koodali

Thursday, December 7, 2017

ఏది తప్పో ? ఏది ఒప్పో ?



కొందరు ఏం చేస్తారంటే, ఏదో అశుభ్రత అంటుకుందని పదేపదే స్నానాలు చేస్తారు.

 అలా పదేపదే స్నానాల వల్ల నీళ్లు వేస్ట్ అయిపోతాయి. పొదుపుగా వాడవలసిన నీటిని వృధా చేయటమూ పాపమేకదా!


 అశుచి అనుకుంటే పదేపదే స్నానాల బదులుగా  కాసిన్ని పసుపునీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది. ఇదీ పెద్దలు చెప్పిన విధానమే కదా! 


*************
మరికొందరు ఎన్నో సందేహాలతో సతమతమవుతుంటారు.  ఉదా.. పూజ కోసం  దీపాన్ని ఏ దిక్కుగా వెలిగించాలి ? వంటి సందేహాలు.

దైవం ఏ దిక్కునైనా ఉంటారు. ఏ దిక్కుగా దీపాన్ని వెలిగించినా తప్పులేదు.


*************

మనవల్ల ఎవరికీ అన్యాయం జరిగితే తప్పు కానీ ...అలా కానప్పుడు  ప్రతి విషయానికి ఎక్కువ  సందేహాలు అవసరం లేదు.


. ఎవరి శక్తిని బట్టి , వీలునుబట్టి వారు పూజ చేసుకోవటం మంచిదని నాకు అనిపించింది. 


 ఏది చేస్తే తప్పో? ఏది ఒప్పో ? అనుకుంటూ ఎన్నో సందేహాలతో సతమతమవటం కంటే , వీలుకుదిరినంతలో దైవంపై ధ్యాస ఉంచి పూజ చేసుకోవటం మంచిది. 

...........
 
కొందరు కలల గురించి భయపడుతుంటారు.  
 
కొన్నిసార్లు పుస్తకాలలో చదివినవి, ఎక్కడైనా విన్నవి విషయాల గురించి  మనము మర్చిపోయినా, మనస్సు లోతులో గుర్తుండి అవి  కలలుగా వచ్చే అవకాశముంది.

 అయితే, ఆశ్చర్యంగా కొన్నిసార్లు మనము ఎప్పుడూ ఆలోచించని విషయాలు కూడా కలల్లో వచ్చి, అవి భవిష్యత్తులో జరగటం కూడా కొందరికి అనుభవంలో ఉంటుంది. అలా ఎలా జరుగుతుందో తెలియదు.
 
 కొన్నిసార్లు భ్రమలను నిజమని నమ్ముతారు కొందరు. అది భ్రమా? నిజమా? అని తెలుసుకోవాలి. 
 

No comments:

Post a Comment