గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి .
దేశ రక్షణ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి ఎండనక వాననక మంచులో కూడా దేశప్రజల రక్షణ కొరకు పాటుబడుతుంటే ,
ప్రజలలో కొందరు మాత్రం సమాజ సొమ్మును దోచుకోవటం, అవినీతి, నైతికత లేకుండా జీవించడం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం లేదు.
************
ఎవరికైనా ప్రాధమిక అవసరాలు తీరటం ముఖ్యం..ప్రాధమిక అవసరాలు అంటే.. ఆహారం, ఆవాసం(ఇల్లు), రక్షణ, విద్య, వైద్యం.. ప్రపంచంలో అందరికీ ప్రాధమిక అవసరాలు తీరటం కష్టమేమీ కాదు. ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి.
బోలెడు
మొక్కలనుంచి అందరికీ ఆహారం లభిస్తుంది. ప్రకృతి నుంచి లభించే వాటితో
పర్యావరణహితమైన ఇళ్ళు కట్టుకోవచ్చు. ఇక, చక్కటి పద్ధతితో జీవిస్తే
అనారోగ్యాలు తక్కువగా ఉంటాయి. ప్రకృతి నుంచి లభించే వాటితో మందులు తయారీ ,
సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజవిధానాలతో వైద్యం చేయవచ్చు. ఎన్నో విద్యలు,
వృత్తులు ఉన్నాయి. ప్రాధమిక అవసరాలు తీరటం అందరికీ తీరటం సులభమే. మనుషులే
వ్యవస్థను పాడుచేసుకుంటున్నారు.
పాతకాలంలో డబ్బు బదులు వస్తుమార్పిడి విధానం ఉండేది. ఆ విధానాన్ని ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వాడవచ్చు.
ఇప్పటి
ప్రజలు చాలామంది ప్రాధమిక అవసరాలను కూడా విలాసంగా మార్చుకుంటున్నారు.
అంటే, ఆహారం విషయంలో.. సరిపడినంత మంచి ఆహారం కాకుండా, జంక్ ఫుడ్ వంటి
అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటున్నారు.
ఇల్లు విషయంలో..సరిపడినంత చక్కటి ఇల్లు కాకుండా, విలాసవంతమైన ఇళ్ళకు బోలెడు డబ్బును ఖర్చుపెడుతున్నారు.
ఇక వైద్యం, విద్య విషయంలో గమనిస్తే.. వీటిని చాలాచోట్ల వ్యాపారధోరణితో మార్చుకున్నారు.
ఇక
రక్షణ విషయంలో..ప్రపంచంలో మనుషులు అనేకకారణాలతో గొడవలు పడుతున్నారు
కాబట్టి, రక్షణకొరకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఉంది.
విమానప్రయాణాలు,
విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన హోటల్స్ ఖర్చులు, అనేక ఆభరణాలు,
కాస్మెటిక్స్ ఖర్చులు..ఇలాంటి విలాసాలు ఎన్నో ఉన్నాయి.
ఆధునికకాలంలో
కుటుంబవ్యవస్థ, విద్య, వైద్యం, అన్నీ మారిపోయాయి. కొత్తవస్తువులకొరకు
ప్రజల కోరికలు పెరిగిపోయాయి. వాటిని పొందటానికి స్త్రీలు, పురుషులు
అదేపనిగా పనిచేసినా కూడా ఎక్కడి డబ్బూ సరిపోవట్లేదు.
ఈ రోజుల్లో
చాలామంది అనేక విధాలుగా డబ్బును పోగేస్తున్నారు. కొందరి వద్ద విపరీతంగా
డబ్బు ఉంటే, కొందరి వద్ద డబ్బు అసలే ఉండటం లేదు. కొందరు ఎన్ని పాపాలు
చేసైనా డబ్బును పోగేస్తున్నారు. డబ్బున్నవారు తమకొరకు కొంత ఉంచుకుని,
ఇతరులు పైకి రావటానికి సాయం చేయాలి. అప్పుడు సమాజంలో అందరూ బాగుంటారు.
ఎవ్వరైనా వందలు, వేలు కోట్లు కూడబెట్టి ఏంచేసుకుంటారో? అర్ధం కాదు.
జీవితంలో ఏదైనా కష్టం వచ్చి దైవాన్ని ప్రార్ధిస్తే, అప్పుడు జీవితంలో సంపాదించిన ఆస్తులకన్నా..చేసిన పుణ్యాలే కాపాడతాయి.
***************
ప్రపంచంలో
అందరూ చక్కగా జీవించవచ్చు. అయితే మనుషులు ఎవేవో కారణాలతో గొడవలు పడుతూ
జీవితాలను అశాంతిగా మార్చుకుంటే అది వారి స్వయంకృతాపరాధం.
ప్రపంచంలో
కొందరు అత్యాశాపరులు, చెడ్డవాళ్ళు.. సమాజంలో గొడవలకు కారణమవుతుంటారు.
చెడ్డవారి మాటలకు కొందరు ప్రభావితమవుతారు. కొందరి వల్ల మొత్తం సమాజం
అల్లకల్లోలమవటం బాధాకరం. చెడ్డవారంటే భయపడి కొంతమంది సామాన్యప్రజలు
చెడ్డవారి మాటలను వింటారు. బలహీనులు బలవంతులను ఎదుర్కోలేరు. అయితే,
బలహీనమైన చీమలు అన్నీ కలిస్తే.. బలవంతమైన దానిని కూడా ఎదుర్కోగలవు.
****************
ప్రభుత్వాలు ప్రజల ప్రాధమిక అవసరాలు తీర్చాలి.
ఆహారం..
ఆహారధాన్యాలు పాడవకుండా నిల్వ చేసి ప్రజలందరికి సరైన విధంగా అందించాలి. ఈ
ప్రక్రియ ద్వారా చాలా ఉద్యోగాలు ఇవ్వవచ్చు. కొందరికి ఉచితంగానూ, తక్కువ
ఆదాయ వర్గాల వారికి తక్కువ ధరకు, ఆదాయం ఎక్కువ ఉన్నవారికి కొంత ఎక్కువ
ధరకు ఇవ్వవచ్చు.
విద్య..ఒక 30 సంవత్సరాల క్రిందట ప్రభుత్వపాఠశాలలు,
కాలేజీలు..ఉండేవి. ఇప్పుడు కూడా సెంట్రల్ స్కూల్స్ కు మంచి పేరుంది. ప్రతి
ఊరిలోనూ ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేస్తే అందరికీ విద్య
అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్య చక్కగా అందిస్తే
ప్రైవేట్ పాఠశాలల విపరీతమైన ఫీజులభారం తగ్గుతుంది.
పేదవారికి ఉచిత
విద్యను అందించి, మిగతావారికి ధర్మబద్ధమైన ఫీజులు తీసుకోవాలి. ఫీజులు మరీ
తక్కువ ఉంటే విద్యాసంస్థలను నడపటం ప్రభుత్వానికి భారం అవుతుంది. భారం అని
విద్యాసంస్థలను ఎత్తివేస్తే, ప్రైవేట్ సంస్థలు బోలెడు ఫీజులతో
దోచుకుంటారు. అందువల్ల డబ్బున్నవారికి ఫీజులు కొంతవరకు పెంచవచ్చు.
వైద్యం..
విషయంలో భారతదేశం చాలాదేశాల కంటే మెరుగనే చెప్పుకోవాలి. కొన్ని అభివృద్ధి
చెందిన దేశాల్లో కూడా పేదలకు సరైన వైద్య సదుపాయాలు లభించటం లేదు. వాటితో
పోల్చుకుంటే భారతదేశంలో పేదలకు కొంతవరకూ బాగానే వైద్య సదుపాయాలు
అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువమంది వైద్యులను,
నర్సులను నియమించితే మరింత చక్కగా వైద్యాన్ని అందించవచ్చు. వైద్యుల,
నర్సుల సంఖ్యను పెంచితే ఎందరికో ఉద్యోగాలు వస్తాయి. పేదలకు ఉచిత వైద్యాన్ని
అందించి, డబ్బున్న పేషెంట్స్ కు ట్రీట్మెంట్ ధరను కొంత పెంచవచ్చు.
ఇక
పరిశ్రమలు విషయంలో చాలా విషయాలుంటాయి. పరిశ్రమలు పెట్టమంటే
పారిశ్రామికవేత్తలు చాలా భూమిని ఇవ్వమని ప్రభుత్వాలను అడుగుతారు. వందల
ఎకరాల భూమిని తక్కువ ధరకు తీసుకుని, వందల సంఖ్యలోనే ఉద్యోగాలను ఇస్తారు.
ఇలాగైతే ప్రతిసంవత్సరమూ లక్షల సంఖ్యలో బయటకు వస్తున్న ఇంజనీరింగ్ వారికి
ఉద్యోగాలు లభించాలంటే చాలా కష్టం.
పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న,
మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. విపరీతమైన యాంత్రీకరణ వల్ల కూడా
నిరుద్యోగం పెరుగుతుంది. అందువల్ల చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి.
కొన్ని కష్టమైన పనులకు యంత్రాలను వాడవచ్చు.
ప్రభుత్వ సంస్థలు చక్కగా
పనిచేయాలి. అవి ప్రైవేట్ సంస్థల వలె శక్తివంతంగా ఉండాలి. ప్రభుత్వ
ఉద్యోగుల విషయంలో కొన్ని విధివిధానాలు ఉండాలి. ప్రభుత్వ సంస్థలంటే చులకనగా
ఉండకూడదు. ప్రభుత్వసంస్థలలో ఎప్పుడూ జీతాలు పెంచుతూ ఉండాలని సమ్మెలు చేయటం
కాకుండా, ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చెందాలని అందరూ భావించి, ఆ విధంగా
ప్రవర్తించాలి.
ఉద్యోగస్తుల జీతాలు పెంచటం... వ్యాపారస్తులు సరుకుల
ధరలను పెంచటం... ధరలు పెరిగాయని మరల జీతాలు పెంచమనటం ..ఈ విధమైన పరిస్థితి
ఉంటే, జీతాలు పెరిగే పరిస్థితి లేని ఇతరులు ఎలా బ్రతుకుతారు?
వ్యాపారస్తులు అదేపనిగా ధరలు పెంచకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు
తీసుకోవాలి.
దేశం అంతటా శుభ్రతకు ప్రాముఖ్యతను ఇచ్చి ప్రతి వీధిలోనూ
మొక్కలు నాటి, పెంచాలి. అక్కడక్కడా పార్కులు ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు
ఎన్నో వేల మంది సిబ్బందిని నియమించవచ్చు. ఇలా చేస్తే దేశం కూడా శుభ్రంగా,
అందంగా ఉంటుంది. ఎందరో కూలిపనులకు కూడా విదేశాలకు వెళ్లి అక్కడ వెట్టి
చాకిరి చేస్తున్నారు. అలాఎక్కడికో వెళ్ళకుండా దేశంలోనే ఉపాధి అవకాశాలు
కల్పించవచ్చు.
దేశంలోని నల్లధనాన్ని వెలికితీయటం, విదేశాల్లో దాచిన
నల్లధనాన్ని తిరిగి తెప్పించటం, దేశంలో అవినీతి పెరగకుండా గట్టి చర్యలు
తీసుకోవటం వంటివి చేస్తే ఆర్ధికపరిస్థితి బాగుంటుంది. జనాభా విపరీతంగా
పెరిగినా కూడా అందరికీ ప్రాధవసరాలు, ఉపాధి లభించటం కష్టం.
దేశం
అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలే అంతా చేయలేరు. ప్రజలు కూడా తమ బాధ్యతలను
తాము సరిగ్గా నిర్వహించాలి. నైతిక విలువలున్న ప్రజల సంఖ్య పెరిగితేనే సమాజం
బాగుపడుతుంది.
***********
No comments:
Post a Comment