కొన్ని చోట్ల వర్షాకాలంలో దోమల సమస్య బాగా ఉంటుంది.
ఈ రోజుల్లో రసాయనాలతో కూడిన దోమల మందులు చాలా వచ్చాయి. అయితే, వీటిని ఎక్కువగా వాడటం మంచిదికాదని అంటున్నారు.
వెల్లుల్లి, వేప, కర్పూరం..వంటివి కూడ దోమలను పారద్రోలటానికి పనిచేస్తాయని అంటున్నారు కానీ....
రసాయనమందులతో పెరగటం, వాతావరణకాలుష్యం వల్ల వెల్లుల్లి, వేప వంటి వాటిలో వాటి సహజ శక్తి తగ్గిందేమో ? అని సందేహం వస్తోంది.
ఆ మధ్య వైజాగ్ చెందిన కొందరు యువత, మనుషులకు హాని కలగని విధంగా, దోమల మందు తయారుచేసారని వార్తలు వచ్చాయి.ఆ ప్రయోగాలు ఎంతవరకూ వచ్చాయో తెలియటం లేదు.
కొందరు ఏం చేస్తారంటే, దోమలు కుట్టకుండా ముఖం నుండి కాళ్ళవరకూ నిండా దుప్పటి కప్పుకుని పడుకుంటారు.
అలా ముఖంపై దుప్పటి కప్పేసుకుంటే కొన్నిసార్లు గాలి ఆడక చిరాగ్గా ఉంటుంది.
అలాగని ముఖంపై దుప్పటి తొలగిస్తే దోమలు కుట్టేస్తాయి.
నాకు ఏమనిపించిందంటే, దోమతెర క్లాత్ తెచ్చి, ఆ క్లాత్ ను ఒకదానిపై ఒకటి... రెండు పొరలుగా వేసి కుట్టించాలి.
ఒకే పొర ఉంటే ఆ కన్నాల నుంచి దోమలు కుడతాయి.
ఒకదానిపై ఒకటి రెండు పొరలు వేస్తే దోమలకు కుట్టడం అంత సులువుకాదు.
మామూలు దుప్పటికి తలవైపు ... రెండు పొరలుగా వేసిన దోమతెర క్లాత్ జాయింట్ చేసి కుట్టించుకోవాలి.
దోమతెరకు కన్నాలు ఉంటాయి కాబట్టి, ముఖం మీద కప్పుకున్నా గాలి సులువుగా తగులుతుంది.
ఈ విధానంలో కూడా దోమలు కుట్టే అవకాశాలు ఉన్నాయి కానీ, చాలావరకూ బెటర్.
******************
ఏసీగదుల్లో పడుకుంటే కొంతవరకు ఫరవాలేదు. .
అయితే, రోజూ ఏసీల్లో పడుకునే వారుకూడా కొన్నిసార్లు ఏసీ లేకుండా పడుకునే పరిస్థితులు ఉంటాయి.
ఉదా..కొన్ని పండుగ రోజుల్లో కొందరు ఏసీ గదిలో పడుకోరు. ..
అయినా ఎప్పుడూ ఏసీ వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు కదా !
**********************
కొందరు ఏసీ గదిలో చలి వల్ల ముఖం పై నుంచి కాళ్ళ వరకూ వరకూ దుప్పటి కప్పుకుంటారు.
శ్వాస ద్వారా ఆక్సిజన్ తీసుకుని , కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడతాం.
ఇవన్నీ గమనిస్తే, రాత్రంతా ముఖంపై దుప్పటి కప్పటం సరైనది కాదనిపిస్తోంది.
*************
నిద్రలో కాలోచెయ్యో తగిలి దోమతెర ప్రక్కకు వెళ్ళిపోతే దోమలు లోపలకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
కొన్ని సమస్యలు ఉన్నా కూడా దోమతెరల వాడకం మంచిది.
పాతకాలంలో పందిరి మంచాలకు దోమతెర రోజూ కట్టకుండా, మంచానికి కర్రలు బిగించే ఏర్పాటు ఉండేదట.. ఇప్పుడు కూడా కొందరు అలా ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ మధ్య అనేక కొత్తరకం దోమతెరలు కూడా వచ్చాయి.
వీటిని మంచంపై వేయవచ్చు. క్రిందకూడా వేసుకోవచ్చు. రోజూ మడిచేయవచ్చు.
వీటిలో కొన్ని పొడవు తక్కువగా ఉండి కాళ్ళు జాపుకోవటానికి సరిపోవట్లేదు... (వీటిలో చిన్నవి, పెద్దవి ఉన్నాయి. చూసి కొనుక్కోవాలి.)
నిద్రలో చేతులు, కాళ్ళు దోమతెరకు తాకితే బయట నుంచి దోమలు కుట్టే అవకాశాలు ఉన్నాయి.
ఏ దోమతెర అయినా , బయటకు వచ్చి తిరిగి పడుకునేటప్పుడు లోపలికి దోమలు వెళ్లాయేమో చెక్ చేసుకోవాలి.
*************.
దోమలు బాగా ఉన్న సీజన్లో... నిద్రలో ఉన్నవారినే కాకుండా , మేలుకుని ఉన్న వారిని కూడా కుట్టేస్తాయి.
అందువల్ల, పరిసరాల్లో దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.
* మరికొన్ని విషయాలను కామెంట్స్ వద్ద చదవమని కోరుతున్నానండి .
దుప్పటి కప్పుకునేటప్పుడు కాళ్ళవైపు కప్పుకున్న దుప్పటి భాగాన్ని తిరిగి తలవైపు కప్పుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ReplyDeleteదుప్పటికి ఒకవైపు పిన్నీసు పెట్టవచ్చు కానీ పొరపాటున పిన్నీస్ ఒపెన్ అయితే గుచ్చుకునే ప్రమాదముంది.
అందువల్ల, దుప్పటికి ఒక వైపు రెండు పూసలు కుట్టుకుంటే పూసలు ఉన్నవైపు దుప్పటి భాగాన్ని తలపై కప్పుకోవచ్చు.
ReplyDeleteకొందరు దోమలు కుట్టకుండా ముఖంపై దుప్పటి కప్పుకుంటారు.
కొందరు ఏసీ గదిలో చలి వల్ల ముఖం పై నుంచి కాళ్ళ వరకూ వరకూ దుప్పటి కప్పుకుంటారు.
**************
శ్వాస అర్థం ఊపిరితిత్తులచే కార్బన్ డయాక్సైడ్ (CO2) తొలగించి, ఆక్సిజన్ తీసుకోవడం, శక్తి ఉత్పత్తికి గ్లూకోజ్ తో పాటు వాయువు అవసరం. ...CO2 తొలగించడం తప్పనిసరి, ఎందుకనగా ఇది ఒక వ్యర్థ ఉత్పత్తి మరియు CO2 అనేది చాలా ఎక్కువ విషపూరితమైనది. (వికీపీడియా)
మనం, శ్వాస ద్వారా ఆక్సిజన్ తీసుకుని, కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడతాం.
పై విషయాలను గమనించితే, నిద్రించే సమయంలో రాత్రంతా ముఖంపైన దుప్పటి కప్పేయటం మంచిది కాదనిపిస్తుంది.
ReplyDeleteరెండక్షరాల దోమ ఇంత పెద్ద టపా రాయించిందంటే అవెంత పవర్ ఫుల్ రెండక్షరాలో కదా :)
దోమల బెడద పోగొట్టగలమే !?
జిలేబి
ReplyDeleteజిలేబీగారు మీరన్నది నిజమేనండి. దోమలు చాలా శక్తిగలవి.
చిన్నదోమ కాటువల్ల ఎన్నో జబ్బులు వస్తాయి.
మనుషులు అంతరిక్షంలోకి వెళ్తున్నారు కానీ, దోమలను మాత్రం పోగొట్టలేకపోతున్నారు.