koodali

Sunday, September 6, 2026

భారతీయులు బలవంతులే...ఉదాహరణ చూడండి..

 

ఈమధ్య కొందరు ఏమంటున్నారంటే, భారతీయులు 
కొంత పెద్ద వయస్సు  వచ్చేసరికి  బలహీనంగా ఉంటారని, విదేశాల వాళ్ళు పెద్ద వయస్సు లో కూడా బలంగా ఉంటారని అంటున్నారు. 

విదేశాల్లో కూడా జబ్బులతో ఉండేవారు ఉంటారు. 

ఈ క్రింద వీడియో చూడండి.  
కొంతపెద్దవయస్సు స్త్రీలు(భారతీయులు) ఎంత బలంగా ఉన్నారో. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా చేయగలరు?

భారతీయులు బలవంతులే...ఉదాహరణ చూడండి..ఇక్కడ లింక్ వద్ద క్లిక్ చేసి ..

link..
https://youtube.com/shorts/fQdBxeQKfBQ?si=dUByrolHLztRWU86 

ఇలాంటివి తెలియజేసిన వారికి ధన్యవాదములండి.

 ఈ లింక్ ఇవ్వటం గురించి ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పగలరు. 

 నాకు తెలిసినంతలో,ఈ డాన్స్ ను మహారాష్ట్ర..గోవా లో చేస్తారట. ఆధునికకాలంలో ఎక్కువమంది, ఈ డాన్స్ లో కొన్ని కఠినమైన విన్యాసాలు చేయలేకపోవచ్చు.

 .....................................
పాతకాలంలో చాలామంది చాలాదూరం నడిచివెళ్లటం, బోలెడు పని చేసుకునేవారు.ఇప్పుడు ఎంతతిన్నా నీరసమే అంటారు చాలామంది.

పాతకాలంలో స్త్రీలు  తిరగలి తిప్పటం, రోట్లో పిండి కొట్టటం, పిండి రుబ్బటం..ఇవన్నీ చేసేవారు. ఇంకా ఇలా డాన్సులు కూడా చేసేవారంటే వాళ్ల ఓపికకు మెచ్చుకోవాలి.

పాతకాలం వాళ్లు దేశవాళి పంటలు , పురుగుమందులు వేయని పంటలు తినటం, ప్రతిపనికి యంత్రాలు కాకుండా స్వయంగా చేయటం, ప్రతిదానికి వాహనాలు కాకుండా నడవటం, నాలుగుగోడలమధ్య యంత్రాలతో పనిచేయటం కాకుండా, ఆరుబయట సూర్యరశ్మిలో తిరిగి పనిచేసుకోవటం ఉండేది.

వాతావరణకాలుష్యం తక్కువగా ఉండి, సరైనవిధంగా ఆహారం తీసుకోవటం, శరీరానికి పనిచేయటం..వంటివి చేస్తే భారతీయులైనా, విదేశీయులైనా ఆరోగ్యంగా ఉండే అవకాశాలుంటాయి.

పాతకాలంలో ఇంటి చుట్టూ చాలా స్థలం ఉండేది. స్త్రీలు పనులు చేస్తూ తిరిగితే,  వాకింగ్ అయ్యేది.

 ఇప్పుడు చాలామంది ఆఫీసుల్లో గంటలతరబడి కూర్చుని పనిచేయటం, ఇంట్లో సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ ఉంటారు.

 టెన్షన్ వల్ల కూడా ఎక్కువ జబ్బులొస్తాయి.

 చిన్నతనం నుంచి పిల్లల్ని రుద్ది చదివించటంతో చదువుల టెన్షన్, ఉద్యోగాల్లో టెన్షన్, కుటుంబాల్లో పాతతరానికి కొత్తతరాలకు మధ్య గొడవల టెన్షన్....ఇలా  చాలా కారణాలుంటాయి...వీటన్నింటివల్ల పెద్దవయస్సు వచ్చేసరికి జబ్బులు వస్తాయి.

పాతకాలంలో కూడా టెన్షన్లు ఉండేవి. టెన్షన్ ఉన్నప్పుడు నడవటం, ఏదైనా పనిచేయటం చేస్తే టెన్షన్ ప్రభావం కొంత తగ్గే అవకాశముంది.  నడిచేటప్పుడు దైవస్మరణకూడా చేయవచ్చు. 
...................
ఇప్పుడు చాలామంది భారతీయులకు డబ్బువ్యామోహం, స్వార్ధం, అసూయ..ఇలాంటివి ఎక్కువయ్యాయి. వీటివల్ల కూడా జబ్బులొస్తాయి.
..............
పాతకాలంలో చాలామంది భారతీయులు ఇప్పటిలా ఎక్కువసార్లు మాంసాహారం తినేవారు కాదు. ఈ రోజుల్లో చాలామంది మాంసాహారం బలం అని, విపరీతంగా తింటున్నారు. 
 మాం
సాహారం బాగా తినే వాళ్లలో కూడా కిలోమీటర్ సరిగ్గా నడవలేనివారున్నారు. 

ఆహారం సరిగ్గా వండుకోవటం, ప్రశాంతంగా తినటం తగ్గింది. సమయం లేదని ఇంట్లో ఆదరాబాదరా వండటం, జంక్ఫుడ్ తినటం, బయట కొని తినటం ఎక్కువయ్యింది. 

 ఎన్ని పాటించినా, వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే అనారోగ్యాలు కొన్ని ఉంటాయి.
...............................
 

ఇలాంటి డాన్సులు చేసేవారిలో అసలు మాంసాహారం తిననివాళ్లు కూడా ఎక్కువమంది ఉంటారు.

........................ 

 ఇవన్నీ ఏఐ  అని కొందరంటున్నారు. ఇవి ఏఐ  కాదు. ఇలాంటివి నిజంగానే చేస్తారు. నేను మరికొన్ని దగ్గర కూడా చూశాను. 

ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఇలా డాన్సులు చేయలేకపోవచ్చు. అందువల్ల మనకు తెలియక ఏఐ  అంటున్నారు.

మనకు తెలియనంతమాత్రాన అన్నీ అబద్ధాలని అనుకోకూడదు. భారతీయుల పధ్ధతులు సరిగ్గా లేవన్నట్లు అనుకోవటం సరైనది కాదు.
.................................
 

కొన్ని కారణాలవల్ల కొన్ని విదేశదేశాలు ధనికదేశాలయ్యాయి. భారతదేశంలో పేదరికం ఉన్నది. అందువల్ల కూడా భారతదేశంలో చాలామందికి సరైన ఆహారం లభించటం లేదు. విదేశాల్లో పేదలు తక్కువున్నారు.

........................... 

అయితే, భారతీయులు బలహీనంగా ఉన్నారని చెప్పిన వాళ్ళు , భారతదేశం మంచిగా ఉండాలని ఎన్నో విషయాలు చెప్పినవాళ్లే. ఆధునిక యువత జంక్ ఫుడ్ తగ్గించి, పుష్టికరమైన ఆహారం తినాలని, మంచిగా వ్యాయామం చెయ్యాలని చెప్పటం కూడా వాళ్ల అభిప్రాయం అయి ఉంటుంది.  

వాళ్ళుచెప్పిన మరికొన్ని విషయాలను గమనించి, భారతీయులు తమనుతాము సరిదిద్దుకోవాలి.

కొందరు విదేశీయులు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కొందరు ఇష్టం వచ్చినట్లు తింటారు. విదేశీయులు కొందరు నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొంత సమయం ఉంటే ప్రకృతి సందర్శనకు వెళ్తారు.చాలామంది విడేశీయులు తమ రోడ్లను శుభ్రంగా ఉంచుతున్నారు.

 భారతీయులు నడక తగ్గించారు. ప్రకృతిసందర్శనకు వెళ్లటమూ తక్కువే. పాతకాలంలో తీర్ధయాత్రలకు నడిచి వెళ్లేవారు. ఇప్పుడు వాహనాలు వచ్చాయి. భయం వల్లో భక్తివల్లో కొందరైనా దైవదర్శనానికి నడిచి వెళ్తారు. అదీ మంచిదే. 

ఎవరైనా నడవలేని పరిస్థితిలో ఉంటే, కుర్చిలో కూర్చుని కొన్ని వ్యాయామాలు చేయవచ్చు.

ఈ రోజుల్లో, చాలామంది భారతీయులు ఆహారాన్ని ఇంట్లో వండటం తగ్గించి బయట ఎక్కువ తింటున్నారు. 
  ఇంటి ఆహారంలో కూడా మైదాబ్రెడ్, మైదానూడుల్స్, బయట తెచ్చిన చిప్స్ పిల్లలకు ఎక్కువగా పెట్టేవాళ్ళున్నారు. 

మైదాతో  బ్రెడ్డులు, బిస్కెట్స్,పిజ్జాలు, నూడుల్స్ విదేశాలనుంచి  వచ్చినవే కదా. నూడుల్స్ మైదాతో కాకుండా బియ్యం, జొన్నలు తో చేస్తే ఫరవాలేదు. బయట అమ్మేవి ఎలా చేస్తారో తెలియదు.

ఈ రోజుల్లో, చాలామంది భారతీయులు రోడ్లను శుభ్రంగా ఉంచటం లేదు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. 
..........................
ఆ డాన్స్ కు సంబంధించి మరికొన్ని వివరాలను క్రింద చూడవచ్చు.

నేను ఇక్కడ వీటికి డైరెక్ట్ లింక్ ఇవ్వటం లేదు. కాపి..పేస్ట్..క్లిక్ చేసి చూడవచ్చండి.

 ................
Fugdi Stage Dance Performance 2026 | Traditional Fugdi of Goa | Ganesh Chaturthi Special
********************
Prudent Media Chavath Fugdi Part 1 17sept15 Part 2
240K views 10y ago
Goa Network
.***************

 You
@KKLandge
kathvat kana mangalagaur #viralvideo #trending #mangalagaur #mangalagauri

............................ 

 ఈ పోస్ట్ కొంతకాలం తర్వాత ఇక్కడ డిలిట్ చేసి, వేరే దగ్గర వేస్తాను.