ఎందరో హిందువులు షిర్డి సాయిని కూడా పూజిస్తున్నారు.
***************
క్రింద విషయాలను ఈ పోస్ట్ వేసిన తరువాత చాలాకాలం తరువాత వ్రాసి ఇక్కడ ప్రచురించటం జరిగింది.హెడ్డింగ్ కూడా మార్చటం జరిగింది.
చాలాకాలం క్రితం ద్వారకాపీట్ శంకరాచార్య, షిర్డి సాయిబాబాను పూజించవద్దన్నట్లుగా చెప్పటం జరిగింది.
( అప్పట్లో నేను, ద్వారకాపీట్ స్వామిగారు అలా అనటం కరెక్ట్ కాదని బ్లాగులో వ్రాసాను. )
ఆ మధ్య కొందరు హిందువులు అయిన సాయి భక్తులు, ఇతరమత దేవతల పేరుతో
పాటలు పాడటం గమనించాక, వీళ్లు భవిష్యత్తులో ఎలా మారుతారో? అని కొందరు హిందువుల్లో సందేహాలు, భయాలు కలుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల వల్ల ...సాయిని పూజించాలనుకుంటే,
దేవాలయాల్లోసాయివిగ్రహం పెట్టకుండా సాయికి విడిగా మందిరం కట్టి పూజించవచ్చు అని, సాయిమందిరాల్లో హిందూ దేవతలను పెట్టకుండా పూజించవచ్చు అని, సాయిరాం, సాయి కృష్ణ.... ఇలా హిందుపేర్లతో కలపకుండా పూజించవచ్చు.. అని, కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయాల్లో దైవము దారి చూపిస్తే బాగుణ్ణు.
.............................
సాయిబాబా
ఇతర మతాల దేవతలను పూజించారు కాబట్టి, హిందూ దేవాలయాల్లో సాయిబాబా
విగ్రహాలు పెట్టి పూజిస్తే, భవిష్యత్తులో ఇతరమతాల వారివల్ల ఎలాంటి పరిస్థితి
వస్తుందో..అని కొన్ని సందేహాలున్నాయి.
..........................................
షిర్డి సాయి ఇతరమత దేవతలను కూడా ఆరాధించారు. అలాగని హిందువులైన సాయి భక్తులు ఇతరమత దేవతలను ఆరాధించరు కదా..
....................................
ఇతరమతాల వాళ్లు వారి మతం పట్ల గట్టిగా ఉంటారు. హిందువులు మాత్రం అన్ని మతాలు ఒకటే అని తేలికగా తీసుకుని, మతాన్ని మారితే హిందువుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదముంది.
.........................................
హిందువులకు ఎందరో దేవతలుండగా, హిందువుల్లోనే కొందరు బ్రాహ్మణులు కూడా కొత్త వారిని పూజించమని ఎందుకు చెబుతున్నారో? తెలియటం లేదు.
వారి పద్ధతులు సులభంగా ఉండి, ప్రజలు వారివైపు
అకర్షితులయ్యి కొన్నిసంవత్సరాలు గడిచాక, వారు ఇతరమతాల దేవతలను కూడా ఆరాధించారు కాబట్టి, హిందువులు ఇతరమతాల్లోకి వెళ్తారేమోనని భయపడి, వారి పూజలను మానేయమంటారు. ఈ భయాలను కూడా తప్పు పట్టలేము.
కొత్త వారిని పూజించమని చెప్పటం, అందుకు అలవాటుపడి కొన్నిసంవత్సరాల తరువాత మానేయమనటం ...ఇదంతా ప్రజలకు అయోమయంగా ఉంటుంది.

ఇక మీదటయినా ఎవరూ కొత్త వారిని తేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా కొత్తవారిని ప్రచారం చేయబోతే గట్టిగా ముందే అడ్డుకోవటం మంచిది.
ఆ మధ్య ఒకటోపి అమ్మను దైవస్వరూపంగా భావించి కొందరు ప్రచారం చేసారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎక్కడకు దారితీస్తాయో..అని కొందరు గట్టిగా ఈ విషయం గురించి మాట్లాడారు. పరిస్థితి ప్రస్తుతానికి సద్దుమణిగింది. తెలుగువాళ్లకు ఇంకో కొత్త వారిని కొలుచుకునే పని తగ్గింది.
నేను వాళ్లను తప్పుగా అనటం లేదు. వారు గొప్ప అవధూతలు, మహిమలు కలవాళ్లే కావ చ్చు.

హిందువులకు అనేక దేవతలుండగా, దేవతా స్వరూపాలంటూ
కొత్తవారిని పూజించటం కన్నా, మనం ఎప్పుడూ పూజించే దైవాన్నే పూజించవచ్చు కదా.
కొత్తగా అనేకమంది దేవతలను ప్రచారం చేస్తే హిందువులు అనేకశాఖలుగా చీలే ప్రమాదముంది.
టోపి అమ్మ తిని పడేసిన వాటిని తింటే కష్టాలు, కోరికలు తగ్గుతాయని కొందరు ఆమె తిన్నవి తింటున్నారట. హిందువులకు తాము నమ్మే దైవము పట్ల నమ్మకం లేదా?
టోపి అమ్మ తిని పడేసిన వాటిని తింటే కష్టాలు, కోరికలు తగ్గుతాయని కొందరు ఆమె తిన్నవి తింటున్నారట. హిందువులకు తాము నమ్మే దైవము పట్ల నమ్మకం లేదా?
తాము పూజించే దైవప్రసాదాన్ని స్వీకరిస్తే తమ కష్టాలుపోతాయని, కోరికలు తీరుతాయని నమ్మాలి కదా.
...................................
జీవితంలో కొన్నిసార్లు గురువునైనా, పెద్దవారినైనా.. కొన్నిసందేహాలు అడగాలనిపిస్తుంది. నాకు కొన్ని సందేహాలు కలిగాయి..
ఏ మతం వారికి ఆ మతాన్ని నమ్మి ఆచరించే గురువు ఉంటారు. అయితే, తాము నమ్మిన గురువు ఒక మతాన్ని కాకుండా, కొన్ని మతాలను నమ్మే వారైతే ఆ శిష్యులు ఏం చేయాలి?
ఎవరి మతాన్ని వారు నమ్మి ఆచరించాలి. ఇతరమతాల పట్ల గౌరవంతో ఉండాలి.. కానీ, ఇతరమతస్తులు తమపట్ల గౌరవంతో ఉండకపోతే ఏం చేయాలి?
ఎవరి మతాన్ని వారు నమ్మి ఆచరించాలి. ఇతరమతాల పట్ల గౌరవంతో ఉండాలి.. కానీ, ఇతరమతస్తులు తమపట్ల గౌరవంతో ఉండకపోతే ఏం చేయాలి?
ఉదా..హిందువుల్లో చాలామంది పరమతసహనంతో ఉంటారు. కానీ, చాలామంది ఇతరమతస్తులు తమ మతం మాత్రమే గొప్పదని, ఇతరమతాల వాళ్ళను మతమార్పిడి చేయడానికి ప్రయత్నిస్తారు.
భారతదేశం విభజన కూడా జరిగింది. ఆ సమయంలో ఎందరో మరణించారు.
భారతదేశం విభజన కూడా జరిగింది. ఆ సమయంలో ఎందరో మరణించారు.
...........................................
భారతదేశంలో ఎప్పటినుంచో హిందువులను నయానాభయానా మతం మార్చటానికి ఇతరమతాలవారు కొందరు ప్రయత్నిస్తున్నారు. హిందువులు కూడా చాలామంది మతాన్ని మారారు. ఇలాంటిపరిస్థితిలో హిందువులు తమ ఉనికిని గట్టిగా కాపాడుకోవాలా? లేక తమ గురువు ఇతరమతాలను కూడా నమ్మారు కాబట్టి, అన్ని మతాలు సమానమే, మనం నింపాదిగా ఊరుకుందాం..అని హిందువులు గమ్మున ఉండాలా?
మరి, ఇతరమతాల వాళ్లు మతమార్పిడులకు ప్రయత్నించరని, హిందువులు మైనారిటీగా మారరని, హిందువులకు హాని జరగదని ఎవరైనా హామీ ఇస్తారా?
భారతదేశంలో ఇతరమతాలవారికి కూడా ఎన్నో భూములున్నాయట. ఇతరమతం వాళ్లు కొందరు
కొన్ని కారణాలు చెప్పి, దేవాలయాన్ని కూడా తమదే అంటున్నట్లు వార్తల ద్వారా
తెలుస్తోంది.
...................................భవిష్యత్తులో ఏం జరుగుతుందో? ఇలాంటి పరిస్థితిలో అనేక సందేహాలు కలిగి అయోమయంగా ఉంటుంది. దైవమే దిక్కు.
.......................
.......................
oka link.. ఓం. హిందువులు.. మరి కొన్ని విషయాలు..
..................................
తరతరాలుగా హిందుదేవతలను ఆరాధించిన ఎందరో హిందువులకు ఆ దేవతలు తమను ఆదుకున్న అనుభవాలు ఉంటాయి. షిర్డిసాయిని ఆరాధించినవారికి కూడా సాయి తమను ఆదుకున్న అనుభవాలు ఉంటాయి. నా విషయంలో కూడా హిందుదేవతలు నన్ను ఆదుకున్న భక్తి అనుభవాలున్నాయి. షిర్డి సాయి నన్ను ఆదుకున్న భక్తి అనుభవాలున్నాయి.
అయితే, ఈ మధ్యకాలంలో కొందరు సాయిభక్తుల ప్రవర్తన గమనించాక అయోమయం ఏర్పడింది. ఎవరికైనా, తమ మతానికి హానిజరగకూడదని ఉంటుంది కదా..
అయితే, ఈ మధ్యకాలంలో కొందరు సాయిభక్తుల ప్రవర్తన గమనించాక అయోమయం ఏర్పడింది. ఎవరికైనా, తమ మతానికి హానిజరగకూడదని ఉంటుంది కదా..
........................................
షిర్డిసాయిబాబా, అంటే నాకు భక్తి ఉంది. అయితే, కొంతకాలం క్రిందట కొందరు హిందువులు అయిన సాయి భక్తులు, ఇతరమత దేవతల పేరుతో పాటలు పాడటం గమనించాక, వీళ్లు భవిష్యత్తులో ఎలా మారుతారో? అని సందేహాలు కలిగాయి.
మరి కొందరు సాయిభక్తులు మాకు అంతా సాయే , సాయిలోనే అందరు దేవతలను పూజిస్తామని అన్నట్లు మాట్లాడటం విన్నాక, ఇలా ఆలోచించే వాళ్లు భవిష్యత్తులో ఇతరహిందు దేవతలను పూజిస్తారా? పూజించరా? అని సందేహాలు కలిగాయి.
కొత్తవారి దగ్గరకు వెళ్ళకుండా, ఇంతకుముందు మనప్రాచీనులు పూజించినవారినే పూజించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనిపిస్తుంది.
హిందువులకు
దేవతలు ఎక్కువే ఉన్నారు. పూజలూ ఎక్కువే ఉన్నాయి. ఇకమీదటయినా కొత్తగా
దేవతలను పెంచుతూ పోవటం కాకుండా, ఉన్నదేవతలనే సరిగ్గా ఆరాధించుకుంటే మంచిదనిపిస్తుంది. ఆచారవ్యవహారాలు క్లిష్టంగా కాకుండా, సులభంగా చేసుకోవచ్చు.
.....................................
షిర్డిసాయివారు
తమ వద్దకు వచ్చిన వివిధ మతాలవారిని ఆదరించారు. ఎవరి మతం ప్రకారం వారికి
చెప్పేవారు. సాయిబాబా హిందు పద్ధతులను కొన్నింటిని మరియు ఇతర మతాల పద్ధతులను కొన్నింటిని పాటించారని తెలుస్తోంది.
నేను కొన్ని విషయాల ద్వారా తెలుసుకున్నంతలో.... ఒక సంఘటనలో ఒక
హిందు భక్తుడు మతం మారటం విషయం గురించి తెలిసినప్పుడు, నీ తండ్రిని
మార్చుకుంటావా..అని బాబా అతనిని కోప్పడ్దారని తెలుస్తోంది.
.......................................
నాకు తెలిసినంతలో, శిరిడి సాయి బాబా వారి జీవితచరిత్రము పుస్తకములో, ఒక దగ్గర సాయి
స్వయముగా ఎన్నో విషయములను తెలియజేసిన సందర్భములో
ఇలా కూడా అన్నారు.. సాయిసాయి
.. యను నామమును జ్ఞప్తి యందుంచుకున్న మాత్రమునే
మంచి జరుగుతుందని తెలియజేసారు.
...............................
కొందరు సాయిభక్తులు ఎలా అంటున్నారంటే, దైవాన్ని రకరకాల దేవతలుగా కాకుండా
ఒక్కరిగానే పూజించాలని భావించి తాము, అందరు దేవతలను సాయిలోనే పూజిస్తున్నామని
అంటున్నారు.
ఒక్కరిగానే పూజించాలనుకుంటే, సాయిసాయి అని అనుకోవచ్చు కదా.. మళ్లి సాయిరాం, సాయి కృష్ణ..అని ఇంకా దేవతలపేర్లు కలపటం ఎందుకు? ఒకే దైవముగా ఆరాధిస్తామంటూ, ఇంకో పేరును కలుపుతున్నారు కదా?
ఒక్కరిగానే పూజించాలనుకుంటే, సాయిసాయి అని అనుకోవచ్చు కదా.. మళ్లి సాయిరాం, సాయి కృష్ణ..అని ఇంకా దేవతలపేర్లు కలపటం ఎందుకు? ఒకే దైవముగా ఆరాధిస్తామంటూ, ఇంకో పేరును కలుపుతున్నారు కదా?
...........................................
వ్రాసినవాటిలో ఏమైనా తప్పులు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
వ్రాసినవాటిలో ఏమైనా తప్పులు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
This comment has been removed by the author.
ReplyDelete