సూర్యుడు ఆరోగ్యప్రదాత. సూర్యరశ్మి వల్ల చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది.
సంక్రాంతి పర్వదినముల సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి .
************************
ఇక్కడ పోస్ట్ చాలా స్థలం ఉందని , ఇంకో టాపిక్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ వ్రాయటం జరిగింది.
* స్త్రీల సమస్యల పరిష్కారం కొరకు మాట్లాడటం మంచిది కాని, స్త్రీలు కొన్ని దుస్తులే వేసుకోవాలనే దానికి సపోర్ట్ చేసి అదేపనిగా మాట్లాడటం వల్ల స్త్రీలకు, సమాజానికి ఏం లాభం?
............................
* స్త్రీల వస్త్రధారణ గురించిన విషయం గురించి ఈ మధ్య ఒకరు ఏమన్నారంటే, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో స్త్రీలు నగ్నంగా తిరిగినా కూడా, అక్కడ అత్యాచారాలు జరగటం లేదని, తనకు బాగా తెలిసినట్లు చెప్పారు.
అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? సమాజంలో అందరికి పైకి తెలియని విషయాలు కూడా ఉంటాయి.
అయితే, దుస్తులు చక్కగా వేసుకోవటం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయని వారి అభిప్రాయమా ఏమిటో?
దుస్తులు సరిగ్గా వేసుకుంటే మంచిదే కదా..
...............................
* ఇంకా ఏమన్నారంటే,
కొన్ని దేవాలయాలలో కొన్ని స్త్రీ ప్రతిమలు చాతీ భాగం కప్పుకోకుండానే ఉంటాయి. అలాగని అవి చూసి వచ్చిన వాళ్లు ఉద్రేకపడి బయటకు వచ్చి అత్యాచారాలు చేస్తున్నారా....అన్నట్లు మాట్లాడారు. వాళ్ళ మాటలు వాళ్లు అన్నదన్నట్లు నేను రాయలేదు కానీ, అలా అన్నారు.
తల్లి యొక్క చీర పమిట గాలికి పక్కకు తొలగితే చూసిన మగపిల్లలు తప్పుగా అనుకోరు. వారిలో ఎలాంటి చెడుభావనలు కలగవు. దేవాలయంలో దేవతామూర్తులను చూసినా చెడుభావనలు కలగవు.
గర్ల్ ఫ్రెండ్ లేక వేరే స్త్రీ యొక్క దుస్తులు పక్కకు తొలగితే, కొందరు మగవాళ్ళ ఆలోచనలు వేరేగా ఉండే అవకాశం ఉంది.
..............................
చాలా దేవతామూర్తులకు చీర పమిటతో వస్త్రధారణ ఉంటుంది. కొంతమంది స్త్రీలు తలపైనుంచి కప్పుతూ ఉత్తరీయాన్ని ధరించేవారట.
చాతీభాగాన్ని కప్పుతూ ఉండే దుస్తులను స్థనపట్ట, కంచుకి అనేవారట.
పాతకాలంలో చాలామంది స్త్రీలు చాతీభాగాన్ని వస్త్రంతో చుట్టుకునేవారట. కొందరు అలా చేయకున్నా కూడా, పమిటను భుజాల చుట్టూ కప్పుకునే పద్ధతి ఉండేది.
దేశంలో ఇప్పటికీ అనేక విధాలైన వస్త్రధారణ, చీరలోనే అనేక పద్ధతులు ఉన్నాయి. పంజాబి డ్రెస్ ఉంది.
కొన్ని దేవతామూర్తులను, యక్షిణుల? చిత్రాలను అలా ఎందుకు చెక్కారో..వాటిని ఎవరు అలా చెక్కారో.. అనేక కారణాలుండవచ్చు. అవన్నీ మనకు అందరికి సరిగ్గా తెలియదు..
కొన్ని విదేశాలలో కూడా మగవారి శిల్పాలు నగ్నంగా ఉన్నాయి. అందుకు అర్ధం.. అక్కడ పురుషులు నగ్నంగా ఉంటారని కాదు. ఎందుకో అలా కొన్ని శిల్పాలున్నాయి.
నాకు తెలిసినంతలో 1200.. ఆ కాలంలో కూడా భారతదేశానికి విదేశీయులు రావటం, ఇక్కడ వారి ప్రభావం కూడా ఉందని చదివాను..
అంతకుముందు కూడా యవనులు, ఇంకా కొందరు..భారతదేశానికి వచ్చారట. అప్పట్లో వారి ప్రభావం కూడా దేశంలో ఉంది. విదేశీప్రభావం అనేక విషయాల పైనున్నదని చదివాను.
************************
* స్త్రీల వస్త్రధారణ గురించిన విషయం గురించి మాట్లాడుతూ కామెంట్లు చేసిన వాళ్లు ...ఖజురాహో శిల్పాల గురించి కూడా ఏదేదో అన్నారు......
నా అభిప్రాయాల ప్రకారం, ఖజురాహో వంటి దేవాలయాలు దేశంలో ప్రతిచోటా లేవు. అవి అప్పట్లో శృంగార విషయాల గురించి ప్రజలకు తెలియటానికి, కొత్తగా వివాహమైన వారు వెళ్ళి చూసి రావటానికి, అలా అతికొద్దిగా మాత్రమే ఉన్నాయి.
వాటిలో కొన్ని శిల్పాలు అభ్యంతకరంగా ఉంటే..
కొన్ని తప్పులు చేసేవాళ్లు పాతకాలంలోనూ కొందరు ఉంటారు, ఇప్పుడూ ఉంటారు.
ఆ రోజుల్లో అలా శిల్పాలను చెక్కమని అప్పటి రాజులు చెప్పారేమో? శిల్పాలను అలా చెక్కటం వెనుక ఎన్ని ఆలోచనలు ఉన్నాయో?
******************
* దేశం ఎంతోకాలం విదేశీపాలనలో ఉంది. విదేశీయుల ప్రభావం దేశంపైన ఉన్నది. విదేశీదాడుల తరువాత స్త్రీలను బయటకు రానివ్వని పద్ధతులు వచ్చాయని అంటారు.
*********************
స్త్రీలలో కొందరు శరీరభాగాలు కనబడకుండా దుస్తులు వేసుకుంటారు. కొందరు శరీరభాగాలు కనబడినా ఫరవాలేదనే విధంగా దుస్తులు వేసుకుంటారు. స్త్రీలలోనూ, పురుషులలోనూ రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు.
మగవాళ్లలో కొందరు చెడ్దవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళుంటారు. స్త్రీలలో కొందరు చెడ్డవాళ్లు, నేరాలు చేసేవాళ్ళుంటారు.
కుటుంబాలలో, సమాజంలోను సాటి స్త్రీలను ఏడిపించేవారుంటారు.
* శ్రీరామునిపై మోజుపడి, సీతాపహరణ విషయంలో రావణాసురుని ప్రోత్సహించిన శూర్పణఖ స్త్రీయే.
మగవాళ్లు మంచిగా ఉండాలని చాలామంది అంటారు. మగవాళ్ళు అయినా ఆడవాళ్లు అయినా మంచిగానే ఉండాలి.
ఎవరైనా చిన్నప్పుడు అమాయకమైన వాళ్లే. తరువాత ఎన్నో కారణాల వల్ల రకరకాలుగా మారతారు.
సమాజంలో ఇంటిపరిస్థితులు, పరిసరాలలోని వ్యక్తుల ప్రభావం, జీవితంలో ఎదురైన సంఘటనలు, నేర్చుకున్న విషయాలు, సోషల్ మీడియా నుంచి విన్నవి, చూసినవి..ఇలా ఎన్నో కారణాలు ప్రవర్తన పై ప్రభావాన్ని చూపిస్తాయి.
* అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఒకరినొకరు గౌరవించాలని చిన్నతనం నుంచి ఇంటా బయటా నేర్పించాలి.
*************************
ఈ రోజుల్లో సెల్ఫోన్లు వచ్చాక అందరికి చాలా విషయాలను బాగా చూడటానికి వీలు కలిగింది.అందువల్ల, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
....................
స్త్రీలపట్ల అత్యాచారాలు జరగకూడదు. మద్యపానము, మత్తుమందుల వాడకం, అసభ్యకర, అశ్లీలత ఉండే చిత్రాలు, దృశ్యాలు, రచనలు..వీటిపట్ల తగిన చర్యలు తీసుకోవాలి.
ప్రజలు..పాపభీతి, నైతిక విలువలను పాటించటం వంటివి పాటించాలి..ఎంతగా మంచి చెప్పినా వినకుండా చెడ్డగా ప్రవర్తించే వారిని, తప్పులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
* నైతికవిలువలను పాటించే ప్రజలున్న చోట మంచిగా ఉంటుంది.
................
సమాజంలో.. మత్తుమందులు, అసభ్యకరచిత్రాలు, రచనలు ..ఇలాంటివాటిని ఆపటానికి గట్టిచర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అయితే, స్త్రీలు అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుని బయట తిరిగితే మాత్రం తప్పేమిటంటూ.... కొందరు స్త్రీలు ప్రదర్శనలు చేయటం బాధాకరం.
*******************
marikonni vishayaalu...
ఈ రోజుల్లో కొందరు స్త్రీలు స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. సాటి స్త్రీలను కూడా ఇబ్బందిపెడుతున్నారు. పురుషులు కూడా తమ స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. విడాకులు ఎక్కువయ్యాయి.
స్త్రీల పట్ల గృహహింస జరగకుండా రక్షణ కొరకు కొన్ని చట్టాలు చేసారు. అయితే, కొందరు స్త్రీలు ఈ చట్టాలను చూపి, తాము చెప్పినట్లు వినకపోతే, భర్త అత్తింటి వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు వింటున్నాము.
భార్యాభర్తకు పడనప్పుడు సాధ్యమైనంతలో సర్దుబాట్లు చేసుకుంటూ జీవించటానికి ప్రయత్నించాలి. పిల్లలుంటే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి.
పిల్లలకు తల్లితండ్రి ఇద్దరితో కలసి ఉండాలని ఉంటుంది. పిల్లలు అమ్మనాన్నతో కలసి తమ ఇంట్లో జీవించాలనుకుంటారు. అయితే, ఈరోజుల్లో కొందరు పేరెంట్స్ విడాకుల తరువాత వేరే వివాహం చేసుకుంటున్నారు.
పిల్లలకు తల్లి దగ్గర వేరేనాన్న, తండ్రి దగ్గర వేరే తల్లి ఉంటారు. పిల్లలకు ఇది బాధగా ఉంటుంది. అయితే, పెద్దవాళ్ళ హక్కుల గురించే అందరూ మాట్లాడతారు కానీ, పిల్లల హక్కులు, వారి ఆశల గురించి ఎంతమంది తల్లితండ్రి ఆలోచిస్తున్నారు?
ఇక పిల్లలు వాళ్ల అమ్మమ్మతాత లేక నాన్నమ్మతాత లేక హాస్టల్స్లో ఉండవలసి ఉంటుంది. వాళ్లు అప్పటికే వృద్ధులు అయి వాళ్ళకు ఎక్కువ ఓపిక ఉండదు.ఇక ఆ పిల్లలను ఏం సరిగ్గా చూసుకోగలరో?
ఈ రోజుల్లో స్త్రీలు, పురుషులు ఉద్యోగాల వల్ల పనివత్తిడి బాగాపెరిగింది. అలసిపోయి చిన్న మాటకే గొడవలు పెరుగుతున్నాయి.
కొందరు ఫ్రెండ్స్, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు కూడా ఎందుకు తగ్గాలి, ఎందుకు సర్దుకుపోవాలంటూ గొడవలు పెంచుతున్నారు.
అప్పటివరకు పిల్లల్ని చదువులని హాస్టల్స్లో వేసిన వాళ్ళుకూడా పిల్లలకు వివాహాలు చేసాక, మా అమ్మాయి కష్టపడిపోతోందని అమ్మాయి అమ్మనాన్న, మా అబ్బాయి కష్టపడిపోతున్నాడంటూ అబ్బాయి అమ్మానాన్న వచ్చేస్తారు.
పాతవ్యవస్థలోనూ ఇప్పటి వ్యవస్థలోను కొన్ని సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి.ఇప్పడు కుటుంబవ్యవస్థ ప్రమాదంలో ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియటం లేదు....కుటుంబవ్యవస్థను బాగుచేసుకోవాలి.
oka link..కొన్ని విషయాలు..
No comments:
Post a Comment