koodali

Thursday, March 27, 2014

సందర్భాన్ని బట్టి సర్దుబాట్లు ....

ఈ  రోజుల్లో  బిజీ  జీవితాల  వల్ల   కుటుంబసభ్యులకు  సరిగ్గా  మాట్లాడుకోవటానికే  సమయం  కుదరటం  లేదు.

కొందరు   భార్యాభర్త  ఉద్యోగరీత్యా  వేరే  దగ్గర  ఉంటున్నారు.  ఇలా  ఎక్కువ  కాలం  ఉండటం  మంచిది  కాదు.
.........................................

స్త్రీలు   సహజంగా  కుటుంబానికి  ఎక్కువ  ప్రాధాన్యతను  ఇస్తారు.  భర్త  కొంచెం  మంచిగా  మాట్లాడితే  చాలు  సంతోషపడిపోతారు.


అయితే     ఎంచేతనో   కొందరు  పురుషులు   భార్యతో    తక్కువగా  మాట్లాడతారు.  బయట  అందరితో  చక్కగా  మాట్లాడే  వ్యక్తి  ఇంటికి  వచ్చేసరికి  ముభావంగా , ముక్తసరిగా  అయిపోతారు.


   ఎక్కువ  మాట్లాడితే  భార్య  నెత్తికెక్కుందేమోనని  ఇలాంటి  వాళ్ళ  భయం  కాబోలు.

బయట  వాళ్ళు  కొంచెం  సాయం  చేసినా  తెగ  పొగిడే  వ్యక్తి  తన  భార్య  ఎంత  సాయం  చేసినా  పట్టించుకోరు.  ఆ  ఏముంది,  తన  బాధ్యత  కాబట్టి  చేస్తుంది,  అంతే..  అనేస్తారు.


బయట  వాళ్ళకు  ఎంతో  విలువనిచ్చి  జీవితభాగస్వామికి  తక్కువ  విలువనిచ్చే    మనస్తత్వం  ఉన్నప్పుడు  కుటుంబంలో  కలతలు  వస్తాయి..


ఇలాంటి  వారి   కుటుంబ  జీవితం  సరిగ్గా  ఉండదు. 
 
......................................
ఈ  రోజుల్లో  కొత్తరకం  ఉద్యోగాలు  వచ్చిపడ్డాక  భార్యకు  భర్తకు  సరిగ్గా  మాట్లాడుకోవటానికి  కూడా  కుదరటం  లేదు. 

ఐటీ  కంపెనీల్లో    రాత్రి,  పగలు  తేడా  లేకుండా  ఉద్యోగాలు  చేయవలసి  వస్తోంది. 

విదేశాల  వారికి  పగలు  మనకు  రాత్రి  అయితే , మనవాళ్ళు   నిద్ర  మేల్కొని  ఉద్యోగాలు  చేసి  డబ్బు  సంపాదిస్తారు.  ఇదే  గొప్ప  అభివృద్ధి  అనుకుంటున్నారు  జనాలు.


 ( ఒకప్పుడు  ప్రపంచానికే    ఆదర్శ  దేశమైన  భారతదేశ  పరిస్థితి    ఇంకొకరి  మీద  ఆధారపడే  విధంగా  ఇలా  తయారయ్యింది.  )

 
........................................

కొందరు  పురుషులు  ఫ్రెండ్సే  లోకంగా  బ్రతికేస్తుంటారు.  వివాహం  అంటే  ఎన్నో  బాధ్యతలు  ఉంటాయి.  


 వివాహం  జరిగినా  కూడా  ఇంకా  బాచ్ లర్  లా   ఫ్రెండ్స్ తో    కులాసాగా  కబుర్లు  చెప్పుకుంటూ  ఎక్కువ  సమయాన్ని  గడపటానికి  ఇష్టపడుతుంటారు.

ఇందువల్ల  కుటుంబములో  ఎన్నో  మనస్పర్ధలు  వస్తుంటాయి.


ఈ  కాలంలో  కొందరు  స్త్రీలు  కూడా  కుటుంబబాధ్యత  కన్నా  ఫ్రెండ్స్ తో  సమయాన్ని  గడపటానికి  ఇష్టపడుతున్నారు.


జీవితంలో  ఫ్రెండ్స్  అవసరమే  కానీ,  కుటుంబము,   కెరీర్ ,  ఫ్రెండ్స్ ..దేనికి  ఎంతవరకు  ప్రాముఖ్యతను  ఇవ్వాలో  ఎవరికి  వారు  తెలుసుకోవాలి. 

 
...................................................

 సైనికులు ,    వైద్యులు   వంటి  వృత్తులలో  ఉండేవారికి   అయితే  కొన్నిసార్లు  కెరీర్ కు    ఎక్కువ  ప్రాధాన్యతను  ఇవ్వవలసి  వస్తుంది.

   ఇవన్నీ  ఎవరికి  వారికి  తెలుస్తాయి.  సందర్భాన్ని  బట్టి   భార్యభర్త   సర్దుబాట్లు  చేసుకోవలసి  ఉంటుంది.

.......................................


కొన్ని  సంస్థలలో  ,   ఉద్యోగస్తులు   కుటుంబసభ్యులులా  కలిసి   స్నేహంగా   పనిచేయాలని , అప్పుడే  సంస్థ  అభివృద్ధి  వేగవంతమవుతుందని   సంస్థవాళ్లు  ఆశిస్తారు. 


  తమ  వద్ద  పనిచేసే  ఉద్యోగస్తుల  కోసం  ఎన్నో  వినోదకార్యక్రమాలను  ఏర్పాటు  చేస్తారు. ఇలా  అయితే,  ఎక్కువ  సమయం  ఆఫీసులోనే  సరిపోతుంది. 

కొన్ని   సంస్థలలో  పనిచేసేవారికి   తమ    కుటుంబసభ్యులతో  గడపటానికి  ఎక్కువ  సమయం  దొరకదు. 


 ఉదా..భార్య  పగలు  ఉద్యోగానికి  వెళ్తుంది.  భర్త  రాత్రి  షిఫ్ట్  ఉద్యోగానికి  వెళ్తాడు.
.....................................................

ఇక  సెలిబ్రిటీల  జీవితం  మరీ  పాపం  అనిపిస్తుంది.  వారికి  కుటుంబముతో  గడపటానికి  ఎక్కువ  సమయం  దొరకదు. 


 దానికి  తోడు  ఎవరెవరో  వచ్చి ... మా  సభకు  ముఖ్య  అతిధిగా  మీరే  తప్పక  రావాలి.  అని  మొహమాటపెట్టేస్తారు.

  ఇక   సెలవు  రోజులలో  కూడా  సెలబ్రిటీలకు   కుటుంబముతో  గడపటానికి  కుదరదు.
...........................................

పురుషులు  తమను  సరిగ్గా  గౌరవించకపోవటం  వల్లే  తామూ  తమ  ఇష్టప్రకారం  జీవిస్తాం  అంటున్నారు   ఈ  కాలపు   కొందరు  స్త్రీలు.


  ఇలా  అనటం  తప్పు.  కొందరు  పురుషులు  వేధించినా  కూడా  స్త్రీలు  దారి  తప్పకూడదు. 

స్త్రీలను  బాధపెట్టే  పురుషులు  వాళ్ళ  ఖర్మను  వాళ్ళు  అనుభవిస్తారు.  పురుషుల  మీద  కోపంతో  స్త్రీలు  తప్పుటడుగులు  వేయకూడదు.


 ఇతరులు తప్పులు   చేసారని  తామూ   తప్పులు  చేయకూడదు  కదా!



4 comments:

  1. సద్దుబాటు తెలియాలి, భార్య భర్తల మధ్య సద్దుబాటు, అదొక కళ, చెబితే రాదు :)

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీరు వ్రాసినట్లు , భార్య భర్తల మధ్య సద్దుబాటు, అదొక కళ..అన్నది నిజమే.

    అయితే పూర్వజన్మ కర్మ ప్రభావం, వర్తమానంలో చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం కూడా జీవితంపై ఉంటుందనిపిస్తుంది. ఇవన్నీ తట్టుకుని నిలబడాలంటే దైవమే దిక్కు.

    జీవితంలో అన్ని సమస్యలకు దైవకృపను పొందటమే పరిష్కార మార్గం అనిపిస్తుందండి.

    ReplyDelete
  3. బాగా చెప్పారండి. ధన్యవాదములు.

    ReplyDelete
  4. మీకు కూడా ధన్యవాదములండి.

    ReplyDelete