koodali

Saturday, March 22, 2014

సంతోషంగా మనసారా నవ్వటానికి బోలెడు డబ్బు అవసరం లేదు.. ఈ యూ ట్యూబ్ చూడండి.


  సంతోషంగా  మనసారా  నవ్వటానికి   బోలెడు  డబ్బు  అవసరం  లేదు..



   చూడండి...... 

Hysterical bubbles! (original) - laughing baby - YouTube



Baby Laughing Hysterically at Ripping Paper (Original) - YouTube 


****************
 
marikonni vishayamulu...

ఈ రోజుల్లో పనులు చేయటానికి మనుషులు లభించటంలేదని  కొందరు అంటారు కానీ, అది నిజంకాదు. ఈరోజుల్లో ఉపాధిలభించని మనుషులు ఎందరో ఉన్నారు. ఉపాధి లేక ఇతరప్రాంతాలకు,దేశాలకు వెళ్తున్నారు. తక్కువ జీతం తీసుకునే వారికొరకు యజమానులు ఎదురుచూస్తారు.  యంత్రాలయితే   జీతాలు ఇవ్వక్కర్లేదు, సమ్మెలు ఉండవు.. ఎక్కువ ఖర్చు ఉండదు. అందుకని యంత్రాల వాడకం పెరుగుతోంది.


పాతకాలంలో నలుగురు నెలరోజులు చేసేపనిని ఇప్పుడు యంత్రాలు ఒక్క గంటలో చేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గాయి.. అతిగా వస్తువినియోగం పెరిగి పర్యావరణసమస్యలు పెరుగుతున్నాయి....ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలనుండి లక్షలమంది డిగ్రీ తీసుకుని బయటకువస్తున్నారు. ఇంతమందికి ఉద్యోగాలు రావాలంటే ఎన్ని కంపెనీలు ఉండాలి?


 యంత్రాలు వద్దని నా అభిప్రాయం కాదు.. కొన్ని కష్టమైనపనులకు యంత్రాలు వాడవచ్చు. అయితే, ప్రతిపనికి యంత్రాలు కాకుండా కొంతవరకు మాత్రం వాడితే మంచిది. సంపదను అందరూ పంచుకుంటే నిరుద్యోగం తగ్గించవచ్చు. కొందరు సంపదను తామే ప్రోగుచేసుకుని దాచుకోవటం కాకుండా, కొంతవరకు సంపాదించుకుని, ఇతరులకు అవకాశమివ్వాలి. మనుషుల్లో అత్యాశ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.
 

 మనుషులకు చేయడానికి
తగినంత పని ఉండాలి. అలాగని  విపరీతమైన పని ,  అసలు పని లేకుండానూ ఉండకూడదు.
ప్రభుత్వాలు  చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ,  చేతివృత్తులను,  పర్యావరణహిత పరిశ్రమలను  ప్రోత్సహించాలి.


 పశుపక్ష్యాదులకు పెద్ద కోరికలు ఉండవు. ఆహారం, చిన్నగూడు.. ఇలాగే అవి జీవిస్తాయి. మనుషులకు కూడా ఆహారం, ఇల్లు, రక్షణ, విద్య, వైద్యం..ఇవే ప్రాధమిక అవసరాలు. వీటికి పెద్ద కష్టపడనక్కరలేదు.


ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి. ఎన్నోమొక్కలు, చెట్లునుండి ఎంతోఆహారం..లభిస్తుంది. పాతకాలంలో మట్టితో..సున్నంతో ఇల్లు కట్టుకునేవారు..హరప్పా, మొహంజోదారో నాగరికత ఎంతో గొప్పది. ఆరోజుల్లోనే ఇళ్ళనుండి ఊరిబయటకు పోవటానికి చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ ఉండేదని అప్పటి కట్టడాల ద్వారా తెలుస్తోంది. పాతకాలపు దేవాలయాలు ఎన్నో ఇప్పటికీ చక్కగా ఉన్నాయి.


వైద్యం కొరకు ఎన్నో మొక్కలున్నాయి, ఆయుర్వేదం ద్వారా ఎన్నో జబ్బులకు మందులున్నాయి. పాతకాలంలో శస్త్రచికిత్సలు కూడా జరిగేవని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. రక్షణకొరకు  ఆయుధాలు వాడేవారు. అంతరిక్షం, ఇంజనీరింగ్.. ఇలా ఎన్నో విషయాల గురించి ప్రాచీనకాలంలో ఎంతో విజ్ఞానం ఉందని గ్రంధాల ద్వారా తెలుస్తోంది. 
 
 
దురదృష్టం ఏమిటంటే, మనదేశంలోని ప్రజలలో చాలామందికి స్వదేశం గురించి చిన్నచూపు ఉంది. భారతదేశం వెనుకబడటానికి ముఖ్యమైన కారణాలాల్లో ఇదొకటి.
 
 
కొన్నిదేశాల్లో ఏం జరుగుతోందో కూడా ఇతరదేశాలకు సరిగ్గా తెలియదు. ప్రభుత్వాలు ప్రజలకు కఠినమైన నిబంధనలు పెడతారు. అలాంటి పరిస్థితి మనదేశంలో ఉంటే కొందరు మానవహక్కులు మంటకలిసిపోతున్నాయంటూ గగ్గోలు పెడతారు. విదేశాల విషయంలో అయితే అక్కడ ప్రజలకు సరిగ్గా  వాక్స్వాతంత్ర్యం సరిగ్గా లేకపోయినా, పర్యావరణ సమస్యలు ఉన్నాకూడా వాటిగురించి మాట్లాడకుండా..ఆ దేశాలు ఎంత అభివృద్ధి చెందాయో చూశారా..అని మెచ్చుకుంటారు.
 

 ఆధునిక టెక్నాలజీ వల్ల ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే, ఆధునికటెక్నాలజీ వల్ల కొంత మంచి, కొంత చెడు ఉంది. టెక్నాలజీ ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి. పర్యావరణసమస్యలు పెరిగే స్థాయిలో టెక్నాలజీ ఉండకూడదు. టెక్నాలజీ వల్ల ఓజోన్ పొర దెబ్బతిని  అనారోగ్యాలు విపరీతంగా పెరిగే ప్రమాదముందని పరిశోధకులు అంటున్నారు.
ణువ్యర్ధాలు, ప్రోగుచేసిన అణ్వాయుధ భయాలు ఉన్నాయి.ఇవన్నీ అందరూ ఆలోచించాలి.
 
 
సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వాడకం వల్ల సమస్యలు కూడా ఉన్నాయి. అదేపనిగా వాడితే నరాల వ్యాధులు, కంటి వ్యాధులు..మొదలైనవి వచ్చే అవకాశాలున్నాయి. ఈరోజుల్లో చిన్న వయస్సు నుంచే వీటిని వాడుతున్నారు. భవిష్యత్తులో వీరి ఆరోగ్యం ఎలా ఉంటుందో?


ఈ రోజుల్లో సంపద, అధికారం కొరకు కొందరు, మతాల పేరుతో కొందరు, టెక్నాలజీ అంటూ కొందరు విపరీతంగా చేస్తున్నారు.. పర్యావరణాన్ని పాడుచేస్తూ కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితులను తెచ్చారు.  ఏదైనా ఒక పరిధిలో ఉంటేనే అంతా బాగుంటుంది.
 
  ఏ విషయంలోనైనా విపరీతధోరణి సరైనది కాదు. అన్నింటినీ సృష్టించిన దైవం అన్నింటినీ సరిదిద్దుతారు.

No comments:

Post a Comment