koodali

Monday, May 9, 2016

అక్షయ తృతీయ...మరియు..

అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని  చేస్తారు. 
.....................

అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు .

 అక్షయ తృతీయ సందర్భంగా.. మంచినీరు, గొడుగు, విసనకర్ర ...వంటివి   ఇతరులకు  దానం చేస్తే మంచిదని పెద్దలు  తెలియజేసారు. 

 దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి  జరుగుతుందని,   ఆహారం,   గృహం …వంటివి   కొరత లేకుండా లభిస్తాయని అంటారు. 
................

 అయితే  ఈ రోజుల్లో, దానం చేసే ఆచారం  తగ్గిపోయి, ఎవరికి వారు  బంగారం కొనుక్కోవటం అనే ఆచారం మాత్రమే బాగా ప్రచారంలోకి వచ్చింది. 
..........

 అక్షయతృతీయ  పండుగ  వేసవిలో  వస్తుంది.  అప్పుడు  మంచినీరు, గొడుగు, విసనకర్ర    వంటివి  దానం  చేయటం  వల్ల  ఎందరికో ఉపయోగం  కలుగుతుంది. 


పూర్వీకులు  సమాజంలో  అందరికీ  ఉపయోగపడేవిధంగా  ఎన్నో  చక్కటి  ఆచారాలను ఏర్పాటుచేసారు. 


అయితే  కాలక్రమేణా  కొన్ని  ఆచారాలు  మార్పులుచేర్పులను  సంతరించుకుని  పూర్వీకుల  అసలు  ఉద్దేశ్యాన్ని  మరుగునపరచే  విధంగా  తయారవుతున్నాయి.
..............

ఈ రోజున బంగారం  కొనుక్కోవటం  మంచిదని  కూడా  పెద్దలు తెలియజేశారు. దానితో పాటూ దానం చేస్తే మంచిదని  కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు  ఇతరులకు  దానం  చేయవలసిన  విషయాలను  వదిలేసి , అక్షయతృతీయ  అంటే  బంగారం  కొనుక్కోవటమే ..అన్నట్లుగా  జరిగిపోతోంది.
 ............. 

 అంతా బాగుండాలి. అంతా దైవం దయ.

.................

నేను ఈ మాత్రం బ్లాగ్ వ్రాస్తున్నానంటే అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు.

*********

 మరి కొన్ని విషయాలు ఏమిటంటే,

అపార్ట్మెంట్ క్రింద కార్ పార్కింగ్ .. స్థలంలో చండీయాగం లేక ఏదైనా యాగం చేయటాన్ని గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, 

పైన ఇళ్ళలో  బాత్రూస్, బెడ్రూంస్ ఉంటాయి కదా! మరి,  పైన ఇండ్లలో మనుషులు నడుస్తున్నప్పుడు క్రింద యాగాలు చేయవచ్చా? అనే సందేహాలు కలిగాయి.

(ఈ టపా వ్రాసిన కొన్నాళ్ళకు ఈ విషయం చేర్చటం జరిగింది.) 



No comments:

Post a Comment