koodali

Friday, January 19, 2018

ప్రాచీనులు అందించిన అద్భుతమైన విజ్ఞానం... ...




*భారతీయ ప్రతిభా  విశేషాలు  108  నిజాలు..
*ETERNALLY  TALENTED  INDIA  -  108 FACTS..

............అనే  పుస్తకాన్ని , మాకు  తెలిసిన  వారు   ఈ  మధ్య  మాకు    ఇచ్చారు.  ఈ  పుస్తకాన్ని  వివేకానంద  లైఫ్  స్కిల్స్  అకాడమీ , హైదరాబాద్  వారు  సమర్పించారు.    ఈ  పుస్తకంలో  ఎన్నో  గొప్ప  విషయాలు  ఉన్నాయి. 

  ప్రాచీన  భారత  దేశపు  గొప్పదనం  గురించి,  ఇంకా  ఎన్నో  విషయాలను  సేకరించి ,  ఈ  గ్రంధం  ద్వారా    అందించారు . 
........................................
పుస్తకం  లోని    కొన్ని  విషయాలు  .
.........................................

* ఈ  మధ్యకాలంలో ' స్ట్రింగ్  ధియరీ ' అనే   ఒక  నూతన  సిద్ధాంతాన్ని    శాస్త్రజ్ఞులు  ప్రతిపాదించారు.  

దీని  ప్రకారం  (' Quarks, Leptons' ) ' కణములు  ('Particles' )కాదనీ,  అవి అతి  సూక్ష్మమైన  , కంపించే  గుణం  కలిగిన  తీగల  వంటివనీ  నిర్ధారించారు. 


 ఇది  మహత్తరమైన  నక్షత్రం  నుండీ   ,  అతి  సూక్ష్మమైన  పరమాణువుల  వరకూ  వ్యాపించి  ఉందనీ  ( శుపెర్ స్త్రింగ్  )  నిర్ధారించారు.

*భారతీయ  దృక్పధం.....

* వేదం  లోని  ' శతపధ  బ్రాహ్మణం ' (  8.7.3.10 ) ఇలా  అంటున్నది. సూర్యుడు  తక్కిన  జగత్తు  ఒక  తీగ  వలే   ఉన్నవి.  ఆ ' తీగ ' యే  వాయువు.  వాయువు  అనగా  వేదార్ధంలో ' గాలి ' అని  కాదు.   'వ్యాపించినది ' అని  అర్ధం.


*భగవద్గీతలో  శ్రీ  కృష్ణ  పరమాత్మ  ఇలా  అంటారు .

'  మత్తః   పరతరం  నాన్యత్  కించిదస్తి  ధనంజయః
మయి  సర్వమిదం  ప్రోతం సూత్రేమణిగణా ఇవ  ....భ.గీ.  7-7 శ్లో.

' ఒక  సూత్రంలో  మణులు  కూర్చినట్లు  ఈ  జగత్తంతా  నాలో  ఇమిడిఉన్నది  '.    శ్రీ  కృష్ణభగవానుడు  చెప్పినట్లు  అనంతం  నుంచి  అణువు  వరకూ   జగత్తంతా  ఒక  సూత్రంలో  బంధించబడింది. 


 దీనినే  ఆధునిక  శాస్త్రవేత్తలు  నేడు  Super String  అన్నారు.


ఇలా  నక్షత్రరాశి  ప్రభావం  అతి  సూక్ష్మమైన  పదార్ధంతో  జగత్తు  నిండా  అనుసంధానించబడినప్పుడు  ,  ఆ  నక్షత్ర ప్రభావాన్ని  మన  జ్యోతిష్య  శాస్త్రం  ఏనాడో  గుర్తించి,  గ్రహించి  విశదీకరించింది  కదా  !

.........

( స్ట్రింగ్  ధియరీ ) గురించి చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే.. ఇలాంటప్పుడు సూర్యుడు, మరియు గ్రహాల ప్రభావం మానవులపై ఉంటుందనటంలో ఆశ్చర్యం లేదు.. అనిపించింది.
........................

 * "  పృధ్వి  వ్యాపస్తేజో  వాయురాకాశం  కాలోదిగాత్మా  మన  ఇతి  ద్రవ్యాణి  !    
- వైశేషికదర్శనం -

కణాద  మహర్షి    వివరించినట్టుగా  మనస్సు  - ఆత్మ  రెండూ  కూడా  ద్రవ్యములే (  Maatters ) . ఇప్పుడిప్పుడే  ఆధునిక  విజ్ఞానం,  పరిశోధనాకర్త  యొక్క  దృక్పధాన్ని  అణువిశ్లేషణలో  లెక్కలోకి  తీసుకుంటూ  ఉంది.

...................
*అగస్త్యుని  విద్యుత్  ఉత్పత్తి  విధానం..........

*యంత్రశాస్త్రం...Machine Science  of India..............

వైద్యం,   ఖగోళ  శాస్త్రం,    ఇంకా  అనేక  రంగాలలో  పలు  యాంత్రిక  పరికరాలను   ఆనాడే  ఉపయోగించారు.  అప్పటివారు విమానాలనూ  నిర్మించారు.

*గణితంలో  దిట్టలు-  భారతీయులు.....

*గురుత్వాకర్షణ  సిద్ధాంతం  కనుగొన్నది  ఎవరు  ?....Many  apples  had  fallen  before  Newton's  Gravity  Laws..........

ప్రాచీన  భారతీయ  గ్రంధాల  నిండా  గురుత్వాకర్షణ సిద్ధాంతము  గురించి  ప్రస్తావించబడి  ఉంది.   ఈ  గ్రంధాల  గురించి,  గురుత్వాకర్షణ   గురించి  వివరాలు  ఉన్న   శ్లోకాల  యొక్క  ఉదాహరణలను  ఇచ్చారు.

*సప్తవర్ణం-  భానుకిరణం....................Seven  Colours  of  Light

*కాంతివేగమును  ఎవరు  లెక్కించారు?  ...........Measuring  the  Speed  of  Light.

సాయనాచార్యులి  ఋగ్వేద భాష్యంలో .. ఋగ్వేద శ్లోకం  ద్వారా   కాంతివేగాన్ని  లెక్కించటం  గురించి  వివరంగా  తెలుసుకోవచ్చు.

 ఇలా..  ఎన్నో  విశేషాలను   ఈ  గ్రంధం  ద్వారా  అందించారు.  ఈ  పుస్తకంలోని  విషయాలను  తెలుసుకుంటే  ప్రాచీనుల  గొప్పతనం  అర్ధమవుతుంది.
...................

*ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న   అందరికి  అనేక  కృతజ్ఞతలండి.  బ్లాగ్ లో  కొత్తగా  ఎవరైనా   సభ్యులైనప్పుడు  కృతజ్ఞతగా  ఇలా  వ్రాస్తుంటాను.

 ఈ  బ్లాగును  కొత్తగా  చదువుతున్నవారికి,  ఇంతకు  ముందు   నుంచి  చదువుతున్నవారికి,  అగ్రిగేటర్లకు ..... అందరికి  కృతజ్ఞతలండి.

* నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  అయినా   ఈ  మాత్రం  వ్రాయగలుగుతున్నానంటే ,  అంతా   దైవం  దయ వల్ల, మరియు    శ్రేయోభిలాషుల  ప్రోత్సాహం  వల్ల.

**************

(Friday, September 7, 2012)

************

Friday, July 18, 2014

ఓం...భౌతిక శక్తిని మించి మరేదో శక్తి ఉందని అర్ధమవు...



 

No comments:

Post a Comment