మా ఇంటి ప్రక్క దేవాలయం నుంచి మైక్ లో దైవానికి సంబంధించిన పాటలు, స్తోత్రాలు వేస్తుంటారు.
మైక్ సౌండ్ మామూలు రోజులలో మరీ పెద్దగా పెట్టరు. కొన్ని పండుగ రోజుల్లో మాత్రం పెద్ద సౌండ్ పెడతారు.
ఈ మధ్య ఒకరోజు సడన్ గా కొద్దిసేపు సౌండ్ పెద్దగా వినిపించింది. అప్పుడు నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను.
పుస్తకంలో చూడకుండా పఠించడానికి ప్రయత్నిస్తున్నాను.
దేవాలయం నుంచి పాటలు వినిపించేసరికి నాకు ధ్యాస తగ్గి, నేను పఠించే వాటిలో తప్పులు వస్తున్నట్లు అనిపించింది.
ఎంత ప్రయత్నించినా సరిగ్గా పఠించడానికి కుదరటం లేదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది.
నేను పూజ చేసేటప్పుడు అలవాటుగా దైవస్తోత్రాలు చదువుతున్నా కూడా ...మనస్సులో అప్పుడప్పుడు వేరే విషయాల గురించి ఆలోచనలు వస్తుంటాయి.
అంటే నోటితో దైవస్తోత్రాలు చదువుతుంటే..మనస్సు దాని ఇష్టానికి అది వేరే ఆలోచనలు చేస్తుంది.
అంటే ఒకేసారి రెండు పనులు జరుగుతుంటాయి. ఈ విషయం గుర్తు వచ్చింది.
దేవాలయం నుంచి వచ్చే శబ్దాలు వినిపిస్తున్నా కూడా, మనస్సును నేను పఠించే విషయంపై పెట్టడానికి ప్రయత్నించవచ్చు కదా! అనిపించి అలా ప్రయత్నించాను.
కొంత వరకు బాగానే పఠించగలిగాను. అంతా దైవం దయ.
ఇంకో విషయం ఏమిటంటే, దైవస్తోత్రాలు చదువుతున్నా కూడా ...మనస్సులో వేరే విషయాల గురించి ఆలోచనలు చేయగలుగుతున్నప్పుడు....
.లౌకికజీవితంలో పనులు చేసుకుంటూనే ...మనస్సుతో దైవారాధన చేయవచ్చు కదా ! అని కూడా అనిపిస్తుంది. .అయితే, ఇలా చేయడం చాలా కష్టం.
మన మనస్సు అని మనం చెప్పుకోవడమే కానీ , మన మనస్సును మనం నియంత్రించటం చాలా కష్టం.
మన మనస్సు మన మాట వినాలన్నా దైవాన్ని ప్రార్ధించవలసిందే.

ReplyDeleteమైక్లో వినిపించే కొన్ని తప్పుగా పఠిస్తున్నట్లు కూడా నేను గమనించాను.
మైకులో అందరికీ వినిపించే వాటిలో తప్పులు వస్తే విన్నవాళ్లలో కొందరు అలా తప్పుగా పఠించడాన్ని నేర్చుకునే అవకాశం ఉంది.