స్త్రీల విషయంలో కొన్ని నియమాలు ఉన్న దేవాలయాల్లో ఆ నియమాలను తొలగించిన విషయంలో గొప్ప విజయం సాధించామంటూ కొందరు సంబరపడిపోవటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
***********
ఆ
మధ్య కొందరు, శని శింగణాపూర్లో మూలమూర్తి వద్ద స్వయంగా స్త్రీలు అభిషేకం చేయవచ్చంటూ పర్మిషన్ తెచ్చుకున్నారు.
స్త్రీలకు సమానత్వం వచ్చేసిందా? సమాజంలో స్త్రీల కష్టాలు పోయాయా?
**************
శబరిమలై వద్ద స్త్రీలకు కొన్ని నియమాలను ఏర్పరచటానికి కొన్ని కారణాలు ఉండవచ్చు.
అయ్యప్పస్వామి బ్రహ్మచారి కాబట్టి , స్త్రీల విషయంలో నియమాలను ఏర్పరిచారన్నట్లు కొందరు అంటున్నారు...
దైవం విషయంలో ఇలా మాట్లాడటం సరికాదనిపిస్తుంది.
దైవానికి మానవులందరూ బిడ్డలే, స్త్రీలు, పురుషులనే తేడా ఉండదు.
మండలదీక్ష సమయంలో కఠినమైన నియమాలను పాటించే విషయంలో స్త్రీలకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండవచ్చు. ఇలాంటి కారణాల వల్ల స్త్రీలకు కొన్ని నియమాలను ఏర్పరిచి ఉండవచ్చు....
అంతేకాని, అయ్యప్పస్వామి బ్రహ్మచారి కాబట్టి , స్త్రీల విషయంలో కొన్ని నియమాలను ఏర్పరిచారనటం సరికాదు.
శబరిమలై వద్ద స్త్రీలకు కొన్ని నియమాలను ఏర్పరచటానికి కొన్ని కారణాలు ఉండవచ్చు.
అయ్యప్పస్వామి బ్రహ్మచారి కాబట్టి , స్త్రీల విషయంలో నియమాలను ఏర్పరిచారన్నట్లు కొందరు అంటున్నారు...
దైవం విషయంలో ఇలా మాట్లాడటం సరికాదనిపిస్తుంది.
దైవానికి మానవులందరూ బిడ్డలే, స్త్రీలు, పురుషులనే తేడా ఉండదు.
మండలదీక్ష సమయంలో కఠినమైన నియమాలను పాటించే విషయంలో స్త్రీలకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండవచ్చు. ఇలాంటి కారణాల వల్ల స్త్రీలకు కొన్ని నియమాలను ఏర్పరిచి ఉండవచ్చు....
అంతేకాని, అయ్యప్పస్వామి బ్రహ్మచారి కాబట్టి , స్త్రీల విషయంలో కొన్ని నియమాలను ఏర్పరిచారనటం సరికాదు.
*****************
ఈ రోజుల్లో స్త్రీలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి.
పాఠశాలల్లో, కాలేజీల్లో , ఆఫీసులలో.. లైంగిక వేధింపులు వల్ల ఎందరో వేదనను అనుభవిస్తున్నారు.
చిన్న పిల్లల పట్ల కూడా అత్యాచారాలు జరిగిన వార్తలు విన్నాము.
ఎందరో స్త్రీలు వేశ్యాగృహాలలో నరకాన్ని అనుభవిస్తున్నారు.
ఎందరో స్త్రీలు అత్తలు, ఆడపడుచులు, సవతులు వంటి..తోటి స్త్రీల వల్లే వేదనకు గురవుతున్నారు.
ఇంకా ఎన్నో సమస్యలున్నాయి .
సమాజంలో నేరాలు పెరగటానికి ..మద్యం, మత్తుమందులు, అశ్లీలచిత్రాలు, కుటుంబకలహాలు.....ఇలాంటివెన్నో కారణాలున్నాయి.
చేతనైతే ఈ సమస్యలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నాలు గట్టిగా జరగాలి.
అంతేకానీ, స్త్రీల విషయంలో.. కొన్ని దేవాలయాల్లో ఉన్న కొన్ని నియమాలను తొలగించినంత మాత్రాన సమాజంలో స్త్రీల పరిస్థితి మారదు.
**************
క్రింద వ్యాఖ్యల వద్ద కూడా మరికొన్ని విషయాలను వ్రాయటం జరిగిందండి.
కొన్ని దేవాలయాల్లో కొన్ని నిషేధాలు ఉండటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల గురించి మనకు ఇప్పుడు పూర్తిగా తెలియకపోవచ్చు.
ReplyDeleteకొన్ని దేవాలయాల్లో అలా నియమాలు ఉన్నంతమాత్రాన ఇందులో వివక్ష ఏముంది?
గర్భగుడిలోకి మగవారిని కూడా అందర్నీ వెళ్లనివ్వరు.
అయితే, శ్రీశైలంలో శివలింగం వద్దకు అందరూ వెళ్ళి తాకవచ్చు.కొన్ని దేవాలయాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి.
***********
హాస్పిటల్లో ఆపరేషన్ ధియేటర్లోకి అందరినీ రానివ్వరు. ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి. అంతమాత్రాన వివక్ష అనము.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అయినా సరే పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చుంటామంటే ఎప్పుడుపడితే అప్పుడు అందరినీ వెళ్ళనిస్తారా ? ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి.అంతమాత్రాన వివక్ష అనము.
కొన్ని దేవాలయాల్లోకి వెళ్ళటానికీ కొన్ని నియమాలు ఉంటాయి. ఇందులో వివక్ష ఏమీలేదు.
ReplyDeleteనోబెల్ పురస్కారం అందుకున్న నదియా, డాక్టర్ డెనిస్ వంటి వారు మహనీయులు. వీరి వల్ల ఎందరో స్త్రీలకు లాభం కలిగింది.
ReplyDeleteమన దేశంలో, కష్టాలలో ఉన్న స్త్రీలకు సహాయం చేస్తున్న సునీతా కృష్ణన్ వంటివారు కూడా ఎంతో గొప్పవారే.
****************
అంతేకానీ, స్త్రీలు అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుని తిరిగితే తప్పేంటి?
స్త్రీలకు పురుషులకు వివాహేతర సంబంధాలుంటే తప్పేంటి ?
స్త్రీలు నెలసరి సమయాల్లో దేవాలయాలకు, తీర్ధయాత్రలకు వెళ్తే తప్పేంటి?
అంటూ వాదించటం వల్ల స్త్రీలకు, సమాజానికి కూడా ఏమీ ఉపయోగం లేదు.
వివాహేతర సంబంధాలు తప్పు కాదంటే, ఇక అలాంటి వారికి పట్టపగ్గాలుంటాయా?
Deleteభార్య లేక భర్త యొక్క వివాహేతరసంబంధాల వల్ల వారి జీవితభాగస్వామికి జబ్బులు వస్తే ఎలా?
అయినా, వివాహేతర సంబంధాలు తప్పు కాకపోవటమేమిటి?
స్త్రీల క్షేమం కోరేవారు ఈ విషయం గురించి ఏమంటారు?
ఇప్పటికే ఎందరో స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి యొక్క వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నారు.
విడాకులిచ్చేస్తే సరిపోతుందా?
వివాహం చేసుకునేది విడాకులివ్వటానికి కాదు కదా!
సతీసహగమనం ప్రాచీన ఆచారం అయినట్లయితే.. కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయి సతీసహగమనం చేయలేదు కదా!
ReplyDeleteకుంతిదేవి కూడా అలా చేయలేదు. పాండురాజు మరణానికి తాను కారణమని భావించిన మాద్రి తనకు తాను అలా చేయటం జరిగింది.
కాలక్రమేణా ఎన్నో కారణాల వల్ల సతీసహగమనం సమాజంలో ఆచారంగా ఏర్పడింది.
జోగినీ వంటివి కూడా సనాతన ఆచారాలు కాదు.. కొందరు స్వార్ధపరులు తమ స్వార్ధం కొరకు మధ్యకాలంలో జోగిని వంటి వాటిని ఆచారాలుగా ఏర్పరచి ఉంటారు.
సతీసహగమనం, జోగిని వంటి ఆచారాలను వ్యతిరేకించవలసిందే.
అయితే, ఆ విషయాలకు, శబరిమలలో స్త్రీల ప్రవేశానికి వయస్సు పరిమితి విషయానికి పోలిక లేదు.
ఇప్పటి సమాజంలో అసభ్యత, అశ్లీల చిత్రాల ప్రసారాలు, మాదకద్రవ్యాల వంటి కారణాల వల్ల ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి.చేతనైతే వీటికి అడ్దుకట్ట వేసేలా పోరాడాలి.
సమాజానికి ప్రమాదంగా ఉన్న ఎన్నో విషయాల గురించి ఏం చేయలేక, దేవాలయాల విషయంలో గొడవలెందుకు?
కొందరు ఏమంటున్నారంటే..
ReplyDeleteస్త్రీలు ఎంతో శక్తిమంతులు, ఈ కాలపు ఎందరో స్త్రీలు నెలసరి సమయంలో , గర్భధారణ సమయంలో కూడా ఉద్యోగాలు చేస్తూన్నారు కదా ! అలాంటప్పుడు, నెలసరి సమయంలో కూడా స్త్రీలు తీర్ధయాత్రలకు, దేవాలయాలకు వెళ్తే తప్పేంటి? అంటున్నారు.
నెలసరి సమయాల్లో స్త్రీలకు చికాకుగా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో స్త్రీలు ఇష్టంగా పనిచేయలేరు. తప్పనిసరి పరిస్థితిలో కష్టంగా పని చేస్తారు.
నెలసరి సమయంలో కూడా విశ్రాంతి లేకుండా కష్టపడి పనులు చేసే పరిస్థితి అనేది స్త్రీల ఖర్మ.
ఇక, నెలసరి సమయాల్లో కూడా తీర్ధయాత్రలు ఎందుకు చేయకూడదు? దేవాలయాల్లోకి ఎందుకు వెళ్లకూడదు?
అవన్నీ చేస్తేనే స్త్రీలకు సమానత్వం ఉన్నట్లు, అలా చేయపోతే సమానత్వం లేనట్లే అంటూ ... వాదిస్తూ దయచేసి స్త్రీలకు కొత్త కష్టాలు తేవద్దు.