వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.
వినాయకచవితి పూజలో ఉపయోగించే పత్రి ఎన్నో ఔషధవిలువలు గలిగిన పత్రి. ఇప్పుడంటే పత్రిని బజారులో కొంటున్నారు గానీ, ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ పత్రిని సేకరించటంలో పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా పాల్గొనేవారట.
అందువల్ల పిల్లలకు రకరకాల మొక్కల గురించిన వివరాలు, వాటికి గల ఔషధగుణాలు తెలిసేవి . పూజ తరువాత , పూజలో వాడిన పత్రిని కూడా నీటిలో కలుపటం ద్వారా పత్రిలోని ఔషధ గుణాలు నీటిలో కలిసి నీరు బాగుంటుంది.
మట్టితో తయారుచేసిన విగ్రహాలవల్ల కలిగే మంచి గురించి ఎందరో ప్రచారం చేస్తున్నారు. అందువల్ల ప్రజలలోనూ క్రమంగా చక్కటి చైతన్యం పెరుగుతోంది. పర్యావరణానికి హానిని కలిగించని విగ్రహాలను వాడటానికి ముందుకొచ్చే ప్రజల సంఖ్య పెరగటం మంచి పరిణామం.

..............................
ఈ క్రిందవిషయాలను ఈ పోస్ట్ వేసిన చాలాకాలానికి వ్రాసి, ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది.
ఇతరుల తప్పులూ ఉన్నాయి..మన బలహీనతలూ ఉన్నాయి..
ఇతరులు భారతదేశానికి వచ్చి చాలాకాలం పాలించారు. ఎవరైనా ఇతర రాజ్యాలను తమ పాలనలోకి తెచ్చుకోవటం తప్పే అయినా, ప్రపంచంలో చాలామంది యుద్ధాలు చేసి తమరాజ్యాన్ని విస్తరించటం జరిగింది.
ఇతరులు భారతదేశానికి వచ్చి చాలాకాలం పాలించారు. ఎవరైనా ఇతర రాజ్యాలను తమ పాలనలోకి తెచ్చుకోవటం తప్పే అయినా, ప్రపంచంలో చాలామంది యుద్ధాలు చేసి తమరాజ్యాన్ని విస్తరించటం జరిగింది.
ఎందరో భారతీయులు దేశం కోసం ఎంతో త్యాగం చేశారు. కొందరు ప్రాణాలను కోల్పోయారు.
భారతదేశం ఇతరులపాలనలోకి వెళ్లటానికి కొందరు భారతీయుల తప్పు కూడా లేదంటారా?
దాడిచేసినప్పుడు ఐకమత్యంగా ఉండి పోరాడి గెలవాలి. అయితే కొందరు భారతీయుల్లో ఐకమత్యం లేకపోవటం, కొందరు భారతీయులే అవతలివారి పక్షాన చేరటం..ఇంకా ఎన్నో కారణాలున్నాయి. ఇప్పటికి కూడా ఐకమత్యం లేదనే చెప్పవచ్చు.
..................................
ఇక ఇతర మతాలవాళ్ళు తమ మతాలను విస్తరించటంలో ....
ఎందుకు మతాన్ని మారుతున్నారో తెలుసుకుని, మారకుండా ఆపగలిగితే బాగుంటుంది.
సమంజసమైన కారణాలను, సమస్యలను పరిష్కరించి కొంతమందినైనా ఆపవచ్చు. ఉండేవాళ్లు ఉంటారు. విపరీతమైన కారణాలు చెప్పేవారిని ఎవరేం చేయగలరు. ఎవరికర్మ వారిది.
...........................
హిందువులకు అనేకమంది దేవతలుండగా, ఇంకా కొత్తవాళ్లదగ్గరికి వెళ్తుంటారు కొందరు.
ఇతరమతాలవాళ్లు పేదవాళ్లయినా కూడా, తమ మతాన్ని మారటానికి ఇష్టపడరు.
............................
దేశం చాలాకాలం ఇతరపాలనలోకి వెళ్ళి ఉండటంలోనైనా, మతమార్పిడులు జరగటంలోనైనా మన బలహీనతలు, మన అసమర్ధత కూడా ఉందనిపిస్తుంది. కొందరు భారతీయుల అసమర్ధత, బలహీనతలు, స్వార్ధం వల్ల కూడా దేశానికి నష్టం జరుగుతోంది.
...................................
ఎదుటివారు పెత్తనం చేస్తున్నారని పదేపదే బాధపడటం వల్ల గొప్ప ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రపంచంలో బలవంతులైన వారినుంచి తమను కాపాడుకోవాలంటే, కొన్నిసార్లు శక్తి చాలకపోవచ్చు. దైవాన్ని ప్రార్ధించి తమ రక్షణ కొరకు, తమ ఉనికిని కాపాడుకోవటం కొరకు గట్టి ప్రయత్నం చేస్తే మంచిది.
.........................
ప్రపంచంలో బలవంతమైన జీవులు, తమకన్నా బలహీనవాటిపై పెత్తనం చేయటానికి ప్రయత్నించటం జరుగుతోంది. ఇది అన్యాయం.
ఉదా.. కొందరు, మూగజీవులను బాధపెడతారు. వాటికి మనుషుల్లా తెలివితేటలు లేవు. వాటి అభిప్రాయాలను మనుషులకు చెప్పలేవు. అవి మనకు హాని చేయనప్పుడు, మూగజీవులైన పశుపక్ష్యాదులను బాధపెట్టటం అన్యాయం కదా..
చాలా కుటుంబాల్లో కూడా గడుసువాళ్లు పెత్తనం చేస్తుంటారు. ఆఫీసుల్లో పైవాళ్లు కొందరు ఇతర ఉద్యోగులపట్ల అధికారం చెలాయిస్తారు...ఇవన్నీ బాధాకరమే.
ఏ జీవి అయినా ఇతర జీవులను బాధపెట్టటం బాధాకరమే. ప్రపంచంలో వివక్ష, బాధపెట్టటం ఎన్నో చోట్ల జరిగింది.
ఉదా.. ఒకే కులంలో బంధువుల్లో కూడా, డబ్బు.. అధికారం బాగా ఉన్నవాళ్లు కొందరు, తమకన్నా డబ్బు, అధికారం ఎక్కువ లేనివాళ్ళను తక్కువగా చూస్తారు, పెత్తనం చేస్తారు..
కుటుంబాల్లో కొందరు సీనియర్లు, జూనియర్ల పట్ల పెత్తనం చేస్తారు.
కాలేజీల్లో సీనియర్లు కొందరు, జూనియర్ల పట్ల పెత్తనం చేస్తారు.
చాలామంది మనుషులు మూగజీవులైన పశుపక్ష్యాదులను చంపి తింటారు.
మనల్ని ఎవరైనా తక్కువగా చూస్తేనే బాధగా ఉన్నప్పుడు, మనుషులు పశుపక్ష్యాదులను చంపటం ఎంతో అన్యాయం కదా.
మూగజీవులైన పశుపక్ష్యాదులు ఇంకా క్రిమికీటకాది ఇతరజీవుల పైన మనుషుల పెత్తనమేమిటి?
.....................
డబ్బు, అధికారం ఉన్న పెద్దవారైనా, డబ్బు, అధికారం అంతగాలేని పేదవారైనా.. ఎవరైనా కూడా పాపాలు చేయకూడదు. అనవసరంగా ఏ జీవిని బాధపెట్టకూడదు.
మనకు హానిచేయకపోయినా కూడా.. ఇతరులను, ఇతరజీవులను బాధపెట్టటం అనేది ఎవరు చేసినా తప్పే. డబ్బు బాగా ఉన్నవాళ్ళైనా, లేనివాళ్ళైనా, తప్పు ఎవరు చేసినా తప్పే.
........................
........................
oka link.....కొన్ని విషయాలు... సమాజంలో వ్యవస్థలు..పరిస్థితులు..
No comments:
Post a Comment