koodali

Wednesday, September 5, 2018

వైద్యులు,నర్సులు.. బాధలు... సిరంజిల.. ప్రమాదాల నుండి రక్షణ కల్పించే గ్లవ్స్ ...మరియు ..


 ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలండి.   
**************
  
ఈ రోజుల్లో ఎవరి బాధలు వాళ్లకున్నాయి. 

ఉదా..వైద్యులు, నర్సులకు ఎంతో పని వత్తిడి ఉంటోంది. 

కొన్నిసార్లు పేషెంట్లకు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో పొరపాటున ఆ సూది వైద్యులకు, నర్సులకు తగిలి గుచ్చుకునే ప్రమాదముంది. ఈ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. 

ఆసుపత్రి పారిశుధ్య సిబ్బందికి  కూడా చాల బాధలు ఉంటాయి.  ఆసుపత్రి వేస్ట్ ను శుభ్రం చేస్తున్నప్పుడు పారిశుధ్య సిబ్బంది చాలా  జాగ్రత్తగా ఉండాలి. 

 ఇంకా, పీజీ చదివే వాళ్ళయితే, కొన్నిసార్లు వరుసగా 32 గంటలు పనిచేయవలసిన పరిస్థితి ఉంది.

 అంటే, ఈ రోజు ఉదయాన్నే డ్యూటీకి వెళ్తే,  మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పనిచేయవలసి ఉంటుంది. 

రాత్రి నిద్రవస్తే ఆపుకోవాలి.అదృష్టం బాగుండి కొంత సమయం లభిస్తే , కుర్చీలో కూర్చుని కొంతసేపు కునుకు తీస్తారు.

 వరుసగా అన్ని  గంటలు నిద్ర లేకుండా పని చేయాలంటే కష్టం. 

కొందరు నిద్ర ఆపుకోలేక మరుసటి రోజుకు నీరసంతో పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది.

వీళ్లకు ఆదివారం సెలవు కూడా ఉండవు.

 ఇలాంటి పరిస్థితిలో వందలాది పేషెంట్లను సరిగ్గా  చూడాలంటే మాటలు కాదు. 

వత్తిడి తట్టుకోలేక కొందరు పీజీ విద్యార్ధులు చదువు వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

 ఎంతో ఇష్టంగా వైద్యవృత్తిలో చేరిన కొందరు పిల్లలు, ఈ వత్తిడి భరించలేక  ఎందుకు వైద్యవృత్తిలోకి వచ్చామా? అని నిరాశకు లోనవటమూ జరుగుతోంది.

 మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచి ఎక్కువమందికి అవకాశాలు వస్తే , వైద్యుల సంఖ్య పెరిగి వత్తిడి తగ్గే అవకాశాలున్నాయి.అప్పుడు పేషెంట్లకు కూడా ఉపయోగమే.

 పనివత్తిడితో నీరసంగా ఉన్న వైద్యులు వందలాది పేషెంట్లను జాగ్రత్తగా చూడాలంటే కష్టం.

 ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాశం ఉంది. అప్పుడు మళ్లీ వైద్యులనే నిందిస్తారు. 

 వైద్యులలో కూడా తప్పులు చేసే వారున్నారు కానీ , చాలామంది వైద్యులు తమకు ఎంత వత్తిడి ఉన్నా భరిస్తూ పేషెంట్లకు ఓపికగా చికిత్స చేస్తారు.

( సైనికులు, పోలీసులు ఇంకా కొందరు కూడా  కొన్నిసార్లు వరుసగా చాలా గంటలు పనిచేయవలసి ఉంటుంది....ఐటి ఉద్యోగస్తులు కూడా కొన్నిసార్లు 32 గంటలు వరుసగా పనిచేయవలసి ఉంటుంది. )

 ఈ రోజుల్లో పిల్లలకు చదువుల భారం, పెద్దలకు పని భారం. ఏమిటో విశ్రాంతి లేని జీవితాలయ్యాయి.

**************
వైద్యులకు, నర్సులకు రక్షణ కల్పించే 
Needle Resistant Gloves..  వివరాలను అంతర్జాలంలో  చూడగలరు.  
 



No comments:

Post a Comment