koodali

Monday, September 21, 2026

ఉట్టి కొట్టటం....

 
 

కొందరు పండుగలప్పుడు ఉట్టి కొట్టటం చేస్తారు. ఉట్టి కొట్టటం..తాడుకు ఉట్టి కట్టి, దానిని కొట్టటానికి ప్రయత్నించటం. ఈ రోజుల్లో ఉట్టి కొట్టే వారిపై పైపుతో చాలా నీటిని కొడుతున్నారు. 

పాతకాలంలో ఉట్టి కొట్టేటప్పుడు,  ఉట్టి ఎత్తుగా కట్టి, దానిని పైకి క్రిందకు లాగుతూ దొరికినప్పుడు కొట్టేవాళ్లు. అలా సరదాగా ఉంటుంది. 

నీటిని పైపుతో కొడితే  సరదాగానే ఉంటుంది కాని, పైపుతో నీటిని కొట్టేటప్పుడు నీరు స్పీడుగా కంట్లో పడే ప్రమాదముంది. 

వివాహంసందర్భంగా పెళ్లికొడుకును చేసినప్పుడు కూడా ఇలా చేస్తున్నారు. కళ్ళలోకి నీరు వెళ్లి కళ్లు ఎర్రగా కూడా అవుతాయి.

చాలా నీరు వృధా చేస్తున్నారు. నీరు సరిగ్గా లేనివారికి నీటి విలువ తెలుస్తుంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి.

............................

ఈ రోజుల్లో ఫంక్షన్లలో భోజనాలు ప్లేట్లకు ప్లాస్టిక్ కొంత తగ్గించారు. కాని, స్వీట్లు వంటివి పెట్టటానికి చిన్నప్లాస్టిక్ కప్పులు స్పూన్లు పెడుతున్నారు. ఇవన్నీ తిన్నాక బోలెడు ప్లాస్టిక్ బయట పడేస్తారు. ప్లాస్టిక్ కప్పులు బదులు, ఆకులతో చేసే చిన్నకప్పులలో ఇవ్వాలి.

కొన్ని పేపర్ ప్లేట్లకు పైన సన్నని ప్లాస్టిక్ పొర ఉంటోంది. ప్లేట్ కూదా ఏదో వాసనవస్తుంది. విస్తరాకులే బెటర్.

చెక్కస్పూన్లు, పేపర్ ప్లేట్లకు కూడా చాలా చెక్క అవసరమవుతోందట. చెక్క అంటే చెట్లనుంచి వస్తుందని కొందరికి తెలియకపోవచ్చు.  చెట్లన్నీ కొట్టుకుంటూ పోతే పర్యావరణం పాడయ్యి చాలా నష్టాలున్నాయి.

ఇక, పాతకాలంలోలా విస్తరాకుల్లో.. చేత్తో తినాలి. 

 

 


No comments:

Post a Comment