కొందరు ఫంక్షన్స్లో, హోటల్స్లో భోజనాలు వడ్దించటానికి ప్లాస్టిక్ ప్లేట్స్ ఉపయోగిస్తారు.
అయితే, ప్లాస్టిక్ ప్లేట్స్ పైన ఉన్న నూనె జిడ్డు త్వరగా శుభ్రం కాదు. ప్లాస్టిక్ ప్లేట్స్ ఎక్కువసార్లు కడగాలి.
ప్లాస్టిక్ తో పోల్చితే స్టీల్ ప్లేట్స్ శుభ్రం చేయటం తేలిక.
ఫంక్షన్స్ లో కొన్నిసార్లు కొందరు భోజనం చేసిన తరువాత ఆ ప్లేట్స్ కడిగి తరువాత వారికి వడ్దిస్తారు.
ఇలాంటప్పుడు కొన్ని ప్లాస్టిక్ ప్లేట్స్ గమనిస్తే, జిడ్దుగా ఉన్నట్లు తెలుస్తుంది.
అందువల్ల ప్లాస్టిక్ బదులు స్టీల్ ప్లేట్స్ , విస్తరాకులు వాడటం మంచిది.
************
కొందరు పెద్దవాళ్ళు చిన్న పిల్లలకు జడ వేయటానికి బదులు, రబ్బర్ బాండ్ తో జుట్టును టైట్ గా బిగించివేస్తారు.
అలా జుట్టును బిగించి కట్టటం వల్ల ....కళ్ళకు హాని కలిగే అవకాశముందని కంటి వైద్యుల ద్వారా తెలిసింది.
అందువల్ల జుట్టును రబ్బర్ బాండ్ తో బిగించి కట్టడం కాకుండా వదులుగా వేయటం మంచిది.
జడ వేయటానికి ఎక్కువ జుట్టు లేనప్పుడు, రబ్బర్ బాండ్ కాకుండా జుట్టును రిబ్బన్ తో కట్టటం మంచిది.
**************
ఈ రోజుల్లో చాలామందికి టీవీలు, కంప్యూటర్ చూడటం అలవాటయింది.అలా ఎక్కువసేపు చూడటం వల్ల కళ్ళు అలసి నొప్పి రావచ్చు.
కళ్ళజోడు పడితే ఎన్నో సమస్యలు ఉంటాయి. కళ్ళజోడు బై ఫోకల్ అయినా ప్రోగ్రెస్సివ్ అయినా దేనిసమస్యలు దానికున్నాయి.
అలాగని టీవీ, కంప్యూటర్..చూడకుండా ఉండలేరు.కాబట్టి తక్కువగా చూడాలి.
టీవీ చూసేటప్పుడు గంటలతరబడి కళ్ళప్పగించి చూడకుండా, మధ్యలో కొంతసేపు చూడటం మాని ,టీవీ లో వచ్చే ప్రోగ్రాం వినవచ్చు..
యూట్యూబ్ చూడాలనుకున్నా అదే పనిగా కళ్ళప్పగించటం కాకుండా, కొంతసేపు చూడటం మాని వినవచ్చు.
అయితే, టీవీ, కంప్యూటర్..మొదలైన వాటి వల్ల రేడియేషన్ సమస్య ఉంటుందంటున్నారు కాబట్టి వీలైనంత తక్కువగా చూడటం మంచిది.
ఇక ఐటీ రంగం వారికి చాలా సమయం కంప్యూటర్తో పని తప్పనిసరి.
వాళ్ళలో చాలామంది చేతులు, మెడ, కళ్ళు, వెన్ను నెప్పులతో బాధపడుతున్నారు.
ఈ రోజుల్లో బాంకింగ్ వంటి ఎన్నో రంగాల్లో కూడా కంప్యూటర్ వాడకం తప్పనిసరి అయింది.
కంప్యూటర్ వాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బలమైన ఆహారం కూడా తీసుకోవాలి.
బాదం, పొన్నగంటి కూర..వంటివి తినాలి.
త్రిఫల చూర్ణం, అశ్వగంధ..వంటివాటిని ఆయుర్వేద వైద్యుల సహాయంతో వాడుకోవచ్చు.
యూట్యూబ్ ద్వారా కొందరు ఆయుర్వేద వైద్యం ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.
ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తున్న అందరికీ ధన్యవాదములు.
No comments:
Post a Comment