కాలేజీల్లో హాస్టల్స్లో కొత్తగా చేరే పిల్లలు భయపడుతుంటారు. కొత్త ప్రదేశం అంతా కొత్త. ఇలా ఉంటే సీనియర్లు కొందరు కొత్తవాళ్లను రాగింగ్ చేయటం అనాగరికం, రాక్షసత్వం. కొత్తవారికి భయం పోయేలా ధైర్యం చెప్పాలికాని, ఏడిపించటం ఏమిటి?
రాగింగ్ చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలి. రాగింగ్ చేసిన వాళ్ళను శిక్షించటం..వాళ్లు పై క్లాసుకు వెళ్లకుండా ఒక సంవత్సరం ఆపటం, ఆఖరు సంవత్సరం వాళ్ళయితే ఆ సంవత్సరం పరీక్షలు రాయకుండా ఆపటం..వంటివి చేస్తే రాగింగ్ చేయడానికి భయపడతారు. రాగింగ్ చేసి సాటి పిల్లల్ని ఏడిపించటం రాక్షసత్వం.
No comments:
Post a Comment