన్ని పద్ధతులు, నియమాలు ఉన్నాయి కదా....ఎవరికి తోచినట్లు వారు పూజలలో పూజించే చిత్రాలను మార్చేయవచ్చా?
 
ఇతరమతాల వారికి కూడా పూజలో వారి పద్ధతులు వారికి ఉంటాయి. హిందువులు, ఇతరమతాల దేవతలను హిందుదేవతలతో కలిపి పూజిస్తే, ఇతరమతస్తులకు కూడా అందరికి నచ్చకపోవచ్చు.
 ....................................
సినిమాల్లో హిందు దేవతలను తమ ఇష్టం వచ్చినట్లు మార్చి చూపించినా,  న్యాయస్థానంలో కేసులు వేయాలి.  
 
మూఢనమ్మకాలు పెంచే సీరియల్స్ ,  సోషల్మీడియాలో మూఢనమ్మకాలను వ్యాపింపచేసేవాళ్ళ పట్ల కూడా చర్యలు తీసుకోవాలి.
.........................................
 పూజలలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదని ఎన్నో చెప్పే బ్రాహ్మణులు,  ఈ విషయాలలో అలా చేయకూడదని చెప్పాలి కదా.. 
 ............................................... 
   వినాయకచవితి పూజలలో కొందరు ఏం చేస్తున్నారంటే,   తమకు ఇష్టం వచ్చినట్లు వినాయకునికి రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇకమీదట ఇవన్నీ చేయకూడదని గట్టిగా చెప్పాలి. 
    హిందువులుగా ఉన్నవాళ్లు హిందుత్వం.. హిందుదేవతల ప్రాముఖ్యత తగ్గేలా ప్రవర్తించకూడదు. హిందుత్వానికి ఎటువంటి హాని జరగకుండా చూడాలి.

  సాయిభక్తులు కూడా హిందువులే కాబట్టి, హిందుధర్మ పరిరక్షణ కూడా చేస్తారు.
..................................... 
ఈ  తరంవారు తాము ఎప్పటినుంచో పూజించే హిందుదేవతలతో పాటు, సాయిని కూడా  పూజిస్తున్నారు. రాబోయే తరాల వాళ్ళు హిందుత్వంలోని అనేక నియమాలను పాటించలేక,  అందరు దేవతలు సాయిలోనే ఉన్నారని,  సాయిని మాత్రమే పూజించే పరిస్థితి కూడా రావచ్చేమో?

 ఇప్పటికే కొందరు సాయిభక్తులు ఏమంటున్నారంటే, సాయిలోనే అందరు దేవతలు ఉన్నారని, సాయిని ఆరాధించుకుంటామని అన్నట్లు అంటున్నారు.
   ......................................................
  నాకు తెలిసినంతలో,  శిరిడి సాయి బాబా జీవితచరిత్రము పుస్తకములో ఒక దగ్గర సాయి స్వయముగా ఎన్నో విషయములను తెలియజేసిన సందర్భములో ఇలా కూడా అన్నారు. సాయిసాయి ..యను నామమును జ్ఞప్తి యందుంచుకున్న మాత్రమునే మంచి జరుగుతుందని తెలియజేసారు.
....................................................
  పూర్వీకులు పూజించిన దేవతలు అంటే నాకు భక్తి ఉంది. షిర్డి సాయి అంటే భక్తి ఉంది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. దైవము ఒక్కరే అయినా, ఏ మతం వారి పద్ధతులు వారికి ఉన్నాయి.
 
 దైవము ఒక్కరే కదా.. అని,   అన్ని మతాల వారు ఒకే ఆచారవ్యవహారాలు పాటించాలంటే  ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో చాలా కష్టం.
.................................
 ఆ రోజుల్లో  సాయి  షిర్డి వస్తే, ఒకరి గుర్రం కనిపించకపోతే సాయి  ఆ విషయాన్ని చెప్పగా, సాయికి మహిమలున్నాయని  హిందువులే వారి వద్దకు వెళ్లి తమకష్టాలు తీర్చమని అడిగినట్లు అనిపిస్తోంది.
 ............................
  నాకు తెలిసిన ఒక సాయి మందిరంలో హిందుదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. చిన్న విగ్రహాను సాయి పాదాలవద్ద ఒక పళ్లెంలో పెట్టి పూజిస్తారు. దసరా వస్తే హాల్లో ఒక పక్కన పెద్ద అమ్మవారి బొమ్మను అలంకరించి నవరాత్రులు చేసేవారు. మామూలుగా నవరాత్రులంటే భక్తులు  అమ్మవారి దేవాలయానికి  లేక ఇంకో హిందుదేవాలయానికి వెళ్తారుకావచ్చు. 

సాయి మందిరంలో ఈ పూజలు చేస్తున్నారు కాబట్టి, ఆ చుట్టుపక్కల ప్రజలు అమ్మవారిని అక్కడే పూజించేవారు. భక్తులు అక్కడ  కానుకలు సమర్పిస్తారు.

షిర్డిసాయి ఇవన్నీ పూజలు చేయమని చెప్పలేదు. 
ఇవన్నీ  సాయి మందిరాల నిర్వాహకులు  చేస్తున్నారు.
....................................
  హిందువుల గ్రంధాలలో ఎవరిశక్తిని బట్టి వారు దైవాన్ని పూజించవచ్చని ఉంది.

దైవపూజ అంటేనే ప్రశాంతంగా చేసుకోవాలి. అలాంటి విషయాన్ని   విపరీతధోరణితో కొందరు హిందువులు క్లిష్టం చేసేసారు.   అవన్నీ విన్న ప్రజలకు అనేక సందేహాలు, భయాలు కలుగుతాయి.
...............
  సాయి తనకు షోడశోపచారాలతో పనిలేదు, ప్రేమతో కూడిన భక్తి ఉంటే చాలన్నారు.
 
 మరి, హిందు పెద్దవాళ్లు ఎలా చెబుతారంటే,   ప్రతిదానికి  ఇలా చేస్తే కష్టాలు వస్తాయి, అలా చేయకూడదు, ఇలాగే చెయ్యాలంటూ భయపెడతారు. హిందువులకు విసుగొచ్చి ఇతరమార్గాల్లోకి వెళ్లేలా చేస్తున్నారు.

  పూజలో కొబ్బరికాయ కుళ్లితే ఏ కష్టం ముంచుకొస్తుందో.. అని భయం, దీపంలో ఎన్ని వత్తులు వేయాలో? అనే సందేహాలు, బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలనే శంకలు, ఫలానా దిక్కున తిరిగి అన్నం తినాలి, టాయ్లెట్లో ఫలానా దిక్కున 
తిరిగి  కూర్చోవాలి, టీవీ ఫలానా దిక్కు పెడితే అరిష్టం..ఇలా వందల విషయాలను గుర్తుంచుకోలేక, గుర్తున్నా కూడా పాటించలేక నలిగిపోతున్నారు.

 ఇవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయోమోనని  భయపడి విసిగిపోయినవాళ్లు,  సులభంగా ఏదైనా మార్గం కనిపిస్తే అటు వెళ్లటానికి ఆలోచిస్తారు.
 
 ప్రాచీనులు ఎన్నో మంచి విషయాలను ఆచారవ్యవహారాలుగా తెలియజేసారు. అయితే, కాలక్రమేణా కొందరు కొన్నింటిని మార్పులుచేర్పులు చేసి మూఢనమ్మకాలుగా అతిగా తయారుచేసారు.
.............................
అంటరానితనం వంటి విషయాల వల్ల,  కొందరు శూద్రులు  మతం మారారని కొందరు అంటారు.  కొందరు అగ్రకులాల వాళ్లు కూడా ఎందుకు మతం మారారు? మతం మారిన వారిలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

హిందుత్వంలోని అనేక  విషయాలను పాటించలేక కూడా, అగ్రకులాల వాళ్లు కొందరు మతం మారుతున్నారేమో? అనిపిస్తుంది.

ఇవన్నీ గమనించాక, ఇప్పటికైనా హిందువులు తమ పద్ధతులను కొంత సులభం చేసుకోవాలి, లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.

.........................................
 గ్రంధాలలో విషయాల గురించి ప్రశ్న వేయకూడదన్నట్లు కొందరు అంటారు. గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు(మార్పులుచేర్పులు) జరిగాయంటారు. 
 
గ్రంధాలను చదివినప్పుడు కొన్ని విషయాలు అర్ధం కావు, సందేహాలు కలుగుతాయి. అలాగే,  కొన్ని గ్రంధాలను చదివినప్పుడు  నాకు  కొన్ని సందేహాలు కలిగాయి.
 
 తెలియనివిషయాలు పెద్దవాళ్లను అడిగి తెలుసుకోవటంలో తప్పులేదు. గురువును, దైవాన్ని అడగటంలో కూడా తప్పులేదు.
................................
 కొందరు,  తమ పూర్వీకులు ఆరాధించిన దేవతలను, గురువులను  కాకుండా, ఇతర మతాలదేవతల ఆరాధనలోకి వెళ్తారు. భవిష్యత్తులో ఇంకో కొత్త వాళ్లు మహిమలు చూపిస్తే, వీళ్ళు అటు వెళ్లరని గ్యారంటి ఉందా?
.........................
 హిందువులకు చాలామంది దేవతలు, గురువులు ఉండగా, ఎందుకు కొత్త వాళ్లవద్దకు వెళ్తారు?  అన్నది ఆలోచించాలి. ఇది హిందువుల బలహీనతే. 
 
తిరువణ్నామలైలో అంత గొప్ప దైవము ఉండగా, మళ్లీ అక్కడున్న టోపి అమ్మ అనే ఆమె వద్దకు వెళ్లి ఆమె విసుక్కుంటున్నా కూడా,  ఆమె వెంటపడుతున్నారు. 
 ............................
 హిందువులు ఎన్నో నియమాలనే చట్రంలో భయపడుతున్నారు. గ్రంధాలలో ఉన్న ఎన్నో విషయాలను పాటించకపోతే ఏమవుతుందో?  అని భయపడుతున్నారు. 
 
 గ్రంధాలలోని విషయాలు, ఆచారవ్యవహారాలు గత యుగాలలో చక్కగా పాటించగలరు.
 
కలియుగంలో పరిస్థితుల గురించి తెలిసిన ప్రాచీనులు, కలికాలంలో దైవస్మరణ..దైవనామ స్మరణ సులభమైన ఉపాయమని తెలియజేసారు.

కలికాలంలో చాలా పదార్ధాలు కల్తి అయి ఉంటాయి. దైవనామము కల్తి చెయ్యలేరు.  దైవనామాన్ని చక్కగా సులభంగా స్మరించుకోవచ్చు.

దైవస్మరణ..దైవనామస్మరణ వల్ల ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించి, ప్రపంచం శాంతిగా ఉండే అవకాశముంది.
 ............................
 విధివిధానాలు ఎక్కువ ఉన్నప్పుడు వాటిని సరిగ్గా పాటించామా? లేదా? అనే టెన్షన్ తోనే సరిపోతుంది.

విధివిధానాలు ఎక్కువ చేస్తూ చెప్పేవారు ప్రజలను దైవానికి దూరం చేస్తున్నట్లే.

దైవపూజ కోసం విధివిధానాలు కానీ, విధివిధానాల కొరకు దైవపూజ ఏర్పాటు చేయలేదు.  
అతి చారాలను తగ్గించుకుంటే,  దైవాన్ని ప్రశాంతంగా  ఆరాధించుకోవచ్చు.
 ..................................
.దైవము ఒక మహాశక్తి. హిందుగ్రంధాల ద్వారా తెలిసిన అనేక  దేవతారూపాలు మూలదైవము నుండి వచ్చిన  దేవతలే. మూలదైవాన్ని పరమాత్మ అని ప్రార్ధించుకోవచ్చు. మూలదైవాన్ని ప్రార్ధించుకుంటే అందరు దేవతలను ప్రార్ధించుకున్నట్లే.
 
అందరు దేవతలను ఒకే దైవశక్తిగా శ్రీ మాత..శ్రీ పరమాత్మగా లేక పరమాత్మగా పూజించుకోవచ్చు..అని నాకు అనిపిస్తుంది.
 .......................... 
 ఈ పోస్ట్ పెద్దది అయ్యింది.
 konni links...
 
  • షిర్డి సాయి గురించి కొందరి అభిప్రాయాల గురించి ..

  • .సాయిబాబా భక్తులు..మరికొన్ని విషయాలు .. 
  • ...........................
  •  వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే, దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


  • Saturday, July 16, 2016

    ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు...

     
    ఈ రోజులలో  ప్రజలు రోగాల బారిన పడటం ఎక్కువగా జరుగుతోంది.  

    వయస్సుతో సంబంధం లేకుండా  చిన్నపిల్లలు  కూడా ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. 

    ఇలా  జరగటానికి అనేక కారణాలున్నాయి.

     వాతావరణ కాలుష్యం బాగా పెరగటం , పంటలు పండించటానికి రసాయన ఎరువులు వాడటం , చదువు, ఉద్యోగ వత్తిళ్ళు పెరగటం..ఇలా అనేక కారణాలున్నాయి.

     ఈ రోజుల్లో  ఇంటి శుభ్రత కోసం వాడుతున్న రకరకాల రసాయనాల వల్ల కూడా భూమి, నీరు కలుషితం అవుతున్నాయి.


     ఇలా కలుషితమైన మట్టి, నీటితో పంటలు పండించటం  అనారోగ్యకరం.
    ..............................

     అనారోగ్యం రావటానికి  ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే ..చిన్నతనం నుంచి తీసుకునే ఆహార  పద్ధతిలో వచ్చిన విపరీతమైన  మార్పులు.

     పాతకాలంలో ఇంట్లోనే  తయారుచేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారు.

    ఈ రోజుల్లో ఎక్కువగా బయట ఆహారం తీసుకోవటం జరుగుతోంది.

     పాతకాలంలో...  కొబ్బరి నూనె, పసుపు, కారం ...వంటివి  ఇంట్లోనే తయారుచేసుకునేవారు.


     ఈ రోజుల్లో అల్లం..వెల్లుల్లి పేస్ట్ కూడా బయట నుంచి కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది.

    బయట నుంచి తెచ్చుకునే వాటిలో నిల్వ ఉండటం కోసం కొన్ని రసాయనాలు కలిపే అవకాశం ఉంది.

     ఈ రోజులలో  పదార్ధాల రుచికొరకు వాడే రసాయనాలతో కూడిన ఆహారాన్ని తినటం ఎక్కువయింది.  


     జంక్ ఫుడ్ వల్ల రుచి బాగుంటుంది కానీ, రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

     ఆహారపదార్ధాలలో రుచి పెరగటం కోసం  ఈ రోజుల్లో  చాలామంది ..  ఎన్నో వంటలలో  బేకింగ్ సోడా, అజనిమోటో వంటివి.. వాడుతున్నారు. 

     అజనిమోటో  బయట షాపులలో సులభంగా లభిస్తుంది. ఇవన్నీ వాడటం వల్ల ఆహార పదార్ధాలకు ఒక విధమైన  రుచి  రావటం వలన  వీటి  వాడకం  బాగా పెరిగింది.

     ఆ రుచికి అలవాటుపడటం వల్లకు మళ్లీమళ్లీ అవే తినాలనిపిస్తుంది.  అలా శరీరంలోకి  వెళ్లే అజనిమోటో పరిమాణం బాగా పెరుగుతుంది. 


     అజనిమోటో  తరచు వాడితే కలిగే నష్టాలు చాలామందికి తెలియదు.

    ఇంట్లో చేసుకునే వంటలలో కూడా అజనిమోటో, సోడాఉప్పు వంటివి ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలి.

    నాకు తెలిసినంతలో సోయాసాస్ , వెనిగర్ వంటివి పదార్ధాలను నెలల తరబడి పులవబెట్టి తయారుచేస్తారు.


       కెమికల్స్ తో కూడా సోయాసాస్, వెనిగర్ తయారుచేస్తారట.

     మన పూర్వీకులు  సోడాఉప్పు వంటివి  వాడకుండానే వెన్న వాడి  కరకరలాడే రుచికరమైన స్నాక్స్ చేసేవారు. 

    ................................

     పాత రోజుల్లో  సూర్యరశ్మి, వెన్నెల, గాలి, వెలుతురు ప్రసరించే విధంగా జీవనశైలి ఉండేది.

     ఈ రోజుల్లో  ఎక్కువగా  నాలుగుగోడల మధ్యన సెల్ ఫోన్స్, టీవీ, కంప్యూటర్స్.. మధ్యే ఉంటున్నారు.  


    అనారోగ్యాలు పెరగటానికి ఇవన్నీ కారణాలే.

    40 సంవత్సరాల క్రిందట కూడా  కాన్సర్, కిడ్నీ..వంటి వ్యాధులు  అరుదుగా ఉండేవి.  


    ఇప్పుడు చిన్నపిల్లలలో కూడా కాన్సర్, కిడ్నీ..వంటి జబ్బులు వస్తున్నట్లు  వింటున్నాము.

    ఆరోగ్యమే మహాభాగ్యం.  ఆరోగ్యాన్ని  అశ్రద్ధ  చేయరాదు.



    Monday, July 11, 2016

    విపరీతమైన జనాభా పెరుగుదల అనేక సమస్యలకు మూలం...marikonni vishayaalu..

     
    విపరీతమైన జనాభా పెరుగుదల వల్ల అనేక నష్టాలున్నాయి.

      విపరీతంగా జనాభా పెరిగితే వనరులు సరిపోవు. 

    దేశంలో ఆహార కొరత,  నిరుద్యోగ సమస్య ఎక్కువ అయ్యే  పరిస్థితులు ఏర్పడుతాయి.  

    ఆహార కొరత,   నిరుద్యోగ సమస్యల  వల్ల  దేశంలో నేరాలు కూడా పెరుగుతాయి. 

     జనాభా పెరిగే కొద్దీ  దేశం జనాభాతో  కిటటలాడుతూ మురికిగా ఉంటుంది. 

    విపరీతమైన జనాభా పెరుగుదల  అనేక సమస్యలకు మూలం. 

      అయితే,  మరీ ఒక్కరే కాకుండా,  ఇద్దరు సంతానం ఉంటే మంచిది.
     ..................................
     అయితే, స్వదేశీయులు తక్కువ సంతానం పొంది, విదేశాలనుంచి అక్రమవలసదారులు దేశంలోకి వస్తే,  జనాభా పెరిగి  స్థానికులకు కష్టాలు వచ్చే అవకాశముంది. ప్రభుత్వాలు అక్రమవలసలను అరికట్టాలి.
     
    భారతీయులు విదేశాలకు వెళ్లటం పట్ల ఆసక్తి తగ్గించుకుని, దేశాన్ని అభివృద్ధి చేయటంలో కృషిచేయాలి. దేశం అభివృద్ధి చెందితే అందరికి అభివృద్ధి ఉంటుంది.
    ..........................
     marikonni vishayaalu...
     
    తెలుగువాళ్లు ఎక్కువగా తమ పిల్లలు డాక్టర్ లేక ఇంజనీర్ అవ్వాలని అనుకుంటారు. ఇందుకోసం చిన్నతనం నుండి హాస్టల్స్లో వేస్తారు. ట్యూషన్స్ పెట్టి రుద్దిరుద్ది చదివిస్తారు. పిల్లలు ఆడుకోవటం కూడా తక్కువే. అన్నీ అయి, ఇంటర్లో సీట్లు కోసం విపరీతమైన పోటీ ఉంటుంది.

     ఉదా..మెడిసిన్లో సుమారు కొన్ని వేల సీట్ల కోసం కొన్ని లక్షల మంది పరీక్ష రాస్తే ఎంత మందికి సీట్ వస్తుంది..మంచి మార్కులు వచ్చినా, కొన్ని కారణాల వల్ల కొందరికి సీట్లు రావు.

    అందువల్ల, ప్రభుత్వాలు మెడిసిన్, ఇంజనీరింగ్ బాగా సీట్లు పెంచి, కాలేజీలు స్థాపించి చాలామందికి సీట్లు ఇస్తే మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలన్న వారి కోరికన్నా తీరుతుంది. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఫీజులు కొంత పెంచితే, ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుంది.

    చాలామందికి సీట్లు లభించే పరిస్థితి ఉంటే, సీట్ల కోసం పోటీపడి వెర్రిగా చదవటం అనేది తగ్గుతుంది. మంచి మార్కులు వచ్చిన అందరికి సీట్లు ఇస్తే, పిల్లలు పోటీపరీక్షల కోసం ప్రాణాంతకంగా చదివే టెన్షన్ తగ్గుతుంది.

     కొద్దిసీట్ల కొరకు అనేకమంది పోటీపడే పరిస్థితి, చావుబతుకుల సమస్యగా మారిన పోటీ పరీక్షల వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోంది.
    ..............................................

    చదువయ్యాక అందరికి ప్రభుత్వఉద్యోగాలు రాకున్నా,  కొందరు వేరే ఉద్యోగాలు చేస్తారు. కొందరు విదేశాలకు వెళ్తారు. మెడిసిన్ చదివిన కొందరు సొంతంగా ప్రాక్టిస్ పెట్టుకుంటారు. ఇంజనీరింగ్ చదివిన కొందరు సొంత పరిశ్రమ, స్టార్టప్ స్టార్ట్ చేస్తారు.

    కొందరు ఇంట్లో ఉండి కుటుంబబాధ్త్యతలు చూసుకుంటారు.పిల్లలు కొంచెం పెద్దయ్యాక  ఉద్యోగమో,సొంతంగానో మొదలుపెట్టవచ్చు.
    ...................

     పెద్దవాళ్ళు ఆలోచించాలి, తమ పిల్లలని అంత క్షోభ పెట్టి చదివించటం అవసరమా? వ్యాపారం, వ్యవసాయం, ఇంకా ఇతర వృత్తులు ఎన్నో ఉన్నాయి. అటు వెళ్లాలని ఎందుకు కోరుకోరో తెలియదు.

    తెలుగువాళ్లు ఉపాధి కొరకు విదేశాలకు వెళ్ళి, ఆ ఉద్యోగం ఎంతవరకు ఉంటుందో తెలియక కొందరు, తక్కువ జీతానికి పనులు చేస్తూ కొందరు కష్టాలు పడుతుంటే, వేరే దగ్గరనుంచి వచ్చిన వారు, ఇక్కడ చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.

    దూరపుకొండలు నునుపు అని విదేశాలకు వెళ్తారు కాని, వెళ్ళాక అక్కడ కష్టాలు తెలుస్తాయి. విదేశం ఎప్పటికైనా విదేశమే. ఎప్పుడు పొమ్మంటారో తెలియదు.
    ....................................

    వ్యవసాయంలో కూడా ఆధునిక పద్ధతులు ఎన్నో వచ్చాయి. వ్యవసాయఉత్పత్తులను దళారీలు రైతుల వద్ద తక్కువధరకు కొని, వినియోగదారులకు చాలా ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతులు సంఘటితంగా ఉండి, తమఉత్పత్తులను తెలివిగా అమ్ముకోవాలి.

    వ్యాపారస్తులకయితే బాగానే డబ్బు వస్తుంది. వ్యాపారం రిస్క్ అని అనుకుంటారు కాని, ఇంజనీరింగ్, మెడిసిన్ కూడా చాలా కష్టపడాలి. ఇంజనీరింగ్ వాళ్ల టార్గెట్ల టెన్షన్, ఆ కంపెనీల వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాల్లో తీసేస్తారో తెలియదు.
    ..................
    ప్రభుత్వాలు స్థానికుల ఓట్లతో అధికారంలోకి వస్తారు.తమప్రజల కొరకు పని చేస్తారు. కంపెనీలను తెచ్చినప్పుడు, స్థానికులకు ఉపాధి కల్పించటంలో ప్రాముఖ్యత ఇవ్వాలి.
    .................

    పాతకాలంలో వైద్యం, ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా, చాలా వృత్తులు ఉండేవి. అప్పట్లో కొన్ని చేతివృత్తులవారు సమాజానికి అవసరమయ్యే ఎన్నో వస్తువులను తయారు చేసేవారు.

    అప్పట్లో టీవీలు, ఫ్రిజ్లు..టెక్నాలజి లేకపోయినా, మనిషి చక్కగా జీవించటానికి అవసరమైనంతలో అన్నీ వారికి తెలుసు. ఇప్పుడు టెక్నాలజి పెరిగింది, పొల్యూషన్ పెరిగింది. యంత్రాల వల్ల నిరుద్యోగమూ పెరిగింది. టెక్నాలజిని పర్యావరణానికి హాని కలగనంత వరకు, నిరుద్యోగం పెరగనంత వరకు వాడుకోవచ్చు.
     .....................

    మనిషి చక్కగా బతకటానికి బోలెడు డబ్బు అవసరం లేదు. పాతకాలంలో ఇన్ని వస్తువులు లేకపోయినా చక్కగానే జీవించారు. ఇప్పుడు విలాసాలు, వస్తువ్యామోహం, ఇళ్లు, స్థలాల కొనుగోలు వ్యామోహం పెరిగి, విపరీతంగా పనిచేస్తున్నారు. తృప్తి లేనివారికి ఎంత డబ్బున్నా తృప్తి ఉండదు. ఎంత డబ్బు ఉన్నా సరిపోదు.



    Wednesday, July 6, 2016

    పండుగ సందర్భంగా శుభాకాంక్షలు..




    జగన్నాధ రధయాత్ర శుభాకాంక్షలు...



    Saturday, July 2, 2016

    శ్రీ అమర్‌నాధ్ శివలింగం రూపం లాంటి రూపం ఫ్రిజ్ లో.... ..మరియు కొన్ని విషయములు..



    శుభప్రదమైన 2016 సంవత్సరపు అమర్ నాధ్ యాత్ర ప్రారంభమయింది. 

     .........

    విజయవాడలో ఉన్న  కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళే దారిలో ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని కూల్చివేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా  చేయాలనుకోవడం చాలాచాలాతప్పు.

     

    *********

    ఇంతకుముందు వ్రాసిన ఒక టపా కూడా ఇక్కడ ఇస్తున్నాను .

     

     Friday, June 18, 2010





    శ్రీ అమర్‌నాధ్ శివలింగం రూపం లాంటి రూపం ఫ్రిజ్ లో.... ..




    ఈ విషయం చెప్పాలని ఎప్పటినుండో అనుకుంటున్నానండి. ఇది సుమారు అయిదు సంవత్సరముల క్రిందట జరిగింది.


    అప్పట్లో మేము చెన్నైలో ఉండేవాళ్ళమండి. మా ఫ్రిజ్ లో ఎప్పుడు అందరికిలానే అయిస్ ఫార్మ్ అవుతుంది. కానీ ఒకసారి అయిస్ పెద్ద ఆకారములో దగ్గరదగ్గర శ్రీ అమర్‌నాధ్ శివలింగం ఆకారములో ఏర్పడిందండి. డీప్ ఫ్రిజ్లో నీరు బొట్లుబొట్లుగా పడుతూ రెండు ఆకారములు ఏర్పడ్డాయి. ముందు నేను గమనించలేదు. తర్వాత చూసి ఆశ్చర్యపోయామండి. ఒక ఆకారానికి ముఖము లాగ కూడా అనిపిస్తోంది.




    . ప్రక్కన వాళ్ళకు చూపిస్తే ఫొటోస్ తియ్యమని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళు తరువాత ఆ అయిస్ కరిగించి నీరు శ్రీ పిడారి నవశక్తి కాళీ అమ్మన్ అమ్మవారి గుడిలోని చెట్టు మొదట్లో పోశానండి. గుడివారికి ఈ విషయములు చెప్పలేదండి. ఈ ఫ్రిజ్లోని అయిస్ తో ఏర్పడ్డ ఆకారములను కొందరికి మాత్రమే చూపించామండి. అంటే అసలే రోజులు బాగాలేదు కదా ఎవరికయినా చెప్పినా నమ్మకపోగా మేమే ఇలా అయిస్ తో ఏర్పాటు చేశామని అన్నా అంటారు. ఎందుకొచ్చిందని ఊరుకున్నామండి.



    కానీ తరువాత ఏమనిపించిందంటే భగవంతుని కి సంబందించిన వింతలు ఇతరులుకు కూడా చూపిస్తే మంచిది కదా అని. అలా కొందరికి ఫోటోస్ ను మెయిల్ చేశాము. ఈ ఫోటోస్ ను చూస్తే నాకు కొంచెము బాధగా అనిపిస్తుంది ఎందుకంటేనండి. అప్పుడు వీడియో తీయించుకోలేకపోయాము. వీడియోలో అయితే బాగా కనిపిస్తుంది కదా... ఇప్పుడు మాకు వీడియో కెమెరా ఉంది కానీ అలా మళ్ళీ ఏర్పడలేదు. . . . . .నేను అయితే ఇది అద్భుతం అనుకుంటాను. .


    ఇది సహజంగానే అలా ఏర్పడిందండి. ఇక నమ్మటం నమ్మకపోవటం ఎవరి ఇష్టం వాళ్ళది. .ఆ భగవంతుని దయవలన క్రితం సంవత్సరం మేము ,పిల్లలతో శ్రీ అమర్ నాధ్ జీ యాత్ర, శ్రీ వైష్ణవీ దేవి అమ్మవారి యాత్రలు చేసి వచ్చామండి. .....