ఈ రోజు తిరువణ్ణామలై దీపోత్సవం .
రేపు .. దత్త జయంతి .. పూర్ణిమ....
..........................
ఈ క్రింద వ్రాసిన విషయాలను ఈ పోస్ట్ వేసిన కొంతకాలానికి వ్రాసి, ఇక్కడ ప్రచురించటం జరిగిందండి.
marikonni vishaya.mulu...
హిందువుల్లో కొందరు ఏం చెపుతారంటే, మీ కష్టాలు, కోరికలు తీరాలంటే, పశుపక్ష్యాదులను
బలి ఇచ్చి పూజలు చేయాలంటారు. తమ కోరికలు, కష్టాలు తీరాలని ఇతర జీవులను బలి ఇచ్చి చంపే వాళ్ళను, వాటిపట్ల క్రూరంగా
ప్రవర్తించేవాళ్లని ఏమనాలి?
ఇలాంటివి చేస్తే తాత్కాలికంగా ఎవరికైనా కొన్ని కష్టాలు, కోరికలు తీరినట్లు అనిపించినా , ఇతరజీవులను చంపిన పాపానికి మరల కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కర్మ ఎక్కడికి పోదుకదా..
కష్టాలు, కోరికలు తీరాలంటే, దైవస్మరణ చేయటం, ఇతర జీవులకు సాయం చేయటం.. వంటి మంచి పనులు చేస్తే మంచిది.

............................
.దైవానికి
జీవులను చంపి బలి ఇస్తే , బలి అయిన మూగజీవులు ఉత్తమ జన్మను పొందుతాయని,
మోక్షాన్ని పొందుతాయని కూడా కొందరు చెపుతున్నారు. అవన్నీ విని, బలి అయితే,
మనుషులు కూడా ఉత్తమజన్మను, మోక్షాన్ని పొందుతారేమోనని భావించి, ఎవరైనా అలా
తాము బలి అవ్వాలని, ఇతరులను బలి ఇవ్వాలని.. ప్రయత్నిస్తే? అందువల్ల, దయచేసి
ఇలాంటివి చెప్పవద్దు.
మనుషులు పాపాలు చేయకుండా, ధర్మంగా జీవిస్తే దైవానికి ఇష్టం. మరి, అలా ఉండటానికి ప్రయత్నించాలి కాని, తమ కోరికలు తీరటానికి, మూగజీవులను దైవానికి బలి ఇవ్వాలని, తమ స్వార్ధానికి దైవము పేరు వాడటం ఏమిటో?
మనుషులు పాపాలు చేయకుండా, ధర్మంగా జీవిస్తే దైవానికి ఇష్టం. మరి, అలా ఉండటానికి ప్రయత్నించాలి కాని, తమ కోరికలు తీరటానికి, మూగజీవులను దైవానికి బలి ఇవ్వాలని, తమ స్వార్ధానికి దైవము పేరు వాడటం ఏమిటో?
మనుషులు తమ కోరికలు తీరటం కొరకు మూగజీవులను బలి ఇచ్చి, వాటికి పుణ్యం వస్తుందని చెప్పటం ఏమిటో?
దైవానికి,
పశుపక్ష్యాదులు.. మనుషులనే తేడా ఉండదు. అన్ని జీవులు దైవసృష్టిలోని వారే
కదా..
తమ కోరికలు
తీరటానికి పశుపక్ష్యాదులను బలిచ్చే వాళ్లను కూడా, వారు చేసిన జీవహింసకు ఫలితంగా , ఈ జన్మలో కష్టాలు, మరుజన్మలో పశుపక్ష్యాదులుగా పుట్టి చంపబడటం.. పరిస్థితి ఉంటుందేమో?
.................................
.................................
ఇంత సృష్టి చేసిన దైవానికి ఏది ఎలా చేయాలో అంతా తెలుస్తుంది.
..................................
మూగజీవులు
మనుషులకు ఎదురుచెప్పలేవని, వాటిని చంపుతున్నారు.
..............................
ప్రపంచంలోని చెడు...పోవాలి..
...........................
సమాజంలో పాపాలు చేస్తూ రాక్షసప్రవృత్తితో జీవులను బాధలు పెట్టేవారిని దైవము తమ శక్తులతో సంహరిస్తారు.
.....................
జీవులను బాధపెట్టిన నరకాసురుడు, రావణాసురుడు.. దైవము చేత సంహరించబడ్దారు. పశుపక్ష్యాదులను వాటి మానాన వాటిని బతకనివ్వండి.
పశుపక్ష్యాదుల మరుజన్మ గురించి, మోక్షం గురించి ఇంత సృష్టి చేసిన దైవము చూసుకుంటారు. సృష్టిలో
అన్ని జీవుల యొక్క జన్మలు, మోక్షం గురించి దైవము చూసుకుంటారు.
అయితే,
మనుషులు తమకు కష్టాలు వచ్చినప్పుడు, కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తారు. పశుపక్ష్యాదులకు కష్టం
వస్తే తమను కాపాడమని దైవాన్ని ప్రార్ధించే జ్ఞానం వాటికి ఉంటుందో? ఉండదో?
పశుపక్ష్యాదులపై నిజంగా దయ ఉంటే, వాటిని బలివ్వటం కాకుండా , మూగజీవులకు కూడా కష్టాలు వచ్చినప్పుడు కాపాడమని, మనుషులు దైవాన్ని ప్రార్ధించాలి. మంచి పనులు చేస్తే, మనుషులకు కూడా మంచి జరుగుతుంది.
.............................
మూగజీవులైన
పశుపక్ష్యాదులను చంపితే తప్పులేదన్నట్లు అనుకునేవారు , తమకు ఏదైనా
అనారోగ్యం వచ్చి చావుబతుకుల సమస్య వస్తే, చచ్చిపోయినా ఫరవాలేదు, ఉత్తమజన్మ
వస్తుందని, మోక్షం వస్తుందని ఊరుకుంటారా? మందులు వాడరా? కాపాడమని దైవాన్ని
ప్రార్ధించరా?
మనుషులు తమకు చిన్న దెబ్బ తగిలినా కూడా, కాపాడమని దైవాన్ని
ప్రార్ధిస్తారు కదా.
..................................
..................................
మొక్కలకు
ప్రాణం ఉంటుంది కాబట్టి, మొక్కలను తిన్నట్లే జంతువులను చంపి తింటే
తప్పేమిటని... అతి తెలివిగా మాట్లాడుతున్నారు కొందరు. మనుషులను కూడా
తినొచ్చని అంటారేమో కూడా?
మొక్కలు, పశుపక్ష్యాదులు, మనుషులు..అన్నింటికి ప్రాణం ఉంటుంది. అన్నింటిని తినరు కదా... మొక్కలను, జంతువులను పోల్చటం కూడా ఏమిటో? మొక్కలకు, పశుపక్ష్యాదులకు వాటి శారీరిక, మానసిక వ్యవస్థ వేరుగా ఉంటుంది కదా..
మొక్కలకు, జంతువులకు నొప్పి విషయంలో తేడాలుంటాయని అంటారు...ఈ విషయాల గురించి ఇంకా పూర్తి అవగాహన లేదు కాని, జంతువులు, మనుషుల్లా..మొక్కల శరీరం ఉండదు.

మొక్కలనయినా (శాకాహారం అయినా) మనకు ఎంత అవసరమో అంతవరకే తినాలి. అతిగా తింటే అనారోగ్యం కలిగే పరిస్థితి రావచ్చు.
.............................
.............................
మనుషులు మాంసాహారాన్ని తినకపోయినా చక్కగా జీవించగలరు.
మనుషులకు దైవము ఎన్నో తెలివితేటలను ఇచ్చారు. మనుషులు పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల ఇప్పటికే కొన్ని జీవులు అంతరించిపోయాయట. మనిషి తమ తెలివిని మంచికి ఉపయోగించాలి.
..............................
మనుషులకు దైవము ఎన్నో తెలివితేటలను ఇచ్చారు. మనుషులు పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల ఇప్పటికే కొన్ని జీవులు అంతరించిపోయాయట. మనిషి తమ తెలివిని మంచికి ఉపయోగించాలి.
..............................
ఆశ్చర్యం
ఏమిటంటే, రోజూ కబేళాల్లో వేలు, లక్షలుగా పశుపక్ష్యాదులను చంపి
తింటున్నారు. అలాంటి వాళ్లు కూడా దేవాలయాల్లో బలుల గురించి మాట్లాడుతారు.
అలా మాట్లాడేవాళ్లు ముందు తాము పశుపక్ష్యాదులను చంపి తినటం మానాలి.
కబేళాలో పశుపక్ష్యాదులను చంపి తిన్నందుకు ఈ జన్మలో కష్టాలు, మరుజన్మలో పశుపక్ష్యాదులుగా పుట్టి చంపబడటం జరగొచ్చు.
............................
............................
మనం నేల మీద నడుస్తున్నప్పుడు కొన్ని జీవులు చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలా అవి చనిపోతే మనం ఏం చేయలేం. మనం భూమ్మీద నడవకుండా ఉండలేము కదా. సృష్టిలో అలా ఉంది. అందువల్ల మనుషులకు ఏమి పాపం రాదు...
ఏదైనా జీవుల వల్ల మనుషులకు అనారోగ్యం కలగటం, హానికలగటం జరిగే పరిస్థితిలో ఆ జీవులనుండి మనుషులు తమనుతాము రక్షించుకుంటారు. మనుషులను ఏదైనా జీవి హాని చేయటానికి దాడి చేస్తే, అయ్యో, వాటిని ఏం చేయకూడదని ఊరుకోరు కదా..వాటిని ఎదుర్కుంటారు, అవసరమైతే వాటిని చంపుతారు.

తప్పనిపరిస్థితిలో జీవులను చంపవలసి వస్తే, బాధ లేకుండా చంపటానికి ప్రయత్నించాలి.
మనుషుల నుండి తమ ప్రాణాలను రక్షించుకోవటానికి జంతువులు కూడా దాడి చేస్తాయి.
జీవులు తమ ప్రాణాన్ని రక్షించుకోవటం తప్పుకాదు. సృష్టిలో చాలా విషయాలున్నాయి. భూమి జీవులకు ఒక పరీక్షాలోకం కావచ్చు.
...........................
మనుషులు సాత్వికగుణాన్ని వృద్ధి చేసుకోవాలి.
రాజస, తామస గుణాలను అదుపులో ఉంచుకోవాలి.
మనస్సును అదుపులో ఉంచుకుని, ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించి దైవకృపను పొందినవారికి..మోక్షానికి అర్హులయ్యే అవకాశం ఉంటుంది.
...........................
మాంసాహారం విషయంలో చాలామంది మాట్లాడేది భక్తకన్నప్ప మాంసాహారాన్ని దైవానికి నివేదించటం గురించి. భక్తకన్నప్ప విషయానికి, తమ కోరికల కొరకు పశుపక్ష్యాదులను బలి ఇచ్చేవారి విషయాలకు పోలిక లేదు.
భక్తకన్నప్ప అడవులలో పుట్టిపెరిగిన వ్యక్తి. అతను అడవుల్లో సులభంగా లభించే పశుపక్ష్యాదులను ఆహారంగా తిని జీవించే వ్యక్తి. అతను పరమశివుని కంటి పరిస్థితి చూసి బాధతో చలించి, తన కన్నును దైవానికి సమర్పించటానికి సిద్ధమయిన అంతటి భక్తి ఉన్న వ్యక్తి.
పశుపక్ష్యాదులను చంపినప్పుడు అవి బాధను అనుభవిస్తాయి. అందువల్ల, అలా చేసినవాళ్ళు ఎంతోకొంత పాపఫలితాన్ని అనుభవించవలసి వస్తుందేమో..అని నాకు అనిపించింది.
భక్తకన్నప్ప తన కన్నును తీసి దైవానికి సమర్పించాలని సిద్ధపడటం..అప్పుడు జరిగినవిషయాలు..అవన్నీ సామాన్యమైన విషయాలు కాదుకదా. ఆ సమయంలో భక్తకన్నప్ప ఎంతో భక్తితో దైవము పట్ల ఎంతో ప్రేమతో ఉన్నారు.
.......................................

ఎవరికైనా గతంలో చేసిన తప్పుల ఫలితంగా కష్టాలు వస్తాయంటారు.
అయితే, ఎవరైనా గతంలో పాపాలు చేసి, పశ్చాత్తాపాన్ని పొంది, దైవాన్ని ప్రార్ధించటం, మంచిగా జీవించటానికి ప్రయత్నించటం జరిగితే, చాలాపాపఫలితం కరుగుతుందని, మిగిలిన కొంత పాపఫలితాన్ని అనుభవించే సమయంలో పెద్ద బాధతెలియకుండా లేక బాధ తెలియకుండానే ఆ కష్టసమయం గడిచిపోతుందట.
..........................
అంతేకాని, కష్టాలు, కోరికలు తీరాలని జీవహింస చేస్తే మరింత పాపకర్మ కలిసి, ఎప్పటికైనా అదంతా అనుభవించవలసి వస్తుంది కావచ్చు...అందువల్ల జాగ్రత్త.
......................
గ్రంధాలలో ఉన్న విషయాలలో అంతరార్ధాలు అంతగా అర్ధంకాకపోవచ్చు.అందువల్ల, వాటిని అర్ధం చేసుకోవటంలో జాగ్రత్తగా ఉండాలి.
......................
సృష్టిలో ఎన్నో రహస్యాలున్నాయి.. దైవానికే అన్నీ సరిగ్గా తెలుస్తాయి.
.......................................
......................
సృష్టిలో ఎన్నో రహస్యాలున్నాయి.. దైవానికే అన్నీ సరిగ్గా తెలుస్తాయి.
.......................................
వ్రాసిన వాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment