సృష్టిలో , ఆకాశంలో ఎగిరే పక్షుల శరీరం , ఎగరటానికి తగ్గట్లుగా సృష్టించబడింది. నీటిలో ఈదే చేపలశరీరం అందుకు తగ్గట్లుగా ఉంది.
ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎంతో ఆలోచనకల శక్తికే సాధ్యం. ఆ మహాశక్తే దైవము.
ఇంత
పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా
శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే ఆస్తికులు దైవం అని
పిలుచుకుంటున్నారు.
..........................
..........................
ఆధ్యాత్మికవాదులు.. దైవానికి ఆది , అంతమూ ..లేవు . అని తెలియజేసారు.
".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .
అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.
సృష్టి ఎలా ఏర్పడింది? అనే ప్రశ్నకు, దైవం వల్ల సృష్టించబడింది.. అని ఆస్తికులు ఖచ్చితమైన సమాధానం చెప్పగలరు.
సృష్టి ఎలా ఏర్పడింది? అనే ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.
కొందరు నాస్తికులు ఏమంటారంటే, దైవం ఎలా ఏర్పడ్డారని ప్రశ్నిస్తారు.
సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని వారు నమ్ముతున్నప్పుడు.. మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. దైవము ఎప్పుడూ ఉంటారు.

........................
ఆధ్యాత్మికవాదులు,
ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం ...... పదార్ధాన్ని
శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము అని , తెలుస్తోంది కదా !
ఇవన్నీ రూపాలను మార్చుకున్నా కూడా ఎప్పుడూ విశ్వంలో ఉంటాయని
తెలుస్తోంది.
అంటే , ఆద్యంతములు లేని ఒక మహాశక్తి ఎప్పుడూ నిత్యంగా ఉంటుందని మనకు తెలుస్తోంది. ఈ శక్తి ఊహాతీతమైన అద్భుతమైన ఆలోచనా శక్తి కూడా ఉన్న శక్తి. ( ఆలోచన కూడా ఒక శక్తే కాబట్టి.. )
అన్ని శక్తులూ కలబోసిన ఈ మహా శక్తినే ఆస్తికులు దైవం అని భావిస్తారు. దైవానికి అనేక వందనములు.

.........................
No comments:
Post a Comment