భారతీయులు చాలామంది ఎందుకు విపరీతంగా ప్రవర్తిస్తున్నారో తెలియటం లేదు. స్వార్ధం, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే అత్యాశ, అశుభ్రత, ఒక పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారు.క్యూలైన్లలో వెళ్ళటం పాటించరు.
దేశంలో కొందరు తమకు డబ్బు, అధికారం కొరకు సాటిమనుషులను పట్టించుకోవటం లేదు. చచ్చాక ఏమవుతారో తెలియదు. చేసిన పాపాలకు మరుజన్మలో ఎన్ని కష్టాలు పడతారో తెలియదు.తరతరాలకు కూడబెట్టి ఏం లాభం?
వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పోయటం, కిళ్లీలు ఊయటం, ఇలా ఎన్నో ఎన్నెన్నో..రైల్వేస్టేషన్, బస్సుస్టాండ్లు..పబ్లిక్ ప్లేసెస్ అశుభ్రత చూస్తే వాంతి వస్తుంది.పబ్లిక్ టాయ్లెట్లు సంగతి ఇక చెప్పనక్కరలేదు.
విదేశాలకు వెళ్ళి కూడా మన అశుభ్రత చూపిస్తున్నారు. విదేశాల్లో రోడ్లపైన సినిమాడాన్సులు వేస్తూ గొప్ప అనుకుంటున్నారు.
విదేశాల్లో పెద్దపెద్దశబ్దాలు చేస్తే ఊరుకోరు. భారతదేశంలో ఎన్ని శబ్దాలు చేసినా పట్టించుకునే వాళ్ళులేరు.విపరీతమైన శబ్దంతో మైకు పెట్టినా చెప్పుకునే దిక్కులేదు.
కొందరు విదేశీయులు వాళ్ళ దేశాలను ఎంతో శుభ్రంగా ఉంచుకుంటున్నారు. పువ్వులమొక్కలు, రోడ్లపక్కన చెట్లు ఎంతో అందంగా ఉంటాయి.వీటికి ఎక్కువ డబ్బు ఖర్చు ఉండదు. మనదేశంలో ఎవరైనా చెట్లు పెట్టినా కూడా, రకరకాల కారణాలు చెప్పి కొట్టేయటం ఎక్కువ.
సనాతనసాంప్రదాయంలో శుభ్రతకు ఎంతో విలువుంది.అశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఉండదన్నారు.
కొన్ని జనాభా ఎక్కువున్న దేశాల వాళ్ళు కూడా తమ దేశాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నారు.భారతీయులు ఎందుకు మురికిగా ఉంటున్నారో? చాలా బాధగా ఉంది. విదేశాలను చూసి మనం శుభ్రతను పాటించాలి..అనుకునే పరిస్థితి వచ్చింది.
అందరూ ప్రయత్నిస్తే కొంతకాలంలోనే శుభ్రంగా మార్చుకోవచ్చు. మొక్కలు, చెట్లు పెరగటానికి మరికొంత సమయం పడుతుంది. అవి పెరిగితే ఇంకా బాగుంటుంది.
అయినా దైవచిత్రాలను ఎక్కడపడితే అక్కడ ముద్రించి, చెత్తకుప్పల్లో వేసే వాళ్లకు శుభ్రత గురించి ఏం చెబుతాం..
నదులను దైవాలుగా పూజిస్తూనే..నదుల్లో ప్లాస్టిక్, నగరాల మురికి, పరిశ్రమల వ్యర్ధాలు వదిలే వాళ్లకు శుభ్రత గురించి ఏం అర్ధమవుతుంది?
ఎంతమంది తిడుతున్నా..సినిమాలు, క్రికెట్ చూడటం, చెత్తను రోడ్ల పక్కన పడేసి, పట్టించుకోకుండా ఆ రోడ్లపైన తిరగటం..ఇంకా ఎన్నో ఉన్నాయి...
పరీక్షలు అయిపోతే రోడ్లపైన పేపర్లు వెయ్యకూడదని పిల్లలకు తల్లితండ్రి, స్కూల్లో టీచర్లు చెప్పాలి. పెద్దవాళ్ళే శుభ్రత పాటించనప్పుడు ఇక పిల్లలకేం చెబుతారులే.
జనం ఎప్పటికి మారుతారో? పట్టించుకోకుండా బతకటం అలవాటయిన వాళ్ళకు..?
ఆ మధ్య ఒకే అబ్బాయి ఒక్కడే ఒక నదిని శుభ్రం చేశాడని వార్తల ద్వారా తెలిసింది. నిజంగా ఎంతో గొప్ప వ్యక్తి.అతని జన్మ ధన్యము. అలాంటి మనుషులుంటే చాలు.
ఒక్క మనిషి అంత చేశాడంటే అందరూ తలచుకుంటే ఏదైనా చేయొచ్చు కదా..సినిమాహాల్లో పేపర్లు చింపి పొయ్యటం, రోడ్లపైన పేపర్లు చింపిపొయ్యటం, ఎవరు ఎత్తుతారు అవన్నీ?
ఒక్కడయ్యి కూడా, నదిని శుభ్రం చేసిన అబ్బాయి ఎంతో గొప్పవాడు.
నేను కూడా ఆ అబ్బాయిలా చెయ్యలేను. నా పరిధిలో నేను ప్లాస్టిక్ విచ్చలవిడిగా పడెయ్యకుండా రోజు వచ్చే ప్లాస్టిక్ ఒకపెద్ద ప్లాస్టిక్ బాగ్ లో వేసి, అది నిండాక గట్టిగా కట్టి బయట పెడతాను. ఇలా కొంతవరకు నేను చేయగలిగింది చేస్తున్నాను.
అందరూ ఆ అబ్బాయిలా శుభ్రం చేయలేరు కాని, ఎవరి పరిధిలో వారు శుభ్రతను పాటిస్తే సమాజం దానికదే బాగుపడుతుంది.
అయితే, ఎంతచెప్పినా వినకుండా సమాజాన్ని పాడుచేసేవాళ్లు కూడా కొందరు ఉంటారు.వాళ్లకు తగిన శిక్షలు వేయాలి.
సమాజాన్ని బాగుచేసేవారి సంఖ్య పెరిగితే చాలా విషయాలు బాగుంటాయి.
No comments:
Post a Comment