koodali

Friday, October 5, 2018

.....సంబంధాలు ఉంటే తప్పేమిటి ?



 కొందరు స్త్రీలుపురుషులు ఏమంటున్నారంటే , 

వివాహేతర సంబంధాలు ఉంటే తప్పేమిటి ? అంటున్నారు.

ఇలా మాట్లాడే వాళ్ళు..  తమ భార్యలుభర్తలుకోడళ్ళు..  వివాహేతర సంబంధాలను ఏర్పరుచుకుంటే సమర్ధించి ప్రోత్సహిస్తారా?

***********

 వివాహేతర సంబంధాలు తప్పుకాదంటే ఇక వివాహ వ్యవస్థ ఎందుకు ?

స్త్రీ పురుషుల పరస్పర అంగీకారంతో కూడిన వివాహేతర సంబంధాలు తప్పుకాదనటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

ఇప్పటికే చాలామంది భార్యలు తమ భర్తల వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో  కష్టాలు పడుతున్నారు...

..ఇప్పుడిక ఇలాంటి భార్యల  కష్టాలు మరింత పెరిగే అవకాశముంది.


 స్త్రీ లైనాపురుషులైనా  తమ జీవితభాగస్వామికి  వివాహేతర సంబంధాలుంటే భరించలేరు.

ఇలాంటప్పుడు కుటుంబాల్లో గొడవలు జరుగుతాయికొన్నిసార్లు హత్యలుఆత్మహత్యలు కూడా జరుగుతాయి


 వివాహేతర సంబంధాల వల్ల కుటుంబ సంబంధాలు విచ్చిన్నం అవుతాయి.

***********
స్త్రీలకు అన్యాయం జరగకూడదు

అదే సమయంలో పురుషులకూ అన్యాయం జరగకూడదు.

 స్త్రీలకుపురుషులకు ఎవరి ప్రత్యేకత వారికుంది.
 వారు ఒకే విధంగా ఎలా అవుతారు?

 స్త్రీలు గర్భం ధరించి సంతానం పొందగలరు

తమకు కలిగిన సంతానం తన సంతానమే..అని నమ్మకంగా చెప్పగలరు.

పురుషులు గర్బం ధరించి సంతానం పొందలేరు కదా!

 స్త్రీలు వివాహేతరసంబంధాలు కలిగి ఉంటేసంతానం విషయంలో పురుషుని హక్కు సంగతేమిటి?

పెద్దవాళ్ళకు కూడా తమ వారసులు తరతరాలుగా  వృద్ధిలోకి రావాలని ఆశలు ఉంటాయి కదా!

సంతానం విషయమే కాకుండాభార్యకు భర్తకు...తమ కుటుంబం అనే ఒక భద్రతభరోసా ఉండాలి.

***********
వివాహేతర సంబంధాలు విషయంలో ..
ఎవరి బెదిరింపుల వల్లనైనా అలాంటి కార్యకలాపాలలో పాల్గొనవలసి వచ్చిందా

లేక ఇష్టపూర్వకంగా పాల్గొన్నారాఅనే విషయాలు పరిశీలించి, 

 స్త్రీ లైనా, పురుషులైనా..  తమ జీవితభాగస్వామి వివాహేతర సంబంధం ద్వారా మోసం చేస్తేఅందుకు సంబంధించిన వారిపై కేసు వేసే హక్కు ఉండాలి.

************

సమాజంలో స్త్రీలకు సమానత్వం లేదని వాపోవటం కన్నా...

.స్త్రీలుపురుషులు సమానమే అని చెబుతూ తల్లులు పిల్లల్ని పెంచితే స్త్రీలకుపురుషులకు సమానంగా గౌరవం ఉంటుంది.


అయితే,కొందరు స్త్రీలే సాటి స్త్రీల కష్టాలకు కారణం అవుతున్నారు. 
   
ఉదా..భార్యను గౌరవంగాప్రేమగా చూసుకోవాలని కొడుకులకు చెప్పే అత్తగార్లు  ఎందరుంటారు?


కొడుకు పెళ్లయి కోడలు వచ్చిన తరువాత  కోడలుకు వ్యతిరేకంగా మాట్లాడే  అత్తలు ఎందరో ఉన్నారు.

 మగవాళ్లు స్త్రీలకు శత్రువులన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు

అయితే..తండ్రిఅన్నదమ్ములు,భర్త, కొడుకులు..స్త్రీలకు శత్రువులా?

స్త్రీలందరూ మంచివారు..పురుషులందరూ చెడ్డవాళ్లు అని  అనుకోనక్కరలేదు.

ఎంతసేపూ,  స్త్రీలపట్ల పురుషాధిపత్యం నశించాలని అంటారు కానీ, స్త్రీల పట్ల సాటి స్త్రీల ఆధిపత్య ధోరణి నశించనక్కరలేదా?

*********************

  రోజుల్లో ఎన్నో కుటుంబాల్లో గొడవలువిడాకులు  జరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో  పిల్లలు మానసికంగా ఎంతో నలిగిపోతారు.

అందువల్ల ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. 
 


No comments:

Post a Comment