ఊరు వెళ్ళి ఈ మధ్యే వచ్చాము. ఊళ్ళు వెళ్ళినప్పుడు అనేక ప్రాంతాలు చూస్తుంటాము. ఇలాంటప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా మనదేశంలో పేదరికం వంటి సమస్యలు ఇంకా ఎందుకున్నాయో ? అనిపిస్తుంది.
ప్రజలు తలచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే, చాలామంది ప్రజలలో దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన అంతగా లేదు.
తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోలనే తాపత్రయం తప్ప దేశం బాగుపడాలనే తాపత్రయం తగ్గిపోయింది.
ఇతర దేశాలు చక్కగా అభివృద్ధి అయినప్పుడు మన దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు ? అయితే, ఇక్కడ చాలామందిలో బాధ్యత, చిత్తశుద్ధి వంటివి లేవు.
ఎవరైనా ఏదైనా మాజిక్ చేసి దేశాన్ని బాగుచేస్తే ఎంజాయ్ చేయటానికి మాత్రం చాలామంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతేకానీ, దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ కృషిచేయాలని చాలామంది అనుకోవటం లేదు.
ప్రతి ఒక్కరు తమ పనినితాము నీతిగా, చిత్తశుద్దిగా చేస్తే చాలు దేశం దానికదే బాగుపడుతుంది. అయితే, అలాంటి పరిస్థితి ఎప్పుడొస్తుందో తెలియటం లేదు.
అభివృద్ధి చెందిన విదేశాలను చూసి నిట్టూర్చటం తప్పా, మన దేశాన్ని మనం బాగుచేసుకోలేక పోతున్నాం. మన దేశాన్ని బాగుచేసుకోలేని దద్దమ్మలమా మనం?
స్వాతంత్రోద్యమ కాలపు ప్రజలలో చాలమందికి పౌరుషం, దేశాన్ని బాగుచేసుకోవాలనే తపనా ఉండేవి.

ఇప్పటి కాలంలో చాలామందికి ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే తాపత్రయం తప్ప ఇంకేమీ ఫీలింగ్స్ లేవు.
మనుషులు మంచిగా ఉంటే ప్రపంచంలో మంచి ఉంటుంది.
చాలామంది అవినీతి..అత్యాశ..స్వార్ధం..చెడ్డ కోరికలతో ప్రపంచంలో చెడును పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మార్పు ఎప్పుడొస్తుందో ?
..................
దైవభక్తులము అనుకునేవారు, చెడ్డపనులు చేసి ప్రపంచంలో చెడును పెంచకూడదు..ప్రపంచాన్ని కష్టపెట్టకూడదు కదా..మనస్సును అదుపులో ఉంచుకుని మంచిగా ప్రవర్తించేలా గట్టిగా ప్రయత్నించాలి.
..............................
ప్రపంచంలో అందరూ మంచిబుద్ధితో ఉండేలా దయచూడమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
అందరూ మంచిగా జీవించటానికి గట్టిగా ప్రయత్నించాలి.
దైవమే దిక్కు.
..................................
లోకంలో కొందరు దుర్మార్గులు
దారుణాలు చేసినప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే, దైవం లోకంలోని చెడ్డవారిని
అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది.
అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా?
దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా, సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.
మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది.

అంతా దైవము దయ.
No comments:
Post a Comment