ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం మరియు కొన్ని నిర్మాణాలు మొదలవుతాయంటున్నారు.
అమరావతి అందంగా , ఆహ్లాదంగా రూపుదిద్దుకుంటుందని ఆశిద్దాము.
బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం,
వానప్రస్తం, సన్యాసాశ్రమం..గురించి ప్రాచీనులు తెలియజేసారు. సన్యాసాశ్రమంలో
అడవులకు వెళ్ళలేకపోయినా, ఇంట్లో ఉండి కూడా లౌకికవిషయాల పట్ల ధ్యాసను
తగ్గించుకుని, మనస్సును ఎక్కువగా దైవస్మరణతో గడపవచ్చు.
సమాజం
సజావుగా సాగాలంటే అనేక వృత్తులు అవసరం. ప్రాచీనులు అనేక వృత్తుల గురించి
తెలియజేసారు. అలాంటి వ్యవస్థను ఏర్పరిచారు. కొన్ని వృత్తులవారు అనేక నియమాలను పాటిస్తూ.. ..బోలెడుసమయం
కూర్చుని పూజలు చేయాలంటే చేయలేరు. ఇవన్నీ ఆలోచించి, సమాజక్షేమం కొరకు
ఎక్కువసేపు పూజలు చేయడానికి కొందరు ఉండాలని భావించి, అలాంటి పద్ధతిని కూడా
ఏర్పరిచారు.
సమాజంలో
లౌకికమైన విషయాలను ఎవరూ పట్టించుకోకుండా ఉంటే ఎలా.. శత్రువులను
ఎదుర్కోవాలి ....కుటుంబనిర్వహణకు అవసరమైన వస్తువులను తయారుచేయాలి
.....వ్యవసాయం, వ్యాపారం, చేతిపనిముట్లు....ఇవన్నీ చేయాలి కదా..
ఇవన్నీ ఆలోచించి ప్రాచీనులు ఎన్నో వృత్తుల గురించి తెలియజేసారు. ఎవరు చేసే పనిని వారు చక్కగా చేయాలని తెలియజేసారు.
ఉదయం కొంతసేపు పూజ చేసుకుని, తరువాత ఎవరి పనిని వారు చక్కగా చేస్తే అది కూడా పూజయే.. అని తెలియజేసారు. అప్పుడప్పుడు పండుగలు , కొన్ని ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు అందరూ చేసుకోవచ్చు.
************************
వేదాలు ఎంతో గొప్పవి. అలాంటి వేదాలను కూడా కొందరు రాక్షసులు ఎత్తుకుపోతే.. దైవం రాక్షసులను వధించి, వేదాలను తిరిగితీసుకువచ్చినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది. వేదాలు ఒక పద్ధతి ప్రకారం ఉంటాయని, ఎవరూ మార్చడానికి వీలు ఉండదని ..తెలిసినవారు చెబుతున్నారు.
గ్రంధాలు మాత్రం ఎవరైనా మార్పులుచేర్పులు చేసే అవకాశం ఉందని.. తెలిసినవారు చెబుతున్నారు. ప్రాచీనకాలం నుంచి కొందరు
స్వార్ధపరులు, కొందరు తెలిసితెలియనివాళ్లు, కొందరు అతి భయస్తులు..
గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు చేసి ఉంటారు.
అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలో అర్ధం కానప్పుడు దైవాన్ని ప్రార్ధించుకోవాలి.
************
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
...........
oka link
* ఓం ..నిష్కామ కర్మ యోగం అద్భుతమైన మార్గం..