ఆధునిక కాలంలో స్త్రీ స్వేచ్ఛ పేరుతో స్త్రీలపై ఎన్నో అదనపు బాధ్యతలు పడ్దాయి.
ఈ రోజులలో స్త్రీల కష్టాలు కూడా మరింత పెరిగాయనిపిస్తుంది.
ఆర్ధికాభివృద్ధి అంటూ .. ఇంటాబయటా పనిచేస్తూ స్త్రీలు ఎంతో కష్టపడవలసి వస్తోంది.
ఈ రోజులలో, స్త్రీలు ఇంటాబయట పని నెత్తినేసుకుని పనిచేయటం గమనిస్తే..ఇది స్త్రీల విజయం కాదు ... ఇది పురుషుల గెలుపుగా అనిపిస్తోంది.
పాతకాలంలో స్త్రీలు ఇంటిపట్టున ఉండేకాలంలో పురుషులకు పరాయి స్త్రీలతో మాట్లాడాలన్నా కష్టంగా ఉండేది.
ఆధునిక కాలంలో అతివలను మోసం చేయడానికి మగవారికి ఎన్నో అవకాశాలు దొరుకుతున్నాయి.
ఈ రోజులలో, కొందరు వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకోవటం..వంటివీ జరుగుతున్నాయి.
పనిచేసేచోట లైంగిక వేధింపులు జరుగుతున్నా బైటకు చెప్పని వారెందరో ఉన్నారు.
బయటకు చెప్తే తమనే తప్పుపడతారేమో ? అనే భయం వల్ల కొందరు,
చదువు .. ఉద్యోగం మానివేస్తే ఎలా ? అనే సందేహాలతో కొందరు ..వేధింపులను మౌనంగా భరించే పరిస్థితీ ఉంది.
ప్రేమపేరుతో టీనేజ్ అమ్మాయిలను మోసం చేయటం గురించిన కొన్ని కేసులు ...
మరి కొందరు స్త్రీలు ఎన్నో కారణాలతో మోసపోయి వ్యభిచార గృహాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాలను గమనిస్తే .. ఈ రోజులలో స్త్రీలను మోసగించటం మగవారికి మరింత తేలికయ్యింది ..అనిపిస్తుంది.
నిర్భయ వంటి కేసులు పెరిగాయి. చిన్నపిల్లల పట్లా లైంగిక వేధింపులు పెరిగాయని తెలుస్తోంది.
చదువుకునే పాఠశాలలోనూ లైంగిక వేధింపులు, కార్యాలయాలలోనూ వేధింపులు, బయటకు తెలుస్తున్నవి కొన్నే. తెలియనివి ఎన్ని ఉన్నాయో?
బయటకొస్తే ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టే , ప్రాచీనులు స్త్రీలకు సంపాదనా బాధ్యతలను అప్పగించలేదు.
ఎంత టెక్నాలజీ పెరిగినా మనుషులలో నైతిక విలువల పట్ల గౌరవం పెరగనంతవరకూ ఈ వేధింపులు జరగకుండా ఆపటం చాలా కష్టం .

..........
చిన్నపిల్లలు ఆటోలో స్కూలుకు వెళ్లేటప్పుడు అమ్మాయిలపట్ల అఘాయిత్యం జరిగిన సంఘటనలు గురించి వార్తలు విన్నాము. అమ్మాయిలను స్త్రీ ఆటోడ్రైవర్లు ఉండే ఆటోల్లో స్కూలుకు పంపిస్తే బాగుంటుంది.
పాతకాలంలో అమ్మాయిలకు ప్రత్యేకంగా స్కూల్స్, కాలేజీలు ఉండేవి. ఇప్పుడు కూడా అలా ఉంటే బాగుంటుంది.
**********
స్త్రీలను సాటి స్త్రీలే మోసం చేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నప్పుడు, ఇంకా ఏం చేస్తారు? మనుషుల్లో నైతికవిలువలు పెరగాలి.
**********
స్త్రీలు సంపాదనా బాధ్యతలను తీసుకోవటంతో స్త్రీలకే కాదు , పిల్లలకీ కష్టాలు మొదలయ్యాయి.
చంటిపిల్లలు కూడా పగలు ఇంటిపట్టున తల్లి వద్ద కాకుండా.. బయట కేర్ సెంటర్లలో ఉండవలసి వస్తోంది.
పాతకాలంలో స్త్రీధనం..ఆభరణాలను అత్తింటి వారు వాడుకోవటం అంతగా జరిగేది కాదు. స్త్రీలకు కష్టకాలంలో ఆ సొమ్ము ఆసరాగా ఉండేది.
..............
ఆర్ధిక ఆలంబన కోసం , స్త్రీలు కొందరు కలిసి తమకు అనుకూలమైన సమయాల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చు.
బయట పనిచేసే స్త్రీల విషయంలో..ఉదయం సుమారు 9.30 నుండి సాయంత్రం 4.30 వరకు స్త్రీలకు పనిగంటలు ఉంటే, ఇంటికి త్వరగా వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుని ఇంటిపని, పిల్లల్ని చూసుకోవచ్చు. (వైద్యరంగంలో పనిచేసే వారు ఈ సమయాల ప్రకారం పనిచేయలేకపోవచ్చు..)
******************
విద్య,ఉపాధి.. వంటి వ్యవస్థలలో ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్నాలజి వల్ల కూడా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
******************
******************
విద్య,ఉపాధి.. వంటి వ్యవస్థలలో ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్నాలజి వల్ల కూడా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
******************
కష్టాలలో ఉన్న స్త్రీలు సమస్య పరిష్కారాల కోసం ఎవరైనా మగవారి సాయం కోరితే.. ఆ మగవారు కూడా నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది.
అలా కాకుండా, కష్టాలలో ఉన్న స్త్రీలను ఆదుకోవటానికి, వారి సమస్యల పరిష్కారం కోసం మహిళామండలులు సహాయం చేస్తే బాగుంటుంది.
కష్టాలలో ఉన్న స్త్రీలు ఒంటరిగా ఉండేకంటే, అపార్ట్మెంట్స్ వంటివి తీసుకుని ఒకే చోట ఉంటే ఒకరికొకరు తోడుగా ఉండవచ్చు.
కుటీరపరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
మహిళామండలులు.. స్త్రీ నిధి ఏర్పాటు చేసి , నా అన్నవారు లేని స్త్రీలను ఆదుకోవచ్చు.
తల్లితండ్రి, పిల్లలను మంచి పౌరులుగా తయారుచేయాలి. తల్లి పిల్లలకు తొలిగురువు అంటారు కాబట్టి, ఎక్కువసమయం కేటాయించి పిల్లలను చక్కని పౌరులుగా తయారుచేయవచ్చు. తండ్రి కూడా మంచి పద్ధతిగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది.
ReplyDeleteపెద్దవాళ్లు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
గురువులు తమ వద్ద చదువుకునే పిల్లలను మంచి పౌరులుగా తయారుచేయాలి.
ప్రభుత్వాలు సమాజంలో అవినీతి, అశ్లీలత, మత్తుపదార్ధాలు..వంటివాటికి అడ్డుకట్టవేయాలి. చట్టం తమపని సరిగ్గా త్వరగా చేయాలి.
ఈ కాలంలో చాలామంది ప్రజలు నైతికవిలువలను పాటించటం లేదు. డబ్బు,అధికారం, విలాసవంతమైన జీవితం కొరకు ఎంతకైనా దిగజారుతున్నారు. చిన్న, పెద్ద తేడాలేకుండా చాలామంది ఎప్పుడూ సెల్ఫోన్లు చూస్తూ ఉంటున్నారు. వీటన్నింటివల్ల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. జీవితాలు బాగుండాలంటే చాలా విషయాలు బాగుండాలి.
ReplyDeleteఅందరూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, తప్పు చేసిన వారు ఎవరైనా సరే, దైవము నుంచి తప్పించుకోలేరు.