మంగళవారం, శుక్ర వారం గోళ్లు కత్తిరించ కూడదంటారు.
అయితే నా విషయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే , గోళ్ళు పెరిగాయని, కత్తిరించుకోవాలని కొన్నిసార్లు అదేంటో సరిగ్గా మంగళవారం, శుక్రవారమే గుర్తు వస్తుంది.
గోళ్ళు పెరిగాయని గుర్తువచ్చాక చిరాగ్గా అనిపిస్తుంది.
పెరిగిన గోళ్ళలో మురికి ఉంటుంది కాబట్టి , ఆ మురికి చేతులతో వంట చేసి దైవానికి నివేదించాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. గోళ్ళు కత్తిరించేస్తాను.
మరీ ముఖ్యమైన పండుగల రోజులలో అయితే కత్తిరించను కానీ, మామూలుగా మంగళవారం, శుక్రవారం అని తెలిసినా చేసేదేమీ లేక కత్తిరించేస్తాను.
నా అభిప్రాయం ఏమిటంటే, మంగళ, శుక్ర వారాల్లో గోళ్లు కత్తిరిస్తే వచ్చే పాపం కంటే... మురికి చేతులతో వంట చేయటం వల్ల వచ్చే పాపం ఎక్కువ ..అనిపిస్తుంది. అందువల్ల అలా చేస్తాను.
పండుగ రోజు అయినా గోళ్ళు కత్తిరించాలని అనిపిస్తుంది కానీ, అలా చేయటం మరింత ఎక్కువ పాపమేమో ? అని భయం వేసి ఊరుకుంటాను.
చేసేదేమీ లేక అప్పటికి గోళ్ళను నీటితో కడిగి , పండుగ తరువాత రోజు కత్తిరిస్తాను.

ఇదంతా కాకుండా, వారంలో ఒక రోజు తప్పనిసరిగా గోళ్లు కత్తిరింపు ప్రోగ్రాం పెట్టుకుంటే సరిపోతుంది.
***********
కొన్ని ఆచారాలు పాటించటం కష్టంగా ఉంటుంది.
ఉదా..నెలసరి సమయంలో ఉన్న స్త్రీలు.. పూజలు చేసే వద్దకు కూడా వెళ్లకూడదంటారు. ఇలాంటివి పాటించటం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది.
ఉదా.. దగ్గరి బంధువుల ఇళ్ళలో వివాహం, గృహప్రవేశం..వంటి వాటికి వెళ్ళాలంటే ఏం చేయాలో అర్ధం కాదు.
అలాగని అతి దగ్గర బంధువుల శుభకార్యాలకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి.
వెళ్తే పూజా కార్యక్రమానికి దూరంగా ఉండాలనే ఆంక్షలుంటాయి.
శుభకార్యానికి వెళ్ళి అందరికీ దూరంగా కూర్చోవటం వల్ల చుటుపక్కల వాళ్ళు వింతగా చూసే అవకాశముంది.
దూరంగా ఉంటే , ఎందుకు దూరంగా ఉన్నావని అడుగుతారు, విషయం అందరితో చెప్పవలసి ఉంటుంది. ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది.
అలాగని దగ్గరి బంధువుల వివాహాలకు వెళ్ళకుండా ఉండటమూ ఇబ్బందే.
ఫంక్షన్లకు వెళ్ళకుండా ఉంటే, ఫంక్షన్ కు రాలేదని కొందరు బంధువులు నిందిస్తారు.
నిందిస్తారేమోనని మైల రోజులలో శుభకార్యానికి వెళ్తే ,తరువాత వాళ్ళింట్లో ఏమైనా కష్టాలు వస్తే, మైల ఉన్న వాళ్ళు శుభకార్యానికి రావటం వల్లే కష్టాలు వచ్చాయని నిందించే వారూ ఉంటారు.
అలాగని నెలసరి వాయిదా వేసే మందులు ఎక్కువసార్లు వేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
...............
దూరపు బంధువులు మరణించిన సమయంలో కూడా మైల వల్ల శుభకార్యాలకు వెళ్ళకూడదనే ఆంక్షల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
..........
కొన్ని సార్లు ఇవన్నీ పాటించే విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి.
***************
పెద్దలు మనకు ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను తెలియజేశారు.
అయితే పెద్దలు తెలియజేసిన ఆచారవ్యవహారాలలోని అసలు అంతరార్ధాలను సరిగ్గా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.
ప్రాచీనులైన వారు తెలియజేసిన విషయాలు కొన్నైతే, మధ్యలో వచ్చిచేరినవి కొన్ని.

ఏవి పెద్దలు చెప్పినవో? ఏవి మార్పులుచేర్పులతో మధ్యలో వచ్చిచేరినవో ? తెలియటం లేదు.
No comments:
Post a Comment