ఈ మధ్య ఒక వార్త వచ్చింది. పచ్చటి నగరమైన బెంగళూరులో పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో మృత నగరం అయిపోతుందట.
అంటే ప్రజలు నివసించటానికి వీలులేకుండా అయిపోతుందట. విచ్చలవిడిగా నగర జనాభా పెరగటం వల్ల అక్కడ చాలా కాలుష్యం పెరిగి ఉందంటున్నారు.
పచ్చటి బెంగళూరు పరిస్థితే అలాగ ఉంటే ఇక మిగిలిన నగరాల సంగతి ఏమిటో ?
ఎంతో అభివృద్ధి జరిగిందంటున్న చైనాలో కూడా కాలుష్యం బాగా పెరిగిందట.
మనవాళ్లు అక్కడకు వెళ్ళివచ్చి అబ్బో అక్కడి అభివృద్ధే అభివృద్ధి.. అని మెచ్చుకుంటారు. అక్కడ పెరిగిన కాలుష్యం గురించి పట్టించుకోరు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెరిగిన కాలుష్యం వల్ల చాలామంది ప్రజలకు రోగాలు బాగా పెరిగాయి.
ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యం లేకపోయాక ఎన్ని వసతులు ఉన్నా ఏం లాభం.
పట్టణీకరణ అంతా ఒక దగ్గరే కాకుండా వివిధ నగరాలలో అభివృద్ధి జరగాలి.
పర్యావరణహితంగా అభివృద్ధి ఉండాలి. అప్పుడు కాలుష్యం పెరగకుండా ఉంటుంది.
ఊర్లు మృతనగరాలు కాకుండా అమృతనగరాలు అవుతాయి.
No comments:
Post a Comment