koodali

Sunday, September 2, 2018

ఓం.....మరికొన్ని విషయములు..




 శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా  ....అందరికీ  శుభాకాంక్షలండి.

**********
 
 పైన పోస్ట్ పెట్టిన చాలాకాలం తరువాత మరికొన్ని విషయములను ఇక్కడ వ్రాసి పోస్ట్ చేయటం జరిగిందండి. 2024..
 
 ఈ మధ్య ఒక వీడియోలో వారు కొన్ని విషయాల గురించి తెలియజేస్తూ...ఈ మధ్యన కొందరు అర్చకులు గొంతు కాన్సర్ కు గురయ్యారని, కల్తీ అగరుబత్తులు, కల్తీ హారతికర్పూరం ఎక్కువగా వాడటం వల్ల ఆ విధంగా జరుగుతుందని వారి అభిప్రాయాన్ని తెలియజేసారు. 
 
నిజమే, కల్తీవి వాడటం వల్ల అలా జరగవచ్చు.  కల్తీ లేనివి వాడటం మంచిది.
 
చాలామంది ..బోలెడు అగరుబత్తులు, చాలా హారతి కర్పూరం .. వెలిగిస్తుంటారు. అలా కాకుండా,  కొద్దిగా తగ్గించి వేయవచ్చు.  కల్తీ లేనివి అయితే , కొంచెం ఎక్కువ అయినా వేయవచ్చు.
 
.లింక్..హారతి ఇచ్చే అసలైన విధానం ఇదే ! Anantha Lakshmi Dharmasandehalu Significance Of Aarti In Telugu
SumanTV Prime
 
********************

మరికొన్ని విషయములు..

  ధ్యానం, ప్రాణాయమం..వంటివి, వాటి గురించి బాగా తెలిసిన వారి వద్ద నేర్చుకుని చేస్తే మంచిది. 

*******

మరికొన్ని విషయములు..

   టీచర్స్, పాటలుపాడేవారు, ఎక్కువగా మాట్లాడే ఉపన్యాసకులు..వంటివారికి కొందరికి గొంతుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశముంది. అందువల్ల, అలాంటి వారు గొంతుకు బాగా శ్రమ కలగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 

 దేవాలయాల్లో భక్తులు అర్చన వంటివి చేయించుకునే సమయంలో అర్చకులు మంత్రాలు పఠించుతారు. అర్చన చేయించుకునే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, అర్చకులు ఒక్కరే ఉంటే,   ఎక్కువసమయం చాలావేగంగా మంత్రాలను పఠించవలసి వస్తుంది.  గొంతుకు బాగా శ్రమ కలగకుండా ..పెద్దగా కాకుండా, చిన్నగా పఠించవచ్చు.

ఎక్కువమంది భక్తులు ఉన్నప్పుడు, ఎక్కువమంది అర్చకులు ఉంటే శ్రమ తగ్గుతుంది.


ఈ రోజుల్లో ఇళ్ళలో కూడా కొందరు ఆఫీసులకు వెళ్ళాలని, పనుల వల్ల హడావిడిగా పూజ చేస్తున్నారు..అలాంటప్పుడు, సమయం ఎక్కువ లేనప్పుడు బోలెడు మంత్రాలు కాకుండా, కొద్దిగా మంత్రాలను ప్రశాంతంగా చదువుకోవచ్చు.

 ఎక్కువ చదవకూడదని నా అభిప్రాయం కాదండి. మరీ అతివేగంగా గొంతునెప్పి వచ్చేట్లు కాకుండా చదవాలని నా అభిప్రాయం.


మంత్రాలను నిదానంగా, ప్రశాంతంగా పఠిస్తే బాగుంటుంది. అలాగని చాలా నిదానంగా పఠించనవసరం లేదు.. మరీ నిదానంగా కాకుండా,  మరీ వేగంగా కాకుండా..పఠించితే మంచిది.

 
కొందరు సామూహిక పారాయణాల్లో 108సార్లు అని, విపరీతమైన వేగంగా చదివేస్తుంటారు. ఆ వేగాన్ని అందుకోలేక కొందరు మధ్యలో కొన్ని అక్షరాలను వదిలేస్తుంటారు. అతివేగంగా చదివితే తప్పులు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది.

అమ్మయ్య 108 సార్లు పూర్తిచేసేశాం.. అని కాకుండా, ప్రశాంతంగా, శ్రద్ధగా 11 సార్లు పఠించినా బాగుంటుంది.

  కొందరు నామస్మరణాన్ని కూడా ఎక్కువసార్లు చేస్తే మంచిదని, నామాన్ని చాలాసార్లు చాలా వేగంగా అనుకుంటారు.  
అలాకాకుండా,  రోజులో అప్పుడప్పుడు భక్తితో కొన్నిసార్లు నామాన్ని అనుకున్నా మంచిదే.


ఎక్కువగా నామస్మరణ కుదరకుంటే, నచ్చిన దైవచిత్రాన్ని కానీ, నామాన్ని కానీ ఫోటోలాగ మనస్సులో జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు తగ్గించుకుని నిశ్సబ్దంగా ఉంటారు కొందరు. మనపనులు చేసుకుంటూనే మనస్సులో ఆలోచనలు తగ్గించుకుని, దైవశక్తిని ఫీలవుతూ ఆనందాన్ని పొందవచ్చు. పనులు చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. పనులు చేస్తూనే దైవాన్ని గురించి ఆలోచించవచ్చు. ఊపిరిపీల్చటమే దైవస్మరణగా కూడా భావించవచ్చు. ఇంకా మనకు తెలియని అనేక విషయాలుంటాయి.



( ఊపిరిని ధ్యానంగా భావిస్తే మరి, టాయ్లెట్ కు వెళ్లినప్పుడు ఫరవాలేదా? వంటి సందేహాలు రావచ్చు. నాకు ఇప్పటికైతే ఫరవాలేదనిపిస్తోంది. భవిష్యత్తులో నా ఆలోచనలు ఎలా ఉంటాయో? నాకు తెలియదు.. ఎవరికైనా 
సందేహాలు  ఉంటే సందేహనివృత్తి కొరకు దైవాన్ని ప్రార్ధించుకోవాలి. కొన్ని సందేహాలకు దైవమే చక్కగా సందేహనివృత్తి చేయగలరు.)

***************
 
ఇంకో విషయమేమిటంటే, అర్చకులు భక్తులకు శఠగోపం పెట్టేటప్పుడు చేతిని పైకి ఎత్తవలసి వస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు అనేకసార్లు చేతిని పైకి ఎత్తవలసి వస్తుంది. అలాంటప్పుడు వారికి భుజం వద్ద నెప్పి వచ్చే అవకాశముంది.


శఠగోపం తీసుకునే సమయంలో భక్తులు నిటారుగా నిల్చోటం కాకుండా, కొద్దిగా వంగితే దైవం పట్ల వినమ్రతగా ఉంటుంది, అర్చకులకు చెయ్యి నెప్పి లేకుండా ఉంటుంది. (వంగినప్పుడు అక్షతలు శిరస్సు పైన పడేలా ఉండాలి.)

 భక్తులు క్రింద కూర్చుని ఉంటే అర్చకులు శఠగోపం ఇవ్వవచ్చు. లేదంటే, అర్చకులు ఎత్తైన ప్రదేశం వద్ద (అరుగు పైన ) నిల్చుంటే, క్రింద భక్తులు నిలబడి శఠగోపం తీసుకోవచ్చు.

 ***********

వ్రాసిన విషయాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే  దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


No comments:

Post a Comment