కొన్ని విద్యాసంస్థలలో కొత్తగా చేరిన వారిని పాతవాళ్లు ర్యాగింగ్ చేస్తారట.
అయితే , కొన్ని కుటుంబాలలో కూడా కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలిని ఆ ఇంట్లోని సీనియర్ మహిళలు ర్యాగింగ్ చేస్తారు. ఈ తంతు పెళ్లిచూపుల నాడే మొదలవుతుంది.
ఉదా...అమ్మాయి జడ నిజమైనదా ? సవరమా ? అని జడ పట్టి గుంజే మహిళలూ ఉంటారు. ఇక, ఇలాంటి మనస్సు కలుక్కుమనే సంఘటనలెన్నో మొదలవుతాయి.
ఇక , పెళ్లిలో మర్యాదలు, పెట్టుపోతలు గురించి వచ్చే గొడవల సంగతి చెప్పనే అక్కరలేదు.
( పెళ్ళి జరిగిన ఎన్నో సంవత్సరాల తరువాత కూడా భార్యాభర్త తిట్టుకోవటానికి ఈ విషయాలు కారణమవుతాయి. )
ఇక, వివాహం జరిగి అమ్మాయి అత్తగారింటికి వచ్చిన తరువాత జీవితం రకరకాలుగా ఉంటుంది.
( అత్తవారిల్లు అన్నారు కానీ, మామగారిల్లు అని ఎందుకు అనలేదో ?....)
.........................................
అత్తగారికేమో.... తన కొడుకును కోడలు చెంగున ముడేసుకుని తనను తిట్టిస్తుందేమోననే భయం పట్టుకుంటుంది.
కోడలికేమో ... భర్త తల్లి మాట విని తనను తిడతాడేమోననే భయం పట్టుకుంటుంది.
ఆడపడుచులకేమో... పుట్టింటిలో తమ ప్రాధాన్యత తగ్గిపోతుందేమో ? అనే భయం పట్టుకుంటుంది.
ఈ అత్తాకోడలి సంగ్రామంలో ఎవరి ప్రక్క మాట్లాడితే ఏమవుతుందో ? ....అని జుట్టు పీక్కుంటారు మగవాళ్ళు.
( మగవాళ్ళకు ఎక్కువగా బట్టతల రావటానికి ఇదీ ఒక కారణమేమో ? )
భార్యతో ఎక్కువగా మాట్లాడితే భార్యావిధేయుడైపోయాడని తల్లితండ్రి అనుకుంటారేమోనని మొహమాటం పడే మగవాళ్ళూ ఉంటారు... ఏమిటో ఈ ఖర్మ.
........................................
అత్త తానూ ఒకప్పుడు కోడలినే అనే విషయాన్ని గుర్తుంచుకోవటానికి అస్సలు ఇష్టపడదు.
కోడలు తానూ భవిష్యత్తులో అత్తగారు అవుతుందన్న విషయాన్ని ఆలోచించటానికి అస్సలు ఇష్టపడదు.
ఆడపడుచు తానూ ఒకింటి కోడలినే అనే విషయాన్ని తలుచుకోవటానికి అస్సలు ఇష్టపడదు.
.............................................
ఇంట్లో చిన్న విషయానికే సూటిపోటి మాటలు, సందు దొరికితే ఒకరిమీద ఒకరు పితూరీలు ...ఇవన్నీ భరించలేనంత బాధగా ఉంటుంది.
కొన్ని సూటిపోటి మాటలు వింటే మనస్సు నలిగిపోతుంది. ఇలాంటప్పుడు , పెళ్ళి ఎందుకు చేసుకున్నాము బాబోయ్.... అనుకుంటారు ఆడవాళ్ళు .
.................................
కొందరు అత్తలు తమ కోడళ్ళను సాధింపులతో పీల్చి పిప్పి చేస్తారు . బతికుండగానే నరకాన్ని చూపిస్తారు .
చిత్రమేమిటంటే అత్తవారింట కష్టాలు పడ్డ ఈ కోడళ్లు తాము అత్తగార్లుగా మారిన తరువాత తమ కోడళ్ళను వేధిస్తారు.
ఈ రోజుల్లో కూడా కట్నం కోసం కోడళ్ళను కాల్చిన అత్తలు, ఆడపడుచులూ ఉన్నారు . కోడలికి పుట్టబోయేది ఆడపిల్ల అని అనుమానం వస్తే అబార్షన్ చేయించుకోవాలని ఆర్డర్ జారీ చేసే అత్తల గురించీ విన్నాము.
ఈ కాలంలో చాలామంది అత్తాకోడళ్లు కలిసి ఒకే దగ్గర ఉండకపోయినా , ఫోన్ల ద్వారానే పితూరీలు ప్రసారం చేస్తూ కాపురాలను అల్లకల్లోలం చేసేస్తున్నారు.
................................
అసలు ఆడవాళ్ళ కష్టాలకు చాలా వరకూ కారణం తోటి ఆడవాళ్ళే. భర్తభార్యను తిడుతుంటే వద్దని ఆపే అత్తలు ఎందరుంటారు ?
తల్లి చెపితే కొడుకు కొంతయినా తగ్గుతాడు కదా ! అలా ఆపకపోగా కోడలి మీద పితూరీలు చెప్పి విషయాన్ని పెద్దది చేసే అత్తల సంఖ్య ఎక్కువే.
...................................
తల్లితండ్రికి పిల్లలకు మధ్య విభేదాలను కల్పించటం పాపం ...భార్యాభర్త మధ్య విభేదాలను కల్పించటమూ పాపమే ... అని పెద్దలు తెలియజేసారు.
................................
అయితే అక్కడక్కడా కొందరు మంచిగా ప్రవర్తించే అత్తలూ ఉంటారు. కొడుకూకోడలూ బాగుండాలని పూజలు చేయించే అత్తమామలూ ఉంటారు.
అయితే ఇలాంటి వారిలో కూడా కొందరు అప్పుడప్పుడూ కోడళ్ళను సాధిస్తుంటారు. ఇలా చేయటానికి వీరిలో ఉన్న అభద్రతా భావం కారణం అయి ఉండవచ్చు.
.....................................
ఇప్పుడు వచ్చే కొన్ని సీరియల్స్ వల్ల కూడా అత్తాకోడళ్లు ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి పెరుగుతోంది.
ఈ మధ్య ఒక సినిమాలో ఒక తల్లి తన కొడుకుతో ఏమంటుందంటే ....
ఏరా! నీ పెళ్లి జరిగిన తరువాత నన్ను ఎక్కువ గౌరవిస్తావా ? నీ భార్యను ఎక్కువ గౌరవిస్తావా ? అని అడుగుతుంది.
( డైలాగులను ఉన్నది ఉన్నట్లు రాయటానికి గుర్తు రావటం లేదు. )
అసలు ఇలా ఎందుకు ఆలోచించాలి ? వివాహం జరిగిన తరువాత తల్లి విలువ తల్లికీ ఉంటుంది. భార్య విలువ భార్యకూ ఉంటుంది. జీవితంలో తల్లికీ గొప్ప స్థానం ఉంటుంది. భార్యకూ గొప్ప స్థానం ఉంటుంది.
అత్తా కోడళ్ళ మధ్య ఈ పోటీ వల్ల సంసారాలు నరకప్రాయంగా మారుతున్నాయి.
...................................
ఆడవాళ్ళ కష్టాలకు పురుషులే కారణమని కొందరు అంటుంటారు కాని, అది పూర్తిగా నిజం కాదు .
ఈ మధ్య ఒక సినిమాలో ఒక తల్లి తన కొడుకుతో ఏమంటుందంటే ....
ఏరా! నీ పెళ్లి జరిగిన తరువాత నన్ను ఎక్కువ గౌరవిస్తావా ? నీ భార్యను ఎక్కువ గౌరవిస్తావా ? అని అడుగుతుంది.
( డైలాగులను ఉన్నది ఉన్నట్లు రాయటానికి గుర్తు రావటం లేదు. )
అసలు ఇలా ఎందుకు ఆలోచించాలి ? వివాహం జరిగిన తరువాత తల్లి విలువ తల్లికీ ఉంటుంది. భార్య విలువ భార్యకూ ఉంటుంది. జీవితంలో తల్లికీ గొప్ప స్థానం ఉంటుంది. భార్యకూ గొప్ప స్థానం ఉంటుంది.
అత్తా కోడళ్ళ మధ్య ఈ పోటీ వల్ల సంసారాలు నరకప్రాయంగా మారుతున్నాయి.
...................................
ఆడవాళ్ళ కష్టాలకు పురుషులే కారణమని కొందరు అంటుంటారు కాని, అది పూర్తిగా నిజం కాదు .
No comments:
Post a Comment