ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. కారణాలు ఏమైనాకానీ, ఇలా జరగటం అత్యంత బాధాకరం. అక్కడి ప్రజల పరిస్థితి తలచుకుంటే ఎంతో బాధగా ఉంది.
యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియక, ఎప్పుడు ఏ బాంబులు మీద పడతాయో? కుటుంబంలోని వారు ఎటు చెల్లాచెదురవుతారో తెలియక ఎంత భయంతో అల్లాడుతారో? కుటుంబంలోని పెద్దవాళ్లు చనిపోతే అమాయకులైన చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఊహించుకుంటేనే ఎంతో బాధ కలుగుతోంది.
యుద్ధాలు లేకుండా ఉంటేనే మన దగ్గర ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాము. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు అల్లాడుతున్నారు..ఇంకో చోట యుద్ధాలు.. ఇదంతా ఏమిటో ? అర్ధం కావటం లేదు.
కొంతమంది పట్ల మరి కొందరు దాడులు చేయటం కూడా బాధాకరం. ఈ దాడుల సమయంలో పిల్లలు, పెద్దవాళ్లు భయంతో ఎంత అల్లాడిపోతారో.. తలచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది.
ఎక్కడైనా ఏ ప్రజల పట్ల అయినా కూడా, ఆ విధంగా దాడులు చేయటం బాధాకరం.
మనుషుల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉంటాయి. గొడవలకు అనేక కారణాలుండవచ్చు.
కొందరు ఇతరులపై ఆధిపత్యం కొరకు గొడవలకు, దాడులకు, యుద్ధాలకు సిద్ధపడతారు. కొందరు శత్రువుల నుంచి తమను రక్షించుకొనడానికి యుద్ధాలు చేస్తారు. ఇంకా ఎన్నో కారణాలుండవచ్చు.
గొడవలు జరిగినప్పుడు .. ఎవరి కోణంలో వాళ్ళు ..మా అభిప్రాయమే సరైనది.. అంటారు. ఎవరి వాదన వారిది.
కారణాలేమైనా, యుద్ధాల వంటి వాటి వల్ల ఎన్నో బాధలుంటాయి. అందువల్ల..దాడులు, యుద్ధాల వంటివి ఆగిపోతే బాగుంటుంది.
ప్రపంచంలోని జీవులు అన్నీ మంచిగా ఉండాలి.
************
కొన్ని విషయములు..link..
marikonni vishayamulu..
ReplyDeleteరైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్ల వద్ద ప్రయాణీకుల సామాను చేరవేసే వారు కూలీలు కొందరు ఉంటారు. కొంత డబ్బు తీసుకుని సామాను ఒకదగ్గరనుండి ఇంకొక దగ్గరకు పెడతారు. ఇలాంటివారు చాలామంది ఎంతో బరువైన సామాను తలపైన పెట్టుకుని, ఇంకా రెండుచేతులతో కూడా పట్టుకుని నడిచి వెళ్తారు. అంతంత బరువులు మొయ్యటం ఎవరికైనా చాలా కష్టం. అంత బరువులు మోయటం వల్ల తలనెప్పి, వళ్లు నెప్పులు వచ్చే అవకాశం ఉంది. వారు జీవితం గడవటం కొరకు వేరేదారిలేక అలా మోస్తుంటారు.
ముంబయిలో రైల్వే స్టేషన్లో కూలీలు ఒక చిన్న ట్రాలీ పైన సామాను పెట్టి తీసుకువెళ్తారు. ఈ పద్ధతివల్ల సామాను తలపైన పెట్టుకోనవసరం లేదు. అలాంటివి కొనుక్కుంటే బరువులు మోసేవారికి తేలికగా ఉంటుంది. ఒక్కో ట్రాలీ 5 వేలు అలా ఉంటుందని అంటున్నారు. సరైన ధర నాకు తెలియదు.
ఈ ట్రాలీ విమానాశ్రయం లో ప్రయాణీకులు వాడే పెద్ద ట్రాలీ లాంటిది కాదు, చిన్న సైజుది. చిన్న ట్రాలీ కానీ, చాలా సామాను పడుతుంది.