ఈ పానకం జలుబు, దగ్గు తగ్గటానికి బాగా పనిచేస్తుందండి. మేము ఎప్పటినుండో వాడుతున్నాము. మాకు తెలిసిన వారు చెప్పారు ఈ మందు.
ధనియాలు...........750 గ్రాములు.
మిరియాలు...............25 గ్రాములు.
శొంఠి...............25 గ్రాములు.
బెల్లపు ముక్క........ ఒక చిన్న ముక్క. ...... {.తీపికి సరిపడినంత.}
శొంఠిని మెత్తగా దంచుకోవాలి. ధనియాలు, మిరియాలు పచ్చివే, వేయించకూడదు. ... బెల్లము ముక్కలు తప్పమిగతావన్ని మిక్సీలో పొడి చేసుకోవాలి. ..... పొడి మరీ మెత్తగా రాకపోయినా పరవాలేదు. ...
ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక గ్లాస్ చొప్పున నీళ్ళు తీసుకుని ఆ గ్లాస్ నీటిలో రెండు స్పూన్లు పొడి వేసి బాగా కాచాలి. ఈకషాయం అరగ్లాస్ నీళ్ళు అయ్యేవరకు కాచాలి ,
అప్పుడు బెల్లపు ముక్కలు వేసి కరిగేవరకు మరిగించాలి. ....... అప్పుడుపొయ్యి మీద నుంచి దింపి , ........ విడిగా కాచిన వేడి పాలు ఇందులో గ్లాస్ నిండా పోయాలి.
ఆ...మర్చిపోయానండి ....ఇలా కాచగా వచ్చిన అర గ్లాస్ కషాయాన్ని జల్లెడలో వడపోసి ....అందులో కాగిన పాలు కలుపుకోవాలి........ ఇది ఒక వ్యక్తికి సరిపడిన కొలత మాత్రమే.
ఇలా రోజూ ఉదయమే ఒక గ్లాస్ త్రాగాలి. ఈ మందు త్రాగిన తరువాత 10 నిముషాలు ఏమీ తినకుండా గ్యాప్ ఇస్తే మంచిది. ఒక పది రోజులు త్రాగాలి.
ఈ కషాయం చిన్న మంట పైన కాగాలి. ఎందుకంటే పొడి లోని రసం (సారం) అంతా నీటిలోకి రావాలి.
..... పాలు ముందే కలిపి కాచితే బెల్లం వలన విరిగిపోవచ్చు. పాలు కలిపాక మళ్ళి కాయనవసరంలేదు. పాలు ఇష్టం లేనివాళ్ళు పాలు కలపకపోయినా పరవాలేదు.
సుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బెల్లపు ముక్కలు వెయ్యకపోయినా పరవాలేదు. కొంతమందికి ఇది వేడిచేయవచ్చు. కాని బాగా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు చలువ చేసే పదార్ధములు తినాలి.
కొంతమందికి జలుబు,దగ్గు అప్పటికప్పుడు తగ్గకపోయినా వారం రోజులు వాడి ఆపేసిన తరువాత నెమ్మదిగా పూర్తిగాతగ్గిపోతుంది. మళ్ళి చాలాకాలం వరకు జలుబు,దగ్గు రాదు.
అసలు జలుబు అవి లేకపోయినా ఈ కషాయం ప్రతినెలమొదటి వారం రోజులు వాడితే మంచిది.
ఈ రోజుల్లో స్వైన్ ఫ్లూ ఇలాంటి వాటి వల్ల జలుబు అవి లేకుండా చూసుకోవాల్సివస్తోంది కదా...
.కొంచెం చిన్న పిల్లలకయితే ఒక గ్లాస్ నీటికి ఒక స్పూన్ పౌడర్ వేస్తే సరిపోతుంది. పిల్లలు జలుబు , దగ్గుతో చాలా బాధపడుతుంటారు.
పెద్దవాళ్ళు కొంచెం ఓపికగా ఇలా కషాయం చేసి ఇస్తే వాళ్ళకు ఆ బాధ ఉండదు. ఇలా కషాయం కాయటం కష్టమనుకుంటే చ్యవన్ ప్రాశ్ వాడవచ్చు.
**************
చదువు, ఉద్యోగ రిత్యా పెద్దవాళ్లకు దూరంగా ఉండే పిల్లలకు ఈ కషాయాన్ని వాడే విధానాన్ని నేర్పించి, మందు పొడిని పంపితే, వాళ్ళు కాచి త్రాగవచ్చు.
అయితే, ఎలా వాడాలో సరిగ్గా నేర్పించాలి. వరుసగా ఎక్కువ రోజులు త్రాగకూడదు.
dear sir very good telugu content
ReplyDeleteLatest Telugu News