koodali

Thursday, October 3, 2024

పండుగల సందర్భంగా.....

  

 శరన్నవరాత్రులు మరియు   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు   మొదలవ్వబోతున్న  సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.

....................

marikonni vishayamulu..

 సంక్రాంతి పండుగకు సూర్యారాధన చేస్తారు. ఆరోగ్యదాత అయిన సూర్యుని వారమైన ఆదివారం మాంసాహారం తినకూడదు. అయితే ఆదివారమే ఎక్కువ మాంసాహారం తింటున్నారు.

 ఈ రోజుల్లో కొందరు సంక్రాంతి పండుగంటే, పల్లెటూళ్లకు వెళ్ళి, కోడిపందేలు, మాంసాహారం తినటం, రికార్డ్ డాన్సులు చూడటమే పండుగ... అన్నట్లు చేస్తున్నారు. 

 వినాయకచవితి ఊరేగింపుల్లో కూడా కొందరు సినిమాపాటలు పెట్టి డాన్సులు వేస్తున్నారు. 

సినిమాపాటలు, డాన్సులు వేరే సమయంలో వేసుకోవచ్చు. పండుగల్లోనే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో?

 ...........................................

ఈ క్రింద విషయములు ఈ పోస్ట్ వేసిన మరికొంతకాలానికి వ్రాసి ఇక్కడ పోస్ట్ చేయటం జరిగిందండి. 

మరికొన్ని విషయములు...

ఇంట్లో శివలింగాకారం అని నలుగురికి చూపిస్తే, మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నట్లు కొందరు మాట్లాడుతున్నారు...

మా ఫ్రిజ్లో కూడా చాలాకాలం క్రిందట  శివలింగాకారంలా ఏర్పడింది. ఆ చిత్రాలను బ్లాగులో పోస్ట్ చేసాను. 
 
 link..

 ఫ్రిజ్లో శివలింగం ఆకారంలా ఏర్పడటం చూసి నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా..అనిపించింది. పెద్దసైజులో అలా ఆకారం ఏర్పడటం నేను ఎప్పుడూ గమనించలేదు.
 
 అది ఐస్ వల్లే ఏర్పడినా, శివలింగంగా భావించి..ఆ విషయాన్ని చూపించాలనిపించి చూపించాను. మూఢనమ్మకాలు ప్రచారం చేయాలని కాదు. నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకం.

అప్పట్లో మా ఫ్రిజ్లో శివలింగాకారాన్ని నేను మా చుట్టుపక్కల ఎక్కువమందికి చూపించడానికి భయపడ్దాను. 
 
నేనే అలా ఏర్పాటు చేసానని అనుకుంటారేమో అని, ఇంకా  ఏమంటారోనని, చూడటానికి ఎక్కువమంది  వస్తారేమో? తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో? అని సందేహాలు కలిగాయి.

 మరికొందరు కూడా వాళ్ల ఫ్రిజ్లో ఇలా ఏర్పడినట్లు చూపించిన ఫోటోస్ చూశాను.
 
ఎవరైనా, ఫ్రిజ్లో శివలింగాన్ని చూపించి, గుడికట్టి భక్తులను పిలిచి, ఇక్కడ మొక్కుకుని హుండిలో డబ్బులు సమర్పిస్తే కష్టాలు, కోరికలు తీరుతాయని.. చెప్పారా ?

మూఢాచారాల పట్ల కొందరి ఆవేదన నేను అర్ధంచేసుకోగలను.

సమాజంలో కొందరు దైవము పేరుతో కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే, అందరూ అలా మోసం చేసేవాళ్ళే ఉండరు.

 దైవము పేరుతో వ్యాపారంలా చేసి, డబ్బు సంపాదించేవారు కూడా ఉండవచ్చు. ఈ రోజుల్లో ఎవరు ఎటువంటివాళ్ళో తెలియదు కాబట్టి, జాగ్రత్తగానే ఉండాలి.

  ఎవరు ఏం అనుకున్నా, మా ఇంట్లో ఫ్రిజ్లో శివలింగాకారంలా ఏర్పడటం విషయం గురించి నేను గొప్పగా, ఆనందంగా భావిస్తాను.
................

చాలామంది.. ప్రకృతిలో, రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో దైవాన్ని చూస్తారు. మట్టితో, ఇసుకతో ..దైవరూపాన్ని తయారుచేసి పూజిస్తారు. 
 
ఇంట్లో పూజించే పటాల్లోని  దైవచిత్రాలను మనుషులే గీచినా, ఆ చిత్రంలో దైవాన్ని ఆరాధిస్తారు.
........................

ఒక పాతసినిమాలో ఒక వ్యక్తి తనకు శివపూజకు సమయం మించిపోతోందని దగ్గరలో శివలింగం లేదని, తను ప్రేమించిన  స్త్రీ యొక్క వక్షోజాన్ని,  శివలింగాకారంలో ఉన్నదని భావించి, దానినే పూజించినట్లు  సినిమాలో చూసినట్లు గుర్తుంది. అలా  చూపిస్తే,  జనాలు బాగా చూసారు. మరి సినిమాల్లో ఇలా చూపిస్తే ఏమంటారు?

అలా కాకుండా, ఆ వ్యక్తి  కొబ్బరికాయనుకాని,  చిన్నరాయినికాని శివలింగంగా భావించి పూజించవచ్చు. లేదంటే మానసికంగా భావించి, మానసికపూజ చేయవచ్చు. మానసిక పూజ చాలా గొప్పదంటారు.

కొందరు దైవము పేరుతో వ్యాపారం చేస్తున్నారనిపిస్తోంది.  మూఢనమ్మకాలు పెంచే సీరియల్స్, సినిమాలను  అందరూ వ్యతిరేకించాలి.
.........................

 దైవపూజలు పేరుతో మూఢత్వంగా ప్రవర్తించకూడదు.
...................

పండుగలు, ఫంక్షన్లు అని ....బోలెడు పనులను,  భయాలు,  సందేహాలను,  ఆచారవ్యవహారాలను..పెంచుకుని సతమతమవటం,  పూజ అంటే బోలెడు  విషయాలను చెప్పటం, వాటిని సరిగ్గా పాటించకపోతే కష్టాలు వస్తాయనటం.. 

దైవము పట్ల ధ్యాస కన్నా, చాలావిషయాలను పాటించటం పట్లే ధ్యాస ఎక్కువ ఉండేలా పరిస్థితి తయారయ్యింది.

సమాజంలో ప్రచారంలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలవల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.. చాలా మూఢనమ్మకాలున్నాయి.
....................

  ప్రజలకు దైవము అంటే భక్తి ఉండాలి, పాపాలు చేయకూడదని భయం ఉండాలి. 
 
అంతేకానీ, పాపభీతి లేకుండా, ఎన్ని పాపాలు చేసినా పరిహారాలు చేస్తే సరిపోతుందనే విధంగా పరిస్థితి తయారయ్యిందనిపిస్తుంది.

 .......................

సోషల్మీడియా వచ్చాక ఎందరో ఎన్నో చెప్పటం, ప్రతిదానికి ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యకూడదంటూ చెప్పి ప్రజలను భయాందోళనకు, అయోమయానికి గురిచేస్తున్నారు. 
 
గ్రంధాలలో కూడా ప్రక్షిప్తాలైన మూఢనమ్మకాలు చాలాఉన్నాయి. వాటిని తొలగించాలి, వాటిని ఎవరూ ప్రచారం చేయకూడదు.

సమాజంలో ఎప్పటినుంచో ప్రజలలో ఏర్పడిన మూఢనమ్మకాలకు కారణాల గురించి ఆలోచించి సరిదిద్దుకోవాలి.

నే
ను కూడా  చాలా విషయాల గురించి భయపడుతూ చాలాకాలం కొన్నింటిని పాటించాను. అయితే, ఇప్పుడు మూఢనమ్మకాలతో కాకుండా , నేను చేయగలిగినంలో మాత్రమే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 
 
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బ్లాగులో ఎన్నో విషయాలను వ్రాసాను. అయినా కొన్ని సెంటిమెంట్స్..ఉన్నాయి.

 

Wednesday, October 2, 2024

ప్రపంచంలోని జీవులు అన్నీ మంచిగా ఉండాలి...

 

 ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. కారణాలు ఏమైనాకానీ, ఇలా జరగటం అత్యంత బాధాకరం. అక్కడి ప్రజల పరిస్థితి తలచుకుంటే ఎంతో బాధగా ఉంది. 

 

 యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియక, ఎప్పుడు ఏ బాంబులు మీద పడతాయో? కుటుంబంలోని వారు ఎటు చెల్లాచెదురవుతారో తెలియక  ఎంత భయంతో అల్లాడుతారో? కుటుంబంలోని పెద్దవాళ్లు చనిపోతే అమాయకులైన చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఊహించుకుంటేనే ఎంతో బాధ కలుగుతోంది. 

 

యుద్ధాలు లేకుండా ఉంటేనే మన దగ్గర ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాము. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు అల్లాడుతున్నారు..ఇంకో చోట యుద్ధాలు.. ఇదంతా ఏమిటో ? అర్ధం కావటం లేదు.

 

కొంతమంది పట్ల మరి కొందరు దాడులు చేయటం  కూడా  బాధాకరం. ఈ దాడుల సమయంలో పిల్లలు, పెద్దవాళ్లు భయంతో ఎంత అల్లాడిపోతారో.. తలచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది. 

 

 ఎక్కడైనా ఏ ప్రజల పట్ల అయినా కూడా, ఆ విధంగా  దాడులు చేయటం బాధాకరం.

   మనుషుల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉంటాయి. గొడవలకు అనేక కారణాలుండవచ్చు. 

 

కొందరు ఇతరులపై ఆధిపత్యం కొరకు గొడవలకు, దాడుకు, యుద్ధాలకు సిద్ధపడతారు. కొందరు శత్రువుల నుంచి తమను రక్షించుకొనడానికి  యుద్ధాలు చేస్తారు. ఇంకా ఎన్నో కారణాలుండవచ్చు. 

  గొడవలు జరిగినప్పుడు .. ఎవరి కోణంలో వాళ్ళు ..మా అభిప్రాయమే సరైనది.. అంటారు.   ఎవరి వాదన వారిది.


కారణాలేమైనా, యుద్ధాల వంటి వాటి వల్ల ఎన్నో బాధలుంటాయి. అందువల్ల..దాడులు, యుద్ధాల వంటివి ఆగిపోతే బాగుంటుంది.

ప్రపంచంలోని జీవులు అన్నీ మంచిగా ఉండాలి. 

 ************

 కొన్ని విషయములు..link..

 ఓం, దైవానికి అనేక వందనములు...