koodali

Friday, January 12, 2018

సులువుగా చక్కలు వత్తే పద్ధతి ...


 
చాలామంది బియ్యం పిండితో చెక్కలు వంటకాన్ని  తయారుచేస్తారు.  అయితే,  పల్చగా వత్తడం  చాలా కష్టంగా ఉంటుంది. 

 చెక్కలు తేలికగా  తయారుచేయాలంటే   ఒక  పద్ధతి ఉంది.  

రెండు ప్లాస్టిక్   షీట్స్  మరియు  ఒక చిన్న గిన్నె  తీసుకోవాలి.   

చెక్కలు చేసే పిండిని చిన్న ముద్దలుగా  చేసి  ఒక ప్లాస్టిక్  షీట్ పైన దూరదూరంగా పెట్టాలి. 

 ఇంకొక ప్లాస్టిక్ కవర్ తీసుకుని పిండి ముద్దలపై పరచాలి. 

చిన్న గిన్నె తీసుకుని   గిన్నె అడుగు భాగంతో  ముద్దలను పలుచగా వత్తాలి. 

అప్పుడు చెక్కలన్నీ ఒకే షేప్ లో పలుచగా వస్తాయి.  అప్పుడు వాటిని నూనెలో వేయించి తీసుకోవాలి.


 చెక్కల పిండిని చేతితో వత్తడం కన్నా,   ప్లాస్టిక్ కవర్ పైన..   ఇంకొక   ప్లాస్టిక్ కవర్  వేసి ... గిన్నె అడుగు భాగంతో  వత్తడం తేలిక. 


చెక్కలపిండిలో  శనగపప్పు బద్దలు వేసినప్పుడు చేతితో కొంచెం వత్తవలసి వస్తుందేమో కానీ..... 

పెసరపప్పు బద్దలు వేస్తే   గిన్నె అడుగుభాగంతో వత్తడం  పద్ధతిలో  చెక్కలు పల్చగా వస్తాయి.

 



No comments:

Post a Comment